
ఢిల్లీ వాతావరణం తాజా సమాచారం
న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ (imd) ఈ రోజు, సెప్టెంబర్ 16న వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. అందువల్ల, నివాసితులు తమ రోజును అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని సూచ
© 2026 telugu.digital

న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ (imd) ఈ రోజు, సెప్టెంబర్ 16న వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. అందువల్ల, నివాసితులు తమ రోజును అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని సూచ

ఈనెల 19 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం..తెలుగు రాష్ట్రాల్లో 18-20 తేదీల్లో భారీ వర్షాలు: IMD వెల్లడి.

ఎలాంటి లవ్ ట్రాక్‌లు, అనవసర పాటలు లేని పక్కా గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ సినిమా మీకు బెస్ట్ ఆప్షన్. ఐఎమ్ డీబీలో 8.2 రేటింగ్ తో ఉన్న ఈ సినిమా రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

దేశ వ్యవసాయ రంగానికి జీవనధారమైన నైరుతి రుతుపవనాల తిరోగమనంపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని వారాలుగా విరివిగా వర్షాలు పడుతున్నాయి. ఈ వాతావరణ పరిస్థితులు రాబోయే కొన్ని రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (imd)

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే వర్ష సంబంధిత ఘటనల్లో 12 మంది మృతి చెందినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) వెల్లడించాయి (Uttarakhand heavy rain). భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు (Uttarakhand rain alert). భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి (12 dead Uttarakhand). అల్మోరాలోని ఒడ్యూదా గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఘటనలో అల్మోరా పట్టణంలోని ధార్కితుని ప్రాంతంలో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు నేపాలీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్‌లోని కండోలీ బ్రిడ్జి సమీపంలో భారీగా ప్రవహించిన నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో మహిళను రక్షించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్ నినో ప్రభావంతో వర్ష పాతం తక్కువగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ నెలలోనూ ఆశించిన స్థాయి లో వర్షాలు లేవని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణం, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాల కు తాజా హెచ్చరికలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పై ఐఎండీ తాజా అలర్ట్స్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అదే విధంగా వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.వారికి మూడు నెలలకోసారి సుపథం ద్వారా శ్రీవారి దర్శనం, సబ్సిడీ ధరకు లడ్డూలు..!!ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్ఇక, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుందని, పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో

దేశంలో వాతావరణం రూటు మార్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెల ఉడుకెత్తిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం 1901 నుంచి చూస్తే, అంటే గత 125 ఏళ్ల హిస్టరీలోనే ఈసారి ఆగస్టు అత్యంత వేడి నెలగా నమోదైంది. సాధారణంగా ఆగస్టులో వర్షాలు దంచి కొట్టాలి. కానీ ఈసారి వానలు తగ్గుముఖం పట్టి ఎండలు మండిపోయాయి. సెప్టెంబరు నెలలో కూడా పెద్దగా వర్షాలు పడేలా కనిపించడం లేదు. ఈ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ తన రిపోర్టులో స్పష్టం చేసింది. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా మారిన 'ఎల్ నినో' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 28.01 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 0.67 డిగ్రీలు ఎక్కువ. రాత్రి వేళల్లో ఉండే సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా 24.36 డిగ్రీలకు చేరుకుని 125 ఏళ్ల రికార్డును తిరగరాసింది. వర్షాల విషయానికి వస్తే దేశంలో ఆగస్టులో కేవలం 213.3 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం తక్కువ. 2001 సంవత్సరం తర్వాత చూస్తే ఇదే 7వ అత్యల్ప వర్షపాతం కావడం గమనార్హం. ఆగస్టు 31 నాటికి దేశంలో మొత్తం వర్షపాతం లోటు 14 శాతంగా ఉంది. వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన మధ్యస్థ నుంచి తీవ్రమైన 'ఎల్ నినో' పరిస్థితులే ఈ తీవ్రమైన మార్పులకు కారణమని చెప్పారు. పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల మాన్సూన్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఆగస్టు నెలలో 4 అల్పపీడనాలు ఏర్పడి దాదాపు 26 రోజుల పాటు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, వాటి ప్రభావం కేవలం ఇండో-గంగా మైదాన ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో మిగిలిన దేశమంతా వర్షాలు లేక ఎండలు, తీవ్రమైన

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతోంది, వర్షాలు పడతాయా లేదా అనే విషయాలపై స్పష్టమైన సూచనలు విడుదల చేసింది. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఈ మేరకు 7 రోజుల వెదర్ రిపోర్టును అధికారికంగా అందించాయి. ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించి పెద్ద ప్రమాదకర హెచ్చరికలేవీ లేవు. అయితే, కొన్ని రోజులు ఉపరితల గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో వాతావరణం కాస్త భిన్నంగా ఉండబోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలతో పాటు యానాం ప్రాంతంలో ఆగస్టు 31 రాత్రి నుండి సెప్టెంబర్ 1 ఉదయం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 5 వరకు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 40-50 kmph వేగంతో గాలులు వీస్తాయి. సెప్టెంబర్ 5 తర్వాత వర్షాలు ఉన్నప్పటికీ గాలుల హెచ్చరికలు ఏమీ ఉండవు. దక్షిణ కోస్తా ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో ఈ వారం మొత్తంలో ఒక్కటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ పరిధిలోని చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో

సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, అదే సమయంలో ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.ఐఎండీ అంచనాల ప్రకారం, సెప్టెంబర్‌లో దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) వర్షపాతంలో 91 శాతం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో సగటు వర్షపాతం 167.9 మిల్లీమీటర్లుగా ఉంటుంది. దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, అయితే వాయవ్య, ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.మరోవైపు, దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. దీనివల్ల వాతావరణంలో వేడి, ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ‘ఎల్ నినో’ పరిస్థితులు నెలకొనడమే ఈ వాతావరణ మార్పులకు ప్రధాన కారణమని ఐఎండీ వివరించింది. ఈ ఎల్ నినో ప్రభావం మున్ముందు మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షపాతం తగ్గడం వల్ల వ్యవసాయం, జలవనరులు, జలవిద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంబంధించి ఈశాన్య రుతుపవనాలపై అంచనాలను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేస్తామని ఐఎండీ వెల్లడించింది