
Andhra Pradesh: ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి కొత్త రూల్స్.. వచ్చే నెల నుంచి నేరుగా అకౌంట్లోకి..
Andhra Pradesh: ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి కొత్త రూల్స్.. వచ్చే నెల నుంచి నేరుగా అకౌంట్లోకి..
© 2026 telugu.digital

Andhra Pradesh: ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి కొత్త రూల్స్.. వచ్చే నెల నుంచి నేరుగా అకౌంట్లోకి..

Andhra Pradesh: కారులో 2కోట్లు పెట్టి జిమ్‌కు వెళ్లిన వ్యక్తి.. తిరిగొచ్చేసరికి ఊహించని సీన్..

Andhra Pradesh: ఏపీకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న వాన గండం.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..

Andhra Pradesh: సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర నిజాలు..

Andhra Pradesh: బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..

Andhra Pradesh: ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్.. రూ.75 వేల విలువ చేసే టెస్ట్ ఉచితం..!
Free Genetic Tests For Cancer Patients In ANdhra Pradesh: క్యాన్సర్ చికిత్సలో భాగంగా రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు జీజీహెచ్ ప్రాంగణంలో నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్లో ఈ జన్యు పరీక్షల ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. ఈ జన్యు పరీక్షలు చాలా ఖరీదైనవి కాగా.. ప్రైవేట్ వైద్య సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సేవలను ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఉచితంగా అందించనున్నారు. ఈ నెల 22 నుంచి ఈ ల్యాబ్ అందుబాటులోకి రానుంది.

Andhra Pradesh: 10ఏళ్ల ప్రేమ.. ప్రియుడి నమ్మకద్రోహం.. చివరకు యువతి ఊహించని నిర్ణయం..

Andhra Pradesh: పాము కరిచినా ప్రాణాలు పోవు.. మాది భరోసా అంటున్న ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh: ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్లాట్లు కేటాయింపు.. అంతా లైన్ క్లియర్..

Andhra Pradesh: యమలోకానికి టికెట్లు.. కట్ చేస్తే.. వినాయకుడి మండపం చుట్టూ కాంట్రవర్సీ..

Andhra Pradesh: ఎవడ్రా నువ్.. ఇలా ఉన్నావ్.. ఏకంగా రైళ్లన్నీ ఆగిపోయాయి.. అసలేం జరిగిందంటే..?

Andhra Pradesh: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే.. ఇకపై నో వెయిటింగ్..

Andhra Pradesh: గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

Andhra Pradesh: ఆధార్, రేషన్ కార్డు రెండూ ఉన్నాయా..? ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. ఏపీ ప్రభుత్వం పెద్ద ఊరట..
Andhra Pradesh Weather Today: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 19 నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం 3,4 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు.

ఉదయాన్నే పార్కుకు వెళ్లిన వారికి చెట్టు కింద గుట్టలుగా కరెన్సీ నోట్ల ముక్కలు కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా వైజాగ్ సెంట్రల్ పార్క్ వద్ద అదే జరిగింది.0 రూ.500 నుంచి రూ.10 వరకు అన్ని నోట్లూ ముక్కలు ముక్కలుగా పడి ఉండటంతో నగరంలో పెద్ద మిస్టరీగా మారింది. ఎవరో కావాలనే పడేశారా లేక దీని వెనుక ఏదైనా నేరం ఉందా అని ఆరా తీసిన పోలీసులకు అవాక్కయ్యే నిజం తెలిసింది.

గతంలో అడవికి వెళ్లిన ఆవులు రాకపోతే తప్పిపోయాయో లేక దొంగలు ఎత్తుకెళ్లారో అనుకునేవారు. కానీ ఇప్పుడు నల్లమల సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎండల తీవ్రత, నీటి ఎద్దడి కారణంగా అడవి వదిలి గ్రామాల శివార్లలోకి వస్తున్న పెద్దపులులు పశువుల మందలపై మాటు వేస్తున్నాయి. తాజాగా ట్రాప్ కెమెరాల్లో చిక్కిన పులి దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
Coca Cola Beverages To Invest Rs 1127 Crore In Andhra Pradesh:ఏపీలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. మొత్తం రూ.1127 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. . రూ.842 కోట్లతో విజయనగరం జిల్లాలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయనున్నారు.. అలాగే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విస్తరణ కోసం రూ.285 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. స్థానిక సమరానికి అత్యంత కీలకమైన, వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఇప్పటికే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న మొత్తం 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఈ నెల 22న అధికారికంగా తుది జాబితాలు విడుదల కానున్నాయి.
Andhra Pradesh Weather Update Today: ఏపీకి వచ్చే రెండు రోజులు వానలు పడతాయని అంచనా వేసింది వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. వాయువ్య బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంటున్నారు.. వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.

house sites for poor: Andhra Pradesh government plans to distribute house site pattas to 1 lakh 25 thousand poor people. Beneficiaries will get land for constructing their own homes under housing welfare schemes.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేయనుంది. సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తోంది.

Ganesha Idols being transported to Anantapur from Hyderabad by Train No. 12785 Kacheguda - Ashokapuram Express. South Central Railways says the shipment highlights rail connectivity for ceremonial deliveries across Telangana and Andhra Pradesh. గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగుతున్నాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో మండపాలన్నీ కూడా కళకళలాడుతున్నాయి.

Andhra Pradesh: నీటి చుక్క పడితే చీమలు వస్తాయ్.. వెంకన్నకు అభిషేకమే చెయ్యని ఆ గుడి గురించి తెలుసా?

Andhra Pradesh: బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం..

Andhra Pradesh: నేటికి 124 ఏళ్లు.. దేశంలోనే తొలి రైలు ప్రమాదం ఏపీలో ఎక్కడ జరిగిందో తెలుసా..?

Andhra Pradesh: దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..

Andhra Pradesh: పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇంటి వద్దకే వచ్చేస్తారు.. ఎక్కడికి వెళ్లాల్సిన అక్కర్లేదు..

Andhra Pradesh: ఇకపై ఆ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ఉచిత బస్సు పథకంపై ఏపీ ప్రభుత్వం బిగ్ డెసిషన్..

Andhra Pradesh: ఏపీ పర్యాటకానికి సరికొత్త ఊపు.. గంటల ప్రయాణం ఇక నిమిషాల్లోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Andhra Pradesh: ఏపీలో కొత్త పింఛన్లపై కూటమి ప్రభుత్వం బిగ్ అప్డేట్.. ఒక్కసారి ఇది చెక్ చేస్కోండి..

Andhra Pradesh: కొత్తగా పింఛన్ అప్లై చేసుకునేవారికి గుడ్ న్యూస్.. ఈ డాక్యుమెంట్స్ లేకున్నా ఓకే..

Andhra Pradesh: అబార్షన్ పిల్స్ మింగిన 17 ఏళ్ల బాలిక.. మూడో రోజే దారుణం!

పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన కేసులో గుంటూరు జిల్లా పోలీసుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ధర్మాసనం, "గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో, ఆయన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పోలీసుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బాలికను కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. గతంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌ను పోలీస్ స్టేషన్‌కు రాకుండా అడ్డుకున్న ఘటనను గుర్తుచేస్తూ, ఇలాంటి పోలీసులు ఉండటం ప్రభుత్వానికే సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేసింది.కేసు విచారణలో పోలీసులు సరైన స్ఫూర్తితో పనిచేయడం లేదని పేర్కొన్న కోర్టు, గురువారం నాటికల్లా బాలికను తమ ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుల్ జంగం నాని (ఏ3), హెడ్ కానిస్టేబుల్ బాబురావు (ఏ5), సాంబయ్య (ఏ6) తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్లను కొట్టివేసింది.ప్రస్తుతం ఈ నలుగురు రిమాండ్ ఖైదీలుగా వేర్వేరు జైళ్లలో ఉన్నారు. సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో ఉన్నారు. తాజా తీర్పు నేపథ్యంలో వారంతా జైలుకే పరిమితం కానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

దశాబ్దాల కాలం నాటి కల సాకారమైంది. ఉత్తరాంధ్ర బీళ్లకు జీవం పోసేందుకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ తరలివచ్చింది. ఈ చారిత్రక ఘట్టంతో పులకించిపోయిన ఉత్తరాంధ్ర రైతులు, ప్రజలు.. తమ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి, ఈ అపూర్వ ఘట్టానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.బుధవారం పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఉత్తరాంధ్ర భూముల్లోకి అడుగుపెట్టిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. అరుణ వర్ణంలో ప్రవహిస్తున్న పవిత్ర జలాలను శిరస్సున చల్లుకుని, భావోద్వేగంతో కాలువలో నిల్చుని పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించారు. అనంతరం గోదావరి తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రణామం అర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన స్థానిక రైతులు, మహిళలు హారతులు పడుతూ, పూలు చల్లుతూ గోదారమ్మకు స్వాగతం పలికారు.ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్రగా మారుతుంది: సీఎంఅనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలోని బీళ్లన్నీ పంటలతో కళకళలాడతాయి. అన్నవరం సత్యదేవుడి ఆశీస్సులతో అనకాపల్లికి వచ్చిన గోదారమ్మను.. వచ్చే ఏడాదికి సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి సూరీడి పాదాల వద్దకు తీసుకెళ్లి, వంశధార వరకు గోదావరి జలాలను తరలిస్తాం" అని స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో 2.87 లక్షల

Yellareddypeta: భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి - నగేష్ ఈ వార్తకు సంబంధించిన

Nellore: పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు 'జై కొట్టు' నినాదం ఆవిష్కరణ నెల్లూరు: యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు సమాజంలో మార్పుకు వారిని భాగస్వాములుగా చేయడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు దుగ్గిశెట్టి సుజిబాబు అన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పరమేశ్వరి కళ్యాణ మండపంలో బుధవారం సుజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ యువత కోసం ‘జై కొట్టు’ అనే నినాదాన్ని ఆవిష్కరించి ప్రకటించారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం జనసేన కార్యకర్తలు, యువత నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ.. యువతలో రాజకీయ చైతన్యం తీసుకురావడంతో పాటు జనసేన పార్టీలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. ‘జై కొట్టు’ నినాదంతో యువతను పెద్ద సంఖ్యలో రాజకీయాల వైపు ఆకర్షించి, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. యువతతోనే సమాజంలో గణనీయమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించడం రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టమని సుజయ్ బాబు అన్నారు. జనసేన పార్టీకి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆదరణకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో యువతను సమష్టిగా ముందుకు నడిపించి వైఎస్సార్సీపీని 11 స్థానాల నుంచి ఒక్క స్థానానికి పరిమితం చేసే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం పవన్‌కళ్యాణ్ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని సుజయ్ బాబు అన్నారు. ‘జై కొట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న లక్ష్యంతో యువతతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.అనంతరం భారీ కేక్ ను కట్ చేసి

Paderu: ‘బడి కోసం డొనేట్’ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ నిశాంతి ఈ వార్తకు సంబంధించిన

దిల్లీ: విశాఖ పాత విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసుల నిలిపివేతపై దాఖలైన పిల్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై ఏపీ హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. భోగాపురం ఎయిర్‌పోర్టుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని.. పాత విమానాశ్రయం నుంచీ విమాన సర్వీసులు నడపాలని విశాఖకు చెందిన కొసరాజు గోపాలకృష్ణ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విచారణ చేపట్టింది. కొత్త ఎయిర్పోర్ట్ నగరానికి 60 కి.మీ దూరంలో ఉందని, కనెక్టివిటీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. 30 ఏళ్ల పాటు సేవలు అందించిన విశాఖ విమానాశ్రయంపై ఎయిర్పోర్ట్ అథారిటీ రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. భోగాపురం విమానాశ్రయం ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’తో నిర్మించడం ఆహ్వానించదగినదని.. అలా అని 30 ఏళ్ల పాటు సేవలు అందించిన ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసులు నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు లేవని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది

ఆళ్లగడ్డ పట్టణం: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించింది. ఈ సంఘటన ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఆళ్లగడ్డకు చెందిన ఆంజనేయులు(32) పట్టణ శివారులోని సమీప పొలాల్లో మంగళవారం ఉదయం మృతిచెంది కనిపించాడు. సీఐ నాగరాజారావు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. తలపై ఎవరో బండరాయితో మోది అతడిని హత్య చేసినట్లు గుర్తించారు. భార్య సుబ్బులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. భార్యపై అనుమానం రావడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. చాగలమర్రి మండలం తోడేళ్లపల్లె గ్రామానికి చెందిన గురు ప్రసాద్‌తో సుబ్బులుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో వారి బంధానికి ఆంజనేయులు అడ్డువస్తుండడంతో సుబ్బులు భర్త హత్యకు వ్యూహరచన చేసింది. సోమవారం రాత్రి తన ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించింది. గురు ప్రసాద్ తనవెంట ప్రొద్దుటూరుకు చెందిన షరీఫ్‌ను వెంట తీసుకువెళ్లాడు. ముగ్గురు కలిసి పట్టణ శివారులో మద్యం సేవించారు. అనంతరం మత్తులో ఉన్న ఆంజనేయులు తలపై గురు ప్రసాద్ మద్యం సీసాతో కొట్టి, బండరాయితో మోదాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. మద్యం సీసా మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ సాయంతో పోలీసులు దానిని ఎవరు ఏ షాప్‌లో కొనుగోలు చేశారనేది సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. ముగ్గురిని న్యాయస్థానంలో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు

గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో పదో తరగతి విద్యార్థిని ఆచూకీ గుర్తించలేకపోయారంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏముందని అభిప్రాయపడింది. ఏదైమైనా గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. పోలీస్‌స్టేషన్‌కి రాకుండా ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్‌ను అడ్డుకున్నారని హైకోర్టు చురకలంటించింది. ఇలాంటి పోలీసులు ఉండటం ఏపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఘాటుగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయిందని జూన్‌లో పట్టాభిపురం పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మూడు నెలలు అవుతున్న తన కుమార్తె ఆచూకీ గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని హైకోర్టులో ఆమె తండ్రి హెబీయస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు సరైన స్ఫూర్తితో వ్యవహరిస్తే.. బాలికను కనుగొనేందుకు ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించింది. రేపటి లోగా బాలికను కోర్టు ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించింది. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

అల్లవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన జనసైనికుడు రోళ్ల ప్రేమ్‌కుమార్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందడం కలచి వేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. జీవితం ఎంతో అమూల్యమైనదని, ర్యాలీలు, బ్యానర్ల ఏర్పాటులో స్వీయ భద్రతకు పాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రేమ్‌కుమార్ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని రాష్ట్ర ఫౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన జనసేన ఎమ్మెల్యేలతో కలిసి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి పార్టీ తరఫున రూ.5 లక్షల సాయం అందించారు. మృతుడి తండ్రి సతీష్‌తో మాట్లాడారు. ఇంజినీరింగ్ చదువుతూ ఇటీవలే ఉద్యోగానికి ఎంపికైన కుమారుడు మృతి చెందడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ మృతుడి సోదరుడు ఆదినారాయణకు ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మరో ఈవెంట్ మేనేజ్మెంట్కు తెరలేపారని.. రెండున్నరేళ్ల నుంచి ఇదే తరహాలో కాలం గడుపుతూ వచ్చారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ‘‘పురుషోత్తపట్నం ద్వారా పోలవరం ఎడమ కాల్వలోకి నీళ్లు వదిలారు. పోలవరం నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు’’ అని అమర్నాథ్ దుయ్యబట్టారు. ‘‘పోలవరం కాలువ ప్యాకేజీలను అంచనాలు పెంచి తనకు నచ్చిన వాళ్లకు ఇచ్చుకున్నారు. పోలవరం ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. పోలవరం ఎత్తు 41 మీటర్లు కాంటూరు వద్ద నీటిని నిల్వ చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలియదా?. 45 మీటర్ల నుంచి ఎత్తును 41 మీటర్లకు తగ్గించేందుకు ఎందుకు ఒప్పుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు తెచ్చిన ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి’’ అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఫోబియాతో చంద్రబాబు భయపడుతున్నారు. జగన్నామస్మరణతో చంద్రబాబు బతుకుతున్నారు. చంద్రబాబు చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ల ఖర్చుతో మరొక పోలవరం ప్రాజెక్టు కట్టవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇస్తున్నారా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇస్తున్నారా? ప్రజలకు చెప్పాలి. వైఎస్సార్ మరణించిన రోజు నీళ్లు విడుదల చేయడం దేవుడు రాసిన స్క్రిప్ట్. చేతకాని వాడు మంగళవారం అన్నారనే సామెత చందంగా ఉంది చంద్రబాబు తీరు. చంద్రబాబు పాలనలో పనులు చేయలేక ఆ నెపాన్ని ఉద్యోగుల మీద నెడుతున్నారు. గ్రావిటీ ద్వారా పోలవరం కాలువకు నీళ్లు ఇవ్వాలి.. ఎత్తిపోతల పథకం ద్వారా కాదు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా వల్లూరులో మెగా డీఎస్సీ అక్రమాలు బట్టబయలయ్యాయి. టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్ట్ ఇచ్చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. టెట్ అర్హత లేకుండానే స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టు ఇచ్చినట్లు కర్నూలు విద్యాశాఖ అధికారులు నిర్థారించారు. స్పోర్ట్స్ కోటాలో టీచింగ్ పోస్టుకు టెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధనలు ఉండగా.. అర్హత లేకుండానే ఓ అభ్యర్దిని ఎస్జీటీ పోస్టుకు శాప్ ఎంపిక చేసేసింది. కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ స్కూల్లో అర్హత లేని టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. కర్నూలు డీఈవో ఆఫీస్‌లో టీచర్స్ కమిటి ఆధ్వర్యంలో ప్రభాకర్ గౌడ్ విద్యార్హతలపై విచారణ జరపగా.. విచారణ కమిటీకి అర్హత సర్టిఫికెట్లను ప్రభాకర్ గౌడ్ చూపలేకపోయారు. టీచర్ కమిటీ ముందు టెట్ అర్హత పొందలేదని ప్రభాకర్ అంగీకరించారు. స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ చేసిన టీచర్ పోస్టులలో అనర్హులకు చోటుపై వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు సర్కార్ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో కేవలం ఒక జూడో క్రీడ ద్వారానే 21 మందికి టీచర్ పోస్టులు ఇచ్చేసింది. ఘటనపై పాఠశాల డైరెక్టర్‌కు నివేదిక అందజేస్తామని కర్నూలు డీఈవో తెలిపారు. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్

Sircilla: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ మహేష్ గితే ఈ వార్తకు సంబంధించిన

Macherla: వైఎస్సార్ 17వ వర్ధంతి - ఘన నివాళులర్పించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వార్తకు సంబంధించిన

అనకాపల్లి పట్టణం: ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు అనకాపల్లిలో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ కార్యాలయం నుంచి జనసైనికులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలో భాగంగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు