translateexpand_more

Gold Jewelry News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu01 Jun, 12:23 pm
మెడలో బంగారం వేసుకుంటే చాలు.. ఇన్ని హెల్త్ బెనిఫిట్సా

మెడలో బంగారు ఆభరణాలు ధరిస్తే వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. బంగారం స్పర్శ వల్ల మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మెడ దగ్గర ఉండే ముఖ్యమైన నాడీ కేంద్రాలపై బంగారం ప్రభావం చూపుతుంది. దీనివల్ల శరీరంలో ప్రాణశక్తి ప్రవాహం సక్రమంగా ఉంటుంది. ప్రాచీన విశ్వాసాల ప్రకారం, మెడలో బంగారం ధరించడం గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బంగారం ధరించడం వల్ల జ్వరం, చర్మ వ్యాధులు, ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమ సమస్యలు తగ్గుతాయి. బంగారాన్ని శక్తినిచ్చే లోహంగా భావిస్తారు. మెడలో బంగారం ధరిస్తే దిష్టి తగలదని, నెగెటివ్ ఎనర్జీ నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. మెడలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది సంపదకు చిహ్నం. శుభకార్యాలలో బంగారం వాడకం.. అది శుభప్రదమని, మంగళకరం అని సూచిస్తుంది. Pineapple Benefits: పరగడపున పైనాపిల్ జ్యూస్ తాగితే ఏమవుతుంది? Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా Coconut Water: రోజూ కొబ్బరి నీళ్లు తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?