
తెలంగాణలో ఎన్నో అద్భుతమైన, మిస్టరీలతో కూడిన దేవాలయాలు చాలానే ఉన్నాయి. కానీ, హైదరాబాద్‌కు జస్ట్ ఒక గంట ప్రయాణ దూరంలో, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామంలో ఉన్న ఒక అరుదైన శివక్షేత్రం గురించి చాలా మందికి తెలియదు. అదే శ్రీ మరకత శివలింగ సోమేశ్వర స్వామి ఆలయం. సాధారణంగా మనం నల్లటి రాతితో చేసిన శివలింగాలను చూస్తుంటాం. కానీ ఇక్కడ పరమశివుడు స్వచ్ఛమైన ఆకుపచ్చ రంగులో మెరిసిపోయే మరకత లింగం రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఒక్క లింగాన్ని దర్శించుకుంటే చాలు, ఎంతటి మొండి రోగాలైనా నయమైపోతాయని భక్తుల నమ్మకం. అందుకే దీన్ని తెలంగాణ వైద్యనాథ క్షేత్రం అని కూడా పిలుస్తారు. మరకతం అంటే పచ్చ రత్నం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది బుధ గ్రహానికి చిహ్నం. చందిప్ప ఆలయంలోని ఈ శివలింగంపై కాంతి పడినప్పుడు లేదా అభిషేకం చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ గ్రీనిష్ గ్లో కనిపిస్తుంది. ఈ వైబ్రేషన్స్ చూడటానికి రెండు కళ్లూ చాలవు. మహారాష్ట్రలో ఉన్న ప్రముఖ జ్యోతిర్లింగం వైద్యనాథ్ ఎలాగైతే భక్తుల రోగాలను నయం చేస్తుందో, అలాగే ఇక్కడి మరకత సోమేశ్వరుడు కూడా భక్తులకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం. ఈ లింగం ముందు కూర్చుని కాసేపు ధ్యానం చేస్తే మైండ్ సూపర్ పీస్ ఫుల్ గా మారుతుంది. ఈ గుడి నిన్న మొన్న కట్టింది కాదు.. దీనికి దాదాపు 1000 ఏళ్ల హిస్టరీ ఉంది. 11వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు (క్రీ.శ. 1076-1126) కాలంలో, 1101 అక్టోబర్ 23న ముచుకుంద నది తీరాన ఈ క్షేత్రాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి శాసనాలు చెప్తున్నాయి. ఆ రోజుల్లో ఈ ఆలయ మెయింటెనెన్స్, పండగల కోసం ఏకంగా 250