translateexpand_more

H 1b Salary Rules News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 03:54 pm
హెచ్-1బీ వీసా కనీస వేతనం పెంపు ప్రతిపాదన.. 13 యూఎస్ రాష్ట్రాల మద్దతు

హెచ్-1బీ వీసా ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచాలన్న కార్మిక శాఖ ప్రతిపాదనకు 13 రాష్ట్రాలు మద్దతు తెలిపాయి. ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసాతో పాటు ఇతర వీసాల్లో కనీస వేతనాన్ని పెంచాలని ఇండియానా రాష్ట్ర (యూఎస్) అటార్నీ జనరల్ టాడ్ రోకిటా డిమాండ్ చేశారు. తక్కువ జీతాలతో విదేశీ ఉద్యోగులను అమెరికన్ కంపెనీలు నియమించుకుంటున్న వైనానికి ఫుల్ స్టాప్ పడాలని అన్నారు. హెచ్-1బీతో పాటు హెచ్-1బీ1, ఈ-3, పీఈఆర్‌ఎమ్ ప్రోగ్రామ్‌ల కింద ఉన్న విదేశీ ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచాలని అమెరికా కార్మిక శాఖ ఇటీవల ఒక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే 13 రాష్ట్రాలు మద్దతు ప్రకటించాయని ఆయన తెలిపారు. హెచ్-1బీ వీసాతో కంపెనీలు తక్కవ జీతాలకు విదేశీ వర్కర్లను నియమించుకుంటూ అమెరికన్లకు జాబ్స్‌ను దూరం చేస్తున్నాయని 13 రాష్ట్రాల కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వీసాలతో వర్కర్ల సగటు వేతనం పెరగకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తోంది. కొన్ని సంస్థలు అసలు అమెరికన్ ఉద్యోగుల గురించి ప్రయత్నించకుండానే నేరుగా హెచ్-1బీ వీసాల వారికి జాబ్స్ ఇస్తున్నాయని రాష్ట్రాల ప్రతినిధులు తెలిపారు. ఈ తీరుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుత వీసా విధానంలోని రక్షణలను సరిపోవని వాదిస్తున్నారు. ఇంతకంటే హానికారక, విపత్కర కార్యక్రమం మరొకటి లేదని రోకిటా వ్యాఖ్యానించారు. ఈ దిశగా గళమెత్తుతున్న రాష్ట్రాలను ముందుండి నడిపించే అవకాశం తనకు దక్కడం గర్వకారణమని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..