translateexpand_more

Obsession Movie News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 08:18 am
ప్రపంచ సినిమా ప్రేక్షకులను షేక్ చేస్తోన్న 7 కోట్ల హాలివుడ్ సినిమా

హాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక చిన్న సినిమా పెద్ద సంచలనంగా మారింది. యువ దర్శకుడు కర్రీ బార్కర్ తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తోంది. కేవలం 7 నుంచి 9 కోట్ల రూపాయల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటికే 100 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, తాజాగా 148 మిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా దాటేసింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1,400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సాధారణ యువకుడు తన ప్రేమను పొందాలనే ఉద్దేశంతో ఓ అతీంద్రియ శక్తులు ఉన్న మాయా వస్తువును ఉపయోగిస్తాడు. అయితే అతను కోరుకున్న కోరిక నిజమవుతుంది. కానీ ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకునే భయానక పరిణామాలు, మానసిక సంఘర్షణలే ‘అబ్సెషన్’ కథ. ప్రేమ, వ్యామోహం, భయం అనే మూడు అంశాలను కలిపి ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టేలా దర్శకుడు కథను నడిపించాడు. అతి తక్కువ లొకేషన్లు, పరిమిత పాత్రలు, చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ప్రస్తుతం హాలీవుడ్‌లో పెద్ద స్టూడియో సినిమాలకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన మౌత్ టాక్ కారణంగా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండో వారంలో కూడా వసూళ్లు పెరగడం హాలీవుడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం థియేటర్లలో ‘మైఖేల్’, ‘ది డెవిల్ వేర్స్ ప్రాడా 2’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నప్పటికీ.. ‘అబ్సెషన్’ తన సత్తా చాటుతోంది. ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఫోకస్ ఫీచర్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమాకు వస్తున్న అద్భుత స్పందనతో ఇప్పటికే సీక్వెల్‌పై చర్చలు మొదలైనట్లు హాలీవుడ్ వర్గాలు

AP7AM30 May, 01:52 pm
అసలు సిసలైన హారర్ మూవీ... 38 సెకన్ల ఫుటేజికి కత్తెర వేసిన భారత సెన్సార్ బోర్డు

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్'కు భారత సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ చిత్రానికి 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్ జారీ చేసినప్పటికీ, పలు కీలక సన్నివేశాలపై కత్తెర వేసింది. కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 29న భారత థియేటర్లలో విడుదలైంది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) ఆదేశాల మేరకు ఈ చిత్రంలో మొత్తం 38 సెకన్ల నిడివి గల సన్నివేశాలను తొలగించారు. ఇందులో సినిమా ద్వితీయార్ధంలో వచ్చే 24 సెకన్ల తీవ్రమైన హింసాత్మక సన్నివేశం, 14 సెకన్ల నిడివి గల శృంగారభరిత సన్నివేశం ఉన్నాయి. వీటితో పాటు ఒక నగ్న దృశ్యాన్ని కూడా వేరే షాట్‌తో భర్తీ చేశారు. ఈ కోతల అనంతరం సుమారు 1 గంట 50 నిమిషాల నిడివితో సినిమా ప్రదర్శితమవుతోంది.అంతర్జాతీయంగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా 'అబ్సెషన్' భారీ విజయం సాధించడంతో భారతీయ హారర్ ప్రియులు సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే, 'A' సర్టిఫికెట్ ఇచ్చాక కూడా కీలక సన్నివేశాలను తొలగించడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్దల కోసం ఉద్దేశించిన సినిమాలో ఈ కోతలు ఎందుకని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. థియేటర్లలో సెన్సార్ చేసిన వెర్షన్ చూసే బదులు, ఓటీటీలో పూర్తి సినిమా (అన్‌కట్ వెర్షన్) కోసం ఎదురుచూస్తామని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చిత్రంలోని హింస, శృంగార సన్నివేశాలు భారతీయ ప్రేక్షకులకు తగినవి కావని ఎగ్జామినింగ్ కమిటీ భావించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఓటీటీలో అన్‌కట్ వెర్షన్ రిలీజ్‌పై