
Ajit Agarkar | అగార్కర్ భవితవ్యంపై ఊగిసలాట.. బీసీసీఐ నిర్ణయం తీసుకునేనా..!
Ajit Agarkar | అగార్కర్ భవితవ్యంపై ఊగిసలాట.. బీసీసీఐ నిర్ణయం తీసుకునేనా..!
© 2026 telugu.digital

Ajit Agarkar | అగార్కర్ భవితవ్యంపై ఊగిసలాట.. బీసీసీఐ నిర్ణయం తీసుకునేనా..!

Ajit Agarkar could be replaced as chief selector as the BCCI reportedly considers two candidates for the key role.భారత క్రికెట్ ఛీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసిపోనుంది. ఆయన స్ధానంలో మరో ఇద్దరు ఐపీఎల్ క్రికెటర్లను బీసీసీఐ పరిశీలిస్తోంది.

BCCI: చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. ఆయనకు మరోసారి పొడిగింపు లభిస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా నివేదికల ప్రకారం పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝా పేర్లు తదుపరి చీఫ్ సెలక్టర్ రేసులో వినిపిస్తున్నాయి. అయితే అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ నుంచి తుది అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Ajit Agarkar | ధోనీ ఇలాకాలో అగార్కర్.. వైభవ్ కోసమే వచ్చాడా..!

BCCI Meeting: భారత క్రికెట్ బోర్డు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ నిర్వహిస్తోంది. భారత జట్టు ఇటీవలి ప్రదర్శనలతో పాటు రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలా వద్దా అనే అంశంపై తీవ్ర చర్చ జరగనుంది. కోచ్ గంభీర్, సెలెక్టర్ అగార్కర్ హాజరవుతున్న ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ ముఖ్యమైన భేటీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు బోర్డు అగ్రశ్రేణి అధికారులు హాజరుకానున్నారు. అందరూ బుధవారం రాత్రికే ముంబై చేరుకున్నారు. ఆయా పర్యటనల్లో జట్టు ప్రదర్శించిన వైఫల్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై బోర్డు పెద్దలు పూర్తి స్థాయి విశ్లేషణ చేయనున్నారు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై తేలనున్న నిర్ణయం ఈ సమావేశంలో అందరి దృష్టి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌పైనే ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు లేదంటూ ప్రచారంలో ఉన్న కథనాలపై బోర్డు ఒక స్పష్టతకు రానుంది. రోహిత్‌ను జట్టులో కొనసాగించాలా లేక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటగాడిని తీర్చిదిద్దాలా అనే కోణంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వయసు, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా రోహిత్ భవిష్యత్తు పై ఒక కీలక రోడ్‌మ్యాప్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీ20 సిరీస్ ఓటములతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ పరాజయంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. వాస్తవానికి ఈ సమావేశం ముందే జరగాల్సి ఉన్నప్పటికీ జింబాబ్వే, శ్రీలంక పర్యటనల కారణంగా వాయిదా పడింది. ఆ రెండు సిరీస్‌లు గెలిచినప్పటికీ విదేశీ గడ్డపై ఎదురైన ప్రతికూల ఫలితాలకు గల కారణాలను గంభీర్, అగార్కర్ వివరించాల్సి ఉంటుంది. బౌలింగ్, బ్యాటింగ్ లోపాలను ఎత్తిచూపుతూ బోర్డు గట్టి నిలదీతలకు

BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్‌ను మరో ఏడాది పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డులోని ఓ వర్గం ఆయనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుత కాంట్రాక్ట్ 2026 సెప్టెంబర్‌లో ముగియనుంది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనను కొనసాగించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అగార్కర్‌కు మరో ఏడాది గడువు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం సమావేశం అనంతరం తీసుకోనున్నారు. అంతేకాదు.. ఈ బాధ్యతను కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అగార్కర్ అభిప్రాయం కూడా కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! 2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి కొన్ని అద్భుత విజయాలు సాధించింది. భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్లో జట్టు విజయాల్లో సెలక్షన్ కమిటీ పాత్రపై ప్రశంసలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సెలక్షన్ కమిటీలో