తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటుచేసుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో కొద్ది రోజులుగా ఆయన అసహనంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో తనకు అవకాశంగానీ, భవిష్యత్తుగానీ లేదని, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో సమావేశం అనంతరం రాజీనామా చేసే అవకాశం ఉందని అన్నామలై పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలిచిన విషయం తెలిసిందే. ఢిల్లీకి విమానం ఎక్కేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న అన్నామలై విలేకరుల బృందంతో ‘‘దయచేసి వేచి ఉండండి.. మనం రెండు రోజుల్లో కూర్చుని మాట్లాడుకుందాం’’ అని అన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విమానాశ్రయానికి ఆయన వచ్చిన వాహనంపై బీజేపీ జెండా లేదు.జూన్ 4న అన్నామలై పుట్టినరోజు కావడంతో కోయంబత్తూరు, మదురై నగరాల్లో ప్రధాన రహదారులు, వీధుల్లో అన్నామలై ‘2.0 అవతార్’ ‘మా నాయకుడు, రండి మమ్మల్ని నడిపించండి’ వంటి నినాదాలతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేశారు. అన్నామలైకు బీజేపీ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. తన భవిష్యత్తుపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్న అన్నామలై... తనకు సమయం కేటాయించాల్సిందిగా అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కోరారు. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా మాజీ ఐపీఎస్ కలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.తొలుత ఓ ఉద్యమాన్ని ప్రారంభించి, తర్వాత దానిని రాజకీయ వేదికగా మార్చాలనే ఉద్దేశంలో అన్నామలై ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులను ఒకచోటకు చేర్చి, బలమైన స్వచ్ఛంద కార్యకర్తల నెట్‌వర్క్‌ను నిర్మించడమే దీని ఉద్దేశమని పలు వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త ఉద్యమం విభిన్న వృత్తులు, సామాజిక
Annamalai On Bjp News
Latest updates from Telugu Digital news sources.
Samayam Telugu01 Jun, 03:08 pm
ఆగండి కూర్చుని మాట్లాడుకుందాం’ కొత్త పార్టీ ఏర్పాటు ప్రచారంపై అన్నామలై స్పష్టత