Mahalakshmi Free Bus Scheme: చదువు.. ఉద్యోగం.. ఉపాధి.. మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉచిత బస్సు ప్రయాణం
Mahalakshmi Free Bus Scheme: చదువు.. ఉద్యోగం.. ఉపాధి.. మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉచిత బస్సు ప్రయాణం
© 2026 telugu.digital
Mahalakshmi Free Bus Scheme: చదువు.. ఉద్యోగం.. ఉపాధి.. మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉచిత బస్సు ప్రయాణం
Free Genetic Tests For Cancer Patients In ANdhra Pradesh: క్యాన్సర్ చికిత్సలో భాగంగా రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు జీజీహెచ్ ప్రాంగణంలో నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్లో ఈ జన్యు పరీక్షల ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. ఈ జన్యు పరీక్షలు చాలా ఖరీదైనవి కాగా.. ప్రైవేట్ వైద్య సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సేవలను ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఉచితంగా అందించనున్నారు. ఈ నెల 22 నుంచి ఈ ల్యాబ్ అందుబాటులోకి రానుంది.

Clearance for Freehold కూటమి ప్రభుత్వం జిల్లా రైతులకు శుభవార్త చెప్పింది. జగన్ హయాంలో ఇష్టానుసారం నిషేధ భూముల జాబితా(22ఏ)లో చేర్చిన భూముల ఫ్రీహోల్డ్‌కు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. ఫ్రీహోల్డ్ భూములకు విముక్తి కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.

freehold for lands ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ర్టేషన్లకు అనుమతిచ్చింది. దీంతో దాదాపు రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. బుధవారం నుంచి ఫ్రీహోల్డ్‌లో ఉన్న భూములను రిజిస్ర్టేషన్ చేసుకునే వెసులుబాటు లభించింది. వైసీపీ అడ్డగోలు జీవోతో అప్పట్లో భూములు అడ్డదారిలో చేతులు మారడం.. పేదల భూములను మోతుబరులు కారుచౌకగా కొట్టేయడం తదితర పరిణామాలతో కూటమి ప్రభుత్వం 25 నెలలుగా ఫ్రీ హోల్డ్ భూముల్లో రిజిస్ర్టేషన్ నిలిపివేసింది. తాజా నిర్ణయంతో నిజమైన హక్కుదారులకు ఊరట లభించింది.

Green signal for freehold registrations జిల్లాలో ఫ్రీహోల్డ్‌లో ఉన్న భూములతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) పొందిన భూములకు విముక్తి కలగనుంది. రిజిస్ట్రేషన్లు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వనుంది. ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలు ప్రకటించే అవకాశఽం ఉంది.

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్‌ప్రీత్ సింగ్ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో యుటిలిటీ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతున్నప్పటికీ.. పనులు పూర్తైన తర్వాత రోడ్లను సక్రమంగా, నాణ్యతతో పునరుద్ధరించడం లేదని ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. దీంతో రోడ్లు unevenగా మారి ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని తెలిపారు. యుటిలిటీ పనులు పూర్తైన వెంటనే సంబంధిత సంస్థలు రోడ్లను సకాలంలో నాణ్యతతో పునరుద్ధరించాలని సూచించారు. మరోవైపు ఓలా, ఉబర్ వాహనాల అనియంత్రిత పార్కింగ్ కూడా ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోందని అధికారులు తెలిపారు. ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసే సమయంలో రోడ్లపై వాహనాలు గుమిగూడకుండా ఐటీ సంస్థలు, ప్రధాన సంస్థలు తమ ప్రాంగణాల్లోనే పికప్, డ్రాప్ ప్రాంతాలతో పాటు ఓలా, ఉబర్ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ లేదా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో రోడ్ల అభివృద్ధి, కనెక్టివిటీపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రతిపాదిత రోడ్డు అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన ట్రాఫిక్ అధికారులు.. రహదారుల అనుసంధానం, ట్రాఫిక్ ప్రవాహం, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఫ్రీ లెఫ్ట్‌లు, జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఫ్రీ లెఫ్ట్ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు జంక్షన్లలో ఛానలైజేషన్, రోడ్డు జ్యామెట్రీలో మార్పులు చేపట్టాలని సూచించారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేచి ఉండే సమయం తగ్గి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రోడ్డు

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ల పరిమితిని తగ్గించింది. ఇదే కాకుండా సేవింగ్స్ అకౌంట్లో సరిపడ బ్యాలెన్స్ లేకుండా విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే భారీగా పెనాల్టీలు విధించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ఈ కొత్త ఛార్జీలను అమల్లోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది. ఖాతాదారులు దీనిని గమనించాలని, ఇందుకనుగుణంగా లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించింది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో కెనరా బ్యాంక్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కెనరా బ్యాంక్ ఏటీఎంలో ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి ఆరుగా ఉండేది. ఇప్పుడు దానిని 5కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నెలకు కేవలం ఐదు లావాదేవీలు మాత్రం ఏటీఎంలలో ఉచితంగా చేసుకోవచ్చు. ఆ పైబడి చేస్తే ఛార్జీలు కట్ అవుతాయి. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి వాటిని కూడా ఉచిత పరిమితిలో చేర్చారు. ఉచిత లావాదేవీల తర్వాత అకౌంట్లో డబ్బులు లేకపోయినా విత్ డ్రాకు ప్రయత్నిస్తే రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది ఏటీఎంలో ఉచిత లావాదేవీల తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది. ఇప్పటివరకు ఇది రూ.20గా ఉండగా.. ఇప్పుడు మరో రూ.3 పెంచారు. అయితే సీనియర్ సిటిజన్లు నెలకు 8 ఉచిత ఏటీఎం లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ లిమిట్ దాటాక వారికి ఒక్కొ ట్రాన్సాక్షన్‌కు రూ.5 ప్లస్ జీఎస్టీ పడుతుంది. సీనియర్ సిటిజన్ల లావాదేవీల పరిమితి ఎప్పటిలాగే ఉంచింది. ఇప్పటినుంచి మెట్రో సిటీల్లోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలో 3 ట్రాన్సాక్షన్లు ఫ్రీగా చేసుకోవచ్చు. అయతే కెనరా బ్యాంక్ ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ వంటి కార్డ్స్‌కు గ్రీన్ పిన్
ATM Charges Hike: ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ (Canara Bank) తమ ఖాతాదారులకు సడెన్ షాక్ ఇచ్చింది. తమ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలు పెంచింది. అలాగే నెలవారీ ఏటీఎం విత్ డ్రాయల్ ఉచిత లావాదేవీల పరిమితులను తగ్గించింది. వీటితో పాటు పొదుపు ఖాతాలో సరిపడ బ్యాలెన్స్ లేనప్పుడు విత్ డ్రాయల్‌కు ప్రయత్నిస్తే భారీగా పెనాల్టీలు విధించాలని నిర్ణయించింది. సవరించిన ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1, 2026 నుంచే అమలులోకి తెచ్చినట్లు వెల్లడించింది.కెనరా బ్యాంక్ కొత్త ఛార్జీలు ఇలా.. కెనరా బ్యాంక్ ఏటీఎంలలో నెలకు లభించే ఉచిత లావాదేవీల పరిమితి ఇప్పటి వరకు 6 ట్రాన్సాక్షన్లుగా ఉండగా దానిని 5కు తగ్గించారు. అంటే 5 ట్రాన్సాక్షన్ల తర్వాత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇందులో ఫైనాన్షియల్, నాన్- ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు అన్నింటికీ ఈ లిమిట్ వర్తిస్తుంది. బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్ వంటివి చేసిన ట్రాన్సాక్షన్ గానే లెక్కిస్తారు. ఏటీఎం (ATM)లో నగదు ఉపసంహరణ చేయడానికి ప్రయత్నించినప్పుడు సేవింగ్స్ అకౌంట్లో సరిపడా డబ్బులు లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే భారీగా పెనాల్టీ పడనుంది. నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత ఇలా ఫెయిల్ అయితే ఇప్పటి వరకు రూ.17 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుండగా ఈ పరిమితిని రూ.23 ప్లస్ జీఎస్టీకి పెంచారు. నెలవారీ ఉచిత లిమిట్ దాటిన తర్వాత నగదు విత్ డ్రాయల్స్ (ICCW, UPI క్యాష్ విత్ డ్రాయల్స్తో సహా) చేస్తే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.23 ప్లస్ GST ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు రూ.20 ఛార్జీ వసూలు చేసే వారు. అయితే, సీనియర్ సిటిజన్లకు కెనరా బ్యాంక్ ఊరట కల్పించింది. ఏటీఎంలలో నెలకు లభించే ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. నెలకు 8 ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు. పరిమితి దాటిన తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ.5

మొన్నటి దాకా కాక్రోచ్ జనత పార్టీ ఆందోళనలతో అట్టుడికిపోయింది.. యావత్ దేశం. ఈ ఉద్యమాల ధాటికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా సైతం చేయాల్సి వచ్చింది. ఇది ఇక్కడితో ఆగట్లేదు. మరో నూతన సామాజిక ఉద్యమం పురుడుపోసుకుంది. ఏకంగా ఏడాదిపాటు కొనసాగబోతోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80వ సంవత్సరంలో అడుగు పెట్టినందున దీనికి ఇండియా @ 80 అని పేరు పెట్టారు.మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమం ఇది. దేశ రాజధానిలో సఫాయి కర్మాచారి ఆందోళన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభలో ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మనుషుల మలాన్ని చేతులతో ఎత్తే ఈ అనాచారం పూర్తిగా అంతరించిపోయిందంటూ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రకటనలపై క్షేత్రస్థాయి నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయనడానికి ఇది.. తాజా నిదర్శనం.ఈ సభలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, జమ్మూ కాశ్మీర్ కు చెందిన మహిళా స్కావెంజర్లు హాజరయ్యారు. తమ నిత్య జీవితంలో నేటికీ ఎదుర్కొంటున్న చేదు వాస్తవాలను వెల్లడించారు. ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ ఈ బానిసత్వం నుండి తమకు ఎప్పుడు విముక్తి లభిస్తుందని వారు నిలదీశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తి కాబోతున్న తరుణంలో కూడా ఈ సామాజిక వివక్ష నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న పేద ప్రజలకు విముక్తి లభించకపోవడంపై సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.పసిడి రేట్లల్లో తీవ్ర ఒడిదొడుకులు.. మరోసారి మార్జినల్ పతనందేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థ పూర్తిగా తొలగిపోయిందంటూ కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే చేసిన ప్రకటనలను సఫాయి కర్మచారి ఆందోళన్ ఖండించింది. పార్లమెంట్ సాక్షిగా ఆయన అబద్ధాలు చెప్పారంటూ మండిపడింది. ఈ నేపథ్యంలో మాన్యువల్ స్కావెంజర్ వ్యవస్థ నుంచి దేశానికి శాశ్వతంగా విముక్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా సఫాయి కర్మాచారి ఆందోళన్ సంఘ్.. ఈ ఉద్యమానికి రూపకల్పన చేసింది. ఇండియా @ 80 పేరిట ఓ సంవత్సరం పాటు సాగే సుదీర్ఘ నిరసన ఉద్యమాన్ని

పరకాల నెత్తుటి త్యాగానికి 75 ఏళ్లు రజాకార్ల దాడుల్లో నేలకొరిగిన యోధులు మరో జలియన్‌వాలాబాగ్ ఘటనగా ప్రసిద్ధి పరకాల(వరంగల్): రజాకారుల పాశవిక దాడికి పరకాలలో 15 మంది సమరయోధులు అమరులైన ఉదంతానికి నేటితో (సెప్టెంబరు 2) 75 ఏళ్లు పూర్తయ్యాయి. భారతదేశం బ్రిటీష్ పాలన నుంచి విముక్తి చెంది ఆగస్టు 15 స్వేచ్ఛా స్వాతంత్య్రం పొందితే.. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించలేదు. స్వేచ్ఛా స్వాంతంత్య్రం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమం వైపు ఉరుకులు తీశారు. ప్రజా సంఘాలు, సాయుధ బలగాలను ఏర్పా టు చేసుకుని సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. నిజాం సర్కారు ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్ల పేరిట ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. వీరు ఉద్యమకారులను, సానుభూతిపరుల కుటుంబాలను అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేసి మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. రజాకారుల చర్యలను ఎదుర్కొనేందు కు సమరయోధులు సాయుధబాట పట్టారు. పరకా ల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కటంగూరి కేశవరెడ్డి, ప్రకా్‌షరెడ్డి, ఎస్.మనోహర్‌రావు, కటంగూరి నర్సింహరెడ్డి, వీరగోపాల్‌రావు, చాడ వాసుదేవరెడ్డి, బల్గూరి బుచ్చయ్య, తోపునూరి కోటయ్య, కందుకూ రి జోగారెడ్డి, మేడిపల్లి మల్లయ్య, పాడి నర్సింహారెడ్డి, చంద్రయ్య, చిట్టిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి పోరాటయోధులు ఒక్కొక్క విభాగానికి నాయకత్వం తీసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. 1947 సెప్టెంబరు 2న పరకాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి పరకాల ప్రాంతంలోని ప్రతీ గ్రామం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. పట్టణంలోని చాపలబండ వద్దకు చేరుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. పరకాలప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాన్ని అణచాలని అప్ప టికే పధకం ప్రకారం నిజాంసేనలు మాటువేసి ఉన్నాయి. పట్టణంలోని తహసీల్ కార్యాలయం వరకు ప్రజలు చేరగానే రజాకార్ మూకలు కత్తులు, బరిసెలు, తల్వార్లతో ఉద్యమకారులను వెంబడించి ఊచకోత కోయగా, నిజాం ఆధీనంలోని పోలీసులు తుపాకులతో విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 15

ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సిఎం చంద్రబాబు కీలక ప్రకటన తగ్గనున్న సాధారణ బస్సుల రద్దీ Stree Shakthi Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'స్త్రీశక్తి(Stree Shakthi Scheme)' పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం కేవలం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు కేటగిరీల బస్సులకే ఇది పరిమితం కావడంతో విపరీతమైన రద్దీ పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు త్వరలోనే ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. Hitech City Railway Station: పండుగ రద్దీకి పక్కా ప్లాన్.. హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల పొడగింపు.. పూర్తి వివరాలు మీకోసం! మోగల్తూరు సభలో ప్రకటన.. రద్దీ నియంత్రణకు ముందడుగు: మోగల్తూరులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, వాటిలో మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. సాధారణ బస్సులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు, వేసవిలో కూడా మహిళలు హాయిగా ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. 'దివ్యాంగశక్తి' సేవలు విస్తరణపై ఆసక్తి.. పెరగనున్న సౌకర్యాలు: ఇప్పటికే రాష్ట్రంలో 'దివ్యాంగశక్తి' పథకం ద్వారా 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని, వారి సహాయకులకు 50 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. అయితే, ఏసీ బస్సుల్లో కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందా లేదా అన్నదానిపై త్వరలో స్పష్టత రానుంది. ఏదేమైనా, ఏసీ బస్సుల్లోనూ స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేయాలన్న నిర్ణయం పట్ల

నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్‌లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్‌లు ఉండవు. ఇంటర్నెట్ డెస్క్: నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్‌లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్‌లు ఉండవు. జీతం స్లిప్‌లు లేకపోయినా క్రెడిట్ కార్డు పొందే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు కేవలం శాలరీ స్లిప్‌నే కాకుండా ఆదాయం, బ్యాంకింగ్ చరిత్ర, క్రెడిట్ ప్రొఫైల్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తాయి (Credit card without salary slip). క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకుకు ప్రధానంగా కావాల్సింది కార్డు బిల్లులను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా? అన్నదే. అందుకే ఉద్యోగులకు శాలరీ స్లిప్ సాధారణ ఆదాయ ఆధారంగా ఉపయోగపడినప్పటికీ, స్వయం ఉపాధి పొందేవారికి ఇతర పత్రాలను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవచ్చు. జీతం స్లిప్‌లు లేని వారికి బ్యాంక్ స్టేట్మెంట్లు ముఖ్యమైన ప్రత్యామ్నాయ ఆదాయ ఆధారంగా ఉపయోగపడవచ్చు. ఖాతాలో క్రమం తప్పకుండా డబ్బు జమ అవుతున్నట్లు కనిపిస్తే, దరఖాస్తుదారుడి ఆదాయ స్థిరత్వాన్ని అంచనా వేయడానికి అది బ్యాంకుకు ఉపయోగపడుతుంది (Self employed credit card). వ్యాపారం లేదా ఇతర పనులు చేసుకునే వారు తమ ఆదాయానికి సంబంధించిన పన్ను రిటర్నులు సమర్పిస్తే, బ్యాంకుకు ఆదాయంపై మరింత స్పష్టత లభిస్తుంది. అర్హత ఉన్న వ్యాపారులు, సేవలందించే వారు జీఎస్టీ రిటర్నులు వంటి పత్రాలను కూడా అవసరమైన సందర్భంలో ఆదాయ ఆధారంగా సమర్పించవచ్చు. అయితే ఏ పత్రాలు అంగీకరిస్తారన్నది బ్యాంకు, క్రెడిట్ కార్డు ఉత్పత్తి, దరఖాస్తుదారుడి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది (Credit card without income proof)

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Free onions distribution in Warangal: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చాలా మంది వంటింట్లో ఉల్లిపాయలను తప్పకుండా ఉపయోగిస్తారు. ఉల్లి ధరలు పెరిగిపోతుండటంతో జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయ్యింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు వెరైటీగా కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్‌లో కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలన నేపథ్యంలో..ఉచితంగా ఉల్లిగడ్డల పంపిణిని చేశారు. ట్రాలీలో ఉల్లిగడ్డ సంచులను తీసుకొనివచ్చిసీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిరోడ్డు మీద పంపిణి చేపట్టాడు. దీంతో జనాలు ఉల్లిపాయల ప్యాకెట్ ల కోసం భారీగా క్యూలు కట్టారు. Read more: Konda Surekha: కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. సుష్మిత వివాదంపై హీటెక్కిన రాజకీయాలు.!. ఉల్లిగడ్డలు తీసుకునేందుకు ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళల పరిస్థితి ఏర్పడింది.ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో అక్కడున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ నేత నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Viral Video: సబ్‌స్రైబ్ చేస్తే చేస్తే తిరుమల లడ్డూ ఫ్రీ! సబ్‌స్క్రైబ్ చేస్తే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ఉచితమంటూ.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఎవరైనా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయిస్తే ఒక్కో లడ్డూ చొప్పున బహుమతిగా ఇస్తున్నట్లు ఆ వీడియోలో చూపించారు. ఇలా ఏకంగా 30 మందితో సబ్‌స్క్రైబ్ చేయించుకుని.. దానికి ప్రతిఫలంగా 30 లడ్డూలను పొందినట్లు.. ఆ వ్యక్తి అందులో పేర్కొన్నాడు. ప్రపంచ ప్రఖ్యాత శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇలా సోషల్ మీడియా ప్రమోషన్లకు, సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి వాడుకోవడం పట్ల భక్తులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తకు సంబంధించిన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CM Chandrababu naidu on free ac bus facility for women: ప్రస్తుతం రెండుతెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నఉచిత బస్సు పథకానికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.అయితే పలుచోట్ల రద్దీకి తగ్గట్టుగా బస్సలు లేకపొవడంతో కొన్ని చోట్ల మహిళలు సిగపట్లు పట్టుకుంటున్నారు. సీటు కోసం, బస్ స్టాప్ ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొంత మంది అవసరంలేకున్న ఫ్రీఅని చెప్పి బస్సులలో ప్రయాణాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కూటమి పనిచేస్తుందని అన్నారు. ఇచ్చిన అన్ని హమీలను నెరవేరుస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సహాకారంతో ఏపీ డెవలప్ మెంట్ పథంలో వేగవంతంగా ముందుకుదూసుకుని పోతుందని చెప్పుకొచ్చారు. కేవలం రెండేళ్లలో సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఎన్టీఆర్ భరోసా కింద రూ.73,507 కోట్లను పేదలకు అందించామని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి గౌరవంగా అర్హులైన ప్రతిఒక్కరికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పుకొచ్చారు. దీపం 2.0 ద్వారా ఏటా మూడు ఉచిత సిలిండర్లు, స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. వడ్డెర్లకు మైనింగ్‌లో, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను

Osmania University: దళిత బంధు పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఓయూలో నిరసన! Osmania University: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న దళిత బంధు నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డా. బుషిపాక గణేశ్ ఆధ్వర్యంలో మోత్కూర్, అడ్డగూడూరు మండలాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బుషిపాక గణేశ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రెండో విడతలో భాగంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.3 లక్షలు జమ చేసిన అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కలెక్టర్లు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారని తెలిపారు. రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని రాష్ట్ర కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా దళిత బంధు నిధుల సమస్య పరిష్కారం కాలేదని, దీంతో లబ్ధిదారుల కుటుంబాలు అనేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బ్యాంకు ఖాతాలపై ఉన్న ఫ్రీజింగ్‌ను ఎత్తివేసి, గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసి ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో మిగిలిన రూ.10 లక్షల దళిత బంధు నిధులను జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ల అజయ్, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ తో పాటు దళిత బంధు లబ్ధిదారులు జిల్లా శివాజీ, జక్కుల గిరిబాబు, ఇటీకాల అంజన్న, చేడే సైదులు, బాలెంల నరేందర్, శ్రీరామ్‌ల ప్రదీప్, బుషిపాక సంజీవ, బట్ట చిన్న వెంకన్న, మంద విష్ణు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ లో.. చాలా మందికి టైమ్ కి భోజనం చేసే సమయమే ఉండటం లేదు. ఇలాంటి సమయంలో.. వీకెండ్స్ లో.. వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతకడమే పెద్ద పని అనుకుంటుంటే.. మళ్లీ.. వాటికి ఐరన్ చేయడం మరో పెద్ద పని. వాషింగ్ మెషిన్ డ్రయ్యర్ చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. దీని వల్ల.. బట్టలకు ఎక్కువగా ముడతలు పడిపోతూ ఉంటాయి. అయితే.. ఒకే ఒక్క సింపుల్ ట్రిక్ తో ముడతలు పడటం కాదు కదా.. ఐరన్ అవసరమే రాదు. ఆ ట్రిక్ ఏంటి..? ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం... మీరు మీ బట్టలకు ముడతలు పడకూడదు అనుకుంటే.. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీ డ్రయ్యర్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తే సరిపోతుంది. ఉతికిన లేదా పొడి బట్టలతో పాటు 2 నుండి 3 ఐస్ క్యూబ్స్‌ను వాషింగ్ మెషిన్ డ్రైయర్ లో వేయాలి. వాషింగ్ మెషిన్ పనిచేస్తున్నప్పుడు ఎక్కువ టెంపరేచర్ రిలీజ్ అవుతుంది. ఆ వేడికి ఐస్ క్యూబ్స్ త్వరగా కరిగి నీరుగా, ఆపై ఆవిరిగా మారతాయి. డ్రైయర్ లోపల తిరిగేటప్పుడు ఉత్పత్తయ్యే ఈ వేడి దుస్తుల మీద ముడతలు పడకుండా ఆపుతుంది. ఇది ఇంట్లో స్టీమ్ ఐరన్ ఎలా పనిచేస్తుందో సరిగ్గా అలాగే పనిచేసి, బట్టలు బైటికి వచ్చేసరికి ముడతలు లేకుండా ప్లాట్‌గా, నీట్‌గా మారేలా చేస్తుంది. ఈ ట్రిక్ బాగా పనిచేయాలంటే డ్రైయర్‌లో కేవలం 2 నుండి 3 దుస్తులు మాత్రమే వేయాలి (ఉదాహరణకు: 2 షర్టులు లేదా ఒక ప్యాంట్, షర్ట్). డ్రైయర్ నిండా బట్టలు వేస్తే ఆవిరి సరిగ్గా వ్యాపించక ముడతలు పోవు. బట్టల పరిమాణాన్ని బట్టి కనీసం ఐదు లేదా ఆరు ఐస్ క్యూబ్స్ వేయాలి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇవి సరిపోతాయి. డ్రైయర్ ఆగిపోగానే బట్టలను వెంటనే బయటకు తీసి హ్యాంగర్‌కు తగిలించాలి

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. New ATM Rules 2026: ఏటీఎం కార్డు వినియోగదారుల విషయానికి వస్తే, ఆర్బీఐ ఆమోదంతో వినియోగదారులపై అదనపు చార్జీల భారం పడనుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నందున, వినియోగదారుల ఇబ్బందులు మరింత పెరగవచ్చు. ఉదాహరణకు, మీరు మీ సొంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎం యంత్రాల వద్ద బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా లేదా నగదు విత్ డ్రా చేయాలన్నా, వారు అధిక చార్జీలను వసూలు చేస్తారు. వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కూడా ఆర్బీఐ ఆమోదంతో ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై విధించనున్నారు. మీరు ఏటీఎం కార్డును తరచూ ఎక్కువగా ఉపయోగిస్తుంటే, కచ్చితంగా అదనపు ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఈ ఛార్జీలను రూ.17 నుండి రూ.19 వరకు పెంచారు. కేవలం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా కూడా రూ.7 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. గతంలో నెలకు ఒకసారిగా లావాదేవీల ఆధారంగా ఈ చార్జీలను వసూలు చేసేవారు. సాధారణంగా మెట్రో నగరాల్లో నివసించే కస్టమర్లకు ఐదు ఉచిత లావాదేవీలు లభిస్తే, నాన్-మెట్రో లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. ఎంపీసీఐ (MPCI) ఆమోదం, ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం ఈ అదనపు చార్జీల విషయంలో ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ అంశం ప్రస్తుతం ఎంపీసీ ముందుకు వెళ్ళింది. ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల, పాత ధరల పద్ధతిని కాకుండా కొత్తగా ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఆర్బీఐ మాత్రం ఎలాంటి అధికారిక

ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు విధించాలన్న యూఎస్సీఐఆర్ఎఫ్ తీరును భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నదని, దానికి ఎలాంటి విశ్వసనీయతా లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై ఆంక్షలు విధించాలన్న అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్(USCIRF)ను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నదని, దానికి ఎలాంటి విశ్వసనీయతా లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. అది నిర్దిష్ట ఎజెండాతో ప్రచారం చేసే సంస్థ అని, దాని వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. 'యూఎస్సీఐఆర్ఎఫ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. ఇలాంటి సంస్థలకు మనం దూరంగా ఉండాలి. వీటికి విశ్వసనీయత ఉండదు, సొంత ఎజెండాలు మాత్రమే ఉంటాయి. ఆ సంస్థ భారత బహుళ వ్యవస్థ వాస్తవికతను స్వీకరిస్తుందని గానీ, దాని విభిన్న వర్గాల సామరస్య సహజీవనాన్ని గుర్తిస్తుందని గానీ మేం ఆశించడం లేదు' అని జైస్వాల్ పేర్కొన్నారు. యూఎస్సీఐఆర్ఎఫ్ ప్యానెల్ ఛైర్మన్ ఆసిఫ్ మహమూద్ ఇటీవల ఆర్ఎస్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సభ్యులపై ఆంక్షలు విధించాలని, అందులోని నాయకులకు ఎలాంటి దౌత్యపరమైన మర్యాదలు, హై-లెవెల్ సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ నెల 29న అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సభ్యుడని, ఆ సంస్థ ఓ గొడుగు కింద పనిచేస్తోందని విమర్శించారు. దాని అనుబంధ సంస్థలు మైనారిటీలపై దాడి చేస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యల్ని భారత విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. మోహన్ భాగవత్ విదేశీ పర్యటనల నేపథ్యంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదంది. భారత్‌లో మత స్వేచ్ఛపై తప్పుడు నివేదికలు ఇవ్వడానికి బదులుగా, అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ప్రవాస భారతీయుల భద్రతపై దృష్టి సారించాలని మరోసారి

సాక్షి, చెన్నై: తమిళనాడులోని శాసన సభ్యులకు ప్రభుత్వం తరఫున కొత్త వాహనాలను కేటాయించేందుకు కసరత్తు వేగవంతమైంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 లక్షల నుంచి రూ.34 లక్షల విలువైన కార్లను అందించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించిన మోడల్ కార్లను సచివాలయ ప్రాంగణానికి తీసుకువచ్చి అధికారులు పరిశీలిస్తున్నారు ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వం తరఫున ఉచిత కార్లను అందజేస్తామని అసెంబ్లీలో సీఎం విజయ్ తెలిపిన విషయం తెలిసిందే. ఇంధనం, వాహన నిర్వహణ, వ్యక్తిగత సహాయకుడి నియామకం వంటి వాటి ఖర్చులకు నెలకు రూ.లక్ష అందజేయనున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటన అమల్లో భాగంగా వివిధ ప్రముఖ ప్రైవేట్ వాహన తయారీ సంస్థలకు చెందిన 6 రకాల మోడల్ కార్లను (మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ తదితరాలు) అధికారులు పరిశీలన కోసం చెన్నైలోని సచివాలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఈ కార్లను టెస్ట్ డ్రైవ్ చేసి, అత్యంత అనుకూలమైన మోడల్‌ను ఎంపిక చేయనున్నారు. 234 కార్ల కొనుగోలుకు ప్రణాళిక రూపకల్పన చేసి ఉన్నా, డీఎంకే సభ్యులు 59 మంది తమకు కార్లు వద్దని ప్రకటించడం గమనార్హం. దీంతో ఎన్ని కార్లు కొనుగోలు చేస్తారో? అన్న చర్చ ఊపందుకుంది. ఒక్కో కారు ఖరీదు కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.34 లక్షల వరకు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @ NO.1

కపుల్‌గా ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? సరైన ప్లానింగ్ లేకపోతే బడ్జెట్, డెస్టినేషన్, షెడ్యూల్ వంటి విషయాల్లో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ప్రయాణాన్ని ఒత్తిడి లేకుండా ఎంజాయ్ చేయడంతో పాటు జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. ఇంటర్నెట్ డెస్క్: కలిసి ట్రిప్‌కు వెళ్లడం అంటే కొత్త ప్రదేశాలను చూడటంతో పాటు ఇద్దరూ కలిసి విలువైన జ్ఞాపకాలను సృష్టించుకోవడం. అయితే సరైన ప్లానింగ్ లేకపోతే బడ్జెట్, డెస్టినేషన్, షెడ్యూల్ వంటి చిన్న విషయాలే గొడవలకు కారణమవుతాయి. అందుకే ప్రయాణానికి ముందే కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకుంటే ట్రిప్ మరింత ప్రశాంతంగా, సరదాగా సాగుతుంది. కపుల్స్ తమ వెకేషన్‌ను హ్యాపీగా, మెమరబుల్‌గా మార్చుకునేందుకు ఈ ఐదు సూచనలు ఉపయోగపడతాయి. ట్రిప్ ప్రారంభించే ముందు ఇద్దరూ కలిసి మొత్తం బడ్జెట్‌పై నిర్ణయం తీసుకోవడం మంచిది. హోటల్, ప్రయాణం, ఆహారం, షాపింగ్, సందర్శనా ప్రదేశాల ఖర్చులను ముందుగానే అంచనా వేసుకోవాలి. ప్రతి విషయానికీ ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచి డిన్నర్ లేదా ప్రత్యేకమైన కపుల్ యాక్టివిటీ కోసం కొంత మొత్తాన్ని కేటాయించి, మిగతా ఖర్చుల్లో పొదుపు చేయొచ్చు. లోకల్ ఫుడ్, మార్కెట్లు, తక్కువ ఖర్చుతో లభించే అనుభవాలను ఎంచుకోవడం ద్వారా బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఊహించని ఖర్చుల కోసం కొంత అదనపు మొత్తాన్ని కూడా పక్కన పెట్టడం మంచిది. ఒక్కరి ఇష్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ప్రదేశాన్ని ఎంచుకోవడం కంటే ఇద్దరి అభిరుచులకు సరిపోయే డెస్టినేషన్‌ను ఎంచుకోవాలి. ఒకరికి బీచ్ నచ్చితే, మరొకరికి హిల్ స్టేషన్ లేదా చారిత్రక ప్రదేశాలు ఇష్టమై ఉండొచ్చు. అలాంటప్పుడు ఇద్దరికీ ఆసక్తి కలిగించే ప్రదేశాన్ని వెతకాలి. ప్రయాణ సమయం, వాతావరణం, కనెక్టివిటీ, వసతి ఖర్చులు, స్థానిక రవాణా వంటి అంశాలను కూడా ముందుగానే పరిశీలించాలి. రద్దీ తక్కువగా ఉండే సీజన్లో ప్రయాణిస్తే ఖర్చు తగ్గడంతో పాటు

తమిళనాడు రాజకీయాల్లో కొత్త రగడ మొదలైంది. అసెంబ్లీలోని 234 మంది ఎమ్మెల్యేలకు ఉచిత కార్లు ఇస్తామని టీవీకే ప్రభుత్వం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ప్రతి ఎమ్మెల్యేకు కారుతో పాటు డ్రైవర్, పెట్రోల్, వాహన నిర్వహణ కోసం నెలకు ₹75,000 భత్యం కూడా ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ను ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ డీఎంకే పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు ఈ ఉచిత కార్లను తీసుకోకూడదని నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఉదయనిధి స్టాలిన్ సభలో వివరంగా వెల్లడించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రవాణా సౌకర్యాలు అవసరమని వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి డిమాండ్ చేశారని ప్రభుత్వం పేర్కొంది. ప్రజా ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయాలంటే ఈ సదుపాయం తప్పనిసరి అని సర్కార్ సమర్థించుకుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపుతూ ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసిరారు. దింతో రాష్ట్రం ఎదుర్కొంటున్న అప్పుల భారాన్ని తగ్గించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఉదయనిధి తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభం, అప్పుల భారం గురించి మాట్లాడుతూ, మరోవైపు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం ద్వంద్వ విధానమని విమర్శించారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృథా చేయకుండా, కార్లు లేని పేద ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫలితంగా ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీలో తీవ్రమైన చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఆఫర్‌ను స్వాగతించగా, డీఎంకే మాత్రం తోసిపుచ్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చే ఉచిత సదుపాయాలను నిరాకరించడం ద్వారా ప్రజల వైపు తాము నిలబడ్డామని డీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముందుముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. ప్రజాధనాన్ని పదుపుగా వాడాలని డీఎంకే పట్టుబడుతుండటంతో టీవీకే