translateexpand_more

Made In Korea News

Latest updates from Telugu Digital news sources.

Telugu Cinema01 Jun, 03:36 pm
భారతీయ కొరియన్ క్యూటీ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఈరోజు 2 గుడ్ న్యూస్ లు బయటపెట్టింది. అందులో ఒకటి ఆమె సౌత్ కొరియా పర్యాటక రంగానికి గౌరవ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ మేరకు తన ఆనందాన్ని పంచుకుంటూ పోస్టు పెట్టింది. “కొరియా పర్యాటకానికి గౌరవ రాయబారిగా నియమితులవడం నాకు నిజంగా చాలా ప్రత్యేకమైన విషయం. కొరియా సంస్కృతిని భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేయగల వ్యక్తిగా నన్ను గుర్తించినందుకు కొరియా ప్రభుత్వానికి, కొరియా పర్యాటక సంస్థకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కొరియా సంస్కృతి, సంప్రదాయాలు, ఆప్యాయత నన్ను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తాయి. ఈ అందమైన ప్రయాణంలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది.” అటు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు హాజరైన విందుకు ప్రియాంక మోహన్‌కు ఆహ్వానం లభించింది. దీనంతటికీ కారణం ఆమె చేసిన ‘మేడ్ ఇన్ కొరియా’ అనే చిత్రం. మరోవైపు తన డ్రీమ్ ప్రాజెక్టును కూడా ప్రకటించింది ప్రియాంక మోహన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో, ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ‘మంజనతి’ అనే సినిమా ప్రకటించింది. వీళ్లిద్దరితో కలిసి పనిచేయాలనే తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది.