translateexpand_more

Hyderabad Metro Viral Video News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 11:50 am
బ్రిటన్ ట్రావెల్ వ్లాగర్ ప్రశంసల వర్షం

హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ న్యూయార్క్ మెట్రో కంటే కూడా హైదరాబాద్ మెట్రో చాలా బాగుందంటూ మెచ్చుకున్నాడు. హైదరాబాద్, జూన్ 02: హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్.. న్యూయార్క్ మెట్రో కంటే కూడా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అత్యంత అనుకూలంగా ఉందంటూ కొనియాడారు. భారత పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌ను సందర్శించిన ఇషాక్ ప్యాటర్సన్ మెట్రోలో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ ‘పబ్లిక్ మెట్రో ఇన్ హైదరాబాద్’ అనే పేరుతో తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘హైదరాబాద్ మెట్రో ఎంతో అద్భుతంగా ఉంది. నేను నా జీవితంలో ఇప్పటివరకు చూసిన మెట్రో రవాణా వ్యవస్థల్లో నాకు హైదరాబాద్ మెట్రో ఇష్టంగా నిలిచిపోతుంది’ అని ఇషాక్ తన వీడియోలో పేర్కొన్నారు. ఇక్కడ మెట్రో స్టేషన్ల నిర్వహణ, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రైళ్లలో ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన ప్రకటనలు కూడా తనకు ఎంతో నచ్చాయని ఇషాక్ వెల్లడించారు. ప్రపంచంలోని అనేక నగరాల మెట్రో వ్యవస్థలను చూసిన తనకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేకంగా కనిపించిందని పేర్కొన్నారు. ఇషాక్ ప్యాటర్సన్ షేర్ చేసిన వీడియో గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విదేశీయులు సైతం హైదరాబాద్ మెట్రో మౌలిక వసతులను, పరిశుభ్రతను అంతర్జాతీయ ప్రమాణాలతో పోలుస్తూ ప్రశంసించడం పట్ల తెలుగు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థకు ఈ ప్రశంస ఒక నిదర్శనమని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీబీఎస్‌ఈ చీఫ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. టీఎంసీ రెబల్స్ కొత్త పార్టీ.. తెరపైకి ‘అస్లీ తృణమూల్’..

Hyderabad Metro Viral Video News Keyword | Telugu Digital