
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావించే బృహస్పతి (గురుడు), 2026 జూన్ 2వ తేదీన ఒక చారిత్రాత్మక మార్పుకు సిద్ధమయ్యాడు. ఈ రోజున గురుడు మిథున రాశి నుండి తన సొంత ఉచ్ఛ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సుమారు 12 ఏళ్ల తర్వాత గురుడు తన ఉచ్ఛ స్థితికి చేరుకోవడం వల్ల విశ్వంలో సానుకూల మార్పులు రాబోతున్నాయి.ఉచ్చస్థితిలో గురువు.. హంస రాజయోగం జూన్ 2, 2026  ఉదయం 06:30 గంటలకు (స్థానిక పంచాంగం ప్రకారం) మిథునం నుండి కర్కాటకంలోకి మారుతుంది. ఈ గ్రహ సంచారం కారణంగా హంస రాజయోగం (Hamsa Raja Yoga) ఏర్పడుతుంది. గురుడు కేంద్ర స్థానాల్లో (1, 4, 7, 10) ఉండి, తన ఉచ్ఛరాశి అయిన కర్కాటకంలో ఉన్నప్పుడు హంస రాజయోగం ఏర్పడుతుంది.  ముఖ్యంగా విద్య, బ్యాంకింగ్, న్యాయ మరియు ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నవారికి ఇది స్వర్ణయుగం వంటిది.కర్కాటకం: మీ రాశిలోనే గురుడు ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కర్కాటక రాశి జాతకులకు అన్ని విధాలా కలిసి వస్తుంది.  పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఇది వీరికి కలిసొచ్చే కాలం . మిథునం:గురువు ఉచ్చస్థితిలో సంచారం చేయటం కర్కాటక రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ధన స్థానంలో గురుడి ప్రభావం వల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఇది మిధునరాశి వారికి మంచి కాలం. ఆర్ధిక లబ్ది చేకూరే కాలం. వృశ్చికం: వృశ్చిక రాశి జాతకులకు భాగ్య స్థానంలో గురుడు ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. తండ్రి వైపు నుండి ఆస్తి కలిసి వచ్చే