translateexpand_more

Ipl Code Of Conduct Violation News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 04:12 pm
ఐపీఎల్ 2026 ఫైనల్ లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ హిట్టర్ పై భారీ జరిమానా, నిషేధం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన టాటా ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపడమే కాకుండా ఒక వివాదానికి కూడా కేంద్రబిందువైంది. ఈ హై-వోల్టేజ్ పోరులో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ మైదానంలో ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతనికి మ్యాచ్ ఫీజులో 50 శాతం భారీ జరిమానా విధించడమే కాకుండా, రెండు డీమెరిట్ పాయింట్లను కూడా కేటాయించారు. ఈ వివాదాస్పద ఘటన మొదటి ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో చోటుచేసుకుంది. ఒక వికెట్ పడిన తర్వాత తీవ్ర నిరాశకు లేదా అసహనానికి లోనైన టిమ్ డేవిడ్, మైదానంలో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ వైపు కోపంతో ఐస్ బ్యాగ్‌ను విసిరాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.9 ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్ళు, అంపైర్లు, మ్యాచ్ రెఫరీ లేదా ఏ ఇతర వ్యక్తి వైపునకైనా బంతిని లేదా వాటర్ బాటిల్స్, ఐస్ బ్యాగ్స్ వంటి క్రికెట్ పరికరాలను ప్రమాదకరమైన రీతిలో విసరడం తీవ్రమైన నేరం. డేవిడ్ చేసిన ఈ పని లెవెల్ 1 ఉల్లంఘన కిందికి వచ్చింది. మ్యాచ్ అనంతరం మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఈ శిక్షను, తన తప్పును టిమ్ డేవిడ్ అంగీకరించాడు. ఈ సీజన్‌లో టిమ్ డేవిడ్ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో మ్యాచ్ 20లో మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించి ఒక డీమెరిట్ పాయింట్, ఆ తర్వాత మ్యాచ్ 54లో రెండోసారి తప్పు చేసి మరో రెండు డీమెరిట్ పాయింట్లు లీగ్ దశలోనే మూటగట్టుకున్నాడు.

Ipl Code Of Conduct Violation News Keyword | Telugu Digital