
భోపాల్ లో జరిగిన ఈవెంట్ లో తెలియని భాష మాట్లాడి కన్ఫ్యూజ్ అయ్యాడు రామ్ చరణ్ (Ram Charan). హిందీలో మాట్లాడాలనే ఆయన ప్రయత్నాన్ని అంతా మెచ్చుకున్నప్పటికీ, ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని పొరపాట్లు ట్రోలింగ్ కు గురయ్యాయి. దీంతో మరోసారి ఆ తప్పు రిపీట్ చేయకూడదని చరణ్ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. ఢిల్లీలో జరిగిన ‘పెద్ది’ (Peddi) ప్రచార కార్యక్రమంలో పూర్తిగా ఇంగ్లిష్ కే పరిమితమయ్యాడు. అక్కడక్కడే హిందీ మాట్లాడ్డానికి ప్రయత్నించినప్పటికీ తిరిగి తన ఇంగ్లిష్ లోకే వచ్చేశాడు. యాంకర్ పదేపదే హిందీలోనే ప్రశ్నలు అడిగినప్పటికీ, చరణ్ మాత్రం ఓపిగ్గా ఇంగ్లిష్ లోనే సమాధానాలిచ్చాడు. అలా వివాదాలకు తావు లేకుండా వ్యవహరించాడు చెర్రీ. భోపాల్ లో జరిగిన కార్యక్రమంలో.. భోపాల్ బదులు బిహార్ అని ప్రస్తావించాడు చరణ్. ఎక్కువగా కన్ఫ్యూజ్ అయి బుమ్రాను ఫుట్ బాల్ ఆటగాడిగా పేర్కొన్నాడు. తెలియని భాష మాట్లాడ్డం వల్లనే ఈ సమస్యలన్నీ వచ్చాయని గ్రహించి, ఢిల్లీలో పూర్తిగా ఇంగ్లిష్ కు పరిమితమయ్యాడు. మరోవైపు భోపాల్ లో చరణ్ చేసిన పొరపాట్లకు ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తోంది. భోపాల్ లో జరిగిన ఈవెంట్ లో తెలియని భాష మాట్లాడి కన్ఫ్యూజ్ అయ్యాడు రామ్ చరణ్ (Ram Charan). హిందీలో మాట్లాడాలనే ఆయన ప్రయత్నాన్ని అంతా మెచ్చుకున్నప్పటికీ, ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని...