translateexpand_more

Bollywood News News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu01 Jun, 03:32 pm
మాధురి దీక్షిత్ 4వ నెల ప్రెగ్నెంట్.. ఫైనల్ గా ఓపెన్ అయిన హీరోయిన్

Madhuri Dixit :మాధురి దీక్షిత్ పై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రెగ్నెన్సీ రూమర్లకు ఆమె తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్న మాధురి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం ఆమె నటన కాదు..దేవదాస్ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక పాత ప్రచారం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌పై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రెగ్నెన్సీ రూమర్లకు ఆమె తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులను అలరిస్తున్న మాధురి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం ఆమె నటన కాదు.. దేవదాస్ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక పాత ప్రచారం. ఇటీవల కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ టీమ్‌కు చెందిన రుబీనా ఖాన్.. దేవదాస్ సినిమాలోని ప్రసిద్ధ ‘డోలా రే డోలా’ పాట షూటింగ్ సమయంలో మాధురి నాలుగు నెలల గర్భిణిగా ఉన్నారని చెప్పినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అభిమానులు కూడా నిజమేనా అంటూ ఆరా తీశారు. ఈ ప్రచారంపై స్పందించిన మాధురి దీక్షిత్.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తన పెద్ద కుమారుడు అరిన్ 2003లో జన్మించాడని, దేవదాస్ సినిమా అయితే 2002లోనే విడుదలైందని గుర్తు చేశారు. ఈ రెండు తేదీలను చూస్తే ప్రచారం పూర్తిగా తప్పని సులభంగా అర్థమవుతుందని తెలిపారు. అయితే దేవదాస్ షూటింగ్ సమయంలో తాను ఆరోగ్యంగా లేకపోవడం మాత్రం నిజమేనని మాధురి వెల్లడించారు. వరుస ప్రయాణాలు, రాత్రి వేళల్లో షూటింగ్‌లు, ఎక్కువసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ కారణంగా అలసటగా ఉండేదని చెప్పారు. కానీ దానికి ప్రెగ్నెన్సీకి

TV9 Telugu29 May, 10:53 am
షాక్ లో సినీ డైరెక్టర్లు! 66 హార్డ్ డిస్క్ లు మాయం

దర్శకులు జోయా అక్తర్, రీమా కాగ్తీకి ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని వారి ప్రొడక్షన్‌ కంపెనీ ‘టైగర్ బేబీ ఆఫీసులో హార్డ్ డిస్క్‌లు దొంగతనానికి గురయ్యాయి. ఈ చోరీ ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇంకా విడుదల కాని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పెద్ద బ్రాండ్‌లకు సంబంధించిన యాడ్ షూట్స్, డిజిటల్ ఫుటేజ్ ఉన్న 66 హార్డ్ డిస్క్‌లు ఆఫీస్ నుంచి మాయం కావడం అందరినీ షాకయ్యేలా చేసింది. ఈ హార్డ్ డిస్క్‌ల మార్కెట్ విలువే 13 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఒరిజినల్ డేటా గనుక లీక్ అయితే, ఆ నష్టం వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దొంగతనం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.మొత్తం 119 హార్డ్ డిస్క్‌ల ఇన్వెంటరీ ఉండగా, అందులో 66 డిస్క్‌లు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ సాదాసీదా స్టోరేజ్ డివైజ్‌లు కావు, వీటి సామర్థ్యం ఒక్కొక్కటి 16 TB నుంచి ఏకంగా 72 TB వరకు ఉంటుంది. ఈ భారీ స్టోరేజ్ డిస్క్‌లలో షూటింగ్‌కు సంబంధించిన రా ఫుటేజ్, రఫ్ ఎడిట్స్, సీన్ కట్స్, పోస్ట్-ప్రొడక్షన్ మెటీరియల్‌ , గతంలో ఘన విజయం సాధించిన ప్రాజెక్టుల తాలూకు బ్యాకప్ డేటా భద్రపరిచారు. వీటిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సూపర్ హిట్ అయిన ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఘోస్ట్ స్టోరీస్’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఫైల్స్ ఉన్నాయి. అయితే, ఆఫీస్ క్యాబినెట్‌లో భద్రంగా ఉండాల్సిన ఆ డిస్క్‌లను మాయం చేసి, యాజమాన్యానికి అనుమానం రాకుండా ఉండేందుకు దొంగలు వాటి స్థానంలో ఖాళీగా ఉన్న బాక్సులని, కొన్ని పాడైపోయిన డబ్బాలని ఉంచారు. ఈ

Chitrajyothy30 May, 02:29 pm
ఛీఛీ.. సిగ్గు లేదా.. సీనియర్ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో వైరల్

కొత్త కొత్త టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకుపోతోంది అని ఆనందపడాలో.. ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని బాధపడాలో ఎవరికీ అర్ధం కావడం లేదు. కొత్త కొత్త టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకుపోతోంది అని ఆనందపడాలో.. ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని బాధపడాలో ఎవరికీ అర్ధం కావడం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పట్లో రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్యనే రుక్మిణి వసంత్ బికినీ వీడియో రచ్చ రచ్చ చేసింది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక అవార్డు ఫంక్షన్ లో మాధురి బ్లాక్ అండ్ సిల్వర్ డిజైనర్ డ్రెస్ లో మెరిసింది. ఆ డ్రెస్ లో ఆమె క్లివేజ్ చాలా తక్కువ కనిపిస్తుంది. 59 ఏళ్ళ వయస్సులో కూడా ఆమె వన్నె తగ్గని అందం కుర్రాళ్ళను సైతం ఫిదా చేస్తుంది. అయితే కొంతమంది ఆకతాయిలు.. మాధురి డీప్ ఫేక్ వీడియో ని క్రియేట్ చేశారు. ఈ వైరల్ వీడియోలో, మాధురి దీక్షిత్ అత్యంత బోల్డ్ క్లివేజ్ చూపిస్తూ.. బ్లాక్ థై-హై స్లిట్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నట్లు చూపించారు. సాంప్రదాయ మరియు హుందాకైన దుస్తులకు పేరుగాంచిన మాధురి దీక్షిత్ ఇలాంటి దుస్తులలో కనిపించడంతో చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయి, ఆమెను విమర్శించడం ప్రారంభించారు. ఆ తరువాత అది డీప్ ఫేక్ వీడియో అని తెలిసి నెటిజన్స్ మండిపడుతున్నారు. ఛీఛీ సిగ్గు లేదా.. ఒక సీనియర్ నటిపై ఇలాంటి వీడియోలు తయారుచేయడమేంటి.. ఇలాంటి ఆకతాయిలను ఊరికే వదలకూడదు పోలీసులు వారిపై

Zee Telugu24 May, 06:59 am
Jewellery Tradition: బాలీవుడ్‌లో తరాలుగా వస్తున్న సంప్రదాయం.. రేఖ, శ్రీదేవి తర్వాత ఆ నగలు ఐశ్వర్యారాయ్ ఎవరికి ఇవ్వనుంది?

- Jewellery Tradition: బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైన ఆచారం కొనసాగుతోందని సినీ వర్గాల్లో తరచూ మాట్లాడుకుంటూ ఉంటారు. - తమకు ఎంతో ఇష్టమైన జూనియర్ హీరోయిన్‌కు సీనియర్ హీరోయిన్ ఒక ప్రత్యేకమైన జ్యువెలరీని బహుమతిగా ఇవ్వడం ఈ సంప్రదాయం. - ఇది కేవలం నగలు ఇవ్వడం మాత్రమే కాదు, ప్రేమ, అభిమానానికి గుర్తుగా భావిస్తారు.

Samayam Telugu26 May, 03:35 am
రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిళ్ల ‘సమయం తెలుగు’లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. ఆయన గతంలో...

రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిళ్ల ‘సమయం తెలుగు’లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ సినీ రంగానికి చెందిన తాజా వార్తలు, స్టోరీలు రాస్తుంటారు. ఆయన గతంలో ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్,...