
ఇంటర్నెట్ డెస్క్: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణా యంత్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన (NEET) ఎలా జరిగిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇలాంటి సంఘటన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర మానసిక క్షోభను కలిగిస్తుందని, వారిని ఇలా నిరాశపెట్టడం సరికాదని అభిప్రాయపడింది. పేపర్ లీక్ (NEET paper leak) విషయంలో లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని, అప్పటి వరకు అసలు సమస్య ఆగదని వ్యాఖ్యానించింది. అయితే, యువత ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం ధర్మాసనానికి వెల్లడించారు. పరిస్థితిని ప్రధానమంత్రి కూడా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జూన్ 21న మరోసారి నిర్వహించే నీట్-యూజీ పరీక్ష కోసం కొత్త యంత్రాంగాలను ఏర్పాటు చేశామన్నారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.