translateexpand_more

Exam Transparency India News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 01:11 am
సీబీఎస్ఈ జవాబుపత్రాలు ఫోన్లతో స్కానింగ్

టెండర్‌ నిబంధనలు మార్చి విద్యార్థుల జీవితాలతో ఆటలా?

రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ, జూన్‌ 1: సీబీఎ్‌సఈ జవాబు పత్రాలను మొబైల్‌ ఫోన్లతో స్కానింగ్‌ చేశారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. టెండర్‌ నిబంధనలు తుంగలో తొక్కి ఓ ప్రైవేట్‌ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం, సీబీఎ్‌సఈ బోర్డు కలిసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడాయని ధ్వజమెత్తారు. సీబీఎ్‌సఈ ఓఎ్‌సఎం ప్రక్రియలో లోపాలను ఎత్తిచూపిన పలువురు 12వ తరగతి విద్యార్థులతో ఆయన భేటీ అయిన వీడియోను ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు. 2025 మేలో సీబీఎ్‌సఈ జారీ చేసిన టెండర్‌ నిబంధనల ప్రకారం.. జవాబుపత్రాలను ఆటోమేటిక్‌ రోబోటిక్‌ స్కానర్లను మాత్రమే వాడాలని, 300డీపీఐ స్పష్టతతో స్కాన్‌ చేయాలని స్పష్టమైన నిబంధనలు పెట్టారని గుర్తుచేశారని ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. కానీ, ఆగస్టులో విడుదల చేసిన సవరించిన టెండర్‌లో.. ఆ నిబంధలన్నింటినీ గుట్టుచప్పుడు కాకుండా తొలగించారని మండిపడ్డారు. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న కోఎంప్ట్‌ ఎడ్యుకేట్‌ సంస్థ ఎలాంటి ప్రొఫెషనల్‌ స్కానర్లు వాడకుండా, సాధారణ మొబైల్‌ ఫోన్ల ద్వారా జవాబుపత్రాలను ఫోటోలు తీసి కాపీ చేసిందని అన్నారు. అందువల్లే జవాబు పత్రాలు మసకగా, మడతపడి కనిపించాయని.. పేజీలు గల్లంతవ్వడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తాయని మండిపడ్డారు. ఇవన్నీ సాంకేతిక సమస్యలు కావనీ, సదరు సంస్థ కోసం టెండర్‌ నిబంధనలు మార్చినప్పుడే రాసిపెట్టిన ఫలితాలని, ఇదొక పక్కా ఫ్రాడ్‌ అని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దేశ ప్రధానికి మన్‌ కీ బాత్‌తో మామిడిపండ్ల గురించి సమయం ఉంటుంది కానీ, 18.5లక్షల విద్యార్థుల భవితవ్యం గురించి మాట్లాడడానికి తీరిక లేదని విమర్శించారు. వ్యవస్థలో అవినీతి, లోపాలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ.. ‘జేబు దొంగలతో జాగ్రత్త.. ఇప్పుడు వాళ్లు సీబీఎ్‌సఈ కార్యాలయంలోనే తిష్ట వేశారు అంటూ రాహుల్‌గాంధీ ఘాటుగా విమర్శించారు. బోర్డు చేసిన తప్పుల వల్ల నష్టపోయిన విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. డిజిటల్‌ స్కానింగ్‌ కాపీ కోసం సబ్జెక్టుకు రూ. 100, మార్కుల లెక్కింపునకు పేపర్‌కు రూ. 100, రీవ్యాల్యుయేషన్‌ కోసం ప్రతి ప్రశ్నకు రూ. 25 వసూలు చేస్తున్న వైనాన్ని ఎండగట్టారు. జవాబుపత్రాన్ని సరిగ్గా దిద్దించుకోవడానికి ఒక్కో విద్యార్థి దాదాపు రూ.2వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వివరించారు. దేశవ్యాప్తంగా 4లక్షల మంది పునఃసమీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారంటే దీనిద్వారా సీబీఎస్‌ఈ ఎంత ఆదాయాన్ని ఆర్జిస్తుందో ఊహించుకోవచ్చన్నారు. ‘తప్పు సీబీఎ్‌సఈది.. శిక్ష విద్యార్థికి.. లాభం మాత్రం ప్రభుత్వానిది’ అని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం