
Sumalatha Devi: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమలత దేవి ఫిర్యాదు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత దేవి (Sumalatha Devi) ఫిర్యాదు చేశారు.
© 2026 telugu.digital

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత దేవి (Sumalatha Devi) ఫిర్యాదు చేశారు.

పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో పోలీసులు భారీ డ్రగ్స్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 47 కిలోల హెరాయిన్‌తో పాటు పిస్టళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశంలోకి చొరబడుతున్న మాదకద్రవ్యాల ముఠాలపై పోలీసుల నిఘా, కఠిన చర్యలకు ఇది తాజా ఉదాహరణ. ఈ ఘటన దేశ భద్రతకు, యువత భవిష్యత్తుకు పొంచి ఉన్న ముప్పును మరోసారి ఎత్తిచూపుతోంది.

Hadnoor Police Station | పోలీస్‌స్టేషన్‌లోనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కౌన్సెలింగ్ ఇస్తుండగా కలకలం

Telangana Police Jobs: 7,437 పోస్టులకు బిగ్ అప్డేట్.. SI, కానిస్టేబుల్ పరీక్షలు ఎప్పుడంటే?

Driving License: ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్‌ను ఆపినప్పుడు వారి డ్రైవింగ్ లైసెన్స్‌లో ఫోటో నుండి మొబైల్ నంబర్ వరకు అన్నీ అప్డేట్ చేసి ఉండకపోతే, అది సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా, మీరు మీ ఇంటి నుండే ఆన్లైన్లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు అవసరమైన..

state Good news from the state government.. Application deadline for Cheyuta pensions and sewing machine schemes extendedరాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. చేయూత పింఛన్లు, కుట్టు మిషన్ పథకాల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌లోని బేగంపేటలో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్యాసింజర్లుగా క్యాబ్ ఎక్కిన మహారాష్ట్రకు చెందిన ఓ దొంగల ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

Hyderabad murder: A man was brutally attacked and killed inside a wine shop in Bandlaguda under Nagole police limits in Hyderabad. Assailants chased him with knives and axes. Police are investigating the motive and identifying the accused using CCTV. హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో వైన్ షాప్ లోపల ఒక వ్యక్తిని కత్తులు, వేటకొడవలతో దాడి చేసి హత్య చేశారు. బాధితుడు పారిపోయినా హంతక
Tirupati Police Advisory To Tirumala Devotees: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసులు భక్తుల్ని అలర్ట్ చేశారు. వదంతులు వ్యాప్తి చేయకూడదని.. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పుడు ప్రచారం చేసేవారు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం టీటీడీ, పోలీసులు ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది, టీటీడీ సూచనల్ని మాత్రమే పాటించాలన్నారు.

వెల్లుల్లిలోని యాంటీ క్లాటింగ్ గుణాలు గుండె జబ్బులతో బాధపడే వారికి రక్తం గడ్డ కట్టకుండా చేసి ఎంతో మేలు చేస్తుంది..| Garlic Heart Health

belagavi Shocking incident in Belagavi, Karnataka: A car driver was fined for not wearing a helmet. The aggrieved driver then drove to the police station while wearing a helmet—a video of the incident has gone viralకర్ణాటక బెలగావిలో షాకింగ్ ఘటన.. హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్ కు జరిమానా.. హెల్మెట్ ధరించి కారు నడుపుతూ స్టేషన్ కు వెళ్లిన బాధితుడు.. వైరల్ వీడియో..

Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకున్నారు. భారత్ లో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు.. ప్రధాని మోదీతో భేటీ అవుతారు.

Telangana Rains : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వర్షాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది.

YS Jagan key Press Meet On AP DSC 2026 : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన కేసులో గుంటూరు జిల్లా పోలీసుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ధర్మాసనం, "గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో, ఆయన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పోలీసుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బాలికను కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. గతంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌ను పోలీస్ స్టేషన్‌కు రాకుండా అడ్డుకున్న ఘటనను గుర్తుచేస్తూ, ఇలాంటి పోలీసులు ఉండటం ప్రభుత్వానికే సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేసింది.కేసు విచారణలో పోలీసులు సరైన స్ఫూర్తితో పనిచేయడం లేదని పేర్కొన్న కోర్టు, గురువారం నాటికల్లా బాలికను తమ ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు మరికొంత కాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుల్ జంగం నాని (ఏ3), హెడ్ కానిస్టేబుల్ బాబురావు (ఏ5), సాంబయ్య (ఏ6) తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలోని 8వ ఏడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్లను కొట్టివేసింది.ప్రస్తుతం ఈ నలుగురు రిమాండ్ ఖైదీలుగా వేర్వేరు జైళ్లలో ఉన్నారు. సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో ఉన్నారు. తాజా తీర్పు నేపథ్యంలో వారంతా జైలుకే పరిమితం కానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుందనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లేని భూమితో బ్యాంకు రుణాలు రూ.4.11 కోట్లు కొట్టేసి రియల్ వ్యాపారం హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు అందినా పట్టించుకోకుండా నిందితులకు సహకరించిన పోలీసులపైనా చర్యలు చేపట్టారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ అంజనేయులతో కలిసి మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు... ప్రస్తుతం చంపాపేట ఎస్ఆర్వోగా ఉన్న మహ్మద్ యూసఫ్ రహమాన్ గతంలో కీసరలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆ సమయంలో కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆయన్ను సంప్రదించారు. కేవలం కాగితాల్లోనే భూమిని సృష్టించి, వాటిని నిజమైన వ్యక్తులకు సంబంఽధించిన భూమి పత్రాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకుగాను సబ్ రిజిస్ట్రార్‌కు రూ. 5లక్షలు ముట్టజెప్పారు. తాను మంచివాడినని నిరూపించుకోవడానికి జరిగిన మోసంపై గతేడాది డిసెంబర్లో కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేవలం కంప్లైంట్ రావడమే తప్ప.. ఈఎంఐల విషయంలో గానీ, ఆర్థిక లావాదేవీల గురించి గానీ, బ్యాంకు అధికారుల నుంచి కూడా సమస్యలు లేకపోవడంతో.. అప్పట్లో కొంతమంది పోలీసులు ఈ ముఠాకు సహకరించారు. కాగా ఇటీవల కీసర పోలీస్ స్టేషన్లో కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఇటీవల బాధ్యతలు

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు... ముంబై, సెప్టెంబరు 2: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా ఎలా పరిగణిస్తారని పోలీసులను ప్రశ్నించింది. వారి దర్యాప్తు తీరు చూస్తుంటే సమాధానాల కన్నా ఎక్కువ సందేహాలే వ్యక్తమవుతున్నాయని ఆక్షేపించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరమని పేర్కొంటూ 44 పేజీల తీర్పును వెలువరించింది. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్‌లో ఓ నివాస భవనం పైనుంచి పడి దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తర్వాత వారం రోజులకే సుశాంత్‌సింగ్ తన ఇంట్లో మరణించడంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారంటూ కోర్టును ఆశ్రయించిన సతీశ్ సాలియాన్.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగూల్మాన్ని నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో పదో తరగతి విద్యార్థిని ఆచూకీ గుర్తించలేకపోయారంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏముందని అభిప్రాయపడింది. ఏదైమైనా గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. పోలీస్‌స్టేషన్‌కి రాకుండా ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్‌ను అడ్డుకున్నారని హైకోర్టు చురకలంటించింది. ఇలాంటి పోలీసులు ఉండటం ఏపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఘాటుగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయిందని జూన్‌లో పట్టాభిపురం పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మూడు నెలలు అవుతున్న తన కుమార్తె ఆచూకీ గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని హైకోర్టులో ఆమె తండ్రి హెబీయస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు సరైన స్ఫూర్తితో వ్యవహరిస్తే.. బాలికను కనుగొనేందుకు ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించింది. రేపటి లోగా బాలికను కోర్టు ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించింది. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త జీవిత బీమా పథకాలను ప్రకటించింది. ఎల్ఐసీ బీమా ప్లాటినం (ప్లాన్ 770), ఎల్ఐసీ జీవన్ రక్ష (ప్లాన్ 894) పేరుతో వీటిని సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ సీఈఓ, ఎండీ ఆర్. దొరైస్వామి ఈ కొత్త ప్లాన్లను ప్రారంభించారు. ఈ రెండు పాలసీలు సెప్టెంబర్ 7 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. బీమా ప్లాటినం (Plan 770)ను పొదుపు, జీవిత రక్షణ, భవిష్యత్ ఆదాయం కలిపిన పాలసీగా ఎల్ఐసీ రూపొందించింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత ప్లాన్. పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లించే విధానం ఇందులో ఉంటుంది. ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి సంవత్సరం చెల్లించిన ప్రతి రూ.1,000 వార్షిక ప్రీమియానికి రూ.70 గ్యారెంటీడ్ అడిషన్ జమ అవుతుంది. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన ఐదో సంవత్సరం చివర్లో పాలసీదారు జీవించి ఉంటే బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 70 శాతానికి సమానమైన బూస్టర్ ఇన్కమ్ బెనిఫిట్ లభిస్తుంది. అంతేకాకుండా, పాలసీ పేఔట్ పీరియడ్‌లో ప్రతి సంవత్సరం బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. పేఔట్ పీరియడ్ అంటే పాలసీ కాలవ్యవధి నుంచి ప్రీమియం చెల్లించే కాలాన్ని మినహాయించిన తర్వాత మిగిలే కాలం. బీమా ప్లాటినంలో కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షలు. గరిష్ఠ పరిమితిని నిర్దిష్టంగా పేర్కొనలేదు. అయితే ఎల్ఐసీ బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీ నిబంధనలు వర్తిస్తాయి. బీమా మొత్తాన్ని రూ.10,000 చొప్పున పెంచుకుంటూ ఎంచుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధిని 7, 10, 12, 15 లేదా 18 సంవత్సరాలు ఎంచుకోవచ్చు. ఎంచుకున్న టర్మ్‌ను బట్టి ప్రవేశ వయసు కనీసం 30 రోజులు, గరిష్ఠంగా 55 సంవత్సరాల వరకు ఉంటుంది. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 75 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అదనపు రక్షణ

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్‌ప్రీత్ సింగ్ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో యుటిలిటీ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతున్నప్పటికీ.. పనులు పూర్తైన తర్వాత రోడ్లను సక్రమంగా, నాణ్యతతో పునరుద్ధరించడం లేదని ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. దీంతో రోడ్లు unevenగా మారి ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని తెలిపారు. యుటిలిటీ పనులు పూర్తైన వెంటనే సంబంధిత సంస్థలు రోడ్లను సకాలంలో నాణ్యతతో పునరుద్ధరించాలని సూచించారు. మరోవైపు ఓలా, ఉబర్ వాహనాల అనియంత్రిత పార్కింగ్ కూడా ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోందని అధికారులు తెలిపారు. ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసే సమయంలో రోడ్లపై వాహనాలు గుమిగూడకుండా ఐటీ సంస్థలు, ప్రధాన సంస్థలు తమ ప్రాంగణాల్లోనే పికప్, డ్రాప్ ప్రాంతాలతో పాటు ఓలా, ఉబర్ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ లేదా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో రోడ్ల అభివృద్ధి, కనెక్టివిటీపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రతిపాదిత రోడ్డు అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన ట్రాఫిక్ అధికారులు.. రహదారుల అనుసంధానం, ట్రాఫిక్ ప్రవాహం, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఫ్రీ లెఫ్ట్‌లు, జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఫ్రీ లెఫ్ట్ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు జంక్షన్లలో ఛానలైజేషన్, రోడ్డు జ్యామెట్రీలో మార్పులు చేపట్టాలని సూచించారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేచి ఉండే సమయం తగ్గి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రోడ్డు

హైదరాబాద్ శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్: నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.90 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్లతో పాటు వాటి తయారీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నకిలీ నోట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు? ఎలా చలామణి చేస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక మరికొందరు ఉన్నారా? నకిలీ కరెన్సీ తయారీకి అవసరమైన సామగ్రిని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది. మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్ సైబరాబాద్ పరిధిలో 10 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్

మొన్న సాదిక్‌ఖాన్.. నేడు గౌస్ మోహిద్దీన్.. కాకినాడలో లవ్ జిహాద్ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్‌ఖాన్ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్ మోహిద్దీన్ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్‌ఖాన్ కేసు మరువక ముందే.. గౌస్ మొహిద్దీన్ కేసు తెరపైకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తిపై బాల రమ్యశ్రీ అనే మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్నాధపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ తనను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకున్న తర్వాత.. మతం మార్చి చిత్రహింసలకు గురి చేశాడని కంప్లైంట్లో పేర్కొంది. ఒత్తిడి చేసి మతం మారేలా చేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు.. తనతో పాటు మరో ఐదుగురిని కూడా ఇలాగే మోసం చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో లవ్ జిహాద్ల వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో గౌస్ మొహిద్దీన్ పలువురు యువతులను మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. ఒకరికి తెలియకుండా మరొకర్ని ట్రాప్ చేసి, వారితో సహజీవనం చేశాడని బాల రమ్యశ్రీ ఆరోపించింది. తనను ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్న తర్వాత వేధింపులకు గురిచేశాడని వెల్లడించింది. ఎన్నోసార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. తనను.. తమ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గౌస్ మోహిద్దీన్‌పై ఇప్పటికే ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడని.. ఇదే అదను భావించి తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని బాధితురాలు చెప్పింది. అయితే.. గౌస్ మొహిద్దీన్ నుంచి తనకు రక్షణ కల్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీని కోరినట్టు తెలిపింది. “జలం… జీవం

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

దేశంలో కోడిగుడ్ల ధరలు సామాన్యులకు భారాన్ని కలిగిస్తున్నాయి. గత ఏడాది కాలంలో గుడ్ల ధరలు ఏకంగా 35 నుంచి 40 శాతం వరకు పెరిగాయని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) వెల్లడించింది. ఇటీవలి వరకు ఫామ్ వద్దే ఒక్కో గుడ్డు ధర రూ. 7 ఉండగా, రిటైల్ మార్కెట్లో అది రూ. 8 నుంచి రూ. 9కి చేరింది. రాబోయే శీతాకాలంలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ధరలు ఇంకా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఈ20' ఇంధన విధానమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలన్న లక్ష్యంతో మొక్కజొన్నను భారీగా వినియోగిస్తున్నారు. కోళ్ల దాణా తయారీ వ్యయంలో 65 నుంచి 70 శాతం మొక్కజొన్నదే కావడం గమనార్హం. దేశీయంగా ఉత్పత్తవుతున్న మొక్కజొన్నలో దాదాపు 37 శాతాన్ని ఇథనాల్ తయారీ పరిశ్రమలకే మళ్లించడంతో, కోళ్ల పరిశ్రమకు దాణా కొరత ఏర్పడి ధరలు గణనీయంగా పెరిగాయి.గత మూడేళ్ల కాలంలో టన్ను మొక్కజొన్న ధర రూ. 14,000 నుంచి రూ. 26,500కి పెరిగింది. ముఖ్యంగా గత ఐదు నెలల్లోనే ధరలు 20 శాతం పెరగడం గమనార్హం. 2024లో 6 మిలియన్ టన్నుల మొక్కజొన్నను ఇథనాల్ తయారీకి వినియోగించగా, ప్రస్తుతం ఆ వినియోగం 17 మిలియన్ టన్నులకు చేరింది.ఇథనాల్ విధానంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు, కోళ్ల మరణాల రేటు పెరగడం వంటివి కూడా ఇటీవల ధరల పెరుగుదలకు ఇతర కారణాలని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు

హైదరాబాద్ నగర పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: నగరంలో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడుల వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వెల్లడించారు. ఏకకాలంలో దాడులు.. 10 ఫేక్ క్లినిక్‌ల సీజ్ మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నకిలీ క్లినిక్‌ల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్ చెరు, ఆర్సీ పురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 నకిలీ క్లినిక్‌లను సీజ్ చేశారు. టెన్త్, బీకామ్ చదివి.. సెలైన్లు ఎక్కిస్తూ! టెన్త్, ఇంటర్, బీకామ్ వంటి చదువులు మాత్రమే చదివిన ఈ కేటుగాళ్లు, ఎలాంటి కనీస మెడికల్ నాలెడ్జ్ లేదా గుర్తింపు పొందిన డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారని విచారణలో తేలింది. చిన్నపిల్లలకు వైద్యం: ఎలాంటి అర్హత లేకున్నా క్లినిక్‌లలో ఏకంగా బెడ్లు ఏర్పాటు చేసి, అమాయక రోగులకు, చిన్నపిల్లలకు వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిరంజీలు, సెలైన్ల వాడకం: తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లకు ఎడాపెడా సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ (IV Fluids) ఎక్కిస్తూ ప్రాణాలపైకి తెస్తున్నారని పోలీసులు తెలిపారు. సామగ్రి సీజ్: దాడుల సమయంలో ఈ క్లినిక్‌ల నుంచి పెద్ద ఎత్తున బీపీ మిషన్లు, స్టెతస్కోప్‌లు

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ వార్షిక వేతన ప్యాకేజీకి సంబంధించి కీలక వివరాలు బయటపడ్డాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దాఖలు చేసిన నివేదిక ప్రకారం ఆయన 2027 ఆర్థిక సంవత్సరానికి గాను 58 మిలియన్ డాలర్లు అంటే సుమారు 485 కోట్ల రూపాయల టార్గెట్ కాంపెన్సేషన్ పొందనున్నారు. ఇందులో బేసిక్ జీతం 3 మిలియన్ డాలర్లు కాగా 55 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ షేర్లు భాగమై ఉన్నాయి. ఆపిల్ సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే ఈ భారీ ప్యాకేజీ వివరాలు వెల్లడించడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాన్ టెర్నస్ 2001లో ఆపిల్ సంస్థలో ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి గత 25 ఏళ్లుగా కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2021 నుంచి హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ వాచ్ వంటి కీలక ఉత్పత్తుల రూపకల్పనను ఆయనే పర్యవేక్షించారు. అనంతరం ఏప్రిల్ 20, 2026న కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ 1 నుంచి ఆయన్ను కొత్త సీఈఓగా నియమించింది. దీంతో సుదీర్ఘ కాలం పాటు సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పాత్రలోకి మారారు. ఈ మార్పులతో కంపెనీ నాయకత్వ పంపిణీలో స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఆపిల్ సీఈఓ ప్యాకేజీలో 75 శాతం పర్ఫార్మెన్స్ ఆధారిత రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు కాగా మిగిలిన 25 శాతం టైమ్ ఆధారిత ఈక్విటీగా కేటాయించారు. బోర్డు నిర్దేశించిన స్టాక్ మార్కెట్ లక్ష్యాలను అందుకోవడంపైనే ఈ ప్యాకేజీ ఆధారపడి ఉంటుంది. మరోవైపు సెప్టెంబర్ చివరి వరకు ఆపిల్ ఆర్థిక సంవత్సరం కొనసాగుతున్నందున 2026 చివరి వారాల కోసం ఆయనకు అదనంగా 2.5 మిలియన్ డాలర్ల ప్రొరేటెడ్ షేర్లు మంజూరయ్యాయి. అదే సమయంలో 15
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో అమెరికా అంతటా ‘తెలుగుకు పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ పరుగు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు భాషను భావితరాలకు అందించాలనే సంకల్పంతో భాషా సైనికులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకుడు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతులు, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను వెల్లడించారు. తెలుగు భాషను నేర్పడం, నేర్చుకోవడం ప్రతి తెలుగు కుటుంబ బాధ్యత అని గుర్తుచేశారు. మనబడి అధ్యక్షుడు కులపతి చమర్తి రాజు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘భాషా సేవయే భావితరాల సేవ’ అనే నినాదాన్ని గుర్తుచేస్తూ ఇప్పటివరకు లక్షా 10 వేల మందికి పైగా విద్యార్థులు మనబడి ద్వారా విద్యను పూర్తి చేసుకున్నారని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ రెండో వారంలో 10 దేశాల్లో దాదాపు 300 కేంద్రాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు 12,500 మంది పిల్లలు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉత్తర అమెరికాలో మనబడికి పాశ్చాత్య పాఠశాలలు, కళాశాలల సంఘం గుర్తింపుతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ‘రన్ ఫర్ తెలుగు’ పోటీలను రెండు విభాగాల్లో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి పతకాలతో సత్కరించారు. పాల్గొన్న వారందరికీ ధ్రువపత్రాలు అందజేసి, ఆయా ప్రాంతాల్లో అల్పాహారం

Mega wishes: మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వారు ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు” అంటూ తన తమ్ముడిపై ఉన్న ప్రేమను, గర్వాన్ని చిరంజీవి చాటుకున్నారు. చిన్నప్పటి నుంచే పవన్‌లో నిబద్ధతతో కూడిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే తపనను చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమై.. ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే ఉద్దేశంతో వేస్తారని కొనియాడారు. తమ కుటుంబంపై పవన్ ఎంత ప్రేమ చూపిస్తారో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తారని చిరంజీవి అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ.. అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకెళ్తున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటూ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని

ప్రపంచదేశాల ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచదేశాల ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలం దాదాపుగా మూతబడినట్టేనని చెప్పారు. ఆవైపు వెళ్లొద్దని హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేమేమీ పౌర విమానయాన సంస్థలను టార్గెట్ చేయడం లేదు. కానీ రష్యా గగనతలంలో భారీ స్థాయిలో డ్రోన్స్ ఉండటం వల్ల రిస్క్‌ను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. రష్యా ప్రారంభించిన యుద్ధం వల్ల ఆ దేశ గగనతలమే మూత పడే స్థితి వచ్చిందని చెప్పారు. సెయింట్ పీటర్స్ బర్గ్, మాస్కో వంటి నగరాల గగనతలంలో విమానాలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అద్యక్షుడి వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. అవి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు. తామూ ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఇటీవల కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో కూడా పుతిన్ ఉక్రెయిన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు చర్చలకు సిద్ధమేనని అంటున్నారు. కానీ ఉగ్రవాదులతో ఎలాంటి చర్చలు ఉండవు’ అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పాశ్చాత్య దేశాల ఎయిర్‌లైన్స్ ఇప్పటికే రష్యాకు విమానాల రాకపోకలను నిలిపివేశాయి. చైనా ఎయిర్‌లైన్స్ సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇక రష్యా గగనతలంలో పౌర ఎయిర్‌లైన్స్ సంస్థలకు రిస్క్ ఉందని పౌరవిమానయాన రంగ కన్సల్టెన్సీ సంస్థ ఆస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ చెప్పింది. ప్రస్తుతం, రష్యా సరిహద్దుకు 300 కిలోమీటర్ల లోపల వరకూ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరుగుతున్నాయని చెప్పింది. దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. పెళ్లింటిపై దాడి చేస్తారా? యూఎస్‌పై భగ్గుమన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

భారత్ అభివృద్ధి ప్రయాణం ఇప్పుడు మరో దేశానికి పాఠంగా మారే స్థాయికి చేరుకుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా అన్నారు. భారత్ సాధించిన అనుభవాలను ఇతర దేశాలతో పంచుకునే అవకాశాలు పెరిగాయని చెప్పారు. జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో దేశ ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో భారత్ పొందే స్థానం కూడా కీలకమని బంగా చెప్పారు. పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆధార్ నుంచి బ్యాంకు ఖాతాల వరకు ఏర్పడిన డిజిటల్ వ్యవస్థను ఇతర దేశాలు అధ్యయనం చేయవచ్చని చెప్పారు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం కూడా ప్రపంచానికి ఉపయోగపడే మరో నమూనా అని అన్నారు.తాను ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పర్యటించినప్పుడు చిన్న రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్పుట్స్ అందించేందుకు సహకార సంఘాలు, గూగుల్, ప్రపంచ బ్యాంకు కలిసి పనిచేస్తున్న విధానాన్ని చూశానని బంగా తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఈ సేవలను పెద్ద సంఖ్యలో రైతులకు చేరువ చేయడం మంచి ప్రయత్నమని చెప్పారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డిజిటల్ వ్యవస్థలతో ప్రాంతీయ ఆసుపత్రులు, వైద్యులతో అనుసంధానించవచ్చని ఆయన వివరించారు. భౌతిక మౌలిక వసతులు, విద్య, నైపుణ్యాలు, ఆరోగ్యం, నియంత్రణ సంస్కరణలు, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ వంటి రంగాల్లో భారత్‌తో

BCCI Selection Policy: ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ కీలక మార్పు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయంలో ఆటగాడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడనే విషయంలో బోర్డు మరింత స్పష్టత తీసుకోనుంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు ఫిట్నెస్ షరతు విధించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారా లేదా అనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే వారి తుది లభ్యతపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల గాయపడిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని, ఆ తర్వాత వారు మ్యాచ్‌లకు దూరమైన సందర్భాల నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం. నివేదిక ప్రకారం.. ఇక ఆటగాడి ఫిట్‌నెస్‌పై 100 శాతం కాకుండా 200 శాతం నమ్మకం ఉన్నప్పుడే అతడిని పూర్తిగా ఎంపిక చేసినట్లు పరిగణించే విధానాన్ని బీసీసీఐ అవలంబించనుంది. దీనివల్ల జాతీయ జట్టులోకి ఎంపికైన తర్వాత ఫిట్నెస్ కారణంగా ఆటగాడు అందుబాటులో లేకపోయే పరిస్థితులను తగ్గించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్లో ఒంటి చేత్తో..! అయితే అంతర్జాతీయ సిరీస్‌కు జట్లను సాధారణంగా కొన్ని వారాల ముందే ఎంపిక చేస్తారు. ఎంపిక తేదీకి ఆటగాడు పూర్తి ఫిట్‌గా లేకపోయినా, సిరీస్ ప్రారంభానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటే అతడిని పూర్తిగా పక్కన పెట్టకుండా ‘ఫిట్‌నెస్‌కు లోబడి’ ఎంపిక చేసే విధానాన్ని బీసీసీఐ కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వివరించినట్లు నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌కు ప్రకటించిన 15 మంది జట్టులో బుమ్రా, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్ రాణాలకు ఫిట్నెస్ క్లియరెన్స్ తప్పనిసరి. నివేదిక ప్రకారం బుమ్రా, నితీశ్ సిరీస్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక క్యారేజ్‌వేల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలు దూరం చేసేందుకు ప్రయత్నాలు హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక క్యారేజ్‌వేల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల వాహనాలు సులభంగా వెళ్లడానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, ట్రాఫిక్ డీసీపీ సంక్రాంతి రవికుమార్, అదపు డీసీపీ జి.హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ కె.చంద్రశేఖర్ రెడ్డి పలు ప్రాంతాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం, యూటర్న్లు, జంక్షన్ల ఆప్టిమైజేషన్ ద్వారా ట్రాఫిక్ ఆలస్యాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేపీహెచ్‌బీ, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని జేఎన్టీయూ నుంచి సింక్రోనీ (రాయదుర్గం) మెట్రోస్టేషన్ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రత్యేక క్యారేజ్‌వే ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: పసిడి ప్రియులకు భారీగా ఊరటనిచ్చే వార్త. బంగారం కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. కిలో వెండిపై ఏకంగా 10,000 తగ్గింది. 24క్యారెట్ల పసిడిపై రూ. 2,680 మేర దిగివచ్చింది. తాజా ధరల మార్పుతో హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,54,090కి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,250కి చేరింది. అదే విధంగా కిలో వెండి ధర రూ.10,000 మేర తగ్గింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద స్థిర పడింది. గత 3 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 6,000 మేర పైగా తగ్గింది. ఇరాన్ పై అమెరికా మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడమే ఈ భారీ తగ్గుదలకు కారణమని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ దాడుల ప్రభావంతో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నట్లు బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై అంచనాలు తగ్గడం, డాలర్ కదలికలు కూడా ధరలపై ప్రభావం చూపాయని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు కుప్పకూలాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుపై ఏకంగా 106 డాలర్లు తగ్గింది. దీంతో 4,323 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ కూైడా 3.20శాతం నష్టపోయింది. దీంతో ఔన్సు వెండి 64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన

హైదరాబాద్: వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు ఇన్స్పెక్టర్ను నియమించడంలో తాత్సారం జరుగుతుంది. వారం రోజులు గడుస్తోన్నా ఇన్స్పెక్టర్ నియామకంలో ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏ అధికారి వచ్చినా 10 వారాలు కూడా ఉండకుండా సస్పెన్షన్లకు గురవుతుండడంతో ఈసారి ఎస్‌హెచ్‌వో నియామకంలో మరింత పారదర్శకత ఉండేలా చేపట్టాలని యోచిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసముండే పరిధి ఠాణాలోనే వరుస వివాదాలు చోటుచేసుకుంటుండడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసంతో పాటు సీఎం క్యాంప్ కార్యాలయ కిందికి వచ్చే ఈ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్లు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తుండడంతో పాటు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ పోలీసు శాఖకే మచ్చతెచ్చారు. దీంతో ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేసి, ఆయన స్థానంలో ముత్తుయాదవ్ను నియమించారు. ఆయన కూడా విధి నిర్వహణలో తీవ్ర నిరక్ష్యాన్ని కనబరచడమే కాకుండా మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై చర్యలు తీసుకోవడంలోనూ, ఆయనను అరెస్టు చేయడంలోనూ అశ్రద్ధ వహించారు. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులు పారిపోవడానికి ఆస్కారం కలిగించారనే ఆరోపణలతో గత నెల 25న ముత్తుయాదవ్‌పై వేటుపడింది. అప్పటి నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ను నియమించడానికి ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జల్లెడపడుతున్న నిఘా వర్గాలు సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఉండే ఈ ఠాణాకు సమర్ధుడైన ఇన్స్పెక్టర్ను నియమించాలని, ఆ స్థాయి అధికారి కోసం నిఘా వర్గాలు జల్లెడపడుతున్నాయి. అటు ఇంటెలిజెన్స్, ఇటు ఎస్బీ ఈ ఠాణాకు ఇన్స్పెక్టర్ను నియమించడంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఇన్స్పెక్టర్ నియామకంలో పాత్ర ఉండే అధికారులను పక్కనబెట్టి ఈసారి గుర్తించిన ఉన్నతాధికారుల ప్రమేయంతో ఈ పోస్టును భర్తీ చేయాలని యోచిస్తున్నారు. అందుకే నియామకంలో ఆలస్యం జరుగుతుందని పేర్కొంటున్నారు. దగ్గరపడుతున్న వినాయక చవితి వేడుకలు వినాయక చవితి వేడుకలు దగ్గర పడుతుండడంతో జూబ్లీహిల్స్ ఠాణాకు ఇంకా ఇన్స్పెక్టర్ను నియమించకపోవడంతో వినాయక మండపాల కమిటీ ప్రతినిధుల సమావేశాలు, మైత్రి

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్‌పై తాజా దాడులకు దిగింది. ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన లక్ష్యాలపై విరుచుకుపడింది. ఒమన్ గల్ఫ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడమే దీనికి కారణం. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తోంది. జోర్డాన్, బహ్రెయిన్.. ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికాకు చెందిన బేస్ క్యాంప్ లపై బాంబుల వర్షాన్ని కురిపించింది.ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు చల్లారినట్టే కనిపించిన ఈ యుద్ధం.. మళ్లీ మొదటికొచ్చినట్టయింది. మున్ముందు మరింత తీవ్రంగా దాడులు చేపడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించడం.. అక్కడి తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. ఈ దాడులను అటు అమెరికా, ఇటు ఇరాన్.. ఆత్మరక్షణలో భాగమని చెప్పుకొన్నాయి.ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనిపై తన అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ పై పోస్ట్ పెట్టింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ సైనికులపైనా ఐఆర్జీసీ దాడుల ప్రయత్నాలకు ప్రతీకారానికి దిగామని తెలిపింది.ఇకపై తిరుమలలో ఎయిర్ పోర్ట్ తరహా స్మార్ట్ లగేజీ సిస్టమ్: జీఎంఆర్ ఎంట్రీఇరాన్లోని ఖేష్మ్ ఐలాండ్, జాస్క్, సిరిక్ రీజియన్, జిరోఫ్ట్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. అంతే ఘాటుగా స్పందించింది. తన భూభాగం నుంచి అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీన్ని ధృవీకరించింది. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామని ప్రకటించింది.బంగారం ధరల పతనానికి సడన్ బ్రేక్- షార్ప్ రీబౌండ్అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్క్యూ-4

Karimnagar: పోగొట్టుకున్న ఫోన్‌ను బాధితుడికి అందించిన కరీంనగర్ పోలీసులు! Karimnagar: కరీంనగర్ రూరల్, దుర్షేడ్ గ్రామానికి చెందిన కొల్లూరి అంజయ్య అనునతడు గత సంవత్సరం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ లో తన యొక్క ఐక్యు సెల్ ఫోన్ పోగొట్టుకొనగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు. పోలీసులు సి.ఈ.ఐ.ఆర్ టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను ట్రేస్ చేసి పెద్దపల్లి లో పట్టుకోవడం జరిగింది. అట్టి ఫోను యజమాని అయిన కొల్లూరి అంజయ్య కు ఇన్స్పెక్టర్ ఏ.నిరంజన్ రెడ్డి సెల్ ఫోను ను అందజేశారు. సెల్ ఫోన్ ను ట్రేస్ చేయడంలో కృషి చేసిన టెక్ టీం కానిస్టేబుల్ చిట్యాల రాంసాయి మరియు ఫైజాన్ లను సిఐ ఏ. నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు కూడా విలువైన వస్తువులను అజాగ్రత్తగా పర వేసుకోకూడదని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొరపాటున అజాగ్రత్తగా ఏదైనా విలువగల వస్తువులను పోగొట్టుకొనిన, దొంగిలించబడ్డ వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని తెలిపారు

మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇరాక్, జోర్డాన్‌పై ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ఐఆర్జీసీ దాడి చేసింది. కువైత్, బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి. సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడి వల్ల ఓ పెళ్లింట విషాదం సంభవించిందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందారని, 50 మంది గాయపడ్డారని తెలిపింది. తమపై దాడులకు తెగబడుతున్న అమెరికా చివరకు పశ్చాత్తాపం చెందక తప్పదని ఇరాన్ సైనిక దళం ఐఆర్జీసీ హెచ్చరించింది. హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకలపై ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే తాము దాడులు చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకూ దాడులు కొనసాగాయని పేర్కొంది. ఇక తమ భూభాగం వైపు వస్తున్న 13 బాలిస్టిక్ మిసైల్స్‌ను మార్గమధ్యంలోనే ధ్వంసం చేశామని జోర్డాన్ మిలిటరీ పేర్కొంది. మరో మూడు మిసైల్స్ నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయాయని తెలిపింది. ఇరాన్ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పింది. బుధవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన పలు మిసైల్స్‌ను అడ్డుకున్నామని మరో ప్రకటనలో కువైట్ తెలిపింది. బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలిసింది. అమెరికా దాడుల్లో చిన్నారి మరణించినట్టు ఇరాన్ మీడియాలో వార్తలు రావడంపై యూఎస్ సెంట్కామ్ ప్రతినిధి స్పందించారు. ఇరాన్ దళాల లాగా తాము సామాన్య పౌరులను ఏనాడు టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఈ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు దొరికారు. హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద చేపట్టిన తనిఖీల్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ. లక్ష విలువ చేసే ఈ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని, నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా స్టెరాయిడ్లు విక్రయిస్తున్న వీరిని సరసాయి రామ్, కుంచాల రవీంద్రలగా గుర్తించారు. నిందితుల దగ్గర మెఫెంటెరమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు (Wofen 10ml) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య లావాదేవీలు అన్నీ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారానే జరిగినట్లు వెల్లడించారు. అయితే ఈ విక్రయాల్లో వినియోగదారులుగా ఉన్న దీపక్, సాయి ప్రసాద్, షకీల్, కిషోర్, నితీష్ అనే మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది

భారతీయ జీవిత బీమా సంస్థ-ఎల్ఐసీ తన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆవిష్కరించింది. 'బీమా ప్లాటినం', 'జీవన్ రక్ష' పేర్లతో వస్తున్న ఈ పాలసీలు 2026 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. పొదుపుతో పాటు రక్షణను కోరుకునే వారి కోసం ఒక ప్లాన్‌ను, పూర్తిస్థాయి ఆర్థిక భద్రత కోసం మరో టర్మ్ ప్లాన్‌ను ఎల్ఐసీ ప్రవేశపెట్టింది.ఎల్ఐసీ బీమా ప్లాటినంఇది పొదుపు, బీమా రక్షణ రెండింటినీ అందించే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. ఇందులో గ్యారెంటీడ్ రిటర్న్స్ ప్రధాన ఆకర్షణ. ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి రూ. 1,000 హామీ మొత్తానికి రూ. 70 చొప్పున 'గ్యారెంటీడ్ అడిషన్' లభిస్తాయి. కనీస హామీ మొత్తం రూ. 3 లక్షలు కాగా, గరిష్ఠ పరిమితి లేదు. మెచ్యూరిటీ సమయంలో హామీ మొత్తంతో పాటు అప్పటివరకు జమయిన గ్యారెంటీడ్ అడిషన్లు పాలసీదారుకు అందుతాయి. ఇప్పటికే ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి రిబేటు, లోన్ సౌకర్యం, అదనపు రైడర్లను జోడించుకునే వెసులుబాటు వంటి సదుపాయులు ఇందులో ఉన్నాయి.ఎల్ఐసీ జీవన్ రక్ష ఇది కుటుంబ ఆర్థిక భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్యూర్ రిస్క్ (టర్మ్) ప్లాన్. పాలసీదారుడికి ఏదైనా అవాంఛనీయ సంఘటన ఎదురైనప్పుడు వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్లాన్‌లో కనీస హామీ మొత్తం రూ. 5 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ. 24 లక్షల వరకు బీమా రక్షణ పొందే అవకాశం ఉంది. ఇందులో సింగిల్, రెగ్యులర్, లిమిటెడ్ ప్రీమియం

ఎల్ఐసీ 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త బీమా పథకాలను ప్రకటించింది. బీమా ప్లాటినమ్, జీవన్ రక్ష పేర్లతో తీసుకొచ్చిన ఈ పాలసీలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ తన 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త బీమా పథకాలను తీసుకొచ్చింది. ‘LIC బీమా ప్లాటినమ్’, ‘LIC జీవన్ రక్ష’ పేర్లతో వీటిని ప్రకటించింది. ఈ రెండు పాలసీలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. LIC బీమా ప్లాటినమ్.. పొదుపుతో పాటు బీమా రక్షణ బీమా ప్లాటినమ్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత బీమా పథకం. పొదుపు లక్ష్యంతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేలా దీన్ని రూపొందించారు. పాలసీ వ్యవధిలో ముందుగానే నిర్ణయించిన గ్యారెంటీడ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి రూ.1,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ జమ అవుతుంది. ఈ పాలసీని 28 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్నవారు తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు కోసం 7, 10, 12, 15 లేదా 18 ఏళ్ల ఆప్షన్లు ఉన్నాయి. పాలసీ టర్మ్‌ను 17, 20, 22, 25 లేదా 28 ఏళ్లలో ఎంచుకోవచ్చు. కనీస బీమా మొత్తం రూ.3 లక్షలు కాగా, గరిష్ఠ సమ్ అష్యూర్డ్‌పై పరిమితి లేదని సంస్థ పేర్కొంది. పాలసీ గడువు పూర్తయ్యే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే.. బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో పాటు అర్హత కలిగిన గ్యారెంటీడ్ అడిషన్లు అందుతాయి. పాలసీ కాలంలో పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే.. నిబంధనల ప్రకారం వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లకు సంబంధించిన అర్హత మొత్తాల్లో ఎక్కువదాన్ని డెత్ బెనిఫిట్‌గా చెల్లిస్తారు. అదనంగా ఎల్ఐసీ పాలసీదారులకు రిబేట్లు, రుణ సదుపాయం, అవసరానికి అనుగుణంగా రైడర్లను జోడించుకునే అవకాశం

Priya Adhikari : నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహించని విపత్తు కారణంగా మృతుల సంఖ్య వెయ్యికిపైగా చేరింది.. వేలాది మంది ఆచూకీ గల్లంతు కాగా.. ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో భాగంగా ఓ మహిళా పైలట్ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమెనే.. నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ప్రియా అధికారి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆమె నేతృత్వంలో ఆరు రోజుల్లోనే సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం విశేషం. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, మట్టికొండలు విరిగిపడటంతో నేపాల్‌లో అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రహదారులు, వంతెనలు ధ్వంసం కావడంతో కొన్ని ప్రాంతాలకు రహదారి మార్గంలో చేరుకోవడం కష్టంగా మారింది. దీంతో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ప్రియా అధికారి అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆమె సారథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లు చేస్తూ.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి సురక్షితంగా ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాక.. సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నవారికి అత్యవసర సహాయ సామగ్రిని చేరవేయడం వంటి కార్యకలాపాల్లో ఆమె ముందుండి పనిచేస్తున్నారు. నేపాల్‌లోని వరద ప్రభావిత రుసువా జిల్లాలోని తైమూర్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడి బాధితులను రక్షించేందుకు దాదాపు 20 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. ఆ ఆపరేషన్లలో ప్రియా అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సవాళ్ల నడుమ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. ఒక్కోసారి ఐదారు హెలికాప్టర్లు ఒకేచోట దిగుతున్నాయి. బాధితులను తరలించడానికి రేడియో ద్వారా సమన్వయం చేసుకుంటున్నాం. భారీగా బురద ఉన్న ప్రాంతంలో చాపర్లు దిగడం కష్టంగా మారుతోంది. దీంతో బాధితులను ఎక్కించడం ప్రమాదంతో కూడుకున్న పని.. ఆపరేషన్ కొనసాగుతున్నంత సేపు పైలట్లు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రహదారులపై ఉమ్మివేయడం, బహిరంగ ప్రదేశాల్లో, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి చర్యలకు మంగళవారం నుంచి జరిమానాలు విధించడం ప్రారంభించారు. రాష్ట్రంలోని నగరాల్లో పరిశుభ్రతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ జరిమానాల ఉద్దేశం ఆదాయం సమకూర్చుకోవడం కాదని, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమేనని పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో ఉమ్మితే రూ.100 జరిమానా విధిస్తారు. చెత్తను పడేయడం లేదా అపరిశుభ్రతకు కారణమయ్యేలా చేయడంపై రూ.200 జరిమానా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, మూత్ర విసర్జన చేసినా రూ.200 చెల్లించాలి. 125 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకానికీ ఇదే జరిమానా వర్తిస్తుంది. అయితే జరిమానాలను కఠినంగా అమలు చేసేందుకు అవసరమైన పౌర మౌలిక వసతులు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని ప్రభుత్వం తెలిపింది. “జరిమానాల ద్వారా డబ్బు వసూలు చేయడానికి కఠినంగా వ్యవహరించడం మా ఉద్దేశం కాదు. ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం. జరిమానాలు విధించి ప్రజల నుంచి డబ్బు తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు” అని పాల్ చెప్పారు. కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు కూడా అందంగా మారాలని తాము కోరుకుంటున్నామని ఆమె అన్నారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వం ఒక్కటితో సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో బాధ్యతాభావం రావాలని, “ఈ నగరం కూడా తమదే” అనే భావన పెరగాలని ఆమె అన్నారు. ఏడాదిలో కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, ప్రజలు తమ నగరం, తమ రాష్ట్రాన్ని తామే అపరిశుభ్రం చేయకూడదనే భావనను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మార్పు కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజా మౌలిక వసతులపై దృష్టి ప్రజా మౌలిక వసతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో చెత్తబుట్టలను ఏర్పాటు చేస్తున్నారు

New LIC plans | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) రెండు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ఎల్ఐసీ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీమా ప్లాటినమ్ (LIC Bima Platinum), జీవన్ రక్ష (LIC Jeevan Raksha) పేరిట రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. సెప్టెంబర్ 7 నుంచి ఈ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. ఆ ప్లాన్ల వివరాలు ఇవీ.. బీమా ప్లాటినమ్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ ప్లాన్. ఇది పొదుపుతో పాటు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కూడా కల్పిస్తుంది. కచ్చితమైన ముందస్తు హామీతో కూడిన రాబడులు లభిస్తాయి. ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిలో ప్రతి వెయ్యి రూపాయలకు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 28 ఏళ్లు. గరిష్ఠ వయసు 75 ఏళ్లుగా నిర్ణయించారు. 7, 10, 12, 15, 18 ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. 17, 20, 22, 25, 28 ఏళ్ల పాటు పాలసీ గడువు ఉంటుంది. కనీస బీమా హామీ మొత్తం రూ.3 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు. పాలసీ మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే బేసిక్ సమ్అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లు చెల్లిస్తారు. జరగరానిది ఏదైనా జరిగితే వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లలో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. ఎల్ఐసీ పాలసీదారులకు రిబేటు లభిస్తుంది. రుణ సదుపాయం కూడా ఉంది. రైడర్లు జోడించుకోవచ్చు. బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం చొప్పున రెగ్యులర్ ఇన్కమ్ కింద ఏటా తీసుకునే వెసులుబాటూ ఉంది. ఎల్ఐసీ జీవన్ రక్ష నాన్-పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇది మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే అండగా నిలుస్తుంది. ఈ ప్లాస్ తీసుకోవడానికి కనీస వయసు

తెలంగాణ జానపద కళారంగంలో ఎంతో ప్రజాదరణ పొందిన జానపద నటులు, డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వ్యవహారం ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వేములవాడ హోటల్ రూమ్ ఘటన తర్వాత, ఈ వివాదం కాస్తా క్రిమినల్ కేసు వైపు వెళ్ళింది. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో 'ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాతో శారీరక సంబంధం పెట్టుకుని తీవ్రంగా మోసం చేసాడు. కేవలం మోసం చేయడమే కాకుండా, నా పరువుకి భంగం కలిగించేలా ప్రవర్తించాడు. నా వ్యక్తిగత ఫోన్లో ఉన్న దృశ్యాలు, వీడియోలని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ద్వారా మార్ఫింగ్ వీడియోలని సృష్టించాడు. నాకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరిస్తూ ఆ ఏఐ మార్ఫింగ్ వీడియోలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి తీవ్ర మనోవేదనకి గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఫిర్యాదులోని అంశాలని పరిశీలించిన పోలీసులు, ఈశ్వర్ సాయిపై నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. మోసపూరిత వాగ్దానాలు, పెళ్లి చేసుకుంటాననే నెపంతో శారీరక సంబంధం పెట్టుకోవడం వంటి నేరాల కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇది నాన్-బెయిలబుల్ అఫెన్స్ కావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈశ్వర్ సాయి ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక పోలీసు బృందాలని రంగంలోకి దించి జల్లెడ పడుతున్నారు. ఆగస్టు నెలలో వేములవాడలోని ఒక లాడ్జి లేదా హోటల్ గదిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌లు కలిసి ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకోవడంతోవివాదం మొదలైన విషయం తెలిసిందే. టాక్సిక్ కి షాకింగ్ రేటింగ్ ఇచ్చిన మహేష్ కుమారుడు గౌతమ్ 'పుష్ప'లో చీరకట్టుపై అల్లు అర్జున్ షాకింగ్

హైదరాబాద్ రాయదుర్గంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హిట్ అండ్ రన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా కారు కాలినడకన వెళ్తున్న నందులాల్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ఘటనలో నందులాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రమాదాన్ని చూసి సహాయం చేయడానికి పరుగెత్తుకు వచ్చిన జైద్ షా కాద్రి అనే విద్యార్థి కూడా అదే వాహనం తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి కారును నిలపకుండా అక్కడి నుండి వేగంగా పరారయ్యాడు. ఈ హిట్ అండ్ రన్ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు వెంటనే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా వాహనాన్ని నడిపినది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పోలీసులు వేగంగా స్పందించి సందీప్‌ను అరెస్ట్ చేసి, ప్రమాదానికి వాడిన కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆనంద్ సాయి తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందడమే కాకుండా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ ట్రస్ట్ బోర్డులో జనసేన నామినీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రమాద సమయంలో వాహనం ఏ వేగంతో వెళ్తోంది, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నారా లేదా అనే అంశాలపై పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయపడిన విద్యార్థి జైద్ షా కాద్రిని స్థానికులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన నందులాల్ కుటుంబ నేపథ్యం, ఇతర వివరాలను సేకరించే పనిలో పోలీసులు

Suryapet: సూర్యాపేటలో 'సైబర్ వారియర్స్' కు ప్రత్యేక శిక్షణ & సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన

కష్టకాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట ఉన్నది ఎవరో కవిత తెలుసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తనపై కవిత చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కవిత చర్యల వల్ల తండ్రి కేసీఆర్ ఎంతటి మనోవేదనకు గురవుతున్నారో ఆమె ఆలోచించుకోవాలని... తాను ఎప్పుడూ కేసీఆర్-కవితలను కలపడానికే ప్రయత్నించాను తప్ప విడగొట్టడానికి కాదని స్పష్టం చేశారు. తాను, తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి 2001లో పార్టీ ఆవిర్భావానికి ముందే కేసీఆర్ వెంటే ఉన్నామని, తాము టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వ్యవస్థాపక సభ్యులమని గుర్తుచేశారు. "బీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్" అని పేర్కొన్న ఆయన... కవిత మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ లైన్ దాటినందుకే ఆమెపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. అసెంబ్లీ లోపలా బయటా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. తాను కాంగ్రెస్ నాయకులతో ఎలాంటి మంతనాలు జరపలేదని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో ప్రమాణపూర్వకంగా చెప్పగలనని... మరి కాంగ్రెస్‌తో కవిత రహస్య మంతనాలు జరపలేదని ఆమె చెప్పగలరా? అని నిలదీశారు. కేసీఆర్‌కు అత్యంత ఆప్తులుగా, బలంగా ఉన్న నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ... పార్టీని బలహీనపరిచి పరోక్షంగా అధికార కాంగ్రెస్ పార్టీకి కవిత లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. సభలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం కేవలం రాజకీయం కోసం, సానుభూతిని పొందేందుకేనని విమర్శించారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీని చేయడంలో తన పాత్ర ఏంటో కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసని, నిన్నటి వరకు ఆమెపై ఉన్న గౌరవాన్ని తన వ్యాఖ్యలతో కవిత స్వయంగా పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు