Karthika Deepam June 01 Episode: ఆస్తి కోసం, ఆఫీస్ పెత్తనం కోసం కలలు కంటున్న జోత్స్నకి నిన్నటి ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు పెద్దాయన శివన్నారాయణ. ఇక ఈరోజు (జూన్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. జ్యోత్స్స కోసం స్టాల్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు సూరజ్. అప్పుడే కార్తీక్ జ్యోత్స్న, పారిజాతంను తీసుకుని స్టాల్ వద్దకు వస్తాడు. "నా బ్రదర్ టైమింగ్ ఎప్పుడూ మిస్ అవ్వదు " అంటాడు సూరజ్ కార్తీక్ ను చూస్తూ. "ఏంటీ పెద్ద మేడమ్ గారు. కారు దిగరేంటీ.. మనం వచ్చింది ఊరికే చూడటానికి కాదు. పని చేయడానికి. దిగండి దిగండి " అంటాడు కార్తీక్ వెటకారంగా. "రాత్రి నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి రావు అనుకున్నానే" అంటుంది పారిజాతం. "ఎప్పుడు ఏం చేయాలో జ్యోత్స్నకు బాగా తెలుసు గ్రానీ. నేను తల దించుకున్న అందులో ఏదో మంచే ఉంటుంది. నేను వస్తే వీడికి ఏదో మంచి జరుగుతుంది అనుకుంటున్నాడు. ఏం చేస్తానో చూడు" అంటుంది జ్యోత్స్న పొగరుగా. "మళ్లీ ఏం చేస్తావే" అంటుంది పారిజాతం కంగారుగా. "ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా"అంటుంది జ్యోత్స్న.నా వల్ల తప్పు జరిగింది.. జోత్స్నకి దిమ్మతిరిగే షాక్ "హాలో పెద్ద మేడమ్ గారు. నువ్వొచ్చింది కారులో కూర్చుని కబుర్లు చెప్పడానికి కాదు. పని చేయడానికి. అక్కడ కస్టమర్లు వెయిటింగ్" అంటాడు కార్తీక్. "దిగుతున్నాం రా" అంటుంది పారిజాతం. సూరజ్ స్టాల్ ముందు జ్యోత్స్న పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో "నావల్ల తప్పు జరిగింది... సూరజ్ హెల్తీ ఫుడ్స్ ఈజ్ ది బెస్ట్ " అని రాసి ఉండడం చూసి షాకవుతుంది జ్యోత్స్న. "అవి కేవలం అక్షరాలు మాత్రమే కాదు. నేను ఇచ్చే
Karthika Deepam 685 Episode News
Latest updates from Telugu Digital news sources.
Samayam Telugu01 Jun, 02:30 am
జ్యోకి రక్తకన్నీరు.. అటు కార్తీక్ ఇటు సూరజ్ ఒకే వాయింపు.. తప్పించుకోలేక అల్లాడిన సైకో పాప.. ఇది కదా