translateexpand_more

Film Updates News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy01 Jun, 01:22 pm
వరలక్ష్మి-నవీన్ చంద్ర పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ రిలీజ్.. సూప ర్ స్టార్ కృష్ణపై ప్రత్యేక గీతం

<p>వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar), నవీన్‌ చంద్ర (Naveen Chandra) ప్రధాన పాత్రధారులుగా నటించిన హారర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పోలీస్‌ కంప్లైంట్‌’ (Police Complaint,). సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించారు. సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సూపర్‌స్టార్‌ కృష్ణ ఘట్టమనేని జయంతిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ట్రైలర్‌తో రెండు ప్రత్యేక గీతాలను మేకర్స్‌ విడుదల చేశారు.</p><p><img class="lazy" loading="lazy" src="https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2026/20260318/police_c_13f2d51cea.jfif" alt="police c.jfif" width="1600" height="1066"></p><p> కృష్ణ నటించిన పలు చిత్రాల టైటిళ్లను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ని కృష్ణ అభిమానుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పాటలో కృష్ణ వీరాభిమాని, నటుడు కృష్ణసాయి నటించారు. ‘నువ్వట్టా సూత్తా ఉంటే’ అనే మరో గీతాన్ని తెలంగాణ డీఐజీ రమణారెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌, కృతి వర్మ, ప్రీతీ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.</p><div id="articlebodyAdsDiv"></div><iframe width="100%" height="415" src=" https://www.youtube.com/embed/fU1O5IZOMPM" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen loading="lazy"></iframe>

TV9 Telugu26 May, 03:03 pm
CM Vijay: ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. అదృష్టం కొద్దీ.. షాకింగ్ విషయం చెప్పిన గబ్బర్ సింగ్ విలన్

అభిమాన్యుసింగ్.. పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ గబ్బర్ సింగ్ విలన్ అంటే ఇట్టే గుర్తు పడతారు. రక్త చరిత్ర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన ఈ విలన్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. నేను నా రాక్షసి, బాడీ గార్డ్, బెజవాడ, ముకుంద, పండగ చేస్కో, జై లవకుశ, ఆక్సిజన్, అమర్ అక్బర్ ఆంటోనీ తదితర సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా చేశాడు. తెలుగులోనే కాదు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశాడు అభిమన్యు సింగ్. స్టార్ హీరోలకు పోటీగా ప్రతినాయకుడి పాత్రల్లో ఆకట్టుకున్నారు. అలా అభిమన్యు సింగ్ తమిళనాడు సీఎం విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ వేలాయుధం లోనూ విలన్ గా అదరగొట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ విలన్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే సీఎం విజయ్ తో కలిసి నటించిన క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ‘తమిళంలో నా మొదటి సినిమా విజయ్‌ దళపతి హీరోగా నటించిన వేలాయుధం. ఈ సినిమాలోని ఓ ఫైట్‌ సీన్‌ కోసం మేము సుమారు ఆరు గంటలపాటు ప్రయాణించి కోయంబత్తూరు వెళ్లాం. అక్కడినుంచి సుమారు గంటన్నరపాటు ప్రయాణిస్తే ఒక చిన్న రైల్వే స్టేషన్‌ వస్తుంది. అక్కడే మా షూటింగ్‌ స్పాట్. ఇందుకోసం అప్పటికే ఒక రైలును ముందుగానే రెడీ చేసి పెట్టారు. మొత్తం ఆరు రోజుల పాటు అక్కడ షూట్ జరిగింది. ఏడో రోజు రైలుపై నాకు విజయ్ కు ఫైట్ సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. కాబట్టి రైలు పట్టాలపై ఆగి ఉన్నప్పుడు దానిపై ఎక్కి విజయ్‌, నేను రిహార్సల్స్‌

TV9 Telugu27 May, 08:25 am
సీఎం విజయ్ నా సొంత తమ్ముడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా.. స్టార్ నటి కామెంట్స్ వైరల్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏ కొత్త సినిమా అయినా మొదటి వారం రోజలు డైలీ 5 షోస్ వేసుకునేలా విజయ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి కోలీవుడ్ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు సీఎం విజయ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ నటి కుష్బూ విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని సీనియర్ ప్రశ్నించారు. ప్రస్తుతం తమిళనాడు బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలిగా ఉన్న కుష్బూ సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్‌, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్‌ను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కుష్బూ ముఖ్యమంత్రి విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ‘ సీఎం విజయ్‌ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం కలిగింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యం కాదు. విజయ్‌ పగ్గాలు చేపట్టి కేవలం కొన్ని రోజులు మాత్రమే అవుతుంది. ముఖ్యమంత్రికి కాస్త సమయం

TV9 Telugu26 May, 04:18 pm
Aishwarya Rajesh: ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి, ఇద్దరు అన్నయ్యలు ఎలా చనిపోయారో తెలుసా? పాపం చిన్న వయసులోనే..

ఐశ్వర్యా రాజేష్‌ పక్కా తెలుగు అమ్మాయి. అయినా తమిళంలోనే స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అక్కడే ఆమెకు స్టార్‌డమ్, పాపులారిటీ ఎక్కువగా ఉంది. అప్పుడప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోయిన్ రేంజ్ కు మాత్రం ఎదగలేకపోతోంది. విక్టరీ వెంకటేష్ తో కలసి ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఐశ్వర్య నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజై ఏడాదిన్నర గడుస్తున్నా ఐశ్వర్య నుంచి మరో తెలుగు సినిమా రాలేదు. అయితే తమిళంలో మాత్రం మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఐశ్వర్య రాజేష్ తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదర్కొంది. 8 ఏళ్ల వయసులోనే తండ్రి ప్రేమకు దూరమైంది. ఆ తర్వాత టీనేజ్ లో ఇద్దరు అన్నయ్యలను కోల్పోయింది. దీంతో ఆమె మేనత్త, ప్రముఖ కమెడియన్ శ్రీలక్ష్మి ఐశ్వర్యను చేరదీసింది. ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి రాజేష్‌ కూడా తెలుగులో హీరోగా చేశారు. పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశార. నెలవంకతో మొదలైంది రాజేష్ ప్రయాణం. ఆ తర్వా రెండు జళ్ల సీత, ఆనంద భైరవి సినిమాల్లోనూ హీరోగా నటించారు. కేవలం హీరోగానే కాకుండా పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గానూ, సహాయక నటుడిగానూ కనిపించారు రాజేష్. మొత్తానికి యాభైకి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారాయన. అయితే నటుడిగా రాణిస్తున్న సమయంలోనే తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు రాజేష్. కాలేయ సమస్యలతో కేవలం 38 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. అప్పటికి ఐశ్వర్య రాజేష్‌ వయసు కేవలం‌ ఎనిమిదేళ్లు మాత్రమే. దీంతో ఐశ్వర్య తల్లి LIC ఏజెంట్ గా మారి