translateexpand_more

Stock Market News

Latest updates from Telugu Digital news sources.

TeluguOne01 Jun, 04:29 am
ఆర్సీబీ విజయంపై ఈసీ స్పందన.. నెటిజనులు ఫిదా

ఐపీఎల్ 2026 సీజన్ చాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు ఆర్సీబీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ భారీ విజయంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ఈసీ ఆర్సీబీ ఐపీఎల్ చాంప్ గా నిలిచిన సందర్భాన్ని అత్యంత సృజనాత్మకంగా ఉపయోగించుకుంది. ఆర్సీబీ అద్భుతవిజయాన్ని ఓటర్ల చైతన్యానికి అనుసంధానిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హృదయపూర్వక అభినందనలు. నిజమైన ఛాంపియన్లు ఎప్పుడూ తమ సరైన సమయం కోసం ఎంతో ఓపికగా సిద్ధంగా ఉంటారు. సరిగ్గా అలాగే మీరు కూడా మీ బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధం కావాలి. మీకు ప్రస్తుతం 18 ఏళ్లు నిండుతున్నాయా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఫారం 6 నింపండి. ఒక ఛాంపియన్‌ తరహాలో మీ ప్రజాస్వామ్య విధిని విజయవంతంగా నెరవేర్చడానికి నడుం బిగించండి. గుర్తుంచుకోండి.. దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు ఎంతో విలువైంది అంటూ ఈసీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. ఈ ఆసక్తికరమైన పోస్టుకు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను జత చేసింది. నిజానికి యువతను ఓటు నమోదు దిశగా ప్రోత్సహించేందుకు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని

TeluguOne01 Jun, 06:41 am
లేడీ దురంధ ర్ రాజామ ణి స ర స్వ తి

సరస్వతి రాజమణి.. బంగారు గనుల వారసురాలిగా మొదలై, భారత తొలి మహిళా గూఢచారిగా ముగిసిన ఆ జీవిత క‌థ ఎలాంటిది? ఇందులో మొద‌టిగా క‌నిపించే చారిత్రక నేపథ్యం.. విష‌యానికి వ‌స్తే.. రంగూన్ వైభవం నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ గూఢచర్యం వరకు సాగిన ఆమె సాహ‌సోపేత‌ ప్ర‌యాణాన్ని ఒక‌సారి సునిశిత వీక్ష‌ణం చేస్తే మ‌నం ఎంద‌రో త్యాగ‌ధ‌నుల‌ను గౌర‌వించ‌డం మానేసి.. ఊహాలోకాల్లో విహ‌రిస్తున్నామ‌ని తేట‌తెల్ల‌మ‌వుతుంది. ఇరవయ్యో శతాబ్దం నాల్గవ దశకంలో, బ్రిటిష్ సామ్రాజ్యం తూర్పు ఆసియాలో తన ప్రభావాన్ని గట్టిగా చూపుతున్న కాలం. ఆనాటి బర్మా ప్రస్తుత మయన్మార్ లోని రంగూన్ నగరం, వాణిజ్య ప‌రంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన‌ కేంద్రం. అక్కడి అత్యంత సంపన్న భారతీయ కుటుంబాలలో ఒకటిగా నిలిచింది రాజమణి కుటుంబం.. ఒక బంగారు గని యజమాన్యం వ‌హించేది, స్వాతంత్రోద్యమానికి ఆర్థిక స‌హాయ స‌హ‌కారం అందించే ఫ్యామిలీ కూడా. ఈ కుటుంబంలో 1927 జనవరి 11న జన్మించిన బాలిక.. తరువాత భారత తొలి మహిళా గూఢచారిగా చరిత్రలో నిలిచింది. ఆమె సరస్వతి రాజమణి. పట్టు వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు, బంగారు గనుల సంపద. ఇవే ఆమె బాల్య ప్రపంచం. కానీ ఆమె జీవిత గమ్యం రాజప్రాసాదాల సౌఖ్యం మాత్ర‌మే కాదు. అరణ్య మార్గాలు, గన్‌పౌడర్ వాసన, బ్రిటిష్ సైనిక శిబిరాల మధ్య ప్రాణాంతక గూఢచర్యం కూడా. సంపదల మధ్య జన్మించినా, స్వాతంత్రం కోసం అన్నీ విడిచిపెట్టిన యువ‌ గూఢచారిణి.. సరస్వతి రాజమణి. 1942లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ రంగూన్‌కు చేరుకున్నప్పుడు, అక్కడి భారతీయ సమాజంలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగ‌సిప‌డింది. నాకు మీ రక్తం ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్రం ఇస్తాను- అనే నేతాజీ పిలుపు, వేలాది భారతీయుల హృదయాలను కదిలించింది. ఆ

TV9 Telugu31 May, 07:57 am
జ్యోతిక తర్వాత నా ఫేవరేట్ హీరోయిన్ ఆమెనే.. అద్భుతమైన హీరోయిన్.. హీరో సూర్య

తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా టాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న కాంబినేషన్లలో హీరో సూర్య, నటి అసిన్ కాంబో ఒకటి. ముఖ్యంగా గజినీ (Ghajini) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ, నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగాఓ ఇంటర్వ్యూలో నటి అసిన్ గురించి హీరో సూర్య మాట్లాడిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో సూర్య తన ఫేవరెట్ కో-స్టార్స్ గురించి ప్రస్తావిస్తూ, తన భార్య జ్యోతిక తర్వాత తనకు నచ్చిన బెస్ట్ యాక్ట్రెస్ అసిన్ అని స్పష్టం చేశారు. అసిన్ ఎంతో ప్రొఫెషనల్ ,అద్భుతమైన నటి మాత్రమే కాదు, మంచి డాన్సర్ కూడా అని కొనియాడారు. స్క్రీన్ పై ఆమె ప్రెజెన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, మేకప్‌కు ముందు.. మేకప్ తర్వాత ఆమె లుక్స్, హావభావాలు పూర్తిగా మారిపోతాయని సూర్య నవ్వుతూ పంచుకున్నారు. విభిన్న భాషలను చాలా త్వరగా నేర్చుకోవడంలో అసిన్ ది బెస్ట్ అని సూర్య ప్రశంసించారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఒక అగ్ర స్థానానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా టాలెంట్ ఉండాలని, అసిన్ లో ఆ ప్రతిభ పుష్కలంగా ఉందని అన్నారు. బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో కలిసి 'గజినీ' హిందీ రీమేక్‌లో నటించడం, అక్కడ కూడా అంతే కాన్ఫిడెంట్‌గా మెప్పించడం ఆమె కమిట్‌మెంట్‌కు నిదర్శనమని సూర్య పేర్కొన్నారు. ఆ నమ్మకమే ఆమెను అంతటి స్థాయికి తీసుకెళ్లిందని, కెరీర్‌లో ఆమె ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందంటూ ఆకాంక్షించారు. అదే ఇంటర్వ్యూలో మరో నటి తమన్నా గురించి కూడా సూర్య చిన్న వ్యాఖ్య చేశారు. తమన్నా కూడా చాలా చిన్న వయసులోనే భాషలను సులువుగా

Eenadu31 May, 12:52 am
ప్రతిష్ఠాత్మకంగా యోగాంధ్ర

జూన్‌ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు అమరావతిలో 25వేల మందితో రాష్ట్రస్థాయి కార్యక్రమం యోగాంధ్ర గోడపత్రికను ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రి నారాయణ, మంతెన సత్యనారాయణరాజు, వీరపాండియన్‌ ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో యోగాంధ్ర-2026ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జూన్‌ 7 నుంచి 14 రోజులు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణపై ఉండవల్లి నివాసంలో మంత్రులు, అధికారులతో శనివారం సమీక్షించారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ రాష్ట్రస్థాయి కార్యక్రమం రాజధాని అమరావతిలో 25వేల మందితో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాజధాని ప్రాంతంలో కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జిపై ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను ప్రజెంటేషన్‌ ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రప్రభుత్వ యోగా, నేచురోపతి విభాగం సలహాదారు మంతెన సత్యనారాయణరాజు యోగాంధ్రపై రూపొందించిన గోడపత్రికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 90 ఆసనాల వీడియోలు, 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనాల వీడియోలు, రోజువారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణాయామంపై ఏడు వీడియోలు, యోగా సందేహాలు ప్రశ్నలు-సమాధానాలపై చేసిన వీడియోలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టనున్నట్లు మంతెన తెలిపారు. 8142404888 నంబర్‌కు హాయ్‌ అని మెసేజ్‌ పంపినా, ఈ వీడియోలు వస్తాయన్నారు. సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్‌ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్‌ సాయిప్రసాద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్, కమిషనర్‌ వీర పాండియన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో

Zee Telugu31 May, 07:22 am
మరో వివాదంలో సింగర్ చిన్మయి.. పైరసీని ప్రశంసిచడం ఏంటని నెటిజన్లు ఫైర్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Singer chinmayi sripada clip post on Preity Mukundan Blast zone movie goes controversy: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయంఅక్కర్లేదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఘటనపై యాక్టివ్ గా ఉంటారు. తనదైన స్టైల్ లో వాయిస్ ను విన్పిస్తుంటారు. పలు మార్లు సింగర్ చిన్మయి ట్రోల్స్ కు గురైన విషయం తెలిసిందే. కొంత మంది ట్రోలర్స్ రాయుళ్లు సింగర్ చిన్మయి ఫ్యామిలీ మీద అత్యంత వర్గల్ గా కామెంట్స్ లు చేసిన విషయం తెలిసిందే.దీనిపై ఆమె సైబర్ పోలీసుల్ని కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా.. ఆమె బ్లాస్ట్ మూవీలోని ఒక క్లిప్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం కాంటవర్సీగా మారింది. యాక్షన్‌ హీరో అర్జున్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `బ్లాస్ట్ జోన్‌`. ఈ మూవీ మే 28న విడుదలైంది.దీనికి సుభాస్‌ కే రాజ్‌ దర్శకత్వం వహించిగా,అభిరామి, ప్రీతి ముకుందన్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ విడుదల చేశారు. ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ మీద దూసుకుని పోతుంది. ఈ క్రమంలో సింగర్ చిన్మయి ఈ మూవీకి సంబంధించిన ఒక థియేటర్ క్లిప్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి థియేటర్ లో

Eenadu31 May, 04:57 pm
మార్కులు సేమ్ .. ఒకే ర్యాంకు ఎందుకివ్వరు? సీఎంను ప్రశ్నించిన బాలిక

ఇంటర్నెట్‌ డెస్క్‌: బోర్డు పరీక్షల్లో సమాన మార్కులు వచ్చినప్పుడు.. వయసు ఆధారంగా ర్యాంకులను కేటాయించడంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann)ను ఓ విద్యార్థిని ప్రశ్నించింది. ప్రభుత్వ విధానం సరిగా లేదని అభిప్రాయపడింది. ఇందుకు బదులిచ్చిన సీఎం.. వెంటనే ఆయా విద్యార్థులకు మొదటి స్థానం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పంజాబ్‌ స్టేట్‌ బోర్డులో 8, 10, 12వ తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు ‘సితారే జమీన్‌ తే’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలో అమృత్‌సర్‌కు చెందిన ఓ విద్యార్థిని లేచి నిలబడి.. ‘‘మేమందరం ఒకే తరగతిలో చదువుకుంటాం. అందరం కష్టపడతాం. టీచర్లు కూడా అంతే కృషి చేస్తారు. కానీ, వయసు ఆధారంగా మొదటి, రెండు, మూడు స్థానాలు ఎందుకు ప్రకటిస్తారు? అని ఆ బాలిక ప్రశ్నించడంతో సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. OnMark పోర్టల్‌.. లోపాలు పరిశీలిస్తున్నాం : సీబీఎస్‌ఈ ఇందుకు సీఎం స్పందిస్తూ.. మా దృష్టిలో మీ ముగ్గురిది తొలి స్థానమేనని బదులిచ్చారు. అంతేకాదు.. సమాన మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు సంయుక్తంగా తొలి ర్యాంకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వయసు ఆధారంగా కాకుండా మార్కుల ఆధారంగానే స్థానాలు కేటాయించాలని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులందరితో కలిసి సీఎం ఫొటో తీసుకున్నారు. అదే వేదికపై ఉన్న దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా మాట్లాడుతూ.. ‘మీ విధానం తప్పు’ అని ముఖ్యమంత్రికి ఓ విద్యార్థిని చెప్పడాన్ని చూసి సంతోషిస్తున్నానని అన్నారు. ఇదిలాఉంటే, పంజాబ్‌ ప్రభుత్వ విద్యా విధానం ప్రకారం.. బోర్డు పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు సమానంగా మార్కులు సాధిస్తే.. వారిలో అతి చిన్న

Eenadu01 Jun, 01:39 pm
ఏపీలో పెద్ది’ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ .. టికెట్ ధర ఇలా

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. పాన్‌ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగానే కీలక నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు విడుదల ముందు రోజు కాదు కదా కొన్ని గంటల ముందు వరకూ బుకింగ్స్‌ ఓపెన్‌ కాక, అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇందుకు అనేక అంశాలు కారణమైనా, అంతిమంగా టికెట్లు బుక్‌ కావడమే ప్రేక్షకుడు చూస్తాడు. ఈ విషయంలో ‘పెద్ది’ మూడు అడుగులు ముందే ఉంది. జూన్‌ 4న మూవీ విడుదల కానుండగా, జూన్‌ 3న రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్‌ వేసేందుకు సిద్ధమైంది. ప్రీమియర్‌ టికెట్‌ ధరల పెంపు, స్పెషల్‌ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, సోమవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు నగరాల్లో బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. అంతేకాదు, జూన్‌ 5న ఉదయ ఆటకు సంబంధించిన టికెట్స్‌ను కూడా కొన్ని థియేటర్స్‌ అందుబాటులోకి తెచ్చాయి. జూన్‌ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్‌ ప్రీమియర్‌ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్‌ ధర రూ.600 (జీఎస్‌టీతో కలిపి), అలాగే జూన్‌ 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్‌ ధరలపై సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్‌

TV9 Telugu31 May, 01:39 am
ఏందీ మేడమ్ ఈ గ్లామర్ మేకోవర్.. బలగం నటిని గుర్తుపట్టారా

తెలుగు సినీ రంగంలో ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో బలగం ఒకటి. ఈ సినిమా ఎంతో మంది నటీనటుల జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా తెలంగాణ పల్లె సెంటిమెంట్ తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. అప్పటి వరకు కమెడియన్ గా, సహయ నటుడిగా రాణించిన వేణు యెల్దండి ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి చెప్పక్కర్లేదు. ఒక్కొక్కరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్.. ఈ సినిమాలోని ప్రతీ సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా జానపద గీతాలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ.. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ద్వారా పాపులర్ అయినవారిలో రూపాలక్ష్మీ ఒకరు. ఇందులో కొమురయ్య కూతురు లచ్చవ్వ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటన, సహజత్వం లచ్చవ్వ పాత్రకు ప్రాణం పోశాయి. బలగం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమాతో ఆమె పెరు మారుమోగింది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. చాలా కాలంగా సైలెంట్ అయిన ఆమె తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వీడియోతో మరోసారి తెరపై హాట్ టాపిక్ అయ్యింది. ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ

Sakshi31 May, 12:35 am
రణ్ వీర్ సింగ్ ని కాదు... ఎఫ్ డబ్య్లూఐసీఈని బ్యాన్ చేయండి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ‘‘డాన్‌ 3’ సినిమా వివాదంలో రణ్‌వీర్‌ సింగ్‌కు మద్దతుగా నిలిచారు దర్శక–నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ‘డాన్‌ 3’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభానికి మూడు వారాల ముందు ఈ ప్రాజెక్ట్‌ నుంచి రణ్‌వీర్‌ తప్పుకోవడంతో దాదాపు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్‌ ఆరోపించారు. ఆ

Eenadu01 Jun, 01:04 am
మధుర ఫలం రుచే రుచి

ఏపీలో పండే బంగినపల్లి, సువర్ణరేఖలను ప్రస్తావించిన మోదీ దిల్లీ: దేశంలో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన మామిడి రకాలు ఉంటాయని, ఆంధ్రప్రదేశ్‌లో బంగినపల్లి, సువర్ణరేఖ లభ్యమవుతుంటాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘ఫలాల్లో రాజు.. మామిడి. ఈ వేసవి వచ్చిందంటే దాని గురించి చర్చ జరగని ఇల్లంటూ ఉండదేమో. ఒక్కో ప్రాంతంలో పండే మామిడిది ఒక్కో రుచి, సువాసన. మహారాష్ట్ర ఆల్ఫోన్సో, గుజరాత్‌ కేసరి, యూపీ దశహరీ, బెంగాల్‌ హిమసాగర్‌ వంటివి పేరెన్నికగన్నవి. ఇక దక్షిణాదికి ఎవరైనా వెళ్తే బంగినపల్లి, తోతాపురి, నీలమ్, మాల్గోవా ఊరిస్తాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో సువర్ణరేఖ దొరుకుతాయి. బిహార్‌లో జర్దాలు రకాలైతే అల్లంత దూరాన ఉంటుండగానే సువాసన తెలిసిపోతుంది. కాశీలోని లాంగ్రా రకం- పండిన తర్వాత కూడా ఆకుపచ్చగానే ఉంటాయి. ప్రాంతాలను బట్టి మామిడి ఆకారం, రుచి, రంగు మారుతాయి. వీటి ప్రస్థానం గ్రామాల నుంచి ప్రపంచ మార్కెట్ల వరకు విస్తరించింది’ అని వివరించారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ ద్వారా ఆయన మాట్లాడారు. దేశంలో ఎండలు మండిపోతున్న దృష్ట్యా బయటకు వెళ్లేవారు తప్పకుండా తగినంత నీరు తాగాలని సూచించారు. ఎండలపై ఆయా శాఖల మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ఇటీవల రాంచీలో జరిగిన పరుగు పోటీల్లో జాతీయ రికార్డులు సాధించిన గురీందర్‌వీర్‌ సింగ్, అనిమేష్‌ కూజూర్‌లతో మోదీ మాట్లాడారు. జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ సమాఖ్య నిర్వహించిన పోటీలో విజేతలైన వీరి గురించి దేశమంతటా చర్చ జరుగుతోందని చెప్పారు. 100 మీటర్ల రేసులో రెండ్రోజుల వ్యవధిలో 3 రికార్డులు సాధించడం ప్రశంసనీయమన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి,

Eenadu01 Jun, 01:03 am
న్యాయమూర్తుల నియామకాలపై ఘర్షణ లేదు

దిల్లీ: సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాల విషయంలో న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్‌ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలో ఖాళీల భర్తీకి చక్కటి సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ అధ్యయనానికి ఎలాంటి అధికారిక కమిటీని ఏర్పాటు చేయలేదని, అనధికారికంగానే దీన్ని చేపట్టినట్లు వివరించారు. అందులో వెల్లడయ్యే అంశాల గురించి ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. కొలీజియం విధానానికి ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. న్యాయమూర్తుల నియామకాల్లో కొన్నిసార్లు కేంద్రం ప్రతిపాదించిన పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం తిరస్కరించిన సందర్భాలున్నాయని, అదే విధంగా కొలీజియం ప్రతిపాదించిన పేర్లను కేంద్రం తిరస్కరించిందని గుర్తు చేశారు. ఆ జాబితాల్లోని వ్యక్తుల నేపథ్య చరిత్ర సక్రమంగా లేకపోవడంలాంటివి అందుకు కారణాలు కావొచ్చన్నారు. కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తూ దాని స్థానంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించే బిల్లును గతంలో పార్లమెంటు ఆమోదించింది. అయితే సుప్రీం కోర్టు దాన్ని కొట్టివేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థల్లో 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండటంపై మేఘ్‌వాల్‌ స్పందిస్తూ.. వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రత్యామ్నాయ యంత్రాంగంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు /