translateexpand_more

Best Lunch Box News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu03 Jun, 06:48 am
హాట్ బాక్స్ కాదు.. ఈ లంచ్ బాక్స్ లో ఫుడ్ ఐదు గంటలైనా వేడి తగ్గదు, ఆఫీస్, స్కూల్

పిల్లల స్కూల్స్ రీ ఓపెన్ అయిపోతున్నాయి. ఈ సమ్మర్ హాలీడేస్ లో మంచి ఇంట్లోనే ఉంటూ.. ఎంజాయ్ చేశారు. ఈ సమ్మర్ లో.. పిల్లలు మనం చేసే ఫుడ్ ని చాలా ఇష్టంగా తిని కొంచెం హెల్దీగా మారతారు. ఇక స్కూల్స్ మొదలైతే.. మళ్లీ వీక్ అవ్వడం మొదలుపెడతారు. స్కూల్ కి పంపిన లంచ్ బాక్స్ తినకుండా వచ్చేస్తారు. వాళ్లకు నచ్చిన ఫుడ్ పెట్టినా కూడా సరిగా తినరు.. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? పొద్దున ఎప్పుడో మీరు వండి బాక్స్ లో పెడితే.. పాపం వాళ్లు ఆరిపోయిన తర్వాత మధ్యాహ్నం తినమంటే ఎలా తినగలరు? పిల్లలే కాదు.. మనం కూడా పొద్దున వండిన ఫుడ్ ని మధ్యాహ్నం ఆఫీసులో ఆరిపోయిన తర్వాత తినాలంటే కష్టంగానే అనిపిస్తుంది. అలా కాకుండా...మనం ఉదయం చేసిన ఫుడ్ ని మధ్యాహ్నం వేడి వేడిగా ఆస్వాదించాలంటే.. లంచ్ బాక్స్ మార్చేయాల్సిందే. ఫుడ్ వేడిగా ఉండాలంటే హాట్ బాక్స్ లో మాత్రమే పెట్టాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాటిలో పెట్టినా మహా అంటే గంట వేడిగా ఉంటుందేమో. కానీ.. ఇప్పుడు మేము చెప్పబోయే లంచ్ బాక్స్ మాత్రం మీరు ఉదయం బాక్స్ పెట్టేటప్పుడు ఫుడ్ ఏ టెంపరేచర్ ఉంటుందో.. మీరు లంచ్ తినే సమయానికి కూడా అంతే ఉంటుంది. ఆ లంచ్ బాక్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం... ఇది మనకు ఆన్ లైన్ చాలా సులభంగా లభిస్తుంది. Vaya Tyffyn పేరుట మార్కెట్ లో ఉంది. ఈ లంచ్ బాక్సులు చూడటానికి మనకు స్టీల్ మెటీరియల్ తోనే ఉంటుంది. కానీ.. ఈ బాక్సులో ఇన్సులేటెడ్ డిజైన్ ఉంటుంది. అందుకే 5 నుంచి 6 గంటలకు వరకు ఆహారం వేడిగా, తాజాగా.. అప్పుడే వండి వడ్డించినట్లు ఉంటుంది. ఇలా టెంపరేచర్ తగ్గకుండా ఉండేందుకు దీనిలో థర్మల్ ఇన్సులేషన్ టెక్నాలజీ ని వాడారు. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. కేవలం వేడి ఆహారాన్ని వేడిగా ఉంచడమే కాదు... చల్లదానిని కూడా చల్లగా ఉంచుతుంది. అంటే.. మనం బాక్స్ లో ఫుడ్ పెట్టేటప్పుడు ఏ టెంపరేచర్ లో ఉంటే.. ఐదు గంటల తర్వాత కూడా అలానే ఉంటుంది. ఈ లంచ్ బాక్స్ లో స్టెయిన్ లెస్ స్టీల్ మూడు బాక్సులు ఉంటాయి. బాక్సు మాత్రమే స్టీల్.. మూత ప్లాస్టిక్ ఉంటుంది. వీటిలో ఒకటి కొంచెం పెద్దగా.. మిగిలిన రెండు చిన్నగా ఉంటాయి. అన్నం, కూర, పెరుగు ఇలా విడివిడిగా పెట్టుకునే విధంగా ఉంటుంది. అంతేకాదు.. ఒక బాక్సును రెండు భాగాలు సపరేట్ చేయడానికి కూడా ఆప్షన్ ఇస్తారు. మనకు అవసరం ఉంటే దానిని వాడుకోవచ్చు. ఈ బాక్సులో మీరు ఎలాంటి ఫుడ్ పెట్టినా లీక్ అవుతుందనే భయమే ఉండదు.మరీ లిక్విడ్స్ కాదులే కానీ.. సెమీ లిక్విడ్స్ మాత్రం ఎలాంటి భయం లేకుండా తీసుకెళ్లొచ్చు. ఇతర లంచ్ బాక్సులతో పోలిస్తే.. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, దీని ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. సుమారు రూ.2,500 నుంచి 3వేల రూపాయల పరిధిలో లభిస్తుంది.