translateexpand_more

Jantar Mantar Protest Neet News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 01:08 am
న భారత్ కు కాక్రోచ్ ’ అధినేత

ఢిల్లీలో ‘నీట్‌’ నిరసనల్లో పాల్గొంటానన్న అభిజీత్‌ దీప్కే

న్యూఢిల్లీ, జూన్‌ 1:  కాక్రోచ్‌ జనతాపార్టీ(సీజేపీ) వ్యవస్థాపక నేత అభిజీత్‌దీప్కే భారత్‌కు వస్తున్నారు. నీట్‌ పరీక్షాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతానని, కేంద్ర విద్యామంత్రి ధరేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుత ఆందోళన కార్యక్రమాన్ని ఈ నెల 6న ప్రారంభిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో, పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. అభిజీత్‌ ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో ఉన్నారు. నీట్‌ లీకేజీ వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంత పెద్ద తప్పు జరిగిన తర్వాత కూడా కేంద్ర మంత్రి వైదొలగకపోతే దేశంలో జవాబుదారీతనం లేనట్టే. నీట్‌ లీకేజీకి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలకు మా పార్టీ మద్దతుగా నిలుస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఒక్కటయ్యేందుకు, శాంతియుతంగా నిరసన గళం వినిపించేందుకు ఇదే సరైన సమయం’’ అని పేర్కొన్నారు. జంతర్‌మంతర్‌ వద్ద తమ కార్యక్రమానికి పోలీసుల అనుమతిని ముందే కోరామని, శాంతియుత నిరసనలను దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలు అనుమతిస్తాయనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. తాను భారత్‌కు చేరుకున్న వెంటనే విమానాశ్రయంలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని దీప్కే తెలిపారు.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం