
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జూన్ 2 ఒక అత్యంత అరుదైన, చారిత్రాత్మకమైన రోజుగా మారబోతోంది. ఈ రోజున నవగ్రహాలలో దేవగురువుగా పిలవబడే బృహస్పతి (గురుడు) మిథున రాశి నుంచి తన ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.గురుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల విశ్వంలో హంస రాజయోగం ఏర్పడుతోంది. సూర్యుడు వృషభ రాశిలో, కుజుడు మేష రాశిలో,శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నారు.  జూన్ 2 గ్రహ సంచారం వల్ల 12 రాశుల ఫలితాలు ఈ విధంగా ఉండనున్నాయి.  మేష రాశి గురుడు మీ రాశి నుంచి 4వ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచరించడం వల్ల మీకు గృహ, వాహన యోగాలు కలుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి మీ రాశిలో సూర్య, కుజుల ప్రభావం వల్ల కాస్త ఆవేశం పెరిగే అవకాశం ఉంది. అయితే, తృతీయ స్థానంలో ఉచ్ఛ గురువు ఉండటం వల్ల మీ ప్రయత్నాలు అన్నింటిలోనూ విజయం సిద్ధిస్తుంది. సమాజంలో ఆత్మవిశ్వాసం, గౌరవం పెరుగుతాయి. మిథున రాశి ధన స్థానంలో ఉచ్ఛ గురుడి సంచారం వల్ల మీ ఆర్థిక సమస్యలు సమూలంగా దూరం అవుతాయి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు కలిసివస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన ప్రాప్తి కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. కర్కాటక రాశి మీ జన్మ రాశిలోనే గురు భగవానుడు ఉచ్ఛ స్థితిలోకి రావడం వల్ల మీకు పూర్తి రాజయోగం పట్టబోతోంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ అదృష్టం మారుతుంది. సమాజంలో ఉన్నత గౌరవం, వ్యాపారంలో అద్భుతమైన లాభాలు ప్రాప్తిస్తాయి. సింహ రాశి మీ రాశి వారికి ఆదాయ మార్గాలు బాగున్నప్పటికీ, 12వ ఇంట ఉచ్ఛ గురువు సంచరించడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు, శుభకార్యాల కొరకు ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యయాలను తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కన్యా రాశిలాభ స్థానంలో ఉచ్ఛ గురువు మీ ఆదాయ మార్గాలను అనూహ్యంగా పెంచుతాడు. స్నేహితులు, బంధువుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు లేదా ఉన్నత పదవులు లభించే సూచనలు ఉన్నాయి. తులా రాశి దశమ స్థానమైన కర్మ స్థానంలో ఉచ్ఛ గురు సంచారం వల్ల కెరీర్‌లో ఊహించని సానుకూల మార్పులు వస్తాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి ఈ సమయం మీకు సంతోషాన్ని, పురోగతిని తెచ్చిపెడుతుంది. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. తండ్రి తరపు నుంచి ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది. మీరు పడే కఠోర శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనస్సు రాశి మీ రాశి అధిపతి అయిన గురుడు 8వ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల అకస్మాత్తుగా కొన్ని ఖర్చులు వచ్చి పడతాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.జూన్ లో కర్కాటకరాశిలో శుక్ర సంచారంతో వీరికి సంపదలు, విలాసాల వెల్లువ! మకర రాశి సప్తమ స్థానంలో ఉచ్ఛ గురువు రాకతో కుటుంబంలో ఉన్న పాత వివాదాలు, మనస్పర్థలు తొలిగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. కుంభ రాశిగురుడు 6వ ఇంట సంచరించడం వల్ల శత్రు, రుణ బాధల నుంచి కొద్దిగా ఉపశమనం లభించినప్పటికీ, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పనిభారం మరియు మానసిక ఒత్తిడి పెరుగుతాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. మీన రాశి పంచమ స్థానంలో గురుడి సంచారం వల్ల సంతాన ప్రగతి, విద్య, మరియు ప్రేమ వ్యవహారాల్లో అద్భుతమైన అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ సృజనాత్మకతకు ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.గమనిక: గ్రహ సంచార ఫలితాలు అనేవి గోచార రీత్యా సాధారణంగా లెక్కించబడినవి. మీ వ్యక్తిగత జాతకంలోని దశా-అంతర్దశల ఆధారంగా ఈ ఫలితాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.