
Nara Brahmani: ఘనంగా మొదలయిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. సందడి చేసిన నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్.. ఫొటోలు..
నేడు మంగళగిరిలో ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమయింది. ఈ ప్రారంభ వేడుకకు నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్ హాజరయ్యారు.
© 2026 telugu.digital

నేడు మంగళగిరిలో ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమయింది. ఈ ప్రారంభ వేడుకకు నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్ హాజరయ్యారు.

Sher-E-Punjab T20 League 2026: షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్ 2026లో అమృత్సర్ సుర్మా జట్టు లుధియానా లయన్స్‌ను ఓడించింది. అయితే, ఈ టోర్నమెంట్లో ఐపీఎల్ సెన్సేషన్ నమన్ ధీర్ అత్యధిక పరుగులతో తోపు ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తంగా 655 పరుగులతో బౌలర్ల భరతం పట్టాడు.

European T20 Premier League: యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (European T20 Premier League, ETPL) పోరులో బెల్ఫాస్ట్ వోల్వ్స్ (Belfast Wolves) అదరగొట్టింది. ఆస్ట్రేలియా దిగ్గజాలు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ హెడెన్ జట్ల నడుమ సాగిన మ్యాచ్‌లో 23 ఏళ్ల యువ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. దీంతో హెడెన్ టీమ్ ఊహించని రీతిలో కుప్పకూలి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.


కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు. ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో అద్భుతమైన ఫీల్డింగ్‌కు మారుపేరుగా నిలిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ మరోసారి సత్తా చాటాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2026లో బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన సింగిల్ హ్యాండెడ్ క్రేజీ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ క్యాచ్ పట్టి ఫిలిప్స్ కూడా కాసేపు ఆశ్చర్యపోయాడు. గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ ముగిసేసరికి స్కోరు 17/0. ఈ సమయంలో డ్వైన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్ ఆడాడు. బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్.. బౌండరీ లైన్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి, గాల్లోకి ఎగిరి కేవలం ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అది అంత సులభమైన క్యాచ్ కాదు. బౌండరీ లైన్‌ను తాకకుండా అద్భుతమైన టైమింగ్‌తో బంతిని ఒంటి చేత్తో అందుకున్న ఫిలిప్స్.. వెంటనే తన చేతిని, క్యాచ్‌ను చూసుకుని తానే నమ్మలేనట్లుగా స్పందించాడు. ఫిలిప్స్‌కు ఇలాంటి అద్భుత క్యాచ్‌లు కొత్తేమీ కాదు. ఒంటి చేత్తో, డైవ్ చేస్తూ, గాల్లోకి ఎగిరి అసాధ్యంగా కనిపించే క్యాచ్‌లను కూడా అతడు సునాయాసంగా అందుకుంటుంటాడు. అందుకే అభిమానులు, కామెంటేటర్లు అతడిని ముద్దుగా ‘సూపర్‌మ్యాన్’ అని పిలుస్తుంటారు. CPLలో ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో క్రికెట్ అభిమానులు అతడి ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 112 క్యాచ్‌లు అందుకున్న ఫిలిప్స్.. రనౌట్లు

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లుసానె డైమండ్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో తన అత్యుత్తమ త్రో నమోదు చేసినప్పటికీ, కేవలం త్రుటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకున్నాడు. నేడు జరిగిన ఈ పోటీలో శ్రీలంక అథ్లెట్ రుమేశ్ పతిరగే మరోసారి నీరజ్‌పై ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలిచాడు.పోటీ ఆరంభం నుంచే తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. నీరజ్ తన తొలి ప్రయత్నంలో 83.54 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. అయితే, తన రెండో ప్రయత్నంలో ఏకంగా 88.05 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి ఒక్కసారిగా అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. ఇది ఈ 2026 సీజన్లో నీరజ్‌కు అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. దీంతో నీరజ్‌కు స్వర్ణం ఖాయమని అంతా భావించారు.కానీ, శ్రీలంక అథ్లెట్ పతిరగే అంత తేలిగ్గా వదల్లేదు. తన మూడో ప్రయత్నంలో 88.14 మీటర్ల దూరం విసిరి నీరజ్‌ను వెనక్కి నెట్టి తిరిగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత నీరజ్ తన తదుపరి ప్రయత్నంలో 83.72 మీటర్లు విసరగా, నాలుగో ప్రయత్నం ఫౌల్ అయింది. ఐదో ప్రయత్నాన్ని నీరజ్ వదిలేయగా, చివరి ఆరో ప్రయత్నంలో 82 మీటర్లు మాత్రమే విసరడంతో పతిరగే విజయం ఖాయమైంది. ఈ పోటీలో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 86.69 మీటర్ల త్రోతో మూడో స్థానంలో నిలిచాడు.ఈ సీజన్లో నీరజ్ చోప్రాపై రుమేశ్ పతిరగే పైచేయి సాధించడం ఇది మూడోసారి. గతంలో కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా పతిరగే 88.68 మీటర్ల

తెలంగాణను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో పర్యటిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శించి, ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో పాలన, విద్య, ప్రజా విధానాలపై విస్తృతంగా చర్చించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చదువుకున్న ఈ విశ్వవిద్యాలయంతో భారత్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.హైదరాబాద్ కు ఆక్స్ఫర్డ్ బృందంతెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్‌జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చారిత్రక సోమర్విల్ కాలేజీని సందర్శించారు. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. 2002లో సోనియా గాంధీ ఈ చిత్రపటాన్ని సోమర్విల్ కాలేజీకి బహూకరించిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి అందుకే ఇవ్వలేదు- రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!అనంతరం ముఖ్యమంత్రి, అక్కడే జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి సమగ్ర క్రీడా సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్‌తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ ఉన్నాయి. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా