translateexpand_more

Cinema News

Latest updates from Telugu Digital news sources.

Telugu Times01 Jun, 02:20 am
ఆ విష యం నేర్చుకోవాలంటున్న యామి

బాలీవుడ్ నటి యామీ గౌతమ్(Yami Gautam) ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాన్ని సమతూకంగా ముందుకు తీసుకెళ్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇటీవల తల్లి అయిన యామీ, మాతృత్వం తన జీవితంలో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చిందని పేర్కొంది. అయితే ఈ కొత్త బాధ్యత తన సినీ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేసింది. ఫ్యామిలీ లైఫ్ లో వచ్చిన మార్పులను ఆస్వాదిస్తూనే, నటిగా తన టార్గెట్స్ పై అదే స్థాయిలో దృష్టి కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ప్రేక్షకులను ఆకట్టుకునే కథల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఇప్పటివరకు తన కెరీర్‌లో చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న యామీ, మంచి కథలే తన ఎదుగుదలకు ప్రధాన కారణమని అభిప్రాయపడింది. ప్రేక్షకుల మనసులను తాకే కథలు, బలమైన పాత్రలు తనను ఎప్పుడూ ఆకర్షించాయని చెప్పింది. కమర్షియల్ అంశాల కంటే కథలోని భావోద్వేగ బలం, పాత్ర ప్రాధాన్యతకు ఎక్కువ విలువ ఇస్తానని వెల్లడించింది. అందుకే తాను చేసిన అనేక సినిమాలు ప్రేక్షకుల వద్ద ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొంది. అలాగే ప్రతి అవకాశాన్ని అంగీకరించడం కంటే సరైన అవకాశాన్ని ఎంచుకోవడం ముఖ్యమని యామీ అభిప్రాయపడింది. నటిగా ఎదగాలంటే సహనం, స్పష్టమైన నిర్ణయాలు అవసరమని చెప్పింది. ముఖ్యంగా నచ్చని పాత్రలకు నో చెప్పగల ధైర్యం ఉండాలని ఆమె పేర్కొంది. కథ, పాత్ర తనను పూర్తిగా నమ్మించే స్థాయిలో ఉంటేనే సినిమాకు అంగీకరిస్తానని వెల్లడించింది. మాతృత్వం తనలో మరింత పరిపక్వతను తీసుకొచ్చినా, నటిగా తన అభిరుచులు, కథల ఎంపికలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని యామీ గౌతమ్ స్పష్టం చేసింది.

TV9 Telugu31 May, 12:38 pm
స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. పెళ్ళైన వ్యక్తిని ప్రేమించి.. చివరకు 22ఏళ్ల వయసులోనే

తెలుగు సినిమా రంగంలో ఫటాఫట్ జయలక్ష్మి ఒక ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. ఆమె అసలు పేరు నీరజా రెడ్డి, 1958 నవంబర్‌లో చెన్నైలో జన్మించారు ఆమె. జయలక్ష్మి తండ్రి, దశరథరామి రెడ్డి, నెల్లూరుకు చెందిన ప్రముఖ కో-డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే డబ్బింగ్ ఇంచార్జ్. రజినీకాంత్‌కు కూడా ఆయన వాయిస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సినీ వాతావరణంలో పెరిగిన జయలక్ష్మి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆమె నటనా రంగ ప్రవేశానికి ప్రముఖ నటి వాణిశ్రీ ప్రోత్సాహం లభించింది. వాణిశ్రీ ఆమెను ఇద్దరు అమ్మాయిలు చిత్రంలో ఒక పాత్రలో నటించేలా చేశారు. ఆ తర్వాత ఆమె ప్రతిభ ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దృష్టిని ఆకర్షించింది. బాలచందర్ గారి చిత్రాల్లో మెయిన్ క్యారెక్టర్స్ చేయడం ద్వారా జయలక్ష్మి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆమె కేవలం పది సంవత్సరాల వ్యవధిలోనే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 70 చిత్రాల్లో నటించారు. ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే రజినీకాంత్‌తో కలిసి ముల్లు మలరం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆరడిరుందు అరబతు వరై చిత్రంలో రజినీకాంత్ భార్య పాత్రలో ఆమె చేసిన త్యాగపూరిత నటనకు రజినీకాంత్ ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటనను "నన్ను మించిపోయింది" అని రజినీకాంత్ పేర్కొన్నారు. బాలచందర్ దర్శకత్వంలో స్వర్గం నరకం చిత్రంలో ఆమె ఈగోయిస్టిక్, పొసెసివ్ పాత్రలో నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాత్ర సంసారాన్ని స్వర్గం చేసుకోవాలన్నా, నరకం చేసుకోవాలన్నా భార్య చేతిలోనే ఉందనే కాన్సెప్ట్‌ను చూపించింది. అలాగే, సీనియర్ ఎన్టీఆర్ తో యుగపురుషుడు, కృష్ణ గారితో రామ్ రాబర్ట్ రహీం వంటి చిత్రాల్లోనూ

TV9 Telugu25 May, 08:09 am
సినీ రంగం రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో గొప్ప పేరు, అపారమైన ప్రజాదరణ, లక్షలాది అభిమానుల ప్రేమను సంపాదించుకున్నప్పటికీ కొంతమంది నటీమణుల జీవితాలు అత్యంత విషాదకరంగా...

సినీ రంగం రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో గొప్ప పేరు, అపారమైన ప్రజాదరణ, లక్షలాది అభిమానుల ప్రేమను సంపాదించుకున్నప్పటికీ కొంతమంది నటీమణుల జీవితాలు అత్యంత విషాదకరంగా ముగిశాయి. వీరి బాధాకరమైన మరణం యావత్ వినోద ప్రపంచాన్ని కుదిపేస...

TV9 Telugu24 May, 01:31 am
ఈ సినిమా ఉంటది భయ్యా..! సీన్ సీన్‌కు సితారే.. గుండె దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

- కొన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకుట్టుకుంటాయి. - ఈ మధ్యకాలంగా వస్తున్న సినిమాలు ఒక్కసారి చూస్తే మళ్లీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. - కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టావు..