translateexpand_more

Regina Cassandra News

Latest updates from Telugu Digital news sources.

Telugu Cinema01 Jun, 04:21 pm
గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నటీనటులు జంతువుల్ని దత్తత తీసుకోవడం కొత్తేం కాదు. ఉపాసన ఏకంగా పులుల్ని దత్తత తీసుకొని వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. ఇప్పుడు రెజీనా (Regina Cassandra) వంతు. ఈ హీరోయిన్ ఓ గుర్రాన్ని దత్త తీసుకుంది. ఆ విషయాన్ని ఆమె ప్రకటించడంతో పాటు, తన దత్త గుర్రానికి ఓ పేరు కూడా పెట్టింది. “ఇదిగో, ఇదే నా మొదటి గుర్రం, నాకు ఎంతో ప్రత్యేకమైన మిల్టన్ కీన్స్‌ను పరిచయం చేస్తున్నాను. నేను ఊహించని ఒక ప్రపంచాన్ని నాకు పరిచయం చేసినందుకు రేస్ 2 విన్ ఫౌండేషన్‌ కు ధన్యవాదాలు.” నిజానికి జంతు సంరక్షణ తనకు చిన్నప్పట్నుంచి అలవాటని చెబుతోంది రెజీనా. చిన్నప్పుడు పిల్లులు, ఉడతలు, కొన్ని పక్షుల్ని సంరక్షించేదాన్నని గుర్తు చేసుకుంది. జంతువుల్ని కూడా ప్రేమతో చూడడం తనకు అమ్మ నుంచి అలవాటైందంటోంది రెజీనా. 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘మరీచక’ అనే తెలుగు సినిమాలో నటించింది. గత వారమే విడుదలైన ఈ సినిమా దారుణ పరాజయం పాలు అయింది. ప్రస్తుతం ఒక హిందీ సినిమా, 2 తమిళ సినిమాల్లో నటిస్తోంది.

Regina Cassandra News | Telugu Digital