translateexpand_more

Carmeni Selvam Ott Telugu News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu03 Jun, 02:30 am
మిడిల్ క్లాస్ జీవితాలు.. అవసరాలకు మించిన ఖర్చులు.. ఓటీటీలోకి వచ్చిన తమిళ సూపర్ హిట్

ఇటీవల థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు వెంటనే ఓటీటీల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హిట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. రామ్ చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘కార్మేని సెల్వం’. ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను సాధించలేకపోయినప్పటికీ, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ఐఎండీబీ (IMDb) లో 7.5 రేటింగ్ సాధించిన ఈ చిత్రం, థియేటర్ రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ సినిమా జూన్ 3, 2026 నుండి అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? అసలు కథేంటంటే ? ఈ సినిమా కథ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి జీవితం చుట్టూ తిరుగుతుంది. సెల్వం (సముద్రఖని) ఒక సంపన్న వ్యాపారవేత్త సంపత్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) దగ్గర కార్ డ్రైవర్‌గా పని చేస్తూ ఉంటాడు. అత్యంత నిజాయితీ గల సగటు వ్యక్తి అయిన సెల్వం, ఆధునిక సమాజంలో వచ్చే మార్పులు, కుటుంబ అవసరాలకు మించిన ఖర్చులు, అత్యాశ కారణంగా ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడనేది కథాంశం. ఒకానొక సందర్భంలో సంపత్‌ను సెల్వం మోసం చేసి విచ్చలవిడిగా అప్పులు చేయడంతో, అతని కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఈ సవాళ్లను అతను ఎలా అధిగమించాడు, తన తప్పును ఎలా తెలుసుకున్నాడు అనేది కళ్లు తెరిపించేలా దర్శకుడు చూపించారు. ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో.. నటీనటుల ప్రతిభసముద్రఖని సాధారణంగా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో మెప్పిస్తుంటారు. కానీ ఈ సినిమాలో లీడ్ రోల్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెన్‌గా జీవించేశారు. అతని నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా.. లక్ష్మీ ప్రియా చంద్రమౌళి, అభినయ, కార్తీక్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో అద్భుతంగా నటించారు. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రం, వీకెండ్‌లో కుటుంబంతో కలిసి చూడదగ్గ ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ఇది. ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్.. ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..