
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Supreme court apply article 142 and key directions to all high court: సుప్రీంకోర్టు ధర్మాసనం అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న పెండింగ్ కేసుల విచారణపై రాజ్యంగం కల్పించిన అసాధారణ ఆర్టికల్ 142న ఉపయోగించి హైకోర్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టులు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత వాటిని 3 నెలల్లోపు ఫైనల్ జడ్జీమెంట్ ఇవ్వాలని ఆదేశించింది. అంతే కాకుండా బెయిల్ వచ్చిన ఖైదీలను అదే రోజు విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ విపిన్ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా జార్ఖండ్ హైకోర్టులో తీర్పులు వెల్లడి, అప్ లోడింగ్ వంటి అంశాలపై దాఖలైన కేసు విచారణ నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం ఈ కీలక తీర్పును వెల్లడించింది.