
ఇంటర్నెట్డెస్క్: రాష్ట్ర హైకోర్టుల్లో తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత దానిని వెలువరించేందుకు అత్యధికంగా 3 నెలలు మాత్రమే సమయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టుల్లో తీర్పు రిజర్వు చేసిన తర్వాత కూడా పలు కారణాలతో తీవ్ర జాప్యాలు చోటు చేసుకోవడంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిష్ విపిన్ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపైనా హైకోర్టులకు మార్గదర్శకాలు జారీ చేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.