
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
© 2026 telugu.digital

Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?

టాలీవుడ్ లో ఘనవిజయాలు అందించే కొన్ని సక్సెస్ ఫార్ములాలు ఉంటాయి. వాటిలో యమలోకం కాన్సెప్ట్ ఒకటి. ఈ కథాంశంతో వచ్చిన ఎక్కువ చిత్రాలు తెలుగులో కాసుల వర్షం కురిపించాయి. హీరోలు యమలోకానికి వెళ్లడం లేదా యముడే భూలోకానికి రావడం ఈ తరహా కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వరకు ఈ ఫార్ములాతో సక్సెస్ అందుకున్నారు. ఎన్టీఆర్ యమగోల, చిరంజీవి యముడికి మొగుడు, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రాలలో హీరోలు యమలోకానికి వెళ్లి తిరిగి భూమిపైకి వస్తారు. అల్లరి నరేష్ యముడికి మొగుడు మూవీ కూడా అదే కాన్సెప్ట్. అలీ యమలీల సినిమాలో యముడే భూలోకానికి వస్తాడు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. నాగార్జున కూడా ఇదే తరహా కాన్సెప్ట్ తో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు లాంటి హిట్స్ అందుకున్నారు. కానీ ఈ ఫార్ములా మాస్ మహారాజ రవితేజకి మాత్రం కలసి రాలేదు. యమలోకం కాన్సెప్ట్ తో రవితేజ నటించిన దరువు చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఇది అంత బ్యాడ్ మూవీ కాదు. కనీసం యావరేజ్ సినిమాగా ఆడి ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పటికీ ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్లు యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకే ఒక్క తప్పు వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు మీద ఉన్న టైంలో దరువు చిత్రాన్ని రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ హోరులో దరువు చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దరువు ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం ఇదే. సోలోగా రిలీజ్ అయి ఉంటే అబౌ యావరేజ్ లేదా హిట్ అయ్యే అవకాశాలు ఉండేవి. టీవీల్లో, యూట్యూబ్ లో ఈ సినిమాని ప్రేక్షకులు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్, రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమై, సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ముందుగా అనుకున్నట్టుగా 2027 జూన్ 11న రిలీజ్ ఉంటుందా లేదా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు మైత్రి నిర్మాత రవిశంకర్ బదులిచ్చారు. తాజాగా జరిగిన ఇరుముడి ప్రెస్ మీట్ లో రవిశంకర్ మాట్లాడుతూ.. "రెండు వారాల తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పటినుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది." అని చెప్పారు. ఫ్రెష్ లవ్ స్టోరీ: 'రోమాంచకం'లో ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు.. సుమంత్ ప్రభాస్ కాన్ఫిడెన్స్.!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా నిర్మాతలు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు.ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమవడంతో శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన ఇప్పట్లో 'డ్రాగన్' సెట్స్ లో అడుగుపెడతారో లేదో అనే సందేహాలు వచ్చాయి. అయితే మరో రెండు వారాల్లో 'డ్రాగన్' షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని మైత్రీ నిర్మాత రవి శంకర్ చెబుతున్నారు. 'ఇరుముడి' లేటెస్ట్ ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడారు. ప్లాన్ చేసిన్నట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తామని, ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాని రిలీజ్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.రెండు వారాల తర్వాత 'డ్రాగన్' షూటింగ్ బిగిన్ అవుతుంది. కంటిన్యూస్ గా షూట్ చేసి, ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తాం. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగానే వచ్చే ఏడాది జూన్ లో బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది'' అని రవి శంకర్ పేర్కొన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే షెడ్యూల్ లో తారక్ పాల్గొంటారా లేదా? అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.నిజానికి ఎన్టీఆర్ గాయపడినా 'డ్రాగన్' మూవీ షూటింగుకి బ్రేకులు పడలేదు. హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాత చెప్పినదాన్ని బట్టి, సెప్టెంబర్ రెండో వారంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కీలకమైన టాకీ పార్ట్స్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.'డ్రాగన్' సినిమాని

జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ భార్య నందమూరి దీపిక రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆమె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాలతో మమేకమవుతూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా తన ఇంట్లో కాఫీ తాగుతూ సరదాగా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు నందమూరి దీపికా జానకిరామ్

స్టార్ హీరోలు నటించే సినిమాలలో అభిమానులు అన్ని విషయాలు గమనిస్తుంటారు. హీరో లుక్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అభిమానులకు ఉంటుంది. వాళ్ళ అంచనాలకు తగ్గకుండా హీరో లుక్ ఉంటే అక్కడి నుంచే సినిమాపై క్రేజ్ మొదలవుతుంది. ఆ విధంగా హీరోల లుక్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ హీరోల లుక్స్ బావున్నప్పటికీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలూ ఉన్నాయి. పవన్, మహేష్, ఎన్టీఆర్, నాగార్జున లాంటి హీరోల లుక్స్ కి మంచి క్రేజ్ వచ్చింది కానీ ఆ సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ లుక్స్ లో పంజా మూవీ ముందు వరుసలో ఉంటుంది. అప్పటికి సరైన హిట్ లేక పవన్ అభిమానులు ఆకలి మీద ఉన్నారు. పంజాలో బియర్డ్ లుక్ బయటకి రాగానే ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అని అంతా భావించారు. కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా రిలీజ్ అభిమానుల ఆశలు ఆవిరి చేసింది. మహేష్ బాబు అందంగా కనిపించని సినిమా అంటూ ఉండదు. అయినప్పటికీ కొన్ని బెస్ట్ లుక్స్ ఉండే సినిమాలు ఉంటాయి. సర్కారు వారి పాట మూవీలో ఉబెర్ కూల్ లుక్ లో మహేష్ కనిపించారు. సినిమా నిరాశ పరిచింది. ఖలేజా కూడా అంతే. ఆ మూవీలో మహేష్ చాలా స్టైలిష్ గా ఉంటారు. కానీ సంబంధం లేని కామెడీ కారణంగా ఆ చిత్రం ఫ్లాప్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ని చాలా యంగ్ గా, స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సక్సెస్ అయ్యారు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. రామయ్య వస్తావయ్యాలో తారక్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో బన్నీ స్టైలిష్ లుక్స్ మైంటైన్

ఓర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాని విడుదల చేసింది. ఇందులో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ దుమ్ములేపారు. ఎన్టీఆర్ మళ్లీ లిస్ట్ లోకి రాగా, రామ్ చరణ్‌కి పెద్ద షాక్ ఇచ్చారు మహేష్ బాబు. అదే సమయంలో సూర్య తన సత్తాని చాటుకున్నారు. మరి ఇండియాలో టాప్ హీరో ఎవరనేది, టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారనేది చూస్తే. మొదటిస్థానం గురించి అందరు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఆ స్థానంలో ఒక్కరే ఉన్నారు. ఒక్కరే శాసిస్తున్నారు. ఆయనే ప్రభాస్. చాలా కాలంగా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా నెంబర్ 1గా నిలిచారు. తనదైన ఇమేజ్, పాపులారిటీ, భారీ సినిమాలతో నిత్యం చర్చల్లో ఉంటారు ప్రభాస్. దీంతో నెంబర్ 1గా రాణిస్తున్నారు. మిగిలిన హీరోల స్థానాలు నిత్యం మారుతూనే ఉన్నాయి. కానీ తన స్థానంలో మార్పు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాల్లో నటిస్తున్నారు. రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. ఆయన జూన్‌లో మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చారు. అదే సమయంలో నాల్గో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌కి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు రెండు మూడు స్థానాల్లోకి రావడంతో షారూఖ్ నాల్గో స్థానంలోకి పడిపోయారు. బన్నీ ప్రస్తుతం `రాకా`లో నటిస్తున్నారు. ఐదో స్థానంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఆయన జూన్‌లో ఆరో స్థానంలో ఉన్నారు. కానీ జులైలో రామ్ చరణ్‌కి ఝలక్ ఇస్తూ 5వ స్థానంలోకి రావడం విశేషం. రామ్ చరణ్ గురించి గత నెలలో పెద్దికి సంబంధించిన చర్చ జరిగినా కూడా ఆయన పడిపోవడం గమనార్హం. అదే సమయంలో ఎలాంటి చర్చ లేకుండా మహేష్ బాబు ఒక్క స్థానం మెరుగుపడ్డారు. ఐదో
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 94 ఏళ్ల వయసులో ఇవాళ చెన్నైలో తుది శ్వాస విడిచారు. తొలి చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న జానకి.. వివిధ భాషల్లో 400కి పైగా సినిమాల్లో నటించారు. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు. దిగ్గజ నటి ఇకలేరని తెలిసి సినీ ప్రముఖులు, సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.''ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి'' అని చిరంజీవి పోస్ట్ చేశారు.షావుకారు జానకితో తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమని నందమూరి బాలకృష్ణ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ''మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా ఎన్టీఆర్ బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కీలక పాత్ర పోషించారు''''పాండురంగ మహాత్మ్యం' నుంచీ ఎన్టీఆర్ బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడి వైపున