
హైదరాబాద్ లో ప్రఖ్యాత విదేశీ విద్యాసంస్థలు.. సీఎంకు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం నివేదిక
హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇటీవల బ్రిటన్, అమెరికా దేశాల్లో చేపట్టిన సుదీర్ఘ పర్యటన విజయవంతమైంది. ఈ విదేశీ పర్యటనలో సాధించిన చారిత్రాత్మక పురోగతి, ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో కుదిరిన కీలక ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు (MoUs), లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)ల సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. ఐటీ, పరిశ్రమలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, పరిశోధన, డిఫెన్స్ రంగాల్లో ఇప్పటికే ప్రపంచ పటంలో ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్ నగరాన్ని, ఇప్పుడు అంతర్జాతీయ విద్యా, నైపుణ్య రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. కమిటీ నివేదిక ప్రకారం అమెరికాలోని అత్యుత్తమ ‘నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ’తో పాటు బ్రిటన్‌లోని 17 స్వతంత్ర విద్యాసంస్థల సమాఖ్య అయిన ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’ భారత్‌లోనే తమ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన అంగీకారం తెలిపాయి. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ వర్సిటీ తమ క్యాంపస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను ముమ్మరంగా పరిశీలిస్తోంది. దీనికితోడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ హైదరాబాద్‌లోని డాక్టర్ MCR HRD ఇన్స్టిట్యూట్ వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ రంగ ప్రతినిధుల కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ అంతర్జాతీయ కోర్సులు రాబోయే నవంబర్ నెల నుంచే నగరంలో ప్రత్యక్షంగా ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS), ఆక్స్ఫర్డ్