
Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..? అద్భుతమైన డీల్స్!
Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..? అద్భుతమైన డీల్స్!
© 2026 telugu.digital

Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..? అద్భుతమైన డీల్స్!

Amazon Festive sale | మళ్లీ వస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఎప్పటి నుంచో తెలుసా..?

అనన్య పాండే, 'చంద్ మేరా దిల్' చిత్రంలో నటించిన బాలీవుడ్ నటి, న్యూయార్క్‌లో జరిగిన us ఓపెన్ 2026 మహిళల ఫైనల్లో పాల్గొనడం ద్వారా ఒక అద్భుతమైన రాత్రిని ఆస్వాదించి

Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లాంచ్ సమయంలో ఈ ఐఫోన్ పాత ఫ్లాగ్షిప్ మోడల్ ఒక్కసారిగా తగ్గింది. ఇంతకన్నా తక్కువ ధరలో ఎలా పొందాలంటే?

భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి అరుదైన కర్ణాటక శాస్త్రీయ సంగీత నేపథ్యంలో రూపొందిన సరికొత్త వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). ఈ ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగా డాటర్ సుష్మిత కొణిదెల ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ‘18 పేజెస్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా.. ఈ చిత్ర బృందం NSR ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సుష్మిత కొణిదెల (Sushmitha Konidela) మాట్లాడుతూ.. ‘‘హిందీలో వచ్చిన ప్రముఖ సిరీస్ 'బందిష్ బ్యాండిట్స్' చూసినప్పుడు చాలా నచ్చింది. దాన్ని కేవలం రీమేక్ చేయకుండా, మన కర్ణాటక సంగీతంలోని లోతైన కల్చర్‌తో, మన తెలుగు మూలాల నుంచి పుట్టిన కథగా తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందని భావించాం. సంగీతంతో రొమాన్స్ చేయగల అనుభవం, మెచ్యూర్డ్ ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యం ఉండటం వల్లే సూర్యప్రతాప్‌ను డైరెక్టర్‌గా ఎంచుకున్నాం. నా గత సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేర్’లో నటించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్‌లతో మళ్లీ పనిచేయడం కుటుంబంతో ఉన్నట్లే అనిపించింది. కథకు తగ్గ స్కోప్ ఉన్నందున ప్రైమ్ వీడియోతో చర్చించి భవిష్యత్తులో తప్పకుండా ‘సీజన్ 2’ కూడా తీసుకొస్తాం’’ అని స్పష్టం చేశారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) మాట్లాడుతూ.. ‘‘ఈ కథ వింటున్నప్పుడు, డైరెక్టర్ ప్రతాప్ చెప్పే విధానం
హాలీవుడ్ ప్రముఖ కథానాయిక, 'వండర్ వుమెన్' ఫేమ్ గాల్ గాడోట్ నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ది రన్నర్' (The Runner) ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా భారతీయ ప్రేక్షకుల కోసం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల డబ్బింగ్ వర్షన్లలో అందుబాటులో ఉండటం విశేషం. గాల్ గాడోట్ క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులోకి తేవడంతో టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. లండన్‌లోని ఓ ప్రముఖ లాయర్ పాత్రలో గాల్ గాడోట్ నటించారు. ఒక రోజు ఉదయం జాగింగ్‌కు వెళ్లిన ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు బెదిరిస్తూ, అతడు చెప్పిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని షరతు విధిస్తాడు. సమయం తక్కువగా ఉండటంతో తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి సాహసాలు చేసింది? కిడ్నాపర్ల ప్లాన్‌ను ఎలా తిప్పికొట్టింది? అనే ఉత్కంఠభరిత అంశాలతో దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీటు అంచున కూర్చోబెట్టేలా ఉన్న స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. గాల్ గాడోట్ గతంలో 'వండర్ వుమెన్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'రెడ్ నోటీస్', 'హార్ట్ ఆఫ్ స్టోన్' వంటి బిగ్ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఒకవైపు తల్లిగా భావోద్వేగాలను పండిస్తూనే, మరోవైపు రేసింగ్ యాక్షన్ సీన్స్‌లో తన నటనతో మెప్పించారు. డెమియన్ లూయిస్, ఆల్ఫ్రెడ్ ఎనోచ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మంచి

ఇటీవల థియేటర్లకు వచ్చిన అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన ప్రముఖ బ్యానర్ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ (Palla Burusu) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రల్లో నటించగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో స్థిరపడి తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి, తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తూ సాగే ఈ కథలో భావోద్వేగాలు అశించినంతగా బలంగా ఉండవు. కానీ శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అమెజాన్


రుత్విక్ - విశాఖ ధీమాన్ జంటగా నటించిన సినిమానే 'రాజా ది రాజా'. ఈ ఇద్దరికీ ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అనిల్ బోయిడపు దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్స్ వైపు నుంచి పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా, ఆగస్టు 21వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.విశాఖపట్నంలో సత్యం (నరేశ్) ఒక డాక్టర్ గా చిన్న క్లినిక్ నడుపుతుంటాడు. భార్య .. కొడుకు 'రాజా' ( రుత్విక్) ఇదే అతని ఫ్యామిలీ. తన కొడుకు రాజా పెద్ద డాక్టర్ గా పేరు తెచ్చుకోవాలనేది ఆయన ఆశ. అయితే రుత్విక్ కి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. ఆ విషయాన్ని తండ్రికి చెబితే ఒప్పుకోడని భావించిన ఆయన, మెడికల్ కాలేజ్ కి వెళ్లి వస్తున్నట్టుగా నటిస్తుంటాడు. ఫ్యాషన్ డిజైనర్ గా జాబ్ సంపాదించి ఆ దిశగా ముందుకు వెళుతుంటాడు. తాను డిజైన్ చేసిన డ్రెస్ లతో ఫ్యాషన్ షోలో పాల్గొనే ఒక అందమైన అమ్మాయి కోసం ఆయన అన్వేషిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి 'ఆద్య' అనే ఒక యువతి తారసపడుతుంది. తన సహాయకురాలైన కుమారితో కలిసి, కొత్తగా ఆమె వైజాగ్ వచ్చిందనే విషయం రాజాకి అర్థమవుతుంది. తాము వచ్చింది 'మహీగఢ్' అనే ప్రాంతం నుంచి అంటూ ఆమె ఒక యువరాణిలా మాట్లాడినప్పటికీ, రాజా పెద్దగా పట్టించుకోడు. 'ఆద్య'ను ఫ్యాషన్ షోకి ఒప్పించాలనే విషయంపైనే అతని దృష్టి ఉంటుంది. ఈ విషయంపై ఆద్యా చుట్టూ తిరుగుతూనే ఆమెపై రాజా మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా అతని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇలాంటి పరిస్థితులలోనే రాజా తనని మోసం చేశాడనే విషయం సత్యానికి తెలుస్తుంది. అతనికి డాక్టర్ కావాలనే ఆలోచన లేదనీ, ఫ్యాషన్ డిజైనర్ గా

కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు. ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో అద్భుతమైన ఫీల్డింగ్‌కు మారుపేరుగా నిలిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ మరోసారి సత్తా చాటాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు. గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ ముగిసేసరికి స్కోరు 17/0. ఈ సమయంలో డ్వైన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్ ఆడాడు. బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్.. బౌండరీ లైన్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి, గాల్లోకి ఎగిరి కేవలం ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అది అంత సులభమైన క్యాచ్ కాదు. బౌండరీ లైన్‌ను తాకకుండా అద్భుతమైన టైమింగ్‌తో బంతిని ఒంటి చేత్తో అందుకున్న ఫిలిప్స్.. వెంటనే తన చేతిని, క్యాచ్‌ను చూసుకుని తానే నమ్మలేనట్లుగా స్పందించాడు. ఫిలిప్స్‌కు ఇలాంటి అద్భుత క్యాచ్‌లు కొత్తేమీ కాదు. ఒంటి చేత్తో, డైవ్ చేస్తూ, గాల్లోకి ఎగిరి అసాధ్యంగా కనిపించే క్యాచ్‌లను కూడా అతడు సునాయాసంగా అందుకుంటుంటాడు. అందుకే అభిమానులు, కామెంటేటర్లు అతడిని ముద్దుగా ‘సూపర్‌మ్యాన్’ అని పిలుస్తుంటారు. CPLలో ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో క్రికెట్ అభిమానులు అతడి ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 112 క్యాచ్‌లు అందుకున్న ఫిలిప్స్.. రనౌట్లు

Glenn Phillips One Handed Catch Video: క్రికెట్లో క్యాచ్‌లు ఎంతో కీలకమైనవి. మ్యాచ్ లను మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాంటి క్యాచ్ లు పట్టేందుకు ఫీల్డర్లు తమ ప్రాణాలను కూడా పణ్ణంగా పెడుతుంటారు. ఈక్రమంలో కొన్ని క్యాచ్‌లు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. పట్టిన ఆటగాడే ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026లో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ అలాంటి అద్భుతమే చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. క్యాచ్ పూర్తయిన తర్వాత ఫిలిప్స్ కూడా కొద్దిసేపు నమ్మలేకపోవడం గమనార్హం. గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ వింత చోటు చేసుకుంది. గయానా తొలుత 186 పరుగులు చేసింది. టార్గెట్ ఛేజింగ్ లో ట్రిన్‌బాగో 17/0తో ఉన్న సమయంలో డ్వేన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్‌గా ఆడాడు. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! బంతి డీప్ మిడ్ వికెట్ వైపు వేగంగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్‌కు అది సిక్సర్‌గా వెళ్లేలా కనిపించింది. అయితే లాస్ట్ మినిట్ లో అతడు కుడివైపు కదులుతూ ఒక్కసారిగా తన కుడి చేతిని గాల్లోకి చాపాడు. అంతే.. గాల్లో దూసుకెళ్తున్న బంతి అతడి చేతిలో పడిపోయింది..! క్యాచ్ అందుకున్న వెంటనే ఫిలిప్స్ ముఖంలో కనిపించిన ఆశ్చర్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాను పట్టిన క్యాచ్‌ను తానే నమ్మలేకపోయినట్లు అతడు కొద్దిసేపు ఆశ్చర్యంగా నిల్చుని చూస్తుండిపోయాడు. క్యాచ్ వీడియోను సీపీఎల్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అభిమానులు ఈ ఫీట్‌ను చూసి ఫిలిప్స్‌ను మరోసారి ‘సూపర్‌మ్యాన్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా పేరు.. A

సెప్టెంబర్ తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాల నుంచి సరికొత్త వెబ్ సిరీస్‌ల వరకు పలు ఆసక్తికరమైన టైటిల్స్ డిజిటల్ స్ట్రీమింగ్కు రానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, రొమాంటిక్ కథలు ఇలా ప్రతి రుచికి తగ్గ కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానుంది. వీకెండ్ ప్లాన్ చేసుకునే ముందు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఏ వెబ్ సిరీస్ బింజ్ వాచ్‌కు బెస్ట్? అన్న వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ జాబితాపై ఓ లుక్ వేయండి. OTT లవర్స్‌కు ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ! 🎬📺 ఈ వారం.. కొత్త ఓటీటీ సినిమాలు (𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞) Manorama Max Ananthan Kaadu (Malayalam) 𝐒𝐞𝐩 𝟐 Jio Hotstar Star Wars: The Mandalorian and Grogu (English) 𝐒𝐞𝐩 𝟐 The Court (Tamil) [Weekly Series] 𝐒𝐞𝐩𝟒 Paramount+ Scary Movie (English) 𝐒𝐞𝐩 𝟑 Sunnxt DC (Tamil, Telugu, Malayalam) - 𝐒𝐞𝐩𝟒 Zee5 Veerabhadruni Rahasyam: S1 Part 2 (Telugu) 𝐒𝐞𝐩𝟒 Sony Liv Unmadham (Malayalam, Tamil, Telugu, Kannada, Hindi) - 𝐒𝐞𝐩𝟒 Apple Tv May Day (English) 𝐒𝐞𝐩𝟒 HBO Max Fuze (English) 𝐒𝐞𝐩𝟒 MUBI Erupcja (English) 𝐒𝐞𝐩𝟒 MGM Plus A Tale Of Two Cities Series 𝐒𝐞𝐩6 Shudder Parasomnia (English) 𝐒𝐞𝐩𝟒 Hulu Signal One (English) 𝐒𝐞𝐩𝟒 Prime Video Confinement (English) Rent 𝐒𝐞𝐩𝟏 I Want Your Sex (English) Rent 𝐒𝐞𝐩𝟏 Just Play Dead (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Wrong Girls (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Runner (English) 𝐒𝐞𝐩 𝟐 Dark Hollow

ప్రస్తుతం ఓటీటీని షేక్ చేస్తున్న ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. భయానక, జానపద కథల ఆధారంగా తెరకెక్కించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి మరాఠీ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతుంది. ఈ చిత్రం కథ, మహారాష్ట్రకు చెందిన జానపద కథలు, రహస్యం, నిధి , భయంల కలయికను చూపిస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరేంటీ... కథేంటీ అనే వివరాలు తెలుసుకుందామా. ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా పేరు 'ఘబడ్కుండ్'. దాగి ఉన్న బంగారం, ఒక భయంకరమైన శక్తి గురించిన పురాణ గాథతో ముడిపడి ఉన్న ఒక రహస్యమైన బావి చుట్టూ దీని కథ తిరుగుతుంది. ఈ బావిలో నిధి ఉందని ఆ గ్రామ ప్రజలకు తెలుసు. అయితే, దానిని పొందడానికి ప్రయత్నించే వారికి ఈ ప్రదేశం ప్రాణాంతకంగా మారుతుంది. ఆ నిధిని కాపాడే అదృశ్య శక్తి కారణంగా బావిలోని రహస్యం మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ చిత్రంలో, దిలీప్ ఒక సాధారణ కుటుంబంలో నివసించే యువకుడు. ఒక సంఘటనలో, అతను అనుకోకుండా ఆ రహస్యమైన బావి వద్దకు చేరుకుంటాడు. అక్కడ, అతను ఒక మహిళ గొంతు విని ప్రమాదంలో పడతాడు. కానీ ఆశ్చర్యకరంగా, అతను ఆ బావి నుండి ప్రాణాలతో బయటపడతాడు. ఈ సంఘటన తర్వాత, అతని పుట్టుకకు, ఆ బావి చరిత్రకు మధ్య ఉన్న సంబంధం వెలుగులోకి రావడం మొదలవుతుంది. అప్పుడే అసలు కథ ఉంటుంది. దిలీప్ ఈ రహస్య నిధికి వారసుడని వెల్లడైన తర్వాత కథ మరింత మలుపులు తిరుగుతుంది. మరోవైపు, ఖాంగ్రీ అనే తాంత్రికుడు కూడా ఈ నిధిపై కన్నేసి ఉంటాడు. పౌర్ణమి రోజున, బావిలోంచి నిధిని బయటకు తీయడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే, ఈ పని కోసం ఒక అమ్మాయిని ఉపయోగించుకోవడానికి కుట్ర పన్నుతారు, ఆ తర్వాత సంఘటనలు భయంకరమైన