
drop off his sister...అక్కను దిగబెట్టేందుకు వెళుతూ మృత్యుఒడికి..
Met a fatal end while on the way to drop off his sister... తన అక్క, మేనల్లుడును వారింటి వద్ద దింపేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.
© 2026 telugu.digital

Met a fatal end while on the way to drop off his sister... తన అక్క, మేనల్లుడును వారింటి వద్ద దింపేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.
Ongole Young Man Writes News About His Death: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ యువకుడు చేసిన ఘనకార్యంతో అందరూ కంగారుపడ్డాడు. బతికుండగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ ఆన్లైన్ న్యూస్ యాప్‌కు వార్తను పంపించాడు. నిజం అనుకుని వార్తను పబ్లిష్ చేయడంతో అందరూ భయపడ్డారు. ఈ విషయం పోలీసులకు తెలిసి యువకుడి కోసం గాలించారు.. చివరికి అతడు బతికే ఉన్నాడని తెలిసింది. పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నిస్తే.. యువకుడు చెప్పిన సమాధానంతో అందరూ షాకయ్యారు.

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయాన్ని తొలుత పెంపుడు కుక్క (మ్యాక్సీ) గుర్తించిందని ఆళ్ల నాని ఇంటి వాచ్‌మన్ అప్పారావు తెలిపారు.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుల్ జంగం నాని (ఏ3), హెడ్ కానిస్టేబుల్ బాబురావు (ఏ5), సాంబయ్య (ఏ6) తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్లను కొట్టివేసింది.ప్రస్తుతం ఈ నలుగురు రిమాండ్ ఖైదీలుగా వేర్వేరు జైళ్లలో ఉన్నారు. సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో ఉన్నారు. తాజా తీర్పు నేపథ్యంలో వారంతా జైలుకే పరిమితం కానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

Disha Salian Case : దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలిమాన్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సారంగ్ కొత్వాల్, జస్టిస్ రంజిత్ సిన్హా రాజా భోంస్లే ధర్మాసనం 44 పేజీల తీర్పును వెలువరించింది. కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకు కోర్టు అప్పగించింది. 2020 జూన్ 8న ముంబయిలోని మలాడ్‌లో ఓ భవనం 14వ అంతస్తు నుంచి దిశా సాలియన్ కిందపడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తరువాత వారం రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఇంట్లో మరణించడంతో ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, దిశా సాలియన్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి సతీశ్ సాలియన్ గత ఏడాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. దిశా సాలియన్ మృతి కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోర్టు సూచించింది. దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితుడిగా పరిగణించరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు

అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి... బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ మృతి న్యూయార్క్, సెప్టెంబరు 2: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. ఓ 49 ఏళ్ల మహిళ తనతో పాటు బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద సోమవారం వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ఇద్దరిపై ఆమె విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ పియాసెంటి అక్కడికక్కడే మృతిచెందగా.. 68 ఏళ్ల మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకీ దూసుకెళ్లడంతో వారు ఘటనా స్థలంలోనే ఆమెను కాల్చి చంపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు... ముంబై, సెప్టెంబరు 2: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా ఎలా పరిగణిస్తారని పోలీసులను ప్రశ్నించింది. వారి దర్యాప్తు తీరు చూస్తుంటే సమాధానాల కన్నా ఎక్కువ సందేహాలే వ్యక్తమవుతున్నాయని ఆక్షేపించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరమని పేర్కొంటూ 44 పేజీల తీర్పును వెలువరించింది. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్‌లో ఓ నివాస భవనం పైనుంచి పడి దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తర్వాత వారం రోజులకే సుశాంత్‌సింగ్ తన ఇంట్లో మరణించడంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారంటూ కోర్టును ఆశ్రయించిన సతీశ్ సాలియాన్.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగూల్మాన్ని నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజుగా నిలిచారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌ది' అని వివరించారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు. 'వైఎస్సార్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని

Macherla: వైఎస్సార్ 17వ వర్ధంతి - ఘన నివాళులర్పించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వార్తకు సంబంధించిన

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి
ఇంటర్నెట్‌డెస్క్: ప్రకృతి విపత్తుతో నేపాల్ అల్లకల్లోలమైంది. ఆ దేశానికి సరిహద్దులో ఉన్న భారత రాష్ట్రం సిక్కిం (Sikkim)లోనూ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో 40 అత్యంత ప్రమాదకర (High-Hazard) హిమానీనద సరస్సులను జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ గుర్తించడమే అందుకు కారణం. వాటిలో ఏడింటిని ‘హై రిస్క్’ జాబితాలో చేర్చింది. ఆ సరస్సుల్లో కొన్ని 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి బద్దలైతే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిక్కిం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సరస్సుల్లో కొన్నింటిపై శాస్త్రీయ మదింపు జరుగుతోందని ఆ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ తాంబే వెల్లడించారు. సరస్సుల లోతు, నీటి పరిమాణం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అలాగే హిమపాతం, కొండచరియల ముప్పును అంచనా వేస్తామన్నారు. నేపాల్ (Nepal)లో ఆగస్టు 26న హిమానీనద సరస్సు బద్దలు కావడం వల్లే నదులు ఉప్పొంగి, గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే మరణాల సంఖ్య 1100 దాటింది. మరో 4వేల మంది గల్లంతయ్యారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్‌డేను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అభిమాన హీరో జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలనే ఉత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుని, ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. అమలాపురంలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై.. రోళ్ల ప్రేమ్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన పవన్ అభిమానులతో పాటు సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ (Prem Kumar) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న ప్రేమ్ కుమార్, తన అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి సొంత ఊర్లో ఘనంగా నిర్వహించాలని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అమలాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీ బ్యానర్‌ను ఏర్పాటు చేసేందుకు స్నేహితులతో కలిసి సిద్ధమయ్యాడు. బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పైనున్న హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగలడంతో ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అమలాపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద వార్త తెలుసుకున్న
ఇంటర్నెట్‌డెస్క్: ప్రకృతి విపత్తుతో నేపాల్ అల్లకల్లోలమైంది. ఆ దేశానికి సరిహద్దులో ఉన్న భారత రాష్ట్రం సిక్కిం (Sikkim)లోనూ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో 40 అత్యంత ప్రమాదకర (High-Hazard) హిమానీనద సరస్సులను జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ గుర్తించడమే అందుకు కారణం. వాటిలో ఏడింటిని ‘హై రిస్క్’ జాబితాలో చేర్చింది. ఆ సరస్సుల్లో కొన్ని 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి బద్దలైతే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిక్కిం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సరస్సుల్లో కొన్నింటిపై శాస్త్రీయ మదింపు జరుగుతోందని ఆ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ తాంబే వెల్లడించారు. సరస్సుల లోతు, నీటి పరిమాణం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అలాగే హిమపాతం, కొండచరియల ముప్పును అంచనా వేస్తామన్నారు. నేపాల్ (Nepal)లో ఆగస్టు 26న హిమానీనద సరస్సు బద్దలు కావడం వల్లే నదులు ఉప్పొంగి, గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే మరణాల సంఖ్య 1100 దాటింది. మరో 4వేల మంది గల్లంతయ్యారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

చిత్ర పరిశ్రమలో నటీనటులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించి చివరకు దీన స్థితిలో మరణించిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో హాస్య నటి కల్పనా రాయ్ ఒకరు. లేడీ కమెడియన్ గా కల్పనా రాయ్ ఎన్నో సినిమాల్లో నటించారు. 70వ దశకం నుంచే ఆమె కెరీర్ ప్రారంభం అయింది. 400పైగా సినిమాల్లో కల్పనా రాయ్ నటించారు. కమెడియన్ గా తిరుగులేని గుర్తింపు సాధించిన కల్పనా రాయ్ చివరి రోజుల్లో ఎవరూ లేని దీన స్థితిలో అనాథలా మరణించారు. కల్పనా రాయ్ పుట్టుకతో పేదవారు కాదు. కోటీశ్వరుల కుటుంబంలో జన్మించారు. సీనియర్ రచయిత నందం హరిశ్చంద్రరావు ఓ ఇంటర్వ్యూలో కల్పనా రాయ్ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్పనా రాయ్ అచ్చతెలుగు మహిళ. ఆమె కాకినాడలో జన్మించారు. కానీ ఆమె పేరు చివర రాయ్ అని ఉండడం వెనుక ఆసక్తికర కథ ఉంది. పుట్టుకతోనే కల్పనా రాయ్ ధనవంతురాలు. ఆమె తల్లి దండ్రులు ఒళ్ళంతా బంగారం చేయించారు. ఓ కార్యక్రమంలో నటి శారద చిన్న వయసులో ఉన్న కల్పనా రాయ్ ని చూసి నటి అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అభినందించారట. నటిని చేయమని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ కల్పనా రాయ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. దీనితో కల్పనా రాయ్ బంధువులు ఆమె ఆస్తిని కరిగించేశారు. దీనితో ఆమె పేదరికంలోకి నెట్టివేయబడింది. సినిమాల్లోకి వెళ్లి సంపాదించాలని కల్పనా రాయ్ అనుకుంది. నటి శారద సహాయంతో ఆమెకి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు మోహన్ రాయ్ అనే వ్యక్తిని కల్పనా రాయ్ ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే అతడితో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాయ్ అనే పేరు అతడి నుంచి ఆమెకి వచ్చింది. కానీ అతడు కల్పనా రాయ్ ని మోసం చేసి వెళ్ళిపోయాడు. తన బిడ్డని పోషించడం కోసం నటిగా మారింది. జీవితంలో ఎన్ని

అమలాపురంలో విద్యుత్ షాక్‌తో జన సైనికుడి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రేమ్ కుమార్ మృతి కలిచివేసిందన్నారు. అమరావతి, సెప్టెంబర్ 2: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ప్రేమ్‌కుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ.. యువకుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై జనసైనికుడు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యువకుడి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. జీవితం ఎంతో అమూల్యమైనదని పవన్ అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు చేశారు. జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్‌కే దక్కుతుంది: పట్టాభి

ఇటీవల తమ దేశంలో సంభవించిన వరదలకు యూఎస్, చైనా, భారత్‌లే బాధ్యత వహించాలని నేపాల్ చెబుతోంది. ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల తమ దేశంలో సంభవించిన వరదలకు యూఎస్, చైనా, భారత్‌లే బాధ్యత వహించాలని నేపాల్ చెబుతోంది. కర్బన ఉద్గారాలతో భూతాపం పెరిగి తమ దేశంలో ఈ భయానక ఉత్పాతం సంభవించిందని చెబుతోంది. కర్బన ఉద్గారాలు వెదజల్లే దేశాల్లో యూఎస్, చైనా, భారత్‌లో ముందువరుసలో ఉన్నాయని నేపాల్ అంటోంది. కాబట్టి, ఆ మూడు దేశాలు తమకు పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ మూడు దేశాలపైనే ఉందని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ కనాల్ పేర్కొన్నారు. పర్యావరణ మార్పుల్లో నేపాల్ పాత్ర తక్కువే అయినా తాము మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విపత్తులో నష్టపోయిన తాము న్యాయం కోసం, పరిహారం కోసం దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు నేపాల్ ప్రధాని బాలెన్ షా స్వయంగా ఐక్యరాజ్య సమితికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విపత్తు నేపథ్యంలో ఇప్పటికే నేపాల్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. తక్షణ అవసరాల కోసం ఉద్దేశించిన నిధి నుంచి సాయం మంజూరు చేయాలని అభ్యర్థించింది. ఈ నష్టం నుంచి బయటపడేందుకు తమకు 4 నుంచి 5 బిలియన్ డాలర్ల నిధులు అవసరమని నేపాల్ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, నేపాల్ వరదల బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,100 దాటింది. వేల మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. నేపాల్-చైనా టిబెట్ వద్ద మంచుచరియలు విరిగిపడి వరదలు ముంచెత్తినట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఈ విపత్తుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు శాస్త్రపరమైన అధ్యయనాలు మరిన్ని జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘టైమ్స్ స్క్వేర్’లో కత్తులతో దాడి.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ మృతి నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం

Disha Salian Death Case:దిశా సాలియన్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2020లో జరిగిన ఆమె మరణంపై సీబీఐ దర్యాప్తుకు బాంబే హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. దివంగత సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2020లో జరిగిన ఆమె మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో దర్యాప్తు చేయించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను ముంబై పోలీసులు సీబీఐకి అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ రంజిత్‌సిన్హా రాజా భోంస్లే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని, అలాగే దిశా తండ్రి సతీష్ సాలియన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో ఒక వ్యక్తిపై ఆరోపణలు నిర్ధారించడానికి తగిన ఆధారాలు లభించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ దర్యాప్తులో ఎలాంటి నేరం జరగలేదని తేలితే, సీబీఐ సంబంధిత కోర్టులో తగిన నివేదిక సమర్పించవచ్చని తెలిపింది. దిశా సాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ భవనం 12వ అంతస్తు నుంచి కిందపడిపోయి మరణించారు. ఆమె మరణంపై అప్పట్లో ముంబై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెది ఆత్మహత్యగా పోలీసులు పేర్కొన్నారు. అయితే దిశా తండ్రి సతీష్ సాలియన్ ఈ వివరణపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన నిజాలను కొందరు ప్రభావశీల వ్యక్తులను కాపాడేందుకు దాచిపెట్టారని కూడా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దిశా మృతి కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన

Sonu Sood: నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన విధ్వంసం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, వరద నీటి ఆనవాళ్లు, దెబ్బతిన్న ఇళ్లు, కనిపించకుండా పోయిన వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు. ఈ దారుణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తీవ్రంగా చలించిపోయారు. పరిస్థితిని అంచనా వేసేందుకు స్వయంగా నేపాల్‌కు వెళ్లిన ఆయన, బాధితులకు అండగా నిలవడానికి పిలుపునిచ్చారు. అంతేకాదు అందరం కలిసి నేపాల్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సోనూ సూద్ అక్కడి పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లను కోల్పోయిన ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరించారు. బయట నుంచి చూస్తే విపత్తు తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమని, కానీ దగ్గర నుంచి చూస్తే జరిగిన నష్టం ఎంత భారీగా ఉందో తెలుస్తుందని అన్నారు. అందుకే ఈ సమయంలో నేపాల్ ప్రజలకు సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు జరిగిన ప్రాంతంలో నీటి ప్రవాహం ఎంత దూరం వరకు చేరిందో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని సోనూ సూద్ తెలిపారు. తాను నిలబడి ఉన్న ప్రాంతం కూడా అప్పట్లో పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండొచ్చని అన్నారు. నీరు, శిథిలాలు భారీగా ప్రవహించడంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోని శిథిలాల వద్దకు చేరుకోవాల్సి వచ్చిందని, వారం రోజులు దాటినా ఆ ప్రాంతంలో విధ్వంసపు ఆనవాళ్లు అలాగే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు. బాధితులకు ఎలాంటి సహాయం అందించబోతున్నారనే ప్రశ్నకు కూడా సోనూ సూద్ స్పందించారు. తన స్నేహితులు, బృందంలోని సభ్యులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు అత్యవసరంగా ఏం అవసరమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తమను సంప్రదిస్తున్న

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Narayanpet Dj Death: స్నేహితుడు పెళ్లి వేడుకల్లో ఆ యువకుడు అందరిలాగే ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉన్నాడు.. చెవులు చిల్లుపడే డిజె సౌండ్స్ మధ్య స్నేహితులతో కలిసి సందడి చేస్తున్నాడు.. కానీ కాసేపట్లోనే ఆ ఆనందం ఆవిరి అయిపోయింది. డిజె సౌండ్ ల తీవ్రతకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. పోతిరెడ్డిపల్లి కి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ (17) అక్కడే ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చేస్తున్నాడు.. అయితే తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉండడంతో రాత్రి సమయంలో ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లాడు.. వివాహ సంబరాల్లో భాగంగా భారీ శబ్దాలతో డీజేలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే స్నేహితులందరూ కలిసి ఆ డిజె సౌండ్స్ మధ్య అందరూ కలిసి బాగా డాన్స్ చేస్తున్నారు.. అయితే ఇంతలోనే.. డిజె సౌండ్స్ తాకిడికి ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గమనించిన స్నేహితులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. రవితేజ అప్పటికే తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ చేశారు.. చేతికి అందించిన కొడుకు అకాల మరణంతో కానరాని లోకంలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అనుకున్న కొడుకు ఇలా విగత జీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు

ప్రకృతి కంటికి కనిపించని రౌద్రరూపం దాల్చితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేపాల్‌లో వచ్చిన వరదలే నిదర్శనంగా నిలిచాయి. వరదల ధాటికి అతలాకుతలమైన పొరుగు దేశం నేపాల్‌లో బాధితులను పరామర్శించేందుకు రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్ నేరుగా రంగంలోకి దిగారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న త్రిశూలి బజార్ ప్రాంతాన్ని ఆయన పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధితులను కలిసిన ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పొరుగు దేశానికి అండగా నిలుస్తూ భారత్ అందిస్తున్న సహాయాన్ని సోనూసూద్ మనస్ఫూర్తిగా కొనియాడారు.మనసారా మెచ్చుకున్న సోనూసూద్నేపాల్లో విపత్తు తీవ్రత ఊహించని స్థాయిలో ఉందని, అక్కడి ప్రజలు మళ్లీ సాధారణ జీవితానికి రావడానికి చాలా సమయం పడుతుందని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌కి అందిస్తున్న సహాయం నిజంగా అభినందనీయం. నేపాల్ మళ్లీ సొంత కాళ్లపై నిలబడాలంటే ఈ సహాయం ఇలాగే కొనసాగాలి. నేను స్వయంగా ఇక్కడి కుటుంబాలను కలిసిన తర్వాత అర్థమైంది ఏమిటంటే.. ఈ సమస్య కొద్ది వారాల్లోనో, నెలల్లోనో తీరేది కాదు. మనం నిరంతరం అండగా ఉంటేనే వాళ్లు కోలుకోగలరు అని మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. Nepal flash floods: దేవుడిలా వచ్చి 1,643 మంది పిల్లల్ని కాపాడి.. రియల్ హీరో1,127కు చేరిన మృతుల సంఖ్యనేపాల్లో సంభవించిన ఈ జలప్రళయంలో ప్రాణనష్టం ఊహించని రీతిలో ఉంది. నేపాల్ పోలీసుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు మృతుల సంఖ్య ఏకంగా 1,127కు చేరింది. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా, తనహున్, నావల్పరాసి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దొరికిన మృతదేహాల్లో ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగలిగారు. మరికొన్ని మృతదేహాలు సరిహద్దులు దాటి భారత్‌లో కూడా లభ్యమవడం విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది.మృత్యువుకు 30 సెకన్ల దూరం! ఒకే ఒక్క మెసేజ్ 8

Veenavanka: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి! Veenavanka: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం,మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకొని మల్లారెడ్డిపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల సమ్మన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించి గ్రామస్తులకు స్వీట్లు పంచినారు. ఈ సందర్భంగా టిపిసిసి సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పేద ప్రజల కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చి వారి అభివృద్ధికి,పేద ప్రజల ఉన్నతికి వారి జీవితాన్ని అంకితం చేసినారని వారి యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోనెల సమ్మన్న ముదిరాజ్, నిమ్మల సమ్మన్న ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూలం సమ్మన్నగౌడ్,మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి,93 వ బూత్ అధ్యక్షులు పల్లేర్ల కిరణ్,94 వ బూత్ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ ముద్దసాని బిక్షపతి,9వ వార్డ్ సభ్యులు గంధం ప్రశాంత్,డీలర్ కర్రె వెంకట నర్సయ్య, రాయణవేణి చంద్రయ్య, దూలం కిరణ్,మాజీ వార్డ్ సభ్యులు గోనెల సమ్మయ్య,అర్సం నాగేష్, దూలం వెంకటేష్, కర్రె రాజు, కర్రె కుమారస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు! Hyderabad: మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ గారు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత అని కొనియాడారు.. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేసి వ్యవసాయ రంగానికి వైఎస్సార్ గారు కొత్త ఊపిరి పోశారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.. వైద్య, ఇంజనీరింగ్ విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు వైఎస్సార్ గారు అని అన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు అండగా నిలిచి వారి జీవితాల్లో భరోసా నింపిన మహానేత అని కొనియాడారు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంజలి ఘటించారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధిని పుష్పగుచ్ఛాలతో అలంకరించి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానేతను స్మరించుకుంటూ వారు అంజలి ఘటించారు.2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 2009 సెప్టెంబర్ 2న 'రచ్చబండ' కార్యక్రమానికి వెళ్తూ నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణించి 17 ఏళ్లు గడుస్తున్నా, ప్రజలు ఆయన్ను నేటికీ స్మరించుకుంటూనే ఉన్నారు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ భార్య విజయమ్మ కూడా పుష్పగుచ్ఛాలతో ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు. జగన్ భార్య భారతితో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, ఆయన అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి 2009వ సంవత్సరం, సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్టలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారు. ఆయన మరణించి 17 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేశారు

పోలవరం జిల్లా, ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న అనంతరం ఏడేళ్ల బాలిక మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురికావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధితులందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్‌తో ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. మలేరియా రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలోని 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయగా, వాటిని తీసుకున్న తర్వాత పలువురు అనారోగ్యం పాలయ్యారు. ఈ దురదృష్టకర ఘటనలో జమున అనే ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి, మరో 24 మందిని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఇప్పటికే గ్రామానికి చేరుకోగా, విజయవాడ, రాజమండ్రి నుంచి మరిన్ని బృందాలు బయలుదేరాయి.ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, కేవలం ఒక బాలిక మాత్రమే మృతి చెందిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని వారు వెల్లడించారు

చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోర్వెల్ మోటార్‌కు అనుసంధానించిన తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చనేది ప్రాథమికంగా అంచనా వేశామని అధికారులు చెప్పారని అన్నారు. ఈ మేరకు ఎక్స్(X)లో పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.. ఏనుగు మృతి ఘటనపై విచారణ చేపట్టి, నివేదికను సమర్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్ రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు పోస్టు ద్వారా బెదిరింపులేఖ వచ్చింది. 'కరుడుగట్టిన ఉగ్రవాదులు' త్వరలోనే హత్య చేస్తారని లేఖ పంపిన వ్యక్తి హెచ్చరించాడు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాస్వాన్‌కు ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. పోస్ట్ (తపాలా) ద్వారా వచ్చిన ఒక సంతకం లేని లేఖలో, 'కరుడుగట్టిన ఉగ్రవాదులు త్వరలోనే నిన్ను హత్య చేస్తారు' అని హెచ్చరించినట్లు ఆయన కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ లేఖలో రెండు మొబైల్ నంబర్లును కూడా పేర్కొన్నారు. హోం కార్యదర్శికి ఫిర్యాదు.. విచారణకు విజ్ఞప్తి తీవ్రమైన ఈ బెదిరింపు లేఖపై చిరాగ్ పాశ్వాన్ అదనపు ప్రైవేట్ కార్యదర్శి ఆలోక్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అత్యవసర లేఖ రాశారు. బెదిరింపు లేఖ మూలాలు, దాని ప్రామాణికతపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ప్రస్తుతం చిరాగ్ పాస్వాన్‌కు కేంద్ర హోంశాఖ ద్వారా 'Z' కేటగిరీ భద్రత ఉంది. అయితే, ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించి, అవసరమైతే మరింత భద్రతను పెంచాలని హోం కార్యదర్శిని కోరారు. కేంద్రమంత్రి రాబోయే బహిరంగ కార్యక్రమాలు, పర్యటనలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది, లేఖ వెనుక ఎవరున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు

నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకూ 1000 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. సెప్టెంబర్ 1 నాటికి 1,003 కు పైగా మృత దేహాలు లభ్యం అయినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 4 వేల మందికి పైగా గల్లంతైనట్లు తెలిపారు. వరదల ధాటికి ఎనిమిది జిల్లాల్లోనే అధిక సంఖ్యలో తవ్వే కొద్దీ మృతదేహాలు లభ్యం అవుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇప్పటివరకూ 12 వేల మందికిపైగా ప్రజల్ని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ అథారిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.నేపాల్- టిబెట్ సరిహద్దులో భోటేకోశీ నది ఉప్పొంగి వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 26 న సంభవించిన ఈ వరదల కారణంగా నార్త్ అండ్ సెంట్రల్ నేపాల్ లోని పట్టణాలు, గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. అలాగే రోడ్లు మొత్తం ధ్వంసం అయ్యాయి. ఇళ్లు, వాహనాలు, బ్రిడ్జ్ లు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక చిత్వానా జిల్లాలో 321 మృత దేహాలను వెలికి తీశారు. నవాల్ పరాసీ జిల్లాలో 216 మృత దేహాలు, నవాల్ పరాసీ వెస్ట్ జిల్లాలో 170 మృత దేహాలు, నువాకోట్ లో 95, ఘోర్కాలో 65, ధాడింగ్ లో 57, రసువా 41, తనాహున్ లో 38 మృత దేహాలను వెలికి తీసినట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకటించింది. ఇక దాదాపు 4 వేల మందికి పైగా గల్లంతైనట్లు తెలిపింది. వారిలో 583 మంది విదేశీయులు ఉన్నట్లు స్పష్టం చేసింది.ఇక ఇప్పటివరకూ 11,814 మందిని రక్షించారు. వారిలో భారత్ లోని తమిళనాడుకు చెందిన 39 మంది యాత్రికులు కూడా ఉన్నారు. వాళ్లు తిరుప్పూర్ నుంచి మానససరోవర్ యాత్రకు వచ్చారు. ఇక నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిలో 158 మంది భారతీయులను నేపాల్ నుంచి స్వదేశానికి

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరదల్లో తల్లిదండ్రులు గల్లంతైనా.. ఆ బాధను అదిమిపెట్టి ఓ యువతి నీట్ పరీక్ష రాసింది. కైలాస మానసరోవర యాత్ర కోసం వెళ్లిన వందలాది మంది భారతీయులు నేపాల్ వరదల్లో (Nepal floods) గల్లంతయ్యారు. ఈ యాత్రకు వెళ్లిన తన తల్లిదండ్రులు కూడా చిక్కుకుపోయారని తన్వి అనే నీట్ అభ్యర్థి (Medical Aspirant Tanvi) సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు వెంకట్రామ్ అన్నందేవర, అనఘ 67 మందితో కూడిన బృందంతో కలిసి కైలాస యాత్రకు వెళ్లినట్లు తెలిపారు. వారు నేపాల్‌లోని ఇమిగ్రేషన్ సెంటర్ వద్ద ఉన్నప్పుడు చివరిసారిగా తనతో మాట్లాడారని తెలిపింది. ప్రస్తుతం వారు తన పక్కన లేకపోయినా.. వారి కోరిక మేరకు నీట్ పరీక్ష (NEET PG 2026) రాశానని చెప్పారు. ‘మూడు గంటల పరీక్షా సమయంలో దాదాపు సగం సమయం కన్నీళ్లతోనే గడిపాను. అడ్మిట్ కార్డుపై ఉన్న ఫొటోను నా తండ్రే తీశారు. పరీక్ష రాస్తున్నప్పుడు అది కనిపించి, ఆయన పదే పదే గుర్తుకు రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాను. మానసికంగా ఎంతో సంఘర్షణకు గురైనప్పటికీ.. అమ్మానాన్మ కోరిక మేరకు ఈ పరీక్ష తప్పకుండా రాయాలని నిర్ణయించుకున్నా. నా భవిష్యత్తు కోసం వారు ఎన్నో కలలు కన్నారు. నేను ఏ పరీక్షకు వెళ్లినా.. అందులో మంచి మార్కులు సాధించాలని కోరుతూ అమ్మ ప్రతిసారి పెరుగులో పంచదార కలిపి తినిపించేది. కానీ ఇప్పుడు ఆమె నా పక్కన లేకపోవడం నన్ను మరింత కుంగదీసింది. వారు సురక్షితంగా తిరిగి వస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నా’ అని తన్వి కన్నీరు పెట్టుకున్నారు. ఇదీ చదవండి: అమ్మో 26 వ తారీఖు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత

ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాల మీదకు వస్తుంది. ఇంటర్నెట్ డెస్క్: ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాల మీదకు వస్తుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బంక్‌లో నిలిపి ఉంచిన కారులో.. సీఎన్జీని పైపు ద్వారా నింపుతున్నారు. కారుకు ఆ పైపును పెట్టి వదిలేశారు. బంకులోని వారంతా ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా కారుకు పెట్టి ఉన్న సీఎస్జీ పైపు ఊడిపోయింది. అందులోని గ్యాస్ ఉద్ధృతికి ఆ పైప్ వాయువేగంతో కదిలింది. ఈ పరిణామాన్ని అక్కడ ఉన్న వారెవరూ అసలు ఊహించలేదు. అంతలో అక్కడే ఉన్న వ్యక్తిని ఆ గ్యాస్ పైప్ హ్యాండ్లర్ బలంగా తగిలింది. దీంతో అతడు కింద పడిపోయాడు. అక్కడి వారంతా భయంతో తలోదిక్కు పరుగులు తీశారు. ఓ వ్యక్తి మాత్రం ధైర్యం చేసి.. సీఎన్జీని ఆఫ్ చేశాడు. అనంతరం గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ మరణించాడు. అతడి పేరు తుషార్ ఖుమ్రీ. ఈ ఘటన ఆగస్ట్ 27వ తేదీన జార్ఖండ్‌లోని జంషెడుపూర్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సహజ వాయువుతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు. సీఎన్జీ పైపు అలా వదిలివేయకుండా ఉండి ఉంటే.. ఈ ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరద విలయం (Nepal floods)లో ఇంకా వేలమంది ఆచూకీ తెలియడం లేదు. భవన శిథిలాలు, పేరుకుపోయిన బురద కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. వరద ధాటికి శిథిలమైన నువాకోట్‌లోని ఓ భవనంలో 23 మృతదేహాలు లభ్యమైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అవన్నీ కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో ఖననం చేయడానికి తరలించారు. నేపాల్ చైనా సరిహద్దులో ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల సంఖ్య 978కు చేరింది. నేపాల్, టిబెట్లలో కలిపి మొత్తం 4,471 మంది గల్లంతయ్యారు. భారత్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా సహా ఇతర దేశాల నుంచి అందిన మద్దతుతో నేపాల్ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రసువా, నువాకోట్లలోని సుమారు 6 సొరంగాలు, 11 ప్రాజెక్టులలో 930 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ఆయా ప్రాంతాలను చేరుకునేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సొరంగం చుట్టూ పేరుకుపోయిన దట్టమైన బురద, ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుల జాడ కోసం వెతుకుతున్న వేలాది మంది ప్రజలతో ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ఆసుపత్రులలో ఒకే మృతదేహాన్ని తమ బంధువుగా పేర్కొంటూ పలు కుటుంబాలు వస్తుండడంతో మృతదేహాల గుర్తింపులో జాప్యం జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి సమస్యలు నివారించడానికి అన్ని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నేపాల్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని గండక్ నదిలోకి 13 మృతదేహాలు కొట్టుకువచ్చినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. వాటిని తిరిగి ఆ దేశానికి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత

దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న గొడవ.. భర్త ప్రాణాలను తీసింది. క్షణికావేశంలో ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అయింది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. ఈ దాడిలో భర్త మృతి చెందగా.. భార్య జైలు ఊసలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో ఆ చిన్న పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.ఏం జరిగిందంటే..? దిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో వినయ్ గుప్తా, రేఖ దంపతులు కాపురం ఉంటున్నారు. మూడున్నరేళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా ఈ జంటకు ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నారు. వినయ్ అడోబ్ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన వార్షిక ప్యాకేజీ రూ. 60 లక్షలుగా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా వినయ్- రేఖల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో రేఖ తరఫు బంధువులు వినయ్ ను చంపేస్తామంటూ వార్నింగ్ లు ఇస్తూ వచ్చారు. ఇక తాజాగా మరోసారి వినయ్- రేఖల మధ్య గొడవ జరిగింది. తమ పిల్లలకు మెడిసిన్ ఇచ్చే విషయంలో వినయ్, రేఖా మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన భర్త వినయ్ గుప్తా.. భార్య రేఖపై గట్టిగా అరిచాడు.నా మీదే అరుస్తావా..? అంటూ భర్తపై కోపం పెంచుకున్న రేఖ అక్కడినుంచి వెళ్లిపోయింది. 10 నిమిషాల తర్వాత తన కుటుంబ సభ్యులను తీసుకొని అత్తారింటికి వచ్చింది. మా అక్కపై ఎలా అరుస్తావ్ అంటూ రేఖా సోదరులు (ఇద్దరు) వినయ్‌పై దాడి చేశారు. అనంతరం రేఖా తండ్రితో పాటు ఆమె మేనమామ సైతం వినయ్‌ని చుట్టుముట్టి ఎటాక్ చేశారు. వినయ్ కుటుంబ సభ్యులు అడ్డురాగా వారిని తోసేసి మరీ అతడ్ని దారుణంగా కొట్టి, గొంతు నులిమి.. గుండెపై తన్నారు.ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వినయ్ ను

తెలుగు చిత్ర పరిశ్రమలో 'మహానటి' సావిత్రి తర్వాత అంతటి గౌరవం, కీర్తి సంపాదించుకున్న నటి సౌందర్య. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతో ఆమె నటించారు. తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగారు. గ్లామర్ కి దూరంగా ఉంటూ చీరకట్టుతో కనిపించి ఆ చీరకే అందాన్ని తీసుకొచ్చారు. 2004లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణం చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. సౌందర్య నటించిన చివరి సూపర్ హిట్ సినిమా వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'సీతయ్య' (2003). ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ హీరోగా నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది. దురదృష్టవశాత్తు, ఈ సినిమా విడుదలైన కొద్ది నెలలకే సౌందర్య ప్రమాదంలో మరణించారు. విధి విచిత్రమో ఏమో గానీ, 'సీతయ్య' చిత్ర హీరో నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు విడిచారు. 2018లో నెల్లూరు జిల్లాలో ఒక పెళ్లికి వెళ్తుండగా, నల్గొండ జిల్లా సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరికృష్ణ మరణించారు. ఒకే సినిమాలో జంటగా నటించిన హీరో, హీరోయిన్ ఇద్దరూ వేర్వేరు ప్రమాదాల్లో మరణించడం నిజంగా ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయం. సౌందర్య, హరికృష్ణ ఇద్దరూ ఈ రోజు మన మధ్య లేరు. హరికృష్ణ.. జూ ఎన్టీఆర్, కళ్యాణ్‌లకు తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ కొడుకు. అనే విషయం తెలిసిందే. భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారి నటన, చిరునవ్వు, మంచి మనసుతో కోట్లాది అభిమానుల గుండెల్లో సౌందర్య, హరికృష్ణ ఎప్పటికీ జీవించే ఉంటారు. సౌందర్య `సీతయ్య` తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది. అందులో `స్వేతనాగు`, ` ప్రేమ దొంగ` చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆడలేదు. అదే సమయంలో మోహన్ బాబుతో `శివ శంకర్`, `నర్తనశాల` చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ జరిగే సమయంలోనే ఆమె కన్నుమూయడం అత్యంత బాధాకరం

దిగ్గజ నటి షావుకారు జానకి (Sowcar Janaki) మృతి పట్ల యావత్ సినీ పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. షావుకారు జానకి పార్థివదేహాన్ని తమిళనాడు, తేనాంపేటలో ఉన్న ఆమె స్వగృహంలో శనివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం వుంచి, సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నామని షావుకారు జానకి మనవరాలు, నటి వైష్ణవి భర్త అరవింద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. చెరగని ముద్ర: సీఎం విజయ్ తనదైన ప్రత్యేక నటనతో తరతరాలుగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి షావుకారు జానకి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురయ్యానని ముఖ్యమంత్రి విజయ్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సినీ పరిశ్రమలో 70 యేళ్ళకుపైగా లెక్కలేనన్ని పాత్రలకు జీవం పోసిన ఆమె కళాత్మక ప్రస్థానం కూడా ప్రశంసనీయం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషా చిత్రాల్లో నటించి పద్మశ్రీ, కలైమామణి, నంది పురస్కారాలతోపాటు అనేకఅవార్డులు అందుకున్న షావుకారు జానకి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. జానకి మరణంతో దుఃఖసాగరంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, చిత్రపరిశ్రమకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు భగవంతుని పాదాల చెంత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని సీఎం విజయ్ విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఒక శకం ముగిసింది: టీఎఫ్ఏపీఏ షావుకారు జానకి మృతిపట్ల తమిళ చిత్ర యాక్టివ్ నిర్మాతల సంఘం (టీఎఫ్ఏపీఏ) కార్యవర్గం, సభ్యులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. భారతీయ చిత్రపరిశ్రమలోని గొప్ప, అత్యంత గౌరవనీయ నటీమణుల్లో ఒకరైన షావుకారు జానకి మృతి తీవ్ర విచారాన్ని కలిగించింది. ఏడు దశాబ్దాలకు పైగా తన అపారమైన నటనతో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రపరిశ్రమలను సుసంపన్నం

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ యువతిని కారు ఢీకొట్టడంతో అమె ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. ప్రమాద సమయంలో ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ఆ కారు నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదంపై తాజాగా రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ స్పందించారు. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందడం తీవ్ర విషాదకరమని పేర్కొంటూ, మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడు సంజుష్ మానవతా దృక్పథంతో వ్యవహరించి, తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించాడని ఎంపీ తెలిపారు. అనంతరం పోలీసులకు స్వయంగా ప్రమాదం గురించి సమాచారం అందించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వారికి వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజుష్‌కు మూడు వేర్వేరు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షలన్నింటిలోనూ ఫలితాలు నెగెటివ్‌గా వచ్చినట్లు ఎంపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు అధికారులకు తన కుమారుడు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో తాము ఎలాంటి విషయాన్ని దాచడం లేదని, చట్టపరమైన ప్రక్రియల నుంచి తప్పించుకునే ఉద్దేశం గానీ ప్రయత్నం గానీ తమకు లేదని ఎంపీ లింగమనేని రమేష్ స్పష్టం చేశారు. పోలీసుల నిష్పక్షపాత దర్యాప్తు ద్వారా వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 16 మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 26 ఏళ్ల భారతి ముఖి ఇనార్బిట్ మాల్లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. అయితే భారతి తన ఫ్రెండ్‌తో కలిసి లంచ్ తెచ్చుకుని రోడ్డు దాటే క్రమంలో అటుగా వేగంగా వచ్చిన ఓ లగ్జరీ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా
iPhone EMI Family Tragedy : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కొండపైకి ఎక్కిన కొడుకు చనిపోతానంటూ రచ్చ చేయడంతో.. కాపాడేందుకు వెళ్లి తండ్రి సైతం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కొడుకు, భర్త చనిపోవడం చూడలేక మహిళ కూడా కొండ పైనుంచి దూకి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురు మృతికి కారణం.. ఐఫోన్ ఈఎమ్ఐ కట్టే విషయంలో గొడవలు తలెత్తడమేనని తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.అసలేం జరిగిందంటే..?పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శంభాజీనగర్‌లోని తిస్గావ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల కునాల్ అనే యువకుడు ఇటీవల ఎంతో ఇష్టపడి ఓ ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఆ ఫోన్‌కు సంబంధించిన ఈఎంఐ వాయిదాలు చెల్లించడానికి అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఇంట్లో తండ్రి మురళీధర్ చాంద్గుడేను డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలోనే ఈఎంఐ చెల్లింపుపై తండ్రీకొడుకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్.. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కోపంతో ఇంట్లోంచి బయటకు వచ్చి, వాలూజ్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు.కొడుకు కొండపైకి వెళ్లడం గమనించిన తల్లిదండ్రులు మురళీధర్, సంగీత వెంటనే అతడిని అనుసరిస్తూ అక్కడికి చేరుకున్నారు. స్థానిక మాజీ సర్పంచ్ సంజయ్ జాధవ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు కూడా కొండ వద్దకు చేరుకుని యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. "నీకు ఐఫోన్ 15 ప్రో కూడా కొనిస్తాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీ తల్లి కోసం అయినా కిందకు దిగి రా" అని దాదాపు మూడు గంటల పాటు అక్కడున్న వారంతా వేడుకున్నారు. అయినా కునాల్ మాత్రం "చావడమే నాకు ఉన్న ఏకైక మార్గం" అని భీష్మించుకూర్చున్నాడు.క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయిన కుటుంబం..!మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పరిస్థితి చేయిదాటిపోతుండటంతో.. తండ్రి మురళీధర్ ధైర్యం చేసి కునాల్ నిలబడి

ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి (94) అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శనివారం ఉదయం నుంచి అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని నివాసంలో ఉంచి, మధ్యాహ్నం అనంతరం అంతిమ సంస్కారాలను పూర్తి చేయనున్నారు.వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1931 డిసెంబర్ 12న జన్మించిన ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. 'షావుకారు' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమెకు, ఆ సినిమా పేరే ఇంటిపేరుగా స్థిరపడిపోయింది.దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి ఆమె తనదైన ముద్ర వేశారు. జానకి మృతి పట్ల చిరంజీవి, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్, విష్ణు మంచు వంటి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమెకు ముగ్గురు సంతానం, నలుగురు మనుమలు, నలుగురు మునిమనుమలు ఉన్నారు

మహారాష్ట్రలో పెను విషాద చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన కుమారుడిని కాపాడబోయి తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ఖవ్దా కొండపై నుంచి లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.దేవలాయ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు శుక్రవారం ఖవ్దా కొండ అంచుకు చేరుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. సుమారు మూడు గంటల పాటు కొండ అంచునే ఉండిపోయి, కిందకు దూకేస్తానంటూ హెచ్చరించాడు. సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు, గ్రామస్థులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అతడిని వారించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కుమారుడిని సురక్షితంగా వెనక్కి లాగే క్రమంలో తండ్రి కొండపైకి వెళ్లగా, ప్రమాదవశాత్తు ఇద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. కళ్లెదుటే భర్త, కుమారుడు లోయలో పడిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లి కూడా క్షణాల్లోనే కొండపై నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ ఈ దుర్ఘటనను అడ్డుకోలేకపోయారు. గంటల తరబడి సాగిన ఈ ఉదంతాన్ని కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు
ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానకి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి శ్రీమతి జానకి గారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారు. శ్రీమతి షావుకారు జానకి గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ ఒక్క సీన్ వల్లే చాలా మంది నిర్మాతలు 'అర్జున్‌రెడ్డి' స్క్రిప్ట్‌ను రిజెక్ట్ చేశారు.! తెలంగాణ ప్రభుత్వం కొత్త సినిమా విధానం: చిన్న సినిమాలు, సినీ కార్మికులకు బిగ్ రిలీఫ్!

ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొంటూ, శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.'షావుకారు' చిత్రంతో ప్రారంభమైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా చిరంజీవి స్మరించుకున్నారు. సుమారు ఏడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ తదితర భాషల్లో వైవిధ్యభరితమైన పాత్రలకు తన సహజ నటనతో ప్రాణం పోశారని కొనియాడారు. ప్రేక్షకుల హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసిన గొప్ప నటి అని అభివర్ణించారు."భారతీయ చిత్ర పరిశ్రమకు షావుకారు జానకి గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అసంఖ్యాక అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

భారతీయ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో ఏడు దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి కన్నుమూశారు. ఆమె మరణవార్త పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైన సందేశాన్ని పోస్ట్ చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది" అంటూ ఆమె ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. "వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి." అంటూ చిరంజీవి నివాళులర్పించారు. యష్ ‘టాక్సిక్’ మూవీకి షాక్ ఇచ్చిన సెన్సార్.. రన్ టైమ్ ఎంతంటే? నయనతార మూవీకి రికార్డు డీల్.. రూ.100 కోట్ల ప్రాజెక్ట్‌కి మైండ్ బ్లాకింగ్ ఓటీటీ రేట్!

భారతీయ సినీ రంగాన్ని ఏడు దశాబ్దాలకు పైగా తన అసాధారణమైన అభినయంతో ఏలిన మహానటి, పద్మశ్రీ షావుకారు జానకి తుదిశ్వాస విడిచారనే వార్త వినగానే మొత్తం చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ చేదు వార్త తెలిసి నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జానకి గారి మరణం పట్ల ఆయన భావోద్వేగంగా స్పందిస్తూ ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. "మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాన్నగారు (ఎన్టీఆర్) హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. " అని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, నందమూరి కుటుంబానికి చెందిన ఎన్.ఏ.టి. (N.A.T.) బ్యానర్ నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కూడా జానకి కీలక పాత్ర పోషించారు. ఇక మరో ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య బయటపెట్టారు. "పాండురంగ మహాత్మ్యం నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ - రహీమ్, వేములవాడ భీమకవి" చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది." అని బాలకృష్ణ అన్నారు. మన దేశంలోనే 75 ఏళ్ల సుదీర్ఘమైన నటనా ప్రస్థానాన్ని చూసిన ఏకైక నటి బహుశా షావుకారు జానకి గారు మాత్రమే అయి ఉంటారని బాలయ్య అభిప్రాయపడ్డారు. అంతటి సుదీర్ఘ నటనా జీవితంలో ఎన్నెన్నో మర్చిపోలేని పాత్రలతో కోట్లాది మంది ప్రజల హృదయాలను మెప్పించారని కొనియాడారు. "ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు

మరో దిగ్గజ సినీతార నింగికెగిసింది. దశాబ్దాల పాటు అభిమానులను మెప్పించిన అలనాటి కథానాయిక కథ ఇక ముగిసింది. దాదాపు 400లకు పైగా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన నాట్య మయూరి ఇక సెలవు తీసుకుంది. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ తుదిశ్వాస విడిచింది. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆమె శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఈ విషాద సమయంలో జానకి గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నారు. నంది అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన తొలి సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారనే టాపిక్ ఆసక్తిగా మారింది. షావుకారు జానకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది షావుకారు మూవీనే. అందుకే ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ మూవీకి గానూ జానకికి రూ.2500 రూపాయలు ఇచ్చారని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అప్పట్లో ఆర్థికంగా చితికిపోతున్న రోజుల్లో నాకు రెండన్నర్ర లక్షలుగా కనపడిందని జానకి పేర్కొంది. ఇది నాకు ఓ వరంలాగా అనిపించిందని జానకి వెల్లడించింది. హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) షావుకారు జానకి మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి ప్రముఖ నటి షావుకారు జానకి లాస్ట్ ఇంటర్వ్యూ సీమ అంటే ఇంత ద్వేషమా రేవంత్ కోసం బాబు తలొంచాడు.. రాయలసీమ కరువుకు బాబే కారణం సోషల్ మీడియాలో మోదీ హవా.. కేంద్ర మంత్రులకు ర్యాంకింగ్స్ రష్యా సీక్రెట్ ఆపరేషన్ ఒక్క టీ... టాప్ స్పై హతం స్టోరీ వింటే

తెలుగు, తమిళ చిత్రసీమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నటి 'షావుకారు' జానకి (94) మరణవార్తపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.విలక్షణమైన పాత్రలతో చెరగని సంతకం చేసిన జానకి గారి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురిచేసిందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సుదీర్ఘ సినీ ప్రయాణం, వెండితెరపై ఆమె జీవం పోసిన విలక్షణమైన పాత్రలు తరతరాల సినీ ప్రేమికుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా నిలిచిపోతాయని కొనియాడారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చెన్నై, ఆగస్టు 21: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 400పైగా సినిమాల్లో జానకి నటించారు. 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో షావుకారు జానకి జన్మించారు

భారతీయ సినీ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి శుక్రవారం ఆగస్టు 21న కన్నుమూశారు. 94 ఏళ్ల వయసు కలిగిన ఆమె చెన్నైలోని కావేరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె గత కొన్ని రోజులుగా వయోభారంతో కూడిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం రోజున ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను కావేరి హాస్పిటల్‌కు తరలించారు. ఐసియులో తీవ్ర నిఘాలో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ వార్త తెలియగానే దక్షిణ భారత సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు మరియు సినీ ప్రముఖుల నివాళుల కోసం ఆమె భౌతికకాయాన్ని తేనాంపేటలోని సెనోటాఫ్ రోడ్ నివాసంలో ఉంచారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన జానకి 1950లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకారు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ మొదటి చిత్ర విజయం ఆమె పేరు ముందు షావుకారు అనే శాశ్వత గుర్తింపును తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించి మెప్పించారు. 300కి పైగా నాటకాల్లో కూడా నటించి తన ప్రతిభను చాటుకున్నారు. కన్యాశుల్కం, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ శివ, ఇది కథ కాదు, తిల్లు ముల్లు, సంసారం ఒక చదరంగం, హే రామ్ వంటి చిత్రాలు సినీ చరిత్రలో నిలిచిపోతాయి. 2023లో వచ్చిన అన్ని మంచి శకునములే చిత్రంలో కూడా ఆమె నటించారు. భారత ప్రభుత్వం ఆమె సేవలకుగాను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆమె మృతి దక్షిణ భారత సినిమా రంగానికి తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఏడు దశాబ్దాల పాటు తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఒక మహానటి ప్రస్థానం ముగిసింది. ఆమె అందించిన సేవలు

ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో ఒక కారు రెండు రోజులుగా పార్క్ చేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వాహనం నుంచి దుర్వాసన రావడంతో అనుమానం మరింత పెరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును పరిశీలించిన పోలీసులు డిక్కీ తెరిచి చూడగా అందులో మూటకట్టిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మృతురాలు గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించినట్లు సమాచారం. వాహనం మానసకు పరిచయమైన వినోద్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాలు వినోద్ వైపు మళ్లాయి. మృతదేహం లభ్యమైన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మానసతో తనకు పరిచయం ఉందని, ఆమెతో కలిసి కరీంనగర్‌లోని ఓ గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ వచ్చి నోటి నుంచి నురగలు రావడంతో ఆమె మృతి చెందినట్లు వినోద్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. మానస మృతి చెందడంతో భయపడిపోయిన తాను మృతదేహాన్ని అక్కడే ఉంచకుండా కారులో తీసుకెళ్లి ఎల్కతుర్తి వద్ద వదిలి వెళ్లినట్లు వినోద్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వాంగ్మూలం నిజమేనా? ఘటనకు సంబంధించి మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఎల్కతుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానస మృతి చెందిన పరిస్థితులు, ఆమె చివరిసారిగా ఎవరితో ఉంది, కారు ఎక్కడి నుంచి వచ్చింది, మృతదేహాన్ని ఎల్కతుర్తికి ఎందుకు తీసుకువచ్చారు వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. వినోద్ చెప్పిన విషయాలను ఇతర ఆధారాలతో సరిపోల్చే పనిలో ఉన్నారు. మృతదేహానికి సంబంధించిన వైద్య, ఫోరెన్సిక్ వివరాలు కూడా దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెరగని గుర్తింపును అందించిన నటీమనుల్లో ఒకరు, ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత 'షావుకారు' జానకి (94) మరణించారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మరణంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆమె 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించారు. చిన్నతనంలోనే రేడియో నాటికల ద్వారా కళారంగంలో ప్రవేశించిన ఆమె.. తన టాలెంట్ తో మంచి గుర్తింపు సాధించింది. 1950లో ప్రముఖ దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన 'షావుకారు' చిత్రంతో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సరసన హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో 'షావుకారు' అనేది ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఒక్క సినిమాతోనే 'షావుకారు జానకి'గా సినీ ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు. సుదీర్ఘమైన సినిమా ప్రయాణం చేసిన అరుదైన హీరోయిన్లలో .. షావుకారు జానకి ఒకరు.దాదాపు 70 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేసన్, జెమిని గణేసన్, ఎంజీఆర్, రాజ్‌కుమార్ వంటి దిగ్గజ నటులందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. షావుకారు, కన్యాశుల్కం, రోజులు మారాయి, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, ఉయ్యాల జంపాల, అక్కచెల్లెళ్లు, దేవుడు చేసిన మనుషులు, తాయారమ్మ బంగారయ్య, బడిపంతులు వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు ఆమె నటనా పటిమకు నిదర్శనాలు. పౌరాణిక, సాంఘిక, హాస్య, సెంటిమెంట్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా జీవించడం ఆమె నైజం. వయసు పెరిగిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, బామ్మ పాత్రల్లోనూ మెప్పించారు. 2020లో వచ్చిన 'బిస్కోత్' చిత్రంలో ఆమె