ఏపీలో ప్రస్తుతం విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండగా.. మరోవైపు పలు జిల్లాల్లో అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు ప్రజలకు కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి నిర్దిష్ట ఎత్తులో ఒక బలమైన ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని నేడు రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు పిడుగుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడా చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా, శనివారం సాయంత్రం వరకు వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లోని మెజారిటీ ప్రాంతాల్లో ఈ సీజన్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా హుస్సేనుపురంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 51 మి.మీ. భారీ వర్షపాతం రికార్డయ్యింది.ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగుతూ.. నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్ ఏపీలో ప్రస్తుతం విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండగా.. మరోవైపు పలు జిల్లాల్లో అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు ప్రజలకు కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి నిర్దిష్ట ఎత్తులో ఒక బలమైన ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని నేడు రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు పిడుగుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడా చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా, శనివారం సాయంత్రం వరకు వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లోని మెజారిటీ ప్రాంతాల్లో ఈ సీజన్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా హుస్సేనుపురంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 51 మి.మీ. భారీ వర్షపాతం రికార్డయ్యింది.ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగుతూ.. నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని చెబుతున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. ఇలా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పూర్తిగా తగ్గిపోలేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ.. ఆదివారం రాష్ట్రంలోని కొన్ని మైదాన ప్రాంతాలలో ఎండలు దంచి కొట్టనున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం నమోదైన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా సంజామల మండలంలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదై, తీవ్రమైన ఉక్కపోతకు దారితీసింది.ప్రస్తుతం ఒకే రాష్ట్రంలో ఇటు వేడి గాలులు, అటు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో విపరీతమైన తేమ పెరిగి, పగటిపూట ఉక్కపోత సాధారణం కంటే ఎక్కువగా ఉంటోంది. ఈ ఉక్కపోత వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల పక్కన గానీ నిలబడవద్దని సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. రాబోయే రెండు రోజులు వాతావరణం ఇలాగే అస్థిరంగా ఉండే అవకాశం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న