
Boiled Egg vs Omelette:గుడ్డును సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారో చాలా మందికి తెలిసిందే. తక్కువ ఖర్చుతో శరీరానికి మంచి ప్రోటీన్ అందించే ఆహారాల్లో గుడ్డు ముందుంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే చాలామందిలో ఒక సందేహం మాత్రం ఉంటుంది. వెయిట్ లాస్ కోసం ఉడికించిన గుడ్డు తినాలా.. లేక ఆమ్లెట్ తినాలా అని ఆలోచిస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గాలనుకునేవారికి ఉడికించిన గుడ్డు మంచి ఎంపికగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని వండడానికి నూనె, వెన్న వంటి అదనపు పదార్థాలు అవసరం ఉండవు. ఒక మీడియం సైజ్ ఉడికించిన గుడ్డులో సుమారు 70 నుంచి 78 కేలరీలు మాత్రమే ఉంటాయి. పైగా ఇందులో శరీరానికి అవసరమైన ప్రోటీన్‌తో పాటు విటమిన్ డి, విటమిన్ బి12, కోలిన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కడుపు ఎక్కువసేపు నిండిన భావన ఉండటంతో మధ్యలో ఆకలి కూడా తగ్గుతుంది. మరోవైపు ఆమ్లెట్ రుచిగా ఉండటంతో చాలా మందికి ఇష్టమైన ఎంపిక. కానీ ఇందులో వాడే నూనె లేదా వెన్న కారణంగా కేలరీలు పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆమ్లెట్లో 90 నుంచి 200 వరకు కేలరీలు ఉండొచ్చు. అయితే ఇందులో ఒక మంచి విషయం కూడా ఉంది. ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్, పాలకూర వంటి కూరగాయలు కలిపితే ఫైబర్ పెరుగుతుంది. దీంతో శరీరానికి అదనపు పోషకాలు అందుతాయి. కేలరీలను ఇంకా తగ్గించాలనుకునేవారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తీసుకోవచ్చు. ఒక ఎగ్ వైట్‌లో తక్కువ కేలరీలు ఉన్నా ప్రోటీన్ మాత్రం బాగా లభిస్తుంది. ఆమ్లెట్ తినాలనిపిస్తే తక్కువ నూనెతో లేదా నాన్‌స్టిక్ పాన్‌లో చేసుకోవడం మంచిది. మొత్తానికి వేగంగా బరువు తగ్గాలనుకుంటే ఉడికించిన గుడ్డు మంచి ఎంపిక. అయితే రోజూ అదే తిని బోర్ కొడితే.. వారంలో రెండు మూడు సార్లు తక్కువ నూనె, ఎక్కువ కూరగాయలతో చేసిన వెజ్ ఆమ్లెట్ కూడా తీసుకోవచ్చు. రుచి కూడా ఉంటుంది.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. Boiled Egg vs Omelette:గుడ్డును సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారో చాలా మందికి తెలిసిందే. తక్కువ ఖర్చుతో శరీరానికి మంచి ప్రోటీన్ అందించే ఆహారాల్లో గుడ్డు ముందుంటుంది. అందుకే బరువు...