translateexpand_more

German Shepherd News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu01 Jun, 01:26 pm
పెంపుడు కుక్కల్లో ఈ కుక్కలు మోస్ట్ డేంజరస్.. జాగ్రత్త

చాలామంది కుక్కలను ఇష్టంగా పెంచుకుంటారు.  కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా చెప్తారు. అటువంటి కుక్కలు ఒక్కొక్కసారి ఊహించని విధంగా యజమానులపైన కూడా దాడులు చేస్తాయి.  వారి ప్రాణాలను తీస్తాయి. ఇతరులకు కూడా హానికరంగా మారుతాయి. ఈ క్రమంలో పెంపుడు కుక్కలలో డేంజరస్ కుక్కలు ఏమిటనేది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరమే. పెంపుడు జంతువులుగా ఉన్నప్పటికీ,  క్రూరంగా ప్రవర్తించే, హింసాత్మక దాడులకు పాల్పడే ప్రమాదకరమైన ఐదురకాల కుక్కల గురించి ప్రస్తుతం  తెలుసుకుందాం. అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్ అత్యంత ప్రమాదకరమైన కుక్కలు మొదటి స్థానంలో అమెరికన్  పిట్ బుల్ టెర్రియర్  ఉంటుంది.  ఇది చూడడానికి చాలా బలమైన కండరాలతో, శక్తివంతమైన దవడల తో, పదునైన పళ్ళతో భయంకరంగా ఉంటుంది.  దీనిని సరిగ్గా ట్రైన్ చేయకపోతే,  సామాజికీకరణ చేయకపోతే మనుషుల ప్రాణాలను  నిలువునా తీస్తుంది.రోట్‌వీలర్ డాగ్‌ ప్రమాదకరమైన కుక్కలలో రెండవ స్థానంలో రోట్‌వీలర్ డాగ్‌ ఉంటుంది.  ఈ కుక్కలను ఎక్కువగా ఇంటిదగ్గర సెక్యూరిటీ కోసం పెట్టుకుంటూ ఉంటారు.  ఈ కుక్కలు కూడా చాలా బలంగా దృఢంగా, బలమైన దవడల తో ఉంటాయి.  ఇవి తెలియని వారు ఎవరైనా వస్తే వారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తాయి.  అవతల వాళ్ళు భయపడేలా ప్రమాదకరంగా మీదికి  దూకుతాయి. జర్మన్ షెఫర్డ్ ప్రమాదకరమైన కుక్కలలో మూడవ స్థానంలో  జర్మన్ షెఫర్డ్ ఉంటుంది దీన్ని సాధారణంగా మనం చాలామంది ఇళ్లల్లో గమనిస్తుంటాం. ఈ కుక్కలు చాలా శక్తివంతమైన కుక్కలు అంతేకాదు అత్యంత తెలివైన కుక్కలు కూడా.  వీటిని పోలీసులు, ఆర్మీ దొంగలను పట్టుకోవడానికి,  ప్రమాదాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.  ఇవి నమ్మకమైన కుక్కలే అయినప్పటికీ వాటిని సరిగా ట్రైన్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.డోబెర్మాన్ పిన్షర్ ఇక ప్రమాదకరమైన కుక్కలలో  4వ స్థానంలో ఉంది డోబెర్మాన్ పిన్షర్.  ఈ కుక్కను కూడా చాలా మంది

German Shepherd News Keyword | Telugu Digital