
ఇంటర్నెట్డెస్క్: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించింది. ‘సర్’ను నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్ (Election Commission)కు ఉందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం (Supreme Court) ధర్మాసనం బుధవారం ఈ తీర్పు వెలువరించింది. ఇక్కడ ఏ చట్టం, రాజ్యాంగ నిబంధనా ఉల్లంఘనకు గురికాలేదని చెప్పింది. ‘‘స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను ‘సర్’ ముందుకు తీసుకెళ్తోంది. ఓటర్ల జాబితాల్లో సమగ్రత, కచ్చితత్వం, విశ్వసనీయత ముఖ్యం. ఈ క్రమంలో సర్ నిర్వహణకు ఈసీ చెప్పిన కారణాలతో సంతృప్తి చెందాం’’ అని తన తీర్పులో ధర్మాసనం పేర్కొంది. ‘సర్’లో పేరు లేనంత మాత్రాన ఎవరూ తమ పౌరసత్వం కోల్పోరని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ‘సర్’ చుట్టూ గత ఏడాదిగా జరుగుతోన్న రాజకీయ ఆరోపణలు, విమర్శలకు తెరదించినట్లయింది. గత ఏడాది జూన్లో బిహార్లో తొలుత ఈ ప్రక్రియ నిర్వహించిన సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.