
చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫుడ్స్ లో ఐస్ క్రీమ్ ముందు వరసలో ఉంటుంది. ఎండా కాలం అయినా, వానా కాలం అయినా… ఐస్ క్రీమ్ తినే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే… కొందరు.. ఐస్ క్రీమ్ పెద్ద పెద్ద డబ్బాలు కొనేసి.. ఫ్రీజర్ లో స్టోర్ చేసి..రోజూ కొంచెం కొంచెం తింటూ ఉంటారు. కానీ.. ఓపెన్ చేసిన ఐస్ క్రీమ్ డబ్బాని ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తినడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం… మీరు దుకాణం నుంచి తెచ్చిన ఐస్ క్రీమ్ బాక్సులు తెరవకుండా… ఇంట్లో ఫ్రీజర్ లో పెడితే… అది దాదాపు 2 నుంచి 3 నెలల వరకు తాజాగా, సురక్షితంగా ఉంటుంది. దీనినే షెల్ప్ లైఫ్ అంటారు. ఒక్కసారి బాక్స్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత, మిగిలిన దానిని గరిష్టంగా.. 1 నెల నుంచి 2 నెలల్లోపు తినేయాలి. అంతకంటే ఎక్కువ రోజులు దానిని నిల్వ ఉంచితే… దానిపై ఐస్ క్రిస్టల్స్ ఏర్పడుతాయి. అంతేకాదు.. ఐస్ క్రీమ్ రుచి కూడా తగ్గిపోతుంది. ఇలా మారిన దానిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఐస్ క్రీమ్ ని నార్మల్ ఫ్రిజర్ డోర్ లో పెడుతూ ఉంటారు. కానీ.. ఇది తప్పు. ఇలా స్టోర్ చేయకూడదు. డోర్ పదే పదే తీయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. అందుకే.. ఐస్ క్రీమ్ పాడవ్వకుండా ఉండాలంటే.. ఫ్రీజర్ లో అది కూడా వెనక భాగంలో లోపల పెట్టాలి. అక్కడ టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది. ఐస్ క్రీమ్ పాడవ్వకుండా ఉంటుంది. ఓపెన్ చేసిన ఐస్ క్రీమ్ ను ఫ్రీజర్ లో పెట్టే ముందు ఒక ప్లాస్టిక్ కవర్ లేదా వాక్స్ పేపర్ ను ఐస్ క్రీమ్ పైన పెట్టి… ఆ తర్వాత మూత పెట్టాలి. ఇలా చేస్తే… ఐస్ క్రిస్టల్స్ ఏర్పడవు. ఐస్ క్రీమ్ పాడవ్వకుండా తాజాగా ఉంటుంది. ఐస్‌క్రీమ్ ఇతర ఆహారాల ఘాటైన వాసనలను సులభంగా పీల్చుకుంటుంది. అందుకే పచ్చి మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి వాటి పక్కన పెట్టొద్దు. ఒరిజినల్ బాక్స్ పగిలినా, దాన్ని వెంటనే గాలి చొరబడని (ఎయిర్-టైట్) డబ్బాలోకి మార్చండి. ఐస్‌క్రీమ్‌పై మందపాటి మంచు పొర ఏర్పడినా, దాని రంగు, ఆకృతి మారినా, లేదా రుచిలో పులుపు లేదా వింతగా అనిపించినా వెంటనే దాన్ని పడేయండి. సరైన పద్ధతిలో నిల్వ చేస్తేనే ఐస్‌క్రీమ్‌ను పూర్తిగా ఆస్వాదించగలం. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫుడ్స్ లో ఐస్ క్రీమ్ ముందు వరసలో ఉంటుంది. ఎండా కాలం అయినా, వానా కాలం అయినా… ఐస్ క్రీమ్ తినే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే…...