translateexpand_more

Delhi News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 01:37 am
పోక్సో’ దుర్వినియోగం.. స్వార్థం కోసం తప్పుడు కేసులు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సాక్షి, న్యూఢిల్లీ: దంపతుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కేవలం ఆర్థిక లబ్ధి, భారీ సెటిల్మెంట్లు ఆశించి భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కక్ష సాధింపులో భాగంగా భర్తను దారికి తెచ్చుకునేందుకు మహిళలు గృహహింస, కట్నం వేధింపులతో పాటు ఏకంగా ‘పోక్సో’ వంటి చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం

Oneindia Telugu01 Jun, 04:28 am
సుప్రీంకోర్టుకు నూతన న్యాయమూర్తులు

దేశ అత్యున్నత న్యాయస్థానం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతనంగా అయిదుమంది న్యాయమూర్తుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. దీంతో సుప్రీంకోర్టుకు అయిదుమంది నూతన న్యాయమూర్తులు నియమితులయ్యారు.ఈ నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కి పెరిగింది. మొత్తం మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 38. కాగా ఇప్పుడు ఒక్క ఖాళీ మాత్రమే మిగిలింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్లను ఇచ్చింది.సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది వెంకిట సుబ్రహ్మణ్యం మోహన, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్, పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, అలాగే జమ్మూకాశ్మీర్-లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లి.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నామినేట్ అయ్యారు.వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కిందటి నెల 27న కేంద్రానికి సిఫారసు చేసింది. వీరందరూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుప్రీంకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 37కు పెరుగుతుంది. ప్రస్తుతం అక్కడ పని చేస్తోన్న జడ్జీల సంఖ్య 32. మొత్తం శాంక్షన్డ్ జడ్జీల సంఖ్య 38. ఈ సంఖ్య కంటే తక్కువగా ఉంటోండటం వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం భావించింది.ఈ నేపథ్యంలో గత నెలలో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తితో కలిపి మంజూరైన జడ్జీల సంఖ్యను 38కి పెంచింది. దీనికంటే ముందు రెండు ఖాళీలు ఉండేవి. జడ్జీల సంఖ్యాబలం పెరిగిన తర్వాత మొత్తం ఆరు పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిలో అయిదింటిని భర్తీ చేసింది కేంద్రం. ఇప్పుడు ఒకే ఖాళీ మాత్రమే మిగిలివుంది.

Sakshi01 Jun, 07:52 am
కన్నప్రేమను పంచిన ఆంటీ’.. కానరాని లోకాలకు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. న్యూఢిల్లీ: ఢిల్లీలోని సాకేత్‌ మెట్రో స్టేషన్ సమీపంలో భవనం కూలిన ‍ఘటన ఒక కుటుంబంలోనే కాకుండా, అక్కడి విద్యార్థులకూ తీరని విషాదాన్ని పంచింది. ఈ ఘటన అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను కాపాడాలనే ప్రయత్నంలో ప్రమాద స్థలంలోకి వెళ్లిన పార్వతీ ఓజా (50) ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులకు ‘పార్వతీ ఆంటీ’ ఢిల్లీలోని సైదులాబాద్ ప్రాంతంలో ‘ఆంటీ వాలా కిచెన్’ నడుపుతున్న

Eenadu01 Jun, 05:53 am
కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలోని కేంద్ర విద్యాశాఖ కార్యాలయం (Education Ministry office)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వికాస్‌మార్గ్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA) భవనం రెండో అంతస్తులో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని.. పలు దస్త్రాలు కాలిపోయాయని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన అంతస్తులో విద్యాశాఖకు చెందిన పలు కార్యాలయాలు, అధ్యాపక సభ్యుల క్యాబిన్‌లు ఉన్నాయని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. మొదట ఏసీలో నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Telugu Stop29 May, 11:43 am
ఏఐసీసీ అగ్రనాయకుడు,లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఏపీ కాంగ్రేస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల గురువారం ఢిల్లీలోని 10

ఆంధ్రప్రదేశ్:ఏఐసీసీ అగ్రనాయకుడు,లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ( Rahul Gandhi )ఏపీ కాంగ్రేస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల (Y.S.Sharmila )గురువారం ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో కలిశారు.ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.రాజకీయ పరిస్థితులు,పార్టీ వ్యవహారాలపై ఈ... ఆంధ్రప్రదేశ్:దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే సూచన పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు అవకాశం ఉందని,రుతుపవనాల ఆగమనానికి వాతావరణం అనుకూలం ఉందని,జూన్‌ మొదటి వారంలో కేరళలోకి రుతుపవనాల ప్రవేశం ఉందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్:క్రికెట్ అభిమానులకు పండుగలా నిలిచే GMR “APL- 2026” టోర్నమెంట్‌కు మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది.జూన్ 24 నుంచి జూన్ 30 వరకు జరుగనున్న ఈ లీగ్ మ్యాచ్‌లు,ఎలిమినేటర్, క్వాలిఫైయర్‌లు మరియు ఫైనల్ పోటీలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపనున్నాయి.టోర్నమెంట్... ఆంధ్రప్రదేశ్:తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ ( Kotagummam Center )సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దుకాణంలోని రెండు అంతస్తులకు వ్యాపించాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో... ఆంధ్రప్రదేశ్:నటుడు రామ్‌చరణ్( Ram Charan ) నటించిన పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.10 రోజులపాటు సింగిల్ స్క్రీన్‌లలో రూ.100 చొప్పున,మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.‘పెద్ది’ ప్రీమియర్ షో (... తెలంగాణ/ఏపీ:ఓవైపు ఎండలు,మరోవైపు వానలు, సూపర్ ఎల్నీనో అంటూ వస్తున్న వార్తలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.2026 నైరుతి రుతుపవనాల... తెలంగాణ:నిర్మల్ లోని ఓ

Sakshi28 May, 07:06 am
ఏళ్ల తర్వాత మోదీని కలిసిన విజయ్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

Sakshi29 May, 06:34 am
మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణం

సాక్షి,ఢిల్లీ: ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఏసీ ఇండోర్‌ యూనిట్‌ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి మాజీ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ (80) మృతిచెందారు. పోలీసులకు సమాచారం ప్రకారం మే 27 బుధవారం రాత్రి 11:18 గంటల ప్రాంతంలో హౌజ్ ఖాస్‌లోని ఆర్‌-15 నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది, ఇంట్లోని ఏసీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తీవ్రంగా గాయపడిన ధనేంద్ర కుమార్‌కు ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. కానీ దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రమాద సమయంలో ధనేంద్రకుమార్‌, ఆయన కుమారుడితోపాటు మరో ముగ్గురు పనివారు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆలస్యమైంది. ఫైర్ సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంట్లో ఉన్న ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ధనేంద్ర కుమార్ పొగ కారణంగా ఊపిరి తీసుకోలేక మరణించగా, ఆయన కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు ఈ ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని, విద్యుత్ లోపంపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ : ఏసీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గృహ సహాయకుడు రమేష్ మీడియాకు వెల్లడించారు. ఎవరీ ధనేంద్ర కుమార్ ? ధనేంద్ర కుమార్ 1946లో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్‌కు చెందిన ప్రతిభావంతుడైన ఐఏఎస్ (IAS) అధికారి. తన సుదీర్ఘ కెరీర్‌లో కేంద్ర, హర్యానా ప్రభుత్వాలలో పలు కీలక పదవుల్లో సేవలందించారు.

Sakshi23 May, 11:55 pm
5 కల్లా ‘జింఖానా’ను అప్పగించండి 

- May 24 2026 5:08 AM | Updated on May 24 2026 5:08 AM న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డునున్న చారిత్రక జింఖానా క్లబ్‌ను జూన్‌ 5వ తేదీలోగా తమకు అప్పగించాలంటూ కేంద్రం నిర్వాహకులను ఆదేశించింది. - అత్యంత కీలకమైన ల్యుటెన్స్‌ ప్రాంతం లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధానమంత్రి అధికార నివాసాన్ని ఆనుకుని 27.3 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్థలం రక్షణ మౌలిక సదుపాయాల బలోపేతానికి, భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఎంతో అవసరమని కేం... - గృహ, పట్టణ వ్యవహారాల శాఖ అధీనంలోని భూ అభివృద్ధి కార్యాలయం(ఎల్‌ అండ్‌డీవో) ఈ మేరకు ఈ నెల 22వ తేదీన ఉత్తర్వు జారీ చేసింది.

Oneindia Telugu30 May, 05:26 pm
కుప్పకూలిన 5 అంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకుని

దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ దిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదులాజాబ్ ప్రాంతంలో సకెర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ ఐదంస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దిల్లీలో శనివారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులు, ఉరుముల ప్రభావంతో భవనం కూలినట్లు తెలుస్తోంది. కూలిపోయిన భవన శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు సమాచారం అందుతోంది. సమాచారం అందుకున్న వెంటనే దిల్లీలోని అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేసింది. స్థానిక పోలీసులు, వైద్య బృందం ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు.ఇక ఐదంస్తుల భవనం కుప్పకూలగానే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా దట్టమైన ధూళితో నిండిపోయింది. భయంతో చుట్టుపక్కల ప్రజలు కేకలు వేసుకుంటూ పరుగులు తీశారు. సంఘటనా స్థలంలో బాధితుల బంధువుల ఆర్తనాదాలు, కేకలతో తీవ్ర గందరగోళం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శిథిలాల కింద చాలామందే చిక్కుకుని ఉంటారని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు.మరోవైపు శిథిలాల కింద నుంచి ఒక్కొక్కరిగా క్షతగాత్రులను వెలికి తీసి తరలించేందుకు వీలుగా ఘటనా స్థలంలో అంబులెన్స్‌ లను కూడా సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం అక్కడ సహయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక వాతావరణ శాఖ దిల్లీ లో రెడ్, ఆరెంజ్ అలర్ట్ లను జారీ చేసింది. నగరంలో గంటకు 70 నుంచి 90 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ తీవ్రమైన గాలులు, వర్షాల కారణంగానే ఈ భవనం కుప్పకూలినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

AP7AM31 May, 03:21 am
ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. 12 మందిని కాపాడిన సిబ్బంది

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఐదంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలింది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, సహాయక బృందాలు ఇప్పటివరకు 12 మందిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.శనివారం రాత్రి ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఇతర విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాత్రంతా సహాయక చర్యలను కొనసాగించాయి. కూలిన భవనంలో ఓ కోచింగ్ సెంటర్, పలు కార్యాలయాలు, కేఫ్‌లు ఉన్నాయని తెలిసింది. భవనం పక్కనే ఉన్న ఓ క్యాంటీన్‌పై శిథిలాల పడటంతో అక్కడ ఉన్న విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు.భవనం మూడో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండటమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, భవనం ఇప్పటికే శిథిలావస్థలో ఉందని స్థానికులు చెబుతున్నారు. 12 మందిని రక్షించామని, ఇక శిధిలాల కింద ఎవరూ లేరని భావిస్తున్నామని, అయితే రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకూ కచ్చితంగా చెప్పలేమని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. 

Telugu Cinema28 May, 07:37 pm
ఈసారి వివాదాలకు తావివ్వని రామ్ చరణ్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

భోపాల్ లో జరిగిన ఈవెంట్ లో తెలియని భాష మాట్లాడి కన్ఫ్యూజ్ అయ్యాడు రామ్ చరణ్ (Ram Charan). హిందీలో మాట్లాడాలనే ఆయన ప్రయత్నాన్ని అంతా మెచ్చుకున్నప్పటికీ, ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని పొరపాట్లు ట్రోలింగ్ కు గురయ్యాయి. దీంతో మరోసారి ఆ తప్పు రిపీట్ చేయకూడదని చరణ్ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. ఢిల్లీలో జరిగిన ‘పెద్ది’ (Peddi) ప్రచార కార్యక్రమంలో పూర్తిగా ఇంగ్లిష్ కే పరిమితమయ్యాడు. అక్కడక్కడే హిందీ మాట్లాడ్డానికి ప్రయత్నించినప్పటికీ తిరిగి తన ఇంగ్లిష్ లోకే వచ్చేశాడు. యాంకర్ పదేపదే హిందీలోనే ప్రశ్నలు అడిగినప్పటికీ, చరణ్ మాత్రం ఓపిగ్గా ఇంగ్లిష్ లోనే సమాధానాలిచ్చాడు. అలా వివాదాలకు తావు లేకుండా వ్యవహరించాడు చెర్రీ. భోపాల్ లో జరిగిన కార్యక్రమంలో.. భోపాల్ బదులు బిహార్ అని ప్రస్తావించాడు చరణ్. ఎక్కువగా కన్ఫ్యూజ్ అయి బుమ్రాను ఫుట్ బాల్ ఆటగాడిగా పేర్కొన్నాడు. తెలియని భాష మాట్లాడ్డం వల్లనే ఈ సమస్యలన్నీ వచ్చాయని గ్రహించి, ఢిల్లీలో పూర్తిగా ఇంగ్లిష్ కు పరిమితమయ్యాడు. మరోవైపు భోపాల్ లో చరణ్ చేసిన పొరపాట్లకు ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తోంది.

Eenadu28 May, 08:22 am
దిల్లీలోని ఏపీ భవన్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

దిల్లీ: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌ అని దిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కొనియాడారు. ఏపీ భవన్‌ అంబేద్కర్ ఆడిటోరియంలో ఎన్టీఆర్‌ చిత్రపటం వద్ద అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సరికొత్త ప్రభంజనం సృష్టించి తెలుగు జాతి ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత నేత అని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం కోసం రూ.2 కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాల వంటి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తెలుగుదేశం (TDP) పార్టీ మహిళల అభ్యున్నతికి పాటుపడుతోందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

Vaartha31 May, 08:15 am
సైదులాజాబ్ లో కుప్పకూలిన ఐదంతస్తుల వాణిజ్య భవనం

Delhi building collaps: దేశ రాజధాని ఢిల్లీలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఢిల్లీలో కుప్పకూలిన భవనం ఘటన తీవ్ర కలకలం రేపింది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో భారీ వాణిజ్య భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. Read also: PM modi: మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్ లో భారత క్రీడాకారులపై ప్రధాని మోదీ ప్రశంసలు ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు దాదాపు తొమ్మిది మందిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారందరిని చికిత్స కోసం ఎయిమ్స్ ట్రామా సెంటర్ తరలించారు. సహాయక బృందాలు అత్యాధునిక పరికరాలతో శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ భవనం కుప్పకూలిన సమయంలో పక్కనే ఉన్న టీన్ షెడ్ క్యాంటీన్‌లో విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు శిథిలాలు క్యాంటీన్‌పై పడటంతో ఈ భారీ నష్టం జరిగింది. ఈ భవనంలో కోచింగ్ సెంటర్లు, కార్యాలయాలు ఉండేవి. భవనంపై అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, ప్రాణనష్టం తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. Gajendra Singh Shekhawat: భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ మోదీ అంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలు Chandrababu Naidu: చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Bagepalli road accident:

Sakshi31 May, 02:54 am
ఢిల్లీలో కూప్పకూలిన ఐదు అంతస్తుల భవనం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం ఐదు అంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మందిని సురక్షితంగా రక్షించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారనే అనుమానంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సాయిదుల్లాజాబ్ ప్రాంతంలోని వెస్ట్రన్ మార్గ్‌లో ఉన్న ఈ ఐదు అంతస్తుల

Oneindia Telugu01 Jun, 01:34 pm
బెంగాల్లో అడ్డుకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా..! మమత సీరియస్ వార్నింగ్

పశ్చిమబెంగాల్లో ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం..వరుసగా విపక్ష టీఎంసీ నేతల్ని టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా రెండు రోజుల్లోనే ఇద్దరు ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీలపై బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైనే దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో రేపు కోల్ కతాలో బహిరంగసభ నిర్వహించాలని మమతా బెనర్జీ (Mamata Banerjee) నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలంతా తరలిరావాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే ఈ సభకు బీజేపీ సర్కార్ అనుమతి నిరాకరించింది.దీనిపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కోల్ కతాలో ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు అనుమతించకపోతే తాను ఢిల్లీకి వెళ్లి ఒంటరిగా నిరసన తెలుపుతానని మమత వార్నింగ్ ఇచ్చారు. వర్చువల్‌గా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో.. మంగళవారం కోల్‌కతాలోని రాణి రష్మోని రోడ్‌లో నిరసన తెలిపేందుకు టీఎంసీ అనుమతి కోరిందని, అయితే పోలీసులు దానిని నిరాకరించారని మమత ఆరోపించారు. ఇది రాజకీయ ప్రేరేపిత నిర్ణయం అన్నారు.తాను ఆందోళనను కొనసాగిస్తానని, అవసరమైతే జాతీయ రాజధానిలో కూడా నిరసన తెలుపుతానని ఆమె స్పష్టం చేశారు. బెదిరింపులు, అరెస్టుల ద్వారా టీఎంసీ కార్యకర్తలను బలహీనపరిచేందుకు పోలీసులు బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు పాలన నడుస్తోందని, టీఎంసీ రాజకీయ కార్యకలాపాలను అధికారులు పద్ధతి ప్రకారం అణచివేస్తున్నారని ఆరోపించారు. సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి టీఎంసీకి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, అయినా తాము బలంగా ఎదుగుతామని తెలిపారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను లాక్కోవడంతో టీఎంసీ బలహీనపడదన్నారు. తమ కార్యకర్తలను సమావేశాలు నిర్వహించనివ్వడం లేదని, తమను బయటకు రానివ్వడం లేదని మమత తెలిపారు. 2,500 పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారని, ఈద్గాలను స్వాధీనం చేసుకున్నారని, మిషనరీ సంస్థలను మూసివేశారని ఆరోపించారు.