
ఊహించిందే జరిగింది. వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఎల్పీజీ వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వీటి రేట్లను సవరిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీన్ని ఇప్పుడు కూడా కొనసాగించాయి.వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల సిలిండర్‌పై ఏకంగా 42 రూపాయలు పెరిగింది. దీంతో ఒక్కో సిలిండర్ ధర అమాంతం రూ.3113.50 పైసలకు చేరింది. కోల్‌కతాలో రూ.53.50 పైసల మేర పెరిగింది. అక్కడ సిలిండర్ ధర రూ.3255.50కి చేరింది. కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర ఈ స్థాయిలో ఉంటుందని బహుశా ఎవరూ ఊహించివుండరు. ఇదే కాకుండా అయిదు కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ల రేటు కూడా మారింది. ఒక్కో సిలిండర్ పై 11 రూపాయలు పెరిగింది. గృహావసర సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు.