translateexpand_more

Farmer Income Support News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 12:30 am
ఉల్లిగడ్డల సేకరణ ధర రూ.15.80కు పెంపు

న్యూఢిల్లీ, జూన్‌ 1: ఉల్లిగడ్డల సేకరణ ధరలను కేంద్రం పెంచింది. బఫర్‌ స్టాక్‌ కార్యక్రమం కింద సేకరించే ఉల్లిగడ్డల ధరను 24.4% పెంచి కిలోకు రూ.15.80చేసింది. ప్రస్తుతం ఇది రూ.12.70గా ఉంది. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ధరను పెంచినట్లు కేంద్ర ఆహార శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్‌ మిశ్రా సోమవారం తెలిపారు. ఉల్లి సేకరణ ప్రక్రియ మే 15 నుంచి మొదలైందని.. పెంచిన ధరకు సంబంధించి మే 22న నోటిఫికేషన్‌ జారీ చేశామని చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి కింధ ఏటా బఫర్‌ స్టాక్‌ను నిర్వహిస్తుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల టన్నుల ఉల్లి సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఏడాది దాన్ని 2 లక్షల టన్నులకు తగ్గించారు.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం