translateexpand_more

General News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu01 Jun, 03:30 am
లో ఈ పథకానికి విరాళమిస్తే.. ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం, మార్గదర్శకాలు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరటం తో భక్తులు రద్దీ పెరిగింది. ఆదివారం 90,826 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్ల లో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో శ్రీవాణి కోటా తో పాటుగా టీటీడీ అమలు చేస్తున్న మరో పథకానికి భక్తుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది.తిరుమల తో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. ఆదివారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా, టీటీడీ ట్రస్టుల్లో శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి ఆదరణ పెరుగుతోంది. రూ.లక్ష విరాళం అందజేస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం(ఒకసారి మాత్రమే) కల్పిస్తున్న నేపథ్యంలో భక్తులు ఆసక్తి చూపుతున్నారు. శ్రీవేంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ఆధ్వర్యంలో నవజాత శిశువులు, చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన నిధులను దాతల ద్వారా సమీకరించేందుకు టీటీడీ 2022లో శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకాన్ని ప్రారంభించింది. PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్.. కీలక మార్పులు..!!స్పందిస్తున్న భక్తులు.. పథకానికి విరాళాలు కాగా, ఈ పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు టీటీడీ ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తోంది. శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలటీ ఆస్పత్రి నిర్వహణ కోసం రూ.కోటి విరాళమిచ్చే దాతలు ఇప్పటికే ఎస్వీ ప్రాణదానం ట్రస్టు ద్వారా లభించే ప్రత్యేక

Asianet News Telugu01 Jun, 03:09 am
సూరజ్ స్టాల్లో జ్యూస్ లు అమ్మిన జ్యో-శివన్నారాయణ బాధ-సూరజ్ వార్నింగ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో జ్యోత్స్న కోసం స్టాల్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు సూరజ్. అప్పుడే జ్యోత్స్న, పారులను తీసుకొని స్టాల్ దగ్గరకు వస్తాడు కార్తీక్. బ్రదర్ టైమింగ్ సూపర్. అదిగో మన స్పెషల్ గెస్ట్ వచ్చింది అంటాడు సూరజ్. కార్తీక్, సూరజ్ హాయ్ చెప్పుకుంటారు. ఆ తర్వాత జ్యోను స్టాల్ దగ్గరకు తీసుకెళ్తాడు కార్తీక్. సూరజ్ స్టాల్ దగ్గర జ్యోత్స్న వల్ల తప్పు జరిగిందన్నట్లు రాసిన ఫ్లెక్సీలు ఉంటాయి. అవి చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. ఈ ఫ్లెక్సీల గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటుంది జ్యోత్స్న. నీ వల్లే కదా చెడ్డపేరు వచ్చింది.. దాన్ని పోగొట్టాల్సింది కూడా నువ్వే అంటాడు కార్తీక్. మీరు చూసుకోలేదు కానీ.. సోషల్ మీడియాలో కూడా గట్టిగానే పబ్లిసిటీ చేశాం అంటాడు కార్తీక్. జ్యోత్స్నని షాప్ లో పని చేసే అమ్మాయిలా రెడీ చేస్తారు సూరజ్ , కార్తీక్. షాప్ లో జ్యోత్స్న జ్యూస్ లు తయారు చేసి, సర్వ్ చేస్తుంది. ఆ ఫోటోలను శివన్నారాయణకు పంపిస్తాడు కార్తీక్. మనుమరాలి ఫోటోలు చూసి బాధపడతాడు శివన్నారాయణ. ఈ ఇంటి వారసురాలు ఎలాంటి పరిస్థితి తెచ్చుకుందో చూడండి. అని సుమిత్ర వాళ్లకు ఆ ఫోటోలను చూపిస్తాడు. సూరజ్ రివేంజ్ కోసం ఈ పని చేసినట్లు అనిపించలేదని అంటారు దీప, కాంచన. తనకి బుద్ధి రావాలంటే ఇలాంటివి చేయించాల్సిందే అంటారు దశరథ, సుమిత్ర. మరోవైపు పనిచేస్తున్న జ్యోత్స్నను చూసి బాధపడుతుంది పారు. కార్తీక్ ని పిలిచి దానికోసం ఒక కూలర్ పెట్టించురా అంటుంది. ఇది శివన్నారాయణ బడ్జెట్ కాదు. సూరజ్ బడ్జెట్... నో కూలర్, నో ఏసీ. పని చేయాల్సిందే అంటాడు కార్తీక్. కాస్త నవ్వుతూ

Samayam Telugu01 Jun, 02:59 am
జలుబు తగ్గడానికి సులభమైన ఇంటి చిట్కాలు

జలుబు వస్తే మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాతావరణం మారగానే ముక్కు కారడం, తుమ్ములు, గొంతులో గరగర అంటూ మొదలై రోజంతా చిరాకుగా అనిపిస్తుంది. అయితే ప్రతి చిన్న సమస్యకు మందుల షాపుకి వెళ్లాల్సిన పని లేకుండా మన వంటగదే ఒక అద్భుతమైన వైద్యశాలలా పని చేస్తుంది. ముఖ్యంగా మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన చిట్కాల్లో ప్రకృతి సిద్ధమైన శక్తి దాగా ఉంటుంది. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా తోడ్పడుతాయి. ముఖ్యంగా మిరియాలు, శొంఠి వంటివి కఫాన్ని కరిగించి మనకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయని రీసెర్చ్‌ గేట్‌ అధ్యయనం పేర్కొంది. ఈ క్రమంలో జలుబును తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..మిరియాలు, పిప్పళ్లు, శొంఠి చూర్ణంఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి మూడు కఫాన్ని తగ్గించి ఊపిరితిత్తుల మార్గాన్ని క్లియర్‌ చేస్తాయి. దీనిని ఎలా వాడాలంటే వీటి మూడింటిని అంటే మిరియాల పొడి, పిప్పళ్ల పొడి, శొంఠి పొడిని సమాన పాళ్లలో తీసుకోవాలి. వీటిలో అర టీ స్పూన్‌ తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.మిరియాల పాలుజలుబు, జలుబు వల్ల వచ్చే గొంతు నొప్పికి ఇవి బెస్ట్‌ రెమిడీ. ఒక గ్లాస్‌ పాలలో పావు టీ స్పూన్‌ మిరియాల పొడి కొద్దిగా పసుపు వేసి బాగా మరిగించాలి. రాత్రి పడుకునే ముందు తాగాతే గొంతులో గరగర తగ్గడమే కాకుండా నిద్ర బాగా పడుతుంది.అల్లం + బెల్లం లేదా తేనెఒకవేళ శొంఠి అందుబాటులో లేకపోతే పచ్చి అల్లం వాడొచ్చు. అల్లం ముక్కను నూరి దాని రసాన్ని తీయాలి. ఒక స్పూన్‌ అల్లం రసానికి సమానంగా తేనె లేదా కొద్దిగా బెల్లం కలిపి

Zee Telugu01 Jun, 01:09 pm
నీట్ రీఎగ్జామ్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఓఎంఆర్ విధానమే ఖరారు

NEET Re-Exam: నీట్-యూజీ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్ 21వ తేదీన జరగబోయే NEET పున:పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలనే పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో పరీక్షను యథాతథంగా ఓఎంఆర్‌ పద్ధతిలోనే హించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు బెంచ్, పరీక్షా విధానాన్ని అకస్మాత్తుగా మార్చడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని పేర్కొంది. సమయాభావం, అలాగే పరీక్ష నిర్వహణ సంస్థ అయిన ఎన్‌టీఏపై ఉన్న భారీ నిర్వహణ ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Oneindia Telugu01 Jun, 06:55 am
ధనస్సు రాశి, మకర రాశివారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి

హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి. మకర రాశికి అధిపతి శని దేవుడు. ఈ రెండు రాశుల వారు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి, అనుకున్న పనులు కలిసిరావడానికి చేయాల్సిన ముఖ్యమైన పరిహారాలు, సూచనలు కొన్ని ఉన్నాయి. వాటిగురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే ఎవరికైనా సరే జాతకంలో గ్రహాల అనుకూలతతో పాటు సత్ప్రవర్తన, కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉన్నప్పుడు అదృష్టం మరింత వేగంగా కలిసివస్తుంది.ధనస్సు రాశిధనస్సు రాశి వారికి అదృష్టం, విజయం లభించాలంటే లగ్నాధిపతి అయిన గురు గ్రహ అనుగ్రహం చాలా అవసరం. ప్రతి గురువారం గుడికి వెళ్లడం లేదా ఇంట్లోనే దైవచింతనతో గడపడం మంచిది. ముఖ్యంగా గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం కలిసివస్తుంది. గురువారం రోజున శనగలు, అరటిపండ్లు లేదా పసుపు రంగు వస్తువులను పేదలకు లేదా గుడిలో బ్రాహ్మణులకు దానం చేయాలి. దత్తాత్రేయుడు, శివుడు లేదా సాయిబాబాను పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా గురు శ్లోకాలను పఠించడం మంచిది. ఇంట్లోని పెద్దలు, గురువులు, తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం వల్ల ధనస్సు రాశి వారికి పనులు త్వరగా పూర్తవుతాయి.మకర రాశిమకర రాశి వారికి అధిపతి శని దేవుడు. ఈ రాశి వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. శని ప్రభావం అనుకూలంగా ఉండాలంటే.. ప్రతి శనివారం శని దేవుడికి లేదా ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో పూజ చేయడం చాలా శ్రేయస్కరం. శని దోషాలు తొలగి, పనులు కలిసిరావడానికి ప్రతిరోజూ లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శనివారం రోజున నలుపు లేదా ముదురు నీలం రంగు దుస్తులు ధరించడం మంచిది.శని దేవుడు న్యాయాధికారి.

NTV Telugu01 Jun, 06:55 am
దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది

Viral Video : మన ఇళ్లలో ఉండే చిన్న చిన్న నిర్లక్ష్యాలు కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. ముఖ్యంగా మందుల విషయంలో చేసే పొరపాట్లు ఊహించని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. సాధారణంగా దగ్గు మందు సిరప్ బాటిల్‌ను వాడిన తర్వాత పక్కన పెట్టేయడం చాలా మందికి అలవాటు. అయితే అదే అలవాటు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఈ ఘటన చూపిస్తోంది. వైరల్ వీడియోలో ఒక బల్లి దగ్గు మందు సిరప్ బాటిల్‌పైకి ఎక్కి, మూత చుట్టూ అంటుకున్న ద్రవాన్ని నాకుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో మందుల భద్రతపై పెద్ద చర్చ మొదలైంది. సాధారణంగా సిరప్‌లు తీపి రుచిని కలిగి ఉండటం వల్ల చీమలు, బల్లులు, ఇతర కీటకాలు వాటివైపు ఆకర్షితమవుతాయి. ఒకసారి అవి బాటిల్‌కు తాకినా, నాలుకతో టచ్ చేసినా, బ్యాక్టీరియా మందులోకి చేరే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులకు ఇచ్చే మందుల విషయంలో ఈ జాగ్రత్తలు మరింత అవసరమని వాళ్ళు చెబుతున్నారు. పిల్లల రోగనిరోధక శక్తి పెద్దలతో పోలిస్తే సున్నితంగా ఉండటం వల్ల కలుషితమైన మందులు తీసుకుంటే జీర్ణాశయ ఇన్ఫెక్షన్లు, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ప్రతి సారి మందు వాడిన వెంటనే బాటిల్ పై భాగాన్ని, మూత చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రమైన గుడ్డతో తుడవడం చాలా ముఖ్యం. తర్వాత మూతను గట్టిగా బిగించి మూసివేయాలి. అలాగే మందులను

TV9 Telugu01 Jun, 06:26 am
మామిడి ఆకులతో అందం..ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం

మామిడి ఆకులతో అందం..ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం!మామిడి ఆకులతో అందం..ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం! 01 June 2026 Jyothi Gadda వేసవి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నోరూరించే మామిడి పండ్లు. అయితే, మామిడి చెట్టు కేవలం రుచికరమైన పండ్లను మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని పెంపొందించే అద్భుతమైన ఆకులను కూడా అందిస్తుంది. మామిడి ఆకులను కేవలం పండగలకు తోరణాలు కట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ, ఈ ఆకులలో దాగున్న ఔషధ గుణాలు చర్మానికి సహజమైన మెరుపును తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మామిడి ఆకులలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాలలో పేరుకుపోయే బ్యాక్టీరియాను మరియు ధూళిని తొలగిస్తాయి. మామిడి ఆకులలోని గుణాలు చర్మంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నశింపజేయడంలో, నల్లటి మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. చర్మంలోని జిడ్డును నియంత్రిస్తాయి. లేత మామిడి ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు రాసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. మామిడి ఆకులను నీడలో బాగా ఎండబెట్టి, వాటిని మిక్సీ పట్టి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఒక చెంచా మామిడి ఆకుల పొడిలో తగినంత రోజ్ వాటర్ కలిపి ప్యాక్‌లా తయారుచేయాలి. దీనిని వారానికి రెండు సార్లు ముఖానికి వేసుకోవడం వల్ల నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ క్రమంగా తగ్గిపోతాయి. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, ఇన్స్టెంట్ గ్లోను అందిస్తుంది. కొన్ని మామిడి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత, ఆ నీటితో ముఖాన్ని

Samayam Telugu01 Jun, 06:17 am
గొర్రెలా నమ్మేసిన విక్రమ్.. అనుమానించిన రాధ.. నమ్మించి గొంతుకోయడంలో ఇంత ఆనందం ఉందా

విక్రమ్, రాధల అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి తెలియడంతో దమయంతి, ప్రియ ఓ ఆట ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విక్రమ్ వద్దకు వెళ్లి తన స్టైల్లో నాటకం ఆడింది ప్రియ. ఇక రాధ వద్దకు దమయంతి వచ్చి అగ్రిమెంట్ అని పదం చెప్పి.. మెల్లిగా హింట్ ఇచ్చింది. ఇన్ని రోజులు మీ బంధాన్ని, ప్రేమను అర్థం చేసుకోలేదు.. ఇకపై నేను మీకు సపోర్ట్‌గా ఉంటాను.. నీకు పుట్టింట్లోనే కాదు.. అత్తింట్లోనూ అమ్మ ఉంది అనుకో.. ఇకపై నీ సీమంత, నీ పిల్లలు ఇలా ప్రతీ కార్యక్రమానికి నేను సపోర్ట్ చేస్తాను.. అని దమయంతి చెబుతుంది. దీంతో రాధలో కాస్త అనుమానం మొదలవుతుంది.అగ్రిమెంట్ అని తెలిసి అందా? తెలియక అందా అని రాధ ఆలోచిస్తుంటుంది. ఇంతలో విక్రమ్ వచ్చి ప్రియ గురించి చెబుతాడు. ప్రియ నన్ను మర్చిపోయిందట.. త్వరలోనే వేరే వాడ్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందట.. అని చెప్పి విక్రమ్ సంబరపడిపోతాడు. మీరు మరీ ఇంత అమాయకపు చక్రవర్తిలా ఉన్నారేంటి.. మీ అత్త, ప్రియ మారిందంటే ఎలా నమ్ముతున్నారు అని రాధ అంటుంది. నాకు వారి గురించి తెలుసు.. వారు మారిపోయారు అని విక్రమ్ అంటాడు. అంతలా నమ్మకండి.. బొక్క బోర్లా పడతారు.. అని రాధ అంటుంది. నన్ను ఎవ్వరూ పడేయలేరు అని విక్రమ్ అనగానే.. స్విమ్మింగ్ పూల్‌లో కాలు జారి పడిపోతాడు.🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : చక్రిని కిడ్నాప్ చేయించిన ప్రతాప్.. ఆదికి మహా మాస్ వార్నింగ్.. కేశవ కోసం తపిస్తున్న శైలుఅవును మిమ్మల్ని ఎవ్వరూ పడేయాల్సిన పని లేదు.. మీరే పడిపోతారు అని రాధ నవ్వేస్తుంది. రాధని కూడా లాగి పడేద్దామని విక్రమ్ అనుకుంటాడు. సాయం చేస్తావా? చేయి అందించి అని విక్రమ్ అడుగుతాడు.

Samayam Telugu01 Jun, 04:45 am
గాఢ నిద్ర అందించే ఉదయం అలవాట్లు

ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఎండలో ఉండండి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉదయం ఎండలో ఉంటే రాత్రిపూట త్వరగా నిద్రపడుతుంది. ఉదయం లేచిన తర్వాత కాసేపు వాకింగ్‌ లేదా ఇతర వ్యాయామాలు చేయండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నిద్ర లేచిన తర్వాత స్ట్రెచ్చింగ్‌ వ్యాయామాలు చేయండి. దీని వల్ల కండరాలు రిలాక్స్‌ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట త్వరగా నిద్ర వస్తుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర లేవండి. దీని వల్ల సిర్కాడియన్ రిథమ్ బాగుంటుంది. దీంతో రాత్రిపూట త్వరగా నిద్ర పడుతుంది. ఉదయం మేల్కొన్న తర్వాత ధ్యానం చేయండి. దీని వల్ల రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట త్వరగా నిద్ర పడుతుంది. ఉదయం మేల్కొన్న తర్వాత ఒక గ్లాసు నీరు తాగండి. దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. దీంతో రాత్రిపూట నిద్ర వస్తుంది. ఉదయం పూట అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని తినండి. దీని వల్ల ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. నిద్ర చక్రం స్థిరంగా ఉంటుంది. ఉదయం లేవగానే ఫోన్‌ ఉపయోగించడం మంచిది కాదు. ఉదయాన్నే సోషల్ మీడియా చూస్తే ఒత్తిడి పెరుగుతుంది. రాత్రిపూట నిద్ర రాదు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ రోజు చేయాల్సిన పనులను ఒక చోట రాసుకోండి. దీని వల్ల మనసు తేలిక అవుతుంది. ఒత్తిడి తగ్గి, నిద్రపడుతుంది.

Samayam Telugu01 Jun, 04:48 am
ముఖంపైన చిన్న రంధ్రాలను తగ్గించే ఇంటి చిట్కాలు

ముఖంపై ఏర్పడిన రంధ్రాలను తొలగించడంలో ఐస్ క్యూబ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుందని డెర్మటాలజీ అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికోసం శుభ్రమైన క్లాత్‌లో ఐస్ ముక్కలు చుట్టి దానితో ముఖంపై మసాజ్ చేయండి. దీంతో రంధ్రాలు మూసుకుపోతాయి. అలాగే స్కిన్ క్లియర్‌గా మారుతుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో ఒకట్రెండు సార్లు చేస్తే ముఖంపైన రంధ్రాలు మూసుకుపోతాయి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై రంధ్రాలు తొలగించి మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి. దీనికోసం గ్రీన్ టీ తయారుచేసి చల్లారిన తర్వాత అందులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి కాటన్ బాల్ సహాయంతో ముఖానికి రాసుకోండి. కాసేపయ్యా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. శనగ పిండి నేచురల్ ఎక్స్‌ఫోలియేట్ లాగా పనిచేసి ముఖ రంధ్రాలను తొలగిస్తుంది. దీనికోసం శనగ పిండిలో కొద్దిగా పెరుగు, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. అలోవెరాలోని సమ్మేళనాలు ముఖంపై రంధ్రాలు, మొటిమలు, మచ్చలు తొలగించడంలో సహాయపడతాయి. దీనికోసం తాజా అలోవెరా తీసుకుని ముఖానికి మందపాటి లేయర్ లాగా రాసుకోండి. 20 నిమిషాలు ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటోల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై అదనపు నూనెలు తొలగించి ముఖంపై రంధ్రాలు తొలగిస్తాయి. దీనికోసం తాజా టొమాటో గుజ్జును ముఖానికి రాసుకుని కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే చాలు. ముఖంపై రంధ్రాలు తొలగించడంలో కోడిగుడ్డు తెల్లసొన చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ఒక కోడిగుడ్డు తెల్లసొనను బాగా గిలకొట్టి ముఖంపై మందపాటి లేయర్ లాగా రాసుకోండి. ఆరిన తర్వాత క్లీన్ చేసకుంటే సరిపోతుంది. యాపిల్ సైడర్

AP7AM01 Jun, 01:22 am
రూ. 2 లక్షల బ్యాగ్ తో కోతి పరార్.. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక విచిత్రమైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి నుంచి సుమారు రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ఓ కోతి లాక్కెళ్లి, చెట్టుపైకి ఎక్కి నోట్లను కిందకు వెదజల్లింది. దీంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది.అస‌లేం జ‌రిగిందంటే..!కచేరీ రోడ్డులోని స్టాంప్ వెండర్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ లాయర్ తన సహోద్యోగి రవీంద్ర లోధి (రాజు)ని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కోసం స్టాంపులు కొనేందుకు పంపించారు. రాజు డబ్బుల బ్యాగ్‌తో వెళ్తుండగా, ఓ కోతి అకస్మాత్తుగా ఆ బ్యాగ్‌ను లాక్కొని సమీపంలోని వేప చెట్టుపైకి ఎక్కింది.చెట్టు కొమ్మపై కూర్చున్న కోతి, బ్యాగ్‌ను చించి అందులో ఉన్న రూ. 500 నోట్ల కట్టలను కిందకు విసిరేయడం ప్రారంభించింది. దీంతో అక్కడ 'డబ్బుల వర్షం' కురుస్తున్నట్టు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన జనం, కింద పడుతున్న నోట్లను ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.సమాచారం అందుకున్న స్థానిక లాయర్లు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దాదాపు రూ. 1.91 లక్షల నగదును తిరిగి స్వాధీనం చేసుకుని యజమానికి అప్పగించినట్లు తెలిసింది. దీంతో పెద్దగా నష్టం జరగలేదని సమాచారం. కోతి కాసేపటికి ఖాళీ బ్యాగ్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆహారం కోసమే కోతి బ్యాగ్‌ను లాక్కెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోతుల బెడద సాధారణమే కాగా, ఈ సంఘటన పట్టణ

Oneindia Telugu01 Jun, 01:20 am
గ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెంపు- కనివినీ ఎరుగని రేట్లు

ఊహించిందే జరిగింది. వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఎల్పీజీ వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వీటి రేట్లను సవరిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీన్ని ఇప్పుడు కూడా కొనసాగించాయి.వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల సిలిండర్‌పై ఏకంగా 42 రూపాయలు పెరిగింది. దీంతో ఒక్కో సిలిండర్ ధర అమాంతం రూ.3113.50 పైసలకు చేరింది. కోల్‌కతాలో రూ.53.50 పైసల మేర పెరిగింది. అక్కడ సిలిండర్ ధర రూ.3255.50కి చేరింది. కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర ఈ స్థాయిలో ఉంటుందని బహుశా ఎవరూ ఊహించివుండరు. ఇదే కాకుండా అయిదు కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ల రేటు కూడా మారింది. ఒక్కో సిలిండర్ పై 11 రూపాయలు పెరిగింది. గృహావసర సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు.

Zee Telugu31 May, 04:46 am
ఆమ్లెట్ లేదా ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గాలంటే ఏది బెస్ట్.. అస్సలు ఊహించరు

Boiled Egg vs Omelette:గుడ్డును సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారో చాలా మందికి తెలిసిందే. తక్కువ ఖర్చుతో శరీరానికి మంచి ప్రోటీన్ అందించే ఆహారాల్లో గుడ్డు ముందుంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే చాలామందిలో ఒక సందేహం మాత్రం ఉంటుంది. వెయిట్ లాస్ కోసం ఉడికించిన గుడ్డు తినాలా.. లేక ఆమ్లెట్ తినాలా అని ఆలోచిస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గాలనుకునేవారికి ఉడికించిన గుడ్డు మంచి ఎంపికగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని వండడానికి నూనె, వెన్న వంటి అదనపు పదార్థాలు అవసరం ఉండవు. ఒక మీడియం సైజ్ ఉడికించిన గుడ్డులో సుమారు 70 నుంచి 78 కేలరీలు మాత్రమే ఉంటాయి. పైగా ఇందులో శరీరానికి అవసరమైన ప్రోటీన్‌తో పాటు విటమిన్ డి, విటమిన్ బి12, కోలిన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కడుపు ఎక్కువసేపు నిండిన భావన ఉండటంతో మధ్యలో ఆకలి కూడా తగ్గుతుంది. మరోవైపు ఆమ్లెట్ రుచిగా ఉండటంతో చాలా మందికి ఇష్టమైన ఎంపిక. కానీ ఇందులో వాడే నూనె లేదా వెన్న కారణంగా కేలరీలు పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆమ్లెట్‌లో 90 నుంచి 200 వరకు కేలరీలు ఉండొచ్చు. అయితే ఇందులో ఒక మంచి విషయం కూడా ఉంది. ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్, పాలకూర వంటి కూరగాయలు కలిపితే ఫైబర్ పెరుగుతుంది. దీంతో శరీరానికి అదనపు పోషకాలు అందుతాయి. కేలరీలను ఇంకా తగ్గించాలనుకునేవారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తీసుకోవచ్చు. ఒక ఎగ్ వైట్‌లో తక్కువ కేలరీలు ఉన్నా ప్రోటీన్ మాత్రం బాగా లభిస్తుంది. ఆమ్లెట్ తినాలనిపిస్తే తక్కువ నూనెతో లేదా నాన్‌స్టిక్ పాన్‌లో చేసుకోవడం మంచిది.

TV9 Telugu31 May, 04:27 am
ఈ లక్షణాలు ఉన్న వారిని అస్సలు నమ్మొద్దు

ఈ లక్షణాలు ఉన్న వారిని అస్సలు నమ్మొద్దు!ఈ లక్షణాలు ఉన్న వారిని అస్సలు నమ్మొద్దు! Prasanna Yadla 31 May 2026 Pic credit - Pinterest చాణక్యుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనకీ చెప్పాడు. అయితే, వాటిలో మన జీవితంలో జరిగే విషయాలను ముందే అంచనా వేసి చెప్పాడు. చాణక్యుడు చాణక్యుడు చెప్పిన సూచనలు తెలుసుకోవడానికి ఇప్పటికి ఎంతో మంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు చాణక్యుడు చెప్పిన సూచనలు చాణక్య నీతి ప్రకారం, ఈ లక్షణాలు ఉన్నవారు మిమ్మల్ని మోసం చేస్తారని చెబుతున్నారు అవేంటో ఇక్కడ చూద్దాం.. వీరు మోసం చేయడం ఖాయం కాబట్టి, వీరిని దగ్గరకి కూడా రానివ్వకండి అలాగే ఈ వ్యక్తులు జీవితంలో మిమ్మల్ని మోసం చేయవచ్చని చాణక్యుడు చెబుతున్నారు దగ్గరకి కూడా రానివ్వకండి అబద్ధం చెప్పే మనుషులను వీలైనంత దూరం పెట్టండి ఇలాంటి వారితో స్నేహం చేస్తే మీకే ప్రమాదం అబద్ధం చెప్పే మనుషులకు ఇచ్చిన మాట మీద నిలబడని వారికీ కూడా దూరంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు మాట మీద నిలబడలేని వారికి ఆచార్య చాణక్యుడి చెప్పిన దాని ప్రకారం, స్వార్థపరుల నుండి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు వాడుకుంటారు స్వార్థపరుల నుండి (నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్‌ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హె‎ల్త్‎కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

AP7AM31 May, 04:26 am
గాజియాబాద్ లో ఎన్ కౌంటర్.. సూర్యప్రతాప్ హత్య కేసు నిందితుడి హతం

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన 17 ఏళ్ల సూర్యప్రతాప్ చౌహాన్ హత్య కేసులోని ప్రధాన నిందితుడు అసద్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాజియాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు యత్నించిన అసద్.. ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఆపరేషన్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు సైతం గాయాలయ్యాయి.ఈ నెల 28న బక్రీద్ పండుగ రోజున ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యప్రతాప్ చౌహాన్‌ను అసద్, అతడి అనుచరులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను వెంటనే పట్టుకోవాలంటూ పలు హిందూ సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ కేసులో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేశారు. అయితే, ప్రధాన సూత్రధారి అయిన అసద్ పరారీలో ఉండటంతో అతడిపై రూ. 50,000 రివార్డు ప్రకటించారు.ఈ క్రమంలో అసద్ నగరం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఖోడా, ఇందిరాపురం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. బైక్‌పై వస్తున్న అసద్‌ను ఆపేందుకు ప్రయత్నించగా, అతడు పోలీసులపై నాటు పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అసద్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరగలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటన సమయంలో బైక్‌పై ఉన్న అతని అనుచరుడు చీకటిని ఆసరాగా చేసుకొని పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు

Oneindia Telugu31 May, 03:54 am
ఈ ఆలయానికి వెళ్తే ఇక అనారోగ్య సమస్యలకు గుడ్ బై

తమిళనాడులోని కుంభకోణం భారతదేశపు అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక నగరాలలో ఒకటి. వేలాది ఆలయాలకు ఇది నిలయం. ఈ ప్రాంతంలో ప్రతి వీధిలోనూ ఒక దేవాలయం దర్శనమిస్తుంటుంది. అటువంటి పుణ్యక్షేత్రాల మధ్య, కుంభకోణానికి సమీపంలో, పవిత్ర కావేరి నది తీరాన తిరుందుదేవన్గుడి కర్కటేశ్వర స్వామి ఆలయం (Thirundudevankudi Temple) వెలసింది. ఆలయంలో పరమేశ్వరుడు కర్కటేశ్వర స్వామిగా కొలువై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ క్షేత్రాన్ని స్థానికులు "నండు కోవిల్" అని కూడా పిలుస్తారు. స్వామికి అభిషేకం చేసిన నువ్వుల నూనెను ప్రసాదంగా అందిస్తారు. ఆ నూనెను భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. స్థల పురాణం ప్రకారం, ఒకసారి దుర్వాస మహర్షి శివారాధనలో ఉండగా ఓ గంధర్వుడు ఆయన నడకను పరిహసించాడు. దాంతో ఆగ్రహించిన మహర్షి అతడిని పీతగా జన్మించమని శపించాడు. తన తప్పును గ్రహించిన గంధర్వుడు క్షమాపణ కోరగా, శివారాధన ద్వారా శాప విమోచనం పొందవచ్చని మహర్షి సూచించాడు. దీంతో గంధర్వుడు పీత రూపంలో శివుని నిరంతరం ఆరాధించాడు. మరో పురాణ గాథ ప్రకారం, దేవేంద్రుడు ప్రతిరోజూ 1008 కమలాలతో శివార్చన చేసేవాడని కథనం. ఒకరోజు కమలాల సంఖ్య తక్కువగా ఉండటాన్ని గమనించి వెతకగా, అప్పుడు పీత ఒక కమలాన్ని తీసుకుని శివునికి సమర్పిస్తున్న దృశ్యం ఇంద్రునికి కనిపించింది. కోపంతో ఇంద్రుడు వెంటనే తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. పీత అప్పుడు శివలింగంలోని ఒక రంధ్రంలో దాక్కుంది. వజ్రాయుధం శివలింగాన్ని తాకగా, దానిపై ఒక గుర్తు ఏర్పడింది. తన తప్పును గ్రహించిన ఇంద్రుడు శివుని క్షమాపణ కోరగా, శివుడు ప్రత్యక్షమై అతడిని అనుగ్రహించాడు. అలాగే, పీతకు మళ్లీ గంధర్వ రూపాన్ని ప్రసాదించాడు. పీతను సంస్కృతంలో "కర్కట" అనడంతో ఈ శివుడు కర్కటేశ్వరుడిగా

Samayam Telugu31 May, 03:28 am
ఏపీకి వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ

ఏపీలో ప్రస్తుతం విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండగా.. మరోవైపు పలు జిల్లాల్లో అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు ప్రజలకు కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి నిర్దిష్ట ఎత్తులో ఒక బలమైన ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని నేడు రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు పిడుగుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడా చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా, శనివారం సాయంత్రం వరకు వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లోని మెజారిటీ ప్రాంతాల్లో ఈ సీజన్‌లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా హుస్సేనుపురంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 51 మి.మీ. భారీ వర్షపాతం రికార్డయ్యింది.ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగుతూ.. నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్‌ఎస్

AP7AM31 May, 01:58 am
కి.మీ. ట్రాఫిక్ జామ్ తో యాత్రికుల నరకయాతన

పవిత్ర చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్ వెళ్లే మార్గంలో తీవ్రమైన ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో జోషీమఠ్‌ సమీపంలో దాదాపు 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది యాత్రికులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు.చార్‌ధామ్‌తో పాటు హేమకుండ్‌ సాహిబ్‌ యాత్ర కూడా ఒకేసారి ప్రారంభం కావడంతో ఊహించని రీతిలో రద్దీ పెరిగింది. ఫలితంగా విష్ణుప్రయాగ్‌ సహా పలు కీలక ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలడం లేదు. శనివారం ఒక్కరోజే జోషీమఠ్‌ సమీపంలోని 'జీరో బ్యాండ్' వద్ద 8 కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి. ఇరుకైన కొండ మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో యాత్రికులు తిండి, నీరు, కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారీ రద్దీ కారణంగా అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు సైతం ముందుకు కదలలేని దుస్థితి నెలకొంది. ఈ భీకర ట్రాఫిక్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు జోషీమఠ్‌ వద్ద 'గేట్ సిస్టమ్' (వన్‌వే) విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద, ప్రతి 30 నిమిషాలకు ఒకవైపు వాహనాలను మాత్రమే అనుమతిస్తూ నెమ్మదిగా రద్దీని క్లియర్ చేస్తున్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉన్నందున, యాత్రికులు తమ ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని, అధికారుల సూచనలను తప్పక పాటించాలని పోలీసులు కోరుతున్నారు.

Asianet News Telugu01 Jun, 02:07 pm
టాయిలెట్ పేపర్ హోల్డర్ డిజైన్లతోనూ ఇంటికి లగ్జరీ టచ్

బాత్రూమ్, బెడ్‌రూమ్ మూలల్లో చీపుర్లు, మాసిన బట్టలు కనిపిస్తే చికాకుగా ఉంటుంది. ఆ చిన్న ప్లేస్‍ను కూడా టాయిలెట్ రోల్ పేపర్ హోల్డర్లతో స్టైలిష్‍గా మార్చేయొచ్చు. ఇదొక మల్టీ పర్పస్ డిజైన్. ఇందులో చిన్న బాస్కెట్ ఉండి దానికి రోల్ హోల్డర్ జతచేసి ఉంటుంది. దీనిలో టిష్యూలు, వెట్ వైప్స్, చిన్న టాయిలెట్రీస్ ఒకేచోట పెట్టుకోవచ్చు. యూనిక్‍గా ఉంటుంది. జంతువుల ఆకారంలో ఉండే ఈ హోల్డర్ డిజైన్.. బాత్రూమ్‌కు చాలా క్లీన్, గ్లాసీ లుక్ ఇస్తుంది. జంతు ప్రేమికులకు ఇది బెస్ట్ ఛాయిస్. దీన్ని ఎక్కడికైనా సులభంగా మార్చుకోవచ్చు. ఈ సింపుల్ మినీ స్టాండ్ నీళ్లు, తేమను తట్టుకుని ఎక్కువ కాలం మన్నుతుంది. తక్కువ బడ్జెట్‌లో ఇది చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. గోడకు మేకులు కొట్టడం ఇష్టం లేకపోతే, ఇలాంటి స్టాండింగ్ హోల్డర్ బెటర్. దీన్ని నేలపై లేదా టేబుల్‌పై పెట్టుకోవచ్చు. అద్దె ఇళ్లలో ఉండేవారికి ఇది చాలా ప్రాక్టికల్ ఛాయిస్. చిన్న చెక్కతో చేసిన ఈ వుడెన్ గ్లోబ్ స్టాండ్ హోల్డర్‌లో మీరు పేపర్ రోల్స్ పెట్టుకోవచ్చు. బాత్రూమ్, బెడ్‌రూమ్ రెండింటిలోనూ ఇది చాలా ఎస్తెటిక్ లుక్ ఇస్తుంది. ఈ రోజుల్లో పిల్లి, జింక లేదా అబ్‌స్ట్రాక్ట్ ఫేస్ డిజైన్ ఉన్న హోల్డర్లు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. డ్రిల్లింగ్ ఆప్షన్‌తో కావాలనుకుంటే, ఇవి బాత్రూమ్‌కు ఫన్, డిజైనర్ లుక్ ఇస్తాయి. Beads Chappal: కేవలం రూ.250 లోపే వచ్చే మెరిసే పూసల వర్క్ చెప్పులు Chikankari Tops: జీన్స్ పై రూ.200లకే వచ్చే వైట్ చికాంకారి టాప్స్ Extension Board: ఎక్స్‌టెన్షన్ బోర్డుకు ఇవి కనెక్ట్ చేస్తున్నారా? Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?

NTV Telugu01 Jun, 01:22 pm
గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్

Oats Roti Recipe: ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గోధుమ పిండి లేదా మైదా పదార్థాలకు బదులుగా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకుంటున్నారు. అలాంటి వాటిలో ఓట్స్ ప్రముఖ స్థానం దక్కించుకున్నాయి. సాధారణంగా ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. అయితే ఓట్స్‌తో రుచికరమైన రోటీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడేవారికి కూడా ఓట్స్ మంచి ఎంపికగా పరిగణిస్తారు. అందుకే రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గోధుమ రోటీలకు ప్రత్యామ్నాయంగా ఓట్స్ రోటీని తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ రోటీ గ్లూటెన్ రహితంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన పోషకాలను అందిస్తుంది. ఇంట్లోనే కొద్ది పదార్థాలతో మెత్తగా, రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఓట్స్ రోటీకి కావలసిన పదార్థాలు * 1 కప్పు ఓట్స్ పిండి * 1/4 టీస్పూన్ ఉప్పు ముందుగా ఓట్స్‌ను మిక్సర్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత జల్లెడతో జల్లించి మెత్తటి పిండిని వేరుచేయాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఒక కప్పు నీటిని మరిగించాలి. నీరు మరిగిన తర్వాత అందులో నెయ్యి, ఉప్పు వేసి కలపాలి. అనంతరం ఓట్స్ పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి సుమారు 10 నిమిషాలు పక్కన ఉంచాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని మెత్తటి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఓట్స్

Asianet News Telugu01 Jun, 11:48 am
ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తోందా? కేవలం రూ.10తో చెక్ పెట్టండి

ఫ్రిజ్ తలుపు తెరిచినప్పుడల్లా దుర్వాస వస్తోందా? అయితే ఈ చిట్కా ట్రై చేయండి. ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా లేదా కాఫీ పొడి వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. దానివల్ల దుర్వాసన పోయి ఫ్రిజ్ ఫ్రెష్‍గా ఉంటుంది. అలాగే వారానికి ఒకసారి గడువు ముగిసిన ఆహార పదార్థాలను తొలగిస్తే వాసన ఉండదు. కాకపోతే ఈ చిన్న జాగ్రత్త పాటించండి..ఫ్రిజ్ ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది. వేసవిలో ఫ్రిజ్‌ సమస్యలు ఎక్కువ అవుతాయి. తరచూ తలుపు తెరవడం, వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఆహారాన్ని చల్లారిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. తలుపును అవసరమైనప్పుడు మాత్రమే తెరవాలి. వెనుక భాగంలో గాలి సరిగా ప్రసరించేలా చూసుకోవాలి. ఫ్రిజ్ సమర్థవంతంగా పనిచేసి కరెంట్ బిల్లు తగ్గించడంలో సహాయపడుతుంది. పాత ఫ్రిజ్‌లలో ఫ్రీజర్‌లో మంచు గడ్డకట్టడం సాధారణమే. ఒక లీటరు నీటిలో 3 చెంచాల వెనిగర్ కలిపి ఫ్రిజ్‌ను శుభ్రం చేస్తే మంచు తొలగిపోతుంది, బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

NTV Telugu01 Jun, 11:43 am
అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషన్స్‌తో దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ పక్కన ‘షాడో’లా కనిపిస్తున్న ఒక భారీ కటౌట్ గురించి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో, నెటిజన్లలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఆయనెవరో కాదు.. చరణ్ కొత్త పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కుంట. నల్లటి సూట్ ధరించి, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో రామ్ చరణ్ ఎంబీపీ, భోపాల్, బెంగళూరు ప్రమోషన్స్ ఈవెంట్లలో కనిపించిన ఈ 27 ఏళ్ల బాడీగార్డ్ లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో కెవిన్ బ్యాక్‌గ్రౌండ్ గురించి వెతికిన నెటిజన్లకు కొన్ని మైండ్ బ్లోయింగ్ నిజాలు తెలిశాయి. కెవిన్ కేవలం ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు, ఆయన అంతర్జాతీయ స్థాయి ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. 2021లో ఇటలీ జాతీయ MMA టీమ్‌కు కూడా ప్రాతినిధ్యం వహించారు. కెవిన్ అసలు పేరు ‘అబ్దూ కదిర్ సోవ్’. 1998లో జన్మించిన ఈయన్ను గాంబియా రెజ్లింగ్ అసోసియేషన్ వారు ‘మామా లామిన్ ఆఫ్ బర్రా’ అని పిలుస్తారు. యూరప్ మిడిల్‌వెయిట్ డివిజన్‌లో ఫైట్ చేసే కెవిన్ ఖాతాలో 4 విజయాలు, 6 ఓటములు ఉన్నాయి (ఆయన చివరి ఫైట్ నవంబర్ 2025లో జరిగింది). తాజాగా జరిగిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో హోస్ట్ అమిత్ భాటియా.. కెవిన్‌కు వస్తున్న విపరీతమైన పాపులారిటీ గురించి రామ్ చరణ్‌ను అడగ్గా, చరణ్ తనదైన శైలిలో నవ్వుతూ చాలా ఫన్నీగా స్పందించారు. "మీరందరూ అతన్ని ఇంత ఫేమస్ చేసేశారు.. అందుకే ఇప్పుడు నేను అతన్ని అస్సలు బయట తిరగనివ్వట్లేదు. ఎవరైనా అతనికి ఒక చాక్లెట్ లేదా బిస్కెట్ ఇచ్చి నా పర్సనల్ విషయాలు

TV9 Telugu01 Jun, 11:34 am
ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే

ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే Prasanna Yadla 01 June 2026 Pic credit - Pinterest వర్షం పడే సమయంలో ఇంకా సాయంత్రం టైమ్ లో ఈ స్వీట్ కార్న్ తింటారు ఇది మంచిదే కానీ కొందరికి డేంజర్ స్వీట్ కార్న్ ఈ స్వీట్ కార్న్‌ను అదేపనిగా తింటే కడుపు ఉబ్బరం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం ఇంకా వీటిని తింటే జీర్ణక్రియ బలహీన పడి అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయి అజీర్ణం ఇంకా దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో బరువు చాలా ఈజీగా పెరుగుతారు బరువు ఈజీగా పెరుగుతారు అలాగే దీనిని మితిమీరి తింటే మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువవుతాయి మధుమేహం ఇంకొందరికి తిన్న వెంటనే గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి ఇది పెరిగే అవకాశం ఉంటుంది. గ్యాస్ ఒక నిల్వ ఉన్న పాత మొక్క జొన్న పొట్టను తింటే అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మొక్క జొన్న పొట్ట (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్‌ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హె‎ల్త్‎కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

Samayam Telugu01 Jun, 02:46 am
అన్ని వైపుల నుంచి రోహిణి లాక్.. బాలు వేసిన మలేషియా ప్లాన్ సక్సెస్.. ఇక ప్రభావతిని ఆపతరమా

మలేషియాకు తీసుకు వెళ్తున్నా అని చెప్పడంతో ప్రభావతి ఎగిరి గంతులు వేస్తుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని మీనా అంటే.. టికెట్లకు మాత్రమే మన ఖర్చు అని బాలు అంటాడు. మిగతాది నేను చెబుతాను అని ప్రభావతి అందుకుంది. అక్కడ రోహిణి ఇల్లు ఉంది కదా అని ప్రభావతి అంటుంది. వాళ్ల నాన్న జైల్లో ఉన్నాడు కదా అని రవి అంటే.. ఇల్లు మాత్రం అలానే ఉంటుంది కదా.. బోలెడు కార్లు ఉన్నాయ్ అని కూడా చెప్పింది.. రోహిణి అని ప్రభావతి అంటుంది. పెళ్లైన కొత్తలో చెప్పావ్ కదా రోహిణి అని ప్రభావతి అంటే.. చెప్పానా? చెప్పే ఉంటాను లేండి అని రోహిణి అంటుంది. మనందరం ఇంత సంతోషంగా ఉంటే.. రోహిణి మాత్రం ఇష్టం లేనట్టుగా ఉంది అని మీనా అంటుంది. సంతోషంలో మాటలు రావడం లేదు అని బాలు కౌంటర్లు వేస్తాడు. మనం అక్కడకు వెళ్లిన తర్వాత జైల్లో రోహిణి నాన్నని కలవాలి అని ప్రభావతి అంటుంది. ఆస్తి కోసమే కదా అని సత్యం అంటే.. అంత దూరం వెళ్లాక ఊరికే రావడం ఎందుకు కూతురు, అల్లుడు కష్టాల గురించి చెపితే ఖాళీ చెక్కు ఇవ్వడా? ఏంటి? అని ప్రభావతి అంటుంది.నువ్వు ఎలాగూ తీసుకు వెళ్లవు.. ఏది ఏమైనా సరే మనం వెళ్తున్నా.. నా ఫుల్ సపోర్ట్ బాలుకే అని ప్రభావతి అంటుంది. అలా ప్రభావతి మాట్లాడటం, బాలుకి సపోర్ట్ ఇవ్వడం చూసి అంతా షాక్ అవుతారు. మా గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయ్ అని మీనా, రవి, శ్రుతి కామెడీ చేస్తారు. మీరంతా ఊరుకోండి.. ముందు ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పురా అని బాలుని అడుగుతుంది ప్రభావతి. పెన్ను తీసుకుని చకచకా సంతకం

TV9 Telugu31 May, 01:42 am
పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే..! లేదంటే

చాలామంది బరువు తగ్గడానికి లేదా ఫిట్‌నెస్‌ కోసం ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగుతుంటారు. అయితే, ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరగకపోగా, కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిమ్మకాయలోని అధిక ఆమ్లత్వం (Acidic nature) వల్ల కడుపులో మంట, ఎసిడిటీ పెరగడం, గ్యాస్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు తీవ్రమవడం జరుగుతుంది. అలాగే, ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. కడుపులో మంట, ఎసిడిటీ: ఖాళీ కడుపుతో నిమ్మరసం నేరుగా తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి తీవ్రమైన కడుపు మంటకు దారితీస్తుంది. ఇది ఎసిడిటీ సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది. అల్సర్, గ్యాస్ట్రైటిస్ ఉన్నవారికి, సులభంగా జీర్ణ సమస్యలు వచ్చే వారికి ఇది మరింత హానికరం. యాసిడ్ రిఫ్లక్స్ సమస్య: నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ అందరి శరీర తత్వానికి పడకపోవచ్చు. ఎవరికైతే ఇప్పటికే గ్యాస్, చాతిలో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ (ఆమ్లాలు పైకి రావడం) వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటాయో, వారికి పరగడుపున నిమ్మరసం తాగడం వల్ల ఆ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చుతాయి. దంతాల ఎనామిల్ దెబ్బతినడం: నిమ్మరసంలోని అధిక ఆమ్ల గుణం దంతాల పైపొర అయిన ఎనామిల్‌ను బలహీనపరుస్తుంది. దీనివల్ల దంతాలలో జివ్వున లాగడం (సెన్సిటివిటీ), పళ్ళు అరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కడుపు నొప్పి, తిమ్మిరి: కొందరి జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగినప్పుడు పొట్టలో మలిపెట్టినట్లు ఉండటం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా తిమ్మిరి వంటి అసౌకర్యాలు ఎదురవుతాయి. అల్సర్, గ్యాస్ట్రైటిస్ ప్రమాదం: పొట్టలో అల్సర్లు (పుండ్లు) లేదా గ్యాస్ట్రైటిస్

Zee Telugu01 Jun, 01:08 pm
పోలవరం జిల్లా రంపచోడవరంలో బెంగాల్ టైగర్ .. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ టీం

Polavaram: పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్దపులి కలకలం సంచలనం రేపుతోంది. తాజాగా గంగవరం మండలం పెద్దగార్లపాడు గ్రామాల వద్ద బెంగాల్ టైగర్ కదలికలు డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించారు. పెద్దపులి నడిచి వెళ్తుండగా డ్రోన్ కెమెరాకి చిక్కింది. ఆ సమయంలో ర్యాపిడ్ యాక్షన్ టీమ్ బంధించేందుకు ప్రయత్నించగా విఫలమైంది

Asianet News Telugu01 Jun, 12:28 pm
నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి

నేరేడు పండులో చాలా పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా మాంగనీస్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. క్యాన్సర్ నిరోధించే గుణం కూడా వీటిలో ఉంది. నేరేడు పండు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఈ పండులో జాంబోలిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గించి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. నేరేడు పండు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు తగ్గుతాయి. డయాబెటిస్ వల్ల తరచుగా మూత్రవిసర్జన, దాహం వంటి సమస్యలు వస్తాయి. నేరేడు పండు తింటే ఈ లక్షణాలు కంట్రోల్ అవుతాయి. విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల నేరేడు పండు హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఈ పండులో ఉండే ఐరన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది. ఈ నేరేడు పండు తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. నేరేడు పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ధమనుల పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులను దూరంగా ఉంచుతుంది. Natu Kodi Curry: నాటుకోడి వండినప్పుడు ఇలా చేస్తే నోట్లోనే కరిగిపోతుంది, రుచి కూడా డబుల్ Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్? Sweet potato: రోజుకి ఒక చిలగడ దుంప తింటే ఏమౌతుందో తెలుసా? Walnuts: రోజూ నానపెట్టిన వాల్ నట్స్ తింటే ఏమౌతుందో తెలుసా?

Asianet News Telugu01 Jun, 01:30 am
ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ చేయాలో తెలుసా

చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫుడ్స్ లో ఐస్ క్రీమ్ ముందు వరసలో ఉంటుంది. ఎండా కాలం అయినా, వానా కాలం అయినా… ఐస్ క్రీమ్ తినే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే… కొందరు.. ఐస్ క్రీమ్ పెద్ద పెద్ద డబ్బాలు కొనేసి.. ఫ్రీజర్ లో స్టోర్ చేసి..రోజూ కొంచెం కొంచెం తింటూ ఉంటారు. కానీ.. ఓపెన్ చేసిన ఐస్ క్రీమ్ డబ్బాని ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తినడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం… మీరు దుకాణం నుంచి తెచ్చిన ఐస్ క్రీమ్ బాక్సులు తెరవకుండా… ఇంట్లో ఫ్రీజర్ లో పెడితే… అది దాదాపు 2 నుంచి 3 నెలల వరకు తాజాగా, సురక్షితంగా ఉంటుంది. దీనినే షెల్ప్ లైఫ్ అంటారు. ఒక్కసారి బాక్స్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత, మిగిలిన దానిని గరిష్టంగా.. 1 నెల నుంచి 2 నెలల్లోపు తినేయాలి. అంతకంటే ఎక్కువ రోజులు దానిని నిల్వ ఉంచితే… దానిపై ఐస్ క్రిస్టల్స్ ఏర్పడుతాయి. అంతేకాదు.. ఐస్ క్రీమ్ రుచి కూడా తగ్గిపోతుంది. ఇలా మారిన దానిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఐస్ క్రీమ్ ని నార్మల్ ఫ్రిజర్ డోర్ లో పెడుతూ ఉంటారు. కానీ.. ఇది తప్పు. ఇలా స్టోర్ చేయకూడదు. డోర్ పదే పదే తీయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. అందుకే.. ఐస్ క్రీమ్ పాడవ్వకుండా ఉండాలంటే.. ఫ్రీజర్ లో అది కూడా వెనక భాగంలో లోపల పెట్టాలి. అక్కడ టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది. ఐస్ క్రీమ్ పాడవ్వకుండా ఉంటుంది.

Samayam Telugu01 Jun, 04:50 am
భర్తకు కిడ్నీ దానం చేసి ప్రాణం కాపాడిన భార్య.. నిజంగా 'అర్ధాంగి' పదానికి సార్థకత చేకూర్చావమ్మా

మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచి, సుఖదుఃఖాల్లో జీవితాంతం తోడుంటానని చేసిన బాసను ఒక భార్య అక్షరాలా నిజం చేసి చూపించింది. భర్త ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు తన శరీరంలోని ఒక భాగాన్ని ఇచ్చి భర్త పాలిట నిజమైన ప్రాణదాతగా మారింది. కరీంనగర్ జిల్లా బీమారం మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన జమ్మికుంట మహేందర్, సుజాత దంపతులు. వీరికి పదేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ పోషణ కోసం, పిల్లల మంచి భవిష్యత్తు కోసం మహేందర్ ఉపాధి వెతుక్కుంటూ సౌదీ అరేబియా వెళ్లారు. కొన్నేళ్ల పాటు అక్కడ కష్టపడి సంపాదిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో.. ఏడాది కిందట పని చేసుకుంటున్న చోటే మహేందర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడ ప్రాథమిక పరీక్షలు చేయించుకున్న అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో మహేందర్ రెండు మూత్రపిండాలు పూర్తిగా పాడైపోయాయని తేలింది. ఈ వార్త వినగానే భార్య సుజాత, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఒక వైపు చిన్న పిల్లలు, మరోవైపు భర్త అనారోగ్యం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.దిక్కుతోచని స్థితిలో, తీవ్ర నైరాశ్యంలో మహేందర్ గత 10 నెలల పాటు నిరంతరం డయాలసిస్‌ చేయించుకుంటూ కాలం వెళ్లదీశారు. డయాలసిస్ వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ కిడ్నీ మార్పిడి ఒక్కటే శాశ్వత పరిష్కారమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో కిడ్నీ మార్పిడి కోసం అవయవ దాన సంస్థ జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ ఉన్న వెయిటింగ్ లిస్ట్ కారణంగా కిడ్నీ లభించాలంటే కనీసం నాలుగేళ్ల సమయం పడుతుందని తెలిసి ఆ కుటుంబం తీవ్ర నిరాశకు గురైంది. రోజురోజుకూ

Oneindia Telugu31 May, 01:17 am
నేడే అధికమాస జ్యేష్ట పూర్ణిమ- 16 కళలతో నిండుగా

నేడు.. జ్యేష్ఠ అధిక మాస పౌర్ణమి. హిందూ విశ్వాసాల ప్రకారం అత్యంత పవిత్రమైన ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజున చంద్రుడు తన 16 కళలతో నిండుగా ప్రకాశిస్తాడు. పురాణాల ప్రకారం.. చంద్రుడు మన మనస్సులను ప్రభావితం చేస్తాడు. అందుకే దీనిని శక్తికి, ఆధ్యాత్మిక పురోగతికి ప్రతీకగా భావిస్తారు. ఈ విశిష్టమైన పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత, కుటుంబ సుఖశాంతులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.ఈ అధిక మాస పౌర్ణమి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆవిర్భవిస్తుంది. ఇది అత్యంత అరుదైన సందర్భం. హిందూ ధర్మంలో ఏ పౌర్ణమి తిథికైనా విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ అధిక మాస పౌర్ణమి శ్రీ మహావిష్ణువు, చంద్రుడు, పితృదేవతలను పూజించడానికి ఎంతో ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు శాస్త్రోక్తంగా పూజలు చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని, జాతకంలోని గ్రహదోషాల ప్రభావం తగ్గుతుందని విశ్వాసం.అలాంటి విశేష ప్రాముఖ్యత ఉండే జ్యేష్ఠ అధిక పౌర్ణమి తిథి పంచాంగం ప్రకారం పౌర్ణమి ఇప్పటికే ఆరంభమైంది. శనివారం ఉదయం 11:57 నిమిషాలకు మొదలైంది. ఈ మధ్యాహ్నం 2:14 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయాతిథి ఆధారంగా నేడు జ్యేష్ట పౌర్ణమిని జరుపుకోవాలి.ఈ పవిత్రమైన రోజున స్నాన, దానాలను ఆచరించడానికి కొన్ని శుభ ముహూర్తాల వివరాల్లోకి వెళ్తే..  బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:34 నుండి 5:17 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి 1:03 నిమిషాల వరకు, విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:48 నుండి 3:41 నిమిషాల వరకు ఉంటాయి. ఈ వేళల్లో చేసే పూజలు మరింత ఫలవంతంగా భావిస్తారు.అధిక జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఒక