
Artificial Intelligence: వ్యాధి రాకముందే రోగాన్ని కనిపెట్టేస్తుందట! ఏఐ చెప్పే ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి!
వయసు పెరుగుతున్న కొద్దీ అప్పుడప్పుడు విషయాలు మర్చిపోవడం సాధారణమే. అయితే జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యంలో కనిపించే మార్పులు కొన్నిసార్లు అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులకు సంకేతంగా ఉండొచ్చు. అల్జీమర్స్లో మెదడులో వ్యాధికి సంబంధించిన మార్పులు స్పష్టమైన లక్షణాలు కనిపించడానికి చాలా సంవత్సరాల ముందే ప్రారంభమయ్యే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ కారణంగానే వ్యాధిని ముందుగానే గుర్తించే మార్గాలపై పరిశోధనలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో కృత్రిమ మేధస్సు (AI) కూడా ఒక ముఖ్యమైన సాధన


