
దిల్లీ: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని దిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కొనియాడారు. ఏపీ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఎన్టీఆర్ చిత్రపటం వద్ద అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సరికొత్త ప్రభంజనం సృష్టించి తెలుగు జాతి ఖ్యాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత నేత అని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం కోసం రూ.2 కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాల వంటి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తెలుగుదేశం (TDP) పార్టీ మహిళల అభ్యున్నతికి పాటుపడుతోందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు.