translateexpand_more

Digital Eye Strain News

Latest updates from Telugu Digital news sources.

Eenadu01 Jun, 03:26 pm
కళ్లు పొడిబారకుండా

కళ్లు మంటగా అనిపించడం, దురద పెట్టడం, ఎర్రగా మారడం, మసకబారడం, మూసుకుపోవడం, ఉబ్బడం, కన్నీళ్లు రాకపోవడం... ఇవన్నీ కళ్లు పొడిబారుతున్నాయని (డ్రై ఐ సిండ్రోమ్) తెలిపే లక్షణాలు. ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని కంటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కళ్లు మంటగా అనిపించడం, దురద పెట్టడం, ఎర్రగా మారడం, మసకబారడం, మూసుకుపోవడం, ఉబ్బడం, కన్నీళ్లు రాకపోవడం... ఇవన్నీ కళ్లు పొడిబారుతున్నాయని (డ్రై ఐ సిండ్రోమ్) తెలిపే లక్షణాలు. ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని కంటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే దీర్ఘకాలంలో మరిన్ని కంటి సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కళ్లు పొడిబారడానికి చాలా కారణాలున్నాయి. విటమిన్‌-ఏ లోపించడం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌, కంప్యూటర్లు/మొబైల్స్‌/ టీవీ ముందు ఎక్కువసేపు గడపడం, వివిధ రకాల ఎలర్జీలు, వృద్ధాప్యం, దుమ్ము, ధూళి తదితర కారణాల వల్ల కళ్లు పొడిబారతాయట. ఇక కంటి ఆరోగ్యంలో లాక్రిమల్‌ గ్రంథిది ప్రధాన పాత్ర. దీని నుంచి ఉత్పత్తయ్యే ద్రవాలే ఎప్పటికప్పుడు కళ్లను శుభ్రపరచి కాపాడుతుంటాయి. అయితే కళ్లు పొడిబారినప్పుడు కంటి ఉపరితలం డీహైడ్రేటెడ్‌గా మారుతుంది. చికాకు, దురద వంటివి ఇబ్బంది పెడతాయి. ఇక చాలామంది కళ్లకు వేసుకునే మేకప్‌ను తొలగించుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. ఇది కూడా కళ్లు పొడిబారడానికి కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ⚛ కంప్యూటర్లు/మొబైల్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు చాలామంది కనురెప్ప వేయకుండా కళ్లు పెద్దవి చేసి మరీ స్ర్కీన్‌ వైపు చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల కళ్లు పొడిబారి, బాగా మంట పెడతాయి. అందుకే వీటికి సాధ్యమైనంత దూరంగా ఉంటూనే.. ఉపయోగిస్తున్నప్పుడూ తరచుగా రెప్పలు వాల్చుతూ ఉండాలి. ⚛ ల్యాప్‌టాప్స్‌/కంప్యూటర్లు వంటి ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి.