translateexpand_more

Supreme Court News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 01:37 am
పోక్సో’ దుర్వినియోగం.. స్వార్థం కోసం తప్పుడు కేసులు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, న్యూఢిల్లీ: దంపతుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కేవలం ఆర్థిక లబ్ధి, భారీ సెటిల్మెంట్లు ఆశించి భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కక్ష సాధింపులో భాగంగా భర్తను దారికి తెచ్చుకునేందుకు మహిళలు గృహహింస, కట్నం వేధింపులతో పాటు ఏకంగా ‘పోక్సో’ వంటి చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం

Eenadu01 Jun, 03:48 am
సుప్రీం కోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల నియామకం

ఇంటర్నెట్‌డెస్క్‌: సుప్రీం కోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్‌ వెలువరించింది. ఈ జాబితాలో సీనియర్‌ న్యాయవాది వి మోహన, జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌ (ప్రస్తుతం బాంబే హైకోర్టు సీజే), జస్టిస్‌ షీల్‌ నాగు (ప్రస్తుత పంజాబ్‌ హరియాణా హైకోర్టు సీజే), జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌ (ప్రస్తుత మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీజే), జస్టిస్‌ అరుణ్‌ పళ్లి (జమ్మూకశ్మీర్‌ హైకోర్టు సీజే) ఉన్నారు. ఇటీవలే సీజేఐ నేతృత్వంలోని కొలీజియం వీరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో వి. మోహన ఒక్కరే సీనియర్‌ న్యాయవాది. న్యాయవాది మోహన 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అయిదేళ్ల లా డిగ్రీ మొదటి బ్యాచ్‌ విద్యార్థి. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ఇందు మల్హోత్రా, సీఎస్‌ వైద్యనాథన్‌ల వద్ద జూనియర్‌గా ఉన్నారు. 1996లో ఏఓఆర్‌ పరీక్ష పాసైన తర్వాత దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్వతంత్రంగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. వివిధ కేసుల్లో సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌సిబల్, కె.కె.వేణుగోపాల్, పి.చిదంబరం, అరున్‌జైట్లీ, అంద్యార్జునలతో కలిసి పనిచేశారు. 2015 ఏప్రిల్‌ 23న సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. ఈమె చేరికతో సుప్రీం కోర్టులో మహిళా జడ్జిల సంఖ్య 2కు చేరినట్లయింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Samayam Telugu29 May, 03:33 pm
సమ్మతితో చేస్తే వ్యభిచారం నేరం కాదు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన జీవీఎన్ అప్పారావు.. గత పదేళ్లుగా రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కథనాలు, విశ్లేషణల రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. సోషల్ మీడియా పోస్టులను జీవీఎన్ అప్పారావు ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. ఆధ్యాత్మికత, ఆస్ట్రాలజీకి సంబంధించిన కథనాలు రాసిన అనుభవం ఉంది. జీవీఎన్ అప్పారావు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు సంస్థలో ఐదేళ్లకుపైగా పని చేశారు. ఆ సమయంలో ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు, కొత్త ప్రదేశాలు చూసేందుకు ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Andhra Jyothy29 May, 11:19 am
యూపీఎస్ సీని చూసి నేర్చుకోండి.. నీట్ పేపర్ లీక్ పై సుప్రీం’ వ్యాఖ్య

నీట్‌ పేపర్ లీక్ ఉదంతంపై విచారణ చేట్టిన సుప్రీం కోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ‌పై(ఎన్‌టీఏ) పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని నిఘా వ్యవస్థలు, కమిటీలు ఉన్నా పేపర్ ఎలా లీకైందని ప్రశ్నించింది. ఇంటర్నెట్ డెస్క్: నీట్‌ పేపర్ లీక్ ఉదంతంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ‌పై(ఎన్‌టీఏ) పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని నిఘా వ్యవస్థలు, కమిటీలు ఉన్నా పేపర్ ఎలా లీకైందని ప్రశ్నించింది. సివిల్స్ పరీక్షలు నిర్వహించే యూపీఎస్‌సీ‌లో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ వెలుగుచూడలేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. యూపీఎస్‌సీని చూసి నేర్చుకోవాలని ఎన్‌టీఏకు సూచించింది. కోర్టు విచారణకు ఎన్‌టీఏ తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. నీట్ వ్యవస్థ ప్రక్షాళనకు ఏర్పాటైన హైలెవెల్ కమిటీ చైర్మన్, ఇస్రో మాజీ చీఫ్ డా. రాధాకృష్ణన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌టీఏ, డా. రాధాకృష్ణన్ దాఖలు చేసిన అఫిడవిట్‌లను సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. కేంద్రం తన ఎఫిడవిట్ దాఖలు చేసేందుకు న్యాయస్థానం అదనపు గడువు ఇచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నరసింహ మాట్లాడుతూ పేపర్ లీక్‌కు ఆస్కారం కల్పించిన పరిస్థితులు ఏమిటని డా. రాధాకృష్ణన్‌ను ప్రశ్నించారు. గతంలో అనేక రక్షణలను ఏర్పాటు చేసినా పేపర్ ఎలా లీక్ అయ్యిందని అన్నారు. ఇందుకు డా. రాధాకృష్ణన్ బదులిస్తూ పేపర్ సెట్టింగ్ ప్రక్రియలో సమస్య తలెత్తిందని అన్నారు. ప్రస్తుతం ఆ లోపాలనూ సరిదిద్ది వ్యవస్థను మరింత బలోపేతం చేశామని అన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా గతంలో మొత్తం 101 సూచనలు చేశామని చెప్పారు. వాటిల్లో 60 తాత్కాలిక సూచనలను 2025-26 పరీక్ష కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు చెప్పారు. ఇతర మార్గదర్శకాలు కూడా త్వరలో పూర్తిస్థాయిలో అమలవుతాయని చెప్పారు.

SkyC Media29 May, 07:20 am
హైకోర్టులకు డెడ్ లైన్ 7 రోజుల్లో పూర్తి తీర్పు ఇవ్వాలని సుప్రీం ఆదేశం

హైకోర్టుల తీర్పుల అప్‌లోడ్ ఆలస్యంపై సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఆర్టికల్ 142 కింద డెడ్‌లైన్ విధిస్తూ చారిత్రాత్మక ఆదేశాలు ఇచ్చింది.

Zee Telugu01 Jun, 01:09 pm
నీట్ రీఎగ్జామ్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఓఎంఆర్ విధానమే ఖరారు

NEET Re-Exam: నీట్-యూజీ రీఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్ 21వ తేదీన జరగబోయే NEET పున:పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలనే పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో పరీక్షను యథాతథంగా ఓఎంఆర్‌ పద్ధతిలోనే హించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు బెంచ్, పరీక్షా విధానాన్ని అకస్మాత్తుగా మార్చడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని పేర్కొంది. సమయాభావం, అలాగే పరీక్ష నిర్వహణ సంస్థ అయిన ఎన్‌టీఏపై ఉన్న భారీ నిర్వహణ ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Eenadu29 May, 10:51 am
జవాబుదారీతనం ఉండాల్సిందే.. నీట్ పేపర్ లీక్ పై సుప్రీం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నీట్‌ యూజీ పరీక్ష పేపర్‌ లీక్‌ వివాదంపై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణా యంత్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన (NEET) ఎలా జరిగిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇలాంటి సంఘటన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర మానసిక క్షోభను కలిగిస్తుందని, వారిని ఇలా నిరాశపెట్టడం సరికాదని అభిప్రాయపడింది. పేపర్‌ లీక్‌ (NEET paper leak) విషయంలో లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని, అప్పటి వరకు అసలు సమస్య ఆగదని వ్యాఖ్యానించింది. అయితే, యువత ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం ధర్మాసనానికి వెల్లడించారు. పరిస్థితిని ప్రధానమంత్రి కూడా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జూన్‌ 21న మరోసారి నిర్వహించే నీట్-యూజీ పరీక్ష కోసం కొత్త యంత్రాంగాలను ఏర్పాటు చేశామన్నారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

TeluguOne30 May, 05:46 am
రిలయన్స్ ఏడీఏ గ్రూప్ కు సీబీఐ షాక్

అనిల్ అంబానీ సంస్థలపై సీబీఐ తొలి ఛార్జిషీట్.. రిలయన్స్ ఏడీఏ గ్రూప్‌కు చెందిన రుణాల మోసం కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) సంస్థకు సంబంధించిన కేసులో తొలి ఛార్జిషీట్‌ను ముంబై ప్రత్యేక సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. ఈ పరిణామం కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఛార్జిషీట్‌లో మొత్తం 16 మందిని నిందితులుగా చేర్చారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థతో పాటు ఆ కంపెనీకి చెందిన ఐదుగురు సీనియర్ అధికారులు, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, మాజీ సిండికేట్ బ్యాంక్‌కు చెందిన పది మంది బ్యాంకు అధికారులపై అభియోగాలు మోపారు. వీరిపై నేరపూరిత కుట్ర, మోసం, అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. సీబీఐ దర్యాప్తు ప్రకారం, కంపెనీకి మంజూరైన భారీ రుణాలను అసలు ఉద్దేశాలకు విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1,200 కోట్ల టర్మ్ లోన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి రూ.500 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ సౌకర్యం, సిండికేట్ బ్యాంక్ నుంచి రూ.350 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ సౌకర్యం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నిధులను ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వినియోగించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఈ కేసులో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మొత్తం 17 ప్రభుత్వ రంగ బ్యాంకులు రిలయన్స్ గ్రూప్ సంస్థలకు భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ రుణాల మొత్తం ఎక్స్‌పోజర్ విలువ రూ.19,694.33 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే

Eenadu29 May, 06:59 am
రిజర్వ్ చేసిన మూడు నెలల్లో తీర్పులివ్వండి

ఇంటర్నెట్‌డెస్క్: రాష్ట్ర హైకోర్టుల్లో తీర్పు రిజర్వ్‌ చేసిన తర్వాత దానిని వెలువరించేందుకు అత్యధికంగా 3 నెలలు మాత్రమే సమయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టుల్లో తీర్పు రిజర్వు చేసిన తర్వాత కూడా పలు కారణాలతో తీవ్ర జాప్యాలు చోటు చేసుకోవడంపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిష్‌ విపిన్‌ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపైనా హైకోర్టులకు మార్గదర్శకాలు జారీ చేసింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

AP7AM30 May, 01:55 am
స్వచ్ఛంద సెక్స్ వర్క్ నేరం కాదు

సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా వర్తించేలా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో కొనసాగుతున్న వారిని, బలవంతంగా లేదా మోసపూరితంగా ఈ రొంపిలోకి దింపబడిన బాధితులను వేర్వేరుగా చూడాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32, 142 ప్రకారం తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి, న్యాయస్థానం ఈ 'విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్'ను రూపొందించింది.ఈ మార్గదర్శకాల ప్రకారం సమ్మతి (consent) అనేది ప్రధానమైన అంశం. స్వచ్ఛందంగా సెక్స్ వర్క్‌లో ఉన్న పెద్దవారిని నేరస్థులుగా పరిగణించరాదని, వారి హక్కులకు భంగం కలిగించరాదని కోర్టు స్పష్టం చేసింది. వ్యభిచార గృహాలపై దాడులు చేసేటప్పుడు, స్వచ్ఛందంగా ఉన్న సెక్స్ వర్కర్లను అరెస్టు చేయడం, వేధించడం లేదా బాధితులుగా చిత్రీకరించడం చేయరాదని పోలీసులను ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, అక్రమ రవాణాపై మాత్రమే దృష్టి సారించాలని సూచించింది.కోర్టు జారీ చేసిన ప్రధాన ఆదేశాలుసరైన చిరునామా రుజువు లేనప్పటికీ సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు జారీ చేసి ప్రభుత్వ సేవలు అందేలా చూడాలి.పోలీసులు, ఇతర చట్ట అమలు సంస్థలు సెక్స్ వర్కర్ల పట్ల గౌరవంగా ప్రవర్తించాలి. వారిని మాటలతో గానీ, శారీరకంగా గానీ హింసించకూడదు.లైంగిక దాడి లేదా అక్రమ రవాణా బాధితులకు తక్షణమే వైద్య, న్యాయ, కౌన్సెలింగ్ సహాయం అందించాలి.కేవలం సెక్స్ వర్క్ చేస్తున్నారనే కారణంతో తల్లుల నుంచి వారి పిల్లలను వేరు చేయరాదు.బాధితుల గుర్తింపు, వయసు నిర్ధారణ, పునరావాసం, వృత్తి శిక్షణ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఒకే రకమైన విధానాలు పాటించాలి.ఈ

Sakshi28 May, 07:45 am
సర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధమే.. ఈసీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధమే.. ఈసీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్

Eenadu29 May, 09:28 am
వినేశ్ ట్రయల్స్ లో పోటీ చేయొచ్చు’.. సుప్రీంకోర్టులో రెజ్లర్ కు ఊరట

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా క్రీడల ట్రయల్స్‌ (2026)లో పోటీపడే విషయంలో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె సెలక్షన్‌ ట్రయల్స్‌లో పోటీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) అనుమతినిచ్చింది. ఈ దశలో ఆమెను (Vinesh Phogat) వెనక్కి రమ్మని చెప్పడం భావ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. మే 30, 31వ తేదీల్లో జరిగే సెలక్షన్‌ ట్రయల్స్‌లో వినేశ్‌ ఫొగాట్‌ పోటీ పడేందుకు అనుమతినిస్తూ ఇటీవల దిల్లీ హైకోర్టు ఉత్తర్వులను జారీచేసింది. దీన్ని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తన పరిధిని మీరిందని, ఎంపిక ప్రమాణాల ప్రకారం వినేశ్‌ అనర్హురాలైనా.. ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు అనుమతివ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ తమ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ‘‘ఈ స్థానంలో వేరొకరు ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ ఆమె (వినేశ్‌) ఈ దేశాన్ని గర్వపడేలా చేశారు. ఇప్పటికే ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ దశలో ఆమెను వెనక్కి వెళ్లమని చెప్పడం సరైన నిర్ణయమనిపించుకోదు. ప్రస్తుతానికి ఈ విషయంలో మేం ఏం చేయలేం. ఆమె పోటీల్లో పాల్గొనవచ్చు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, డబ్ల్యూఎఫ్‌ఐ పిటిషన్‌పై వినేశ్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ విషయంలో దిల్లీ హైకోర్టు వ్యవహరించిన తీరుపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి అంశాల్లో కోర్టుల వేగవంతమైన జోక్యం సరికాదని అభిప్రాయపడింది. ‘‘ఆమె అద్భుతమైన రెజ్లర్‌ కావొచ్చు. కానీ, కోర్టులకు

Eenadu27 May, 08:20 am
సర్’ నిర్వహణ.. ఈసీకి అధికారం ఉంది

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించింది. ‘సర్’ను నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్‌ (Election Commission)కు ఉందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం (Supreme Court) ధర్మాసనం బుధవారం ఈ తీర్పు వెలువరించింది. ఇక్కడ ఏ చట్టం, రాజ్యాంగ నిబంధనా ఉల్లంఘనకు గురికాలేదని చెప్పింది. ‘‘స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను ‘సర్’ ముందుకు తీసుకెళ్తోంది. ఓటర్ల జాబితాల్లో సమగ్రత, కచ్చితత్వం, విశ్వసనీయత ముఖ్యం. ఈ క్రమంలో సర్ నిర్వహణకు ఈసీ చెప్పిన కారణాలతో సంతృప్తి చెందాం’’ అని తన తీర్పులో ధర్మాసనం పేర్కొంది. ‘సర్’లో పేరు లేనంత మాత్రాన ఎవరూ తమ పౌరసత్వం కోల్పోరని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ‘సర్’ చుట్టూ గత ఏడాదిగా జరుగుతోన్న రాజకీయ ఆరోపణలు, విమర్శలకు తెరదించినట్లయింది. గత ఏడాది జూన్‌లో బిహార్‌లో తొలుత ఈ ప్రక్రియ నిర్వహించిన సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Samayam Telugu29 May, 04:29 pm
వ్యభిచారం నేరం కాదు.. కానీ, అవి నడపకూడదు.. సుప్రీం కోర్టు

వ్యభిచారం నేరం కాదు.. కానీ, అవి నడపకూడదు.. సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు.. సెక్స్ వర్కర్లకు సంబంధించి చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వ్యభిచారం అనేది కూడా ఒక జాబేనని... మిగిలిన వృత్తుల వారికి ఉన్నట్లే.. సెక్స్ వర్కర్లకు కూడా చట్టప్రకారం.. అన్ని హక్కులు, గౌరవంగా ఉంటాయని... సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని సెక్స్ వర్కర్ల హక్కులు, వారి రక్షణకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా... సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం... ప్రతి ఒక్కరికీ లభించే... జీవించే హక్కు అలాగే వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు... వారికి కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. తీర్పులో భాగంగా... సెక్స్ వర్కర్లు కూడా ఈ దేశ పౌరులేనని... వారికి చట్టం ప్రకారం సమాన రక్షణ లభిస్తుందని.. కోర్టు తెలిపింది. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్నవారిపై... పోలీసులు ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే సెక్స్ వర్కర్ల పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తించకూడదని... వారిని శారీరకంగా లేదా మానసికంగా వేధించరాదని కోర్టు ఆదేశించింది. వారికి కూడా గౌరవంగా బతికే హక్కు ఉందని గుర్తుచేసింది. ఈ వార్తకు సంబంధించిన

Chitrajyothy26 May, 06:23 am
నటి ఆత్మహత్య ... సుప్రీమ్‌ జోక్యం! | Twisha Sharma Case Transferred to CBI for Fair Investigation Onava

'ముగ్గురు మొనగాళ్ళు' ఫేమ్‌ త్విశా శర్మ ఈ నెల 12న భోపాల్‌లో సూసైడ్ చేసుకుంది. నిందితులు న్యాయ వ్యవస్థకు చెందిన వారు కావడంతో నిష్పక్షపాత దర్యాప్తు కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కేసును సీబీఐకు అప్పగించింది. తెలుగులో దీక్షిత్‌ శెట్టి (Deekshith Shetty) సరసన 'ముగ్గురు మొనగాళ్ళు' (Mugguru Monagallu) చిత్రంలో హీరోయిన్‌గా నటించిన త్విశా శర్మ ఈ నెల 12న భోపాల్ లో అత్తవారింట ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. మోడలింగ్‌ నుండి సినిమాల్లోకి వచ్చిన త్విశా శర్మ (Twisha Sharma) ఐదు నెలల క్రితం న్యాయవాది సమర్థ్‌ సింగ్‌ను వివాహం చేసుకుంది. అయితే ఊహించని విధంగా ఆమె సూసైడ్‌ చేసుకోవడం అందరినీ కలచివేసింది. ఆర్థికపరమైన ఒత్తిడులు, వరకట్న వేదింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పుట్టింటి వారు ఆరోపిస్తే, ఆమెకు మాదక ద్రవ్యాల అలవాటు ఉందని అత్తింటి వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్విశా శర్మ కేసును మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. ఇదిలా ఉంటే... మృతురాలి అత్త గిరిబాల సింగ్‌ మాజీ న్యాయమూర్తి కావడంతో ఆమె ఈ కేసులో తన పరపతిని ఉపయోగిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ఈ తరహా వార్తా కథనాలు సుప్రీమ్‌ కోర్టు (Supreme Court) దృష్టికి రావడంతో శనివారం దీనిని సుమోటోగా స్వీకరించింది. సోమవారం ఈ కేసు సుప్రీమ్‌ కోర్టు ప్రధాన నాయ్యమూర్తి సూర్యకాంత్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ పైకి వచ్చింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా ఈ కేసును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిందని, రెండోసారి పోస్ట్ మార్టమ్‌ను ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్) వైద్యుల బృందం భోపాల్‌కు వెళ్ళి నిర్వహించిందని, ఆ ఫలితాలు

Eenadu23 May, 06:42 pm
Supreme Court: ట్విష మృతి కేసు.. సుమోటోగా తీసుకున్న సుప్రీం

- దిల్లీ: మాజీ మిస్‌ పుణె, నటి ట్విషా శర్మ మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ కేసుపై విచారించే అవకాశం ఉంది. - ఇటీవల భోపాల్‌లోని అత్తవారింట్లో ట్విష ఆత్మహత్య చేసుకుంది.

Sakshi23 May, 05:51 pm
ట్విషా శర్మ మృతి కేసు.. సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు

- May 23 2026 11:10 PM | Updated on May 23 2026 11:10 PM దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడల్, నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. - ఈ కేసును శనివారం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. - భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే 25) ఈ కేసుపై విచారించే అవకాశం ఉంది.

Andhra Jyothy29 May, 08:59 am
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు సుప్రీంకోర్టులో ఊరట

ఆసియా క్రీడల ట్రయల్స్‌ 2026లో పోటీపడే విషయంలో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె సెలక్షన్‌ ట్రయల్స్‌లో పోటీ చేసేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది. స్పోర్ట్స్ డెస్క్: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆసియా క్రీడల సెలక్షన్‌ ట్రయల్స్‌(2026)లో పోటీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) అనుమతినిచ్చింది. ఈ దశలో ఆమెను (Vinesh Phogat) వెనక్కి రమ్మని చెప్పడం భావ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అలానే డోపింగ్ టెస్టులకు వినేశ్ మిస్ అవ్వడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సెలబ్రిటీ హోదా ఉన్నంత మాత్రాన నిబంధనల మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది. ఒక అథ్లెట్ కెరీర్‌ను పూర్తిగా దెబ్బతీయలేమని, అందుకే అర్హత పోటీలకు అనుమతి ఇస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈనెల 30, 31వ తేదీల్లో జరిగే సెలక్షన్‌ ట్రయల్స్‌లో వినేశ్‌ ఫొగాట్‌ పోటీ పడేందుకు అనుమతినిస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను జారీచేసింది. దీనిపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ‘వినేశ్‌ ఈ దేశాన్ని గర్వపడేలా చేశారు. ఇప్పటికే ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ దశలో ఆమెను వెనక్కి వెళ్లమని చెప్పడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ప్రస్తుతానికి ఈ విషయంలో మేం ఏం చేయలేం. ఆమె పోటీల్లో పాల్గొనవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు డబ్ల్యూఎఫ్‌ఐ పిటిషన్‌పై వినేశ్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Zee Telugu29 May, 07:11 am
సుప్రీంకోర్టు మరో సంచలనం.. అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కీలక ఆదేశాలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Supreme court apply article 142 and key directions to all high court: సుప్రీంకోర్టు ధర్మాసనం అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న పెండింగ్ కేసుల విచారణపై రాజ్యంగం కల్పించిన అసాధారణ ఆర్టికల్ 142న ఉపయోగించి హైకోర్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టులు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత వాటిని 3 నెలల్లోపు ఫైనల్ జడ్జీమెంట్ ఇవ్వాలని ఆదేశించింది. అంతే కాకుండా బెయిల్ వచ్చిన ఖైదీలను అదే రోజు విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ విపిన్ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా జార్ఖండ్ హైకోర్టులో తీర్పులు వెల్లడి, అప్ లోడింగ్ వంటి అంశాలపై దాఖలైన కేసు విచారణ నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం ఈ కీలక తీర్పును వెల్లడించింది.

AP7AM01 Jun, 09:36 am
నీట్ రీ-టెస్ట్ పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సీబీటీ పిటిషన్ తిరస్కరణ

నీట్ (యూజీ) 2026 రీ-టెస్టును కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. దీంతో, ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 21న ఓఎంఆర్ విధానంలోనే ఈ పరీక్ష జరగనుంది. ఈ మేరకు ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.ఈ దశలో పరీక్షా విధానాన్ని మార్చడం వల్ల తీవ్రమైన నిర్వహణాపరమైన సవాళ్లు ఎదురవుతాయని కోర్టు అభిప్రాయపడింది. సమయాభావం, ఎన్టీఏపై ఉన్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. "ఇలాంటి అభ్యర్థనలను గతంలోనే తిరస్కరించాం. ఈ అంశాన్ని వెకేషన్ తర్వాత జులైలో విచారిస్తాం" అని జస్టిస్ నరసింహ స్పష్టం చేశారు.మే 3న జరిగిన నీట్ (యూజీ) 2026 పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో దాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. వాట్సాప్‌లో సర్క్యులేట్ అయిన 'గెస్ పేపర్‌'లోని సుమారు 120 ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సరిపోలడంతో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోంది. 22 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు.జూన్ 21న జరిగే రీ-టెస్ట్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బహుళస్థాయి అథెంటికేషన్, పటిష్ఠ నిఘా వంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. మరోవైపు, నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు 2027 నుంచి నీట్ (యూజీ)ని సీబీటీ విధానంలో నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎన్టీఏ