
Bandi Sanjay Fan: బండి సంజయ్ పై అభిమానం.. మండుటెండలో అభిమాని సైకిల్ యాత్ర.. ఈ వార్తకు సంబంధించిన
Latest updates from Telugu Digital news sources.

Bandi Sanjay Fan: బండి సంజయ్ పై అభిమానం.. మండుటెండలో అభిమాని సైకిల్ యాత్ర.. ఈ వార్తకు సంబంధించిన

తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ పెరుగుతున్న తరుణంలో, కీలక నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు గ్రూపు రాజకీయాలను రోడ్డుకు ఈడుస్తోంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుండటంతో, అటు కేడర్ తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురవుతోంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీలో గత కొంతకాలంగా సాగుతున్న పాత వర్సెస్ కొత్త నేతల వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. తాజాగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తీవ్ర ఆరోపణలతో కూడిన పోస్టర్లు వేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారం వెనుక కేంద్రమంత్రి బండి సంజయ్ వర్గానికి చెందిన కొందరి హస్తం ఉందంటూ ఈటల అనుచరులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ కొంతకాలంగా సాన్నిహిత్యంగా ఉంటుండటాన్ని జీర్ణించుకోలేక, వారి మధ్య గ్యాప్ పెంచేందుకే ఈ పోస్టర్ల కుట్రకు తెరలేపారనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనికి కౌంటర్‌గా బండి సంజయ్ అనుచరులు మరో వాదనను తెరపైకి తెస్తున్నారు. గతంలో బండి సంజయ్ కొడుకు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం వెనుక, అలాగే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దించేయడం వెనుక పరోక్షంగా ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ మరికొందరు నేతల హస్తం ఉందంటూ వారు పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల మధ్య పరస్పర పోస్టులు, తీవ్ర విమర్శలు వైరల్ అవుతున్నాయి. “ఈటల ఏడుపే బీజేపీకి శాపం.. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా