translateexpand_more

Mollywood News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy01 Jun, 10:39 am
అల్లు అర్జున్ సినిమాలో మిన్నల్ మురళి నటి

అల్లు అర్జున్‌ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ‘రాకా’ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే!ఇప్పుడు ఈ చిత్రంలో మరో నటి భాగమయ్యారు. ‘ అల్లు అర్జున్‌ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ‘రాకా’ (Raaka) చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! కొంతకాలంగా ఈ చిత్రం షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. ఇందులో నలుగురు హీరోయిన్స్‌కు అవకాశం ఉందని మొదటి నుంచి టాక్‌ నడుస్తోంది. బన్నీకి జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకోన్‌ (Deepika Padukone) నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో మరో నటి భాగమయ్యారు. ‘మిన్నల్‌ మురళి’ ఫేం ఫెమినా జార్జ్‌ (Femina George)ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘రాకా’ లాంటి పెద్ద సినిమాలో అవకాశం వస్తుందని ఊహించలేదు. ఇప్పటిదాకా నేను చేసిన చిత్రాల్లో అతి పెద్ద సినిమా ఇదే. ఐకాన్‌స్టార్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. ఆయన నటించిన ‘హ్యాపీ’ నేను చూసిన ఫస్ట్‌ సినిమా. అప్పటి నుంచే బన్నీకి పెద్ద అభిమానినయ్యా. ఈ సినిమాలో నా పాత్ర నిడివి చిన్నదే అయినా.. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం మాత్రం కల నిజమైనట్లుగా అనిపిస్తుంది. ఈ మధ్యనే ఆమె ‘డిస్కో’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నా. అప్పుడే ‘రాకా’ టీమ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఫెమినా జార్జ్‌ 2021లో నెట్‌ఫ్లిక్స్‌ సూపర్‌ హీరో చిత్రం ‘మిన్నల్‌ మురళి’తో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టారు.

Chitrajyothy30 May, 10:59 am
ఆగిపోయిన ప్రేమలు 2.. కారణం అదే

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సీక్వెల్స్ లో ప్రేమలు 2 (Premalu 2) కూడా ఒకటి. మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju)ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సీక్వెల్స్ లో ప్రేమలు 2 (Premalu 2) కూడా ఒకటి. మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju)ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. నస్లీన్ కె గఫుర్ హీరోగా గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు 2024 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సచిన్- రీనూల క్యూట్ లవ్ స్టోరీని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఖుషీ అయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ప్రేమలు 2 సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక చేదు వార్త అందింది. గత కొన్నిరోజులుగా ప్రేమలు 2 సీక్వెల్ ఆగిపోయిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అవి రూమర్స్ అని ఫ్యాన్స్ అనుకున్నారు. తాజాగా అవి రూమర్స్ కాదని ప్రేమలు 2 ఆగిపోయిందని హీరో నస్లీన్ కన్ఫర్మ్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో నస్లీన్ ప్రేమలు 2 ఆగిపోవడానికి కారణాలను కూడా వెల్లడించాడు. 'ప్రేమలు 2 సినిమా ఆగిపోవడానికి ముఖ్య కారణం అనుకున్న స్క్రిప్ట్ ఆశించిన స్థాయిలో కుదరకపోవడమే. మొదటి భాగం సృష్టించిన భారీ విజయం కారణంగా ప్రేక్షకులు ఈ సీక్వెల్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా కథను సిద్ధం

SkyC Media29 May, 08:48 am
మోహన్ లాల్ దృశ్యం 3 కలెక్షన్లు.. 8 రోజుల్లోనే రూ. 197 కోట్లు

మోహన్‌లాల్ దృశ్యం 3 కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. 8 రోజుల్లోనే రూ. 197 కోట్లకు పైగా వసూళ్లతో డబుల్ బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

Chitrajyothy28 May, 04:36 pm
టాక్ బ్యాడ్ .. క లెక్ష న్లు టాప్ ! వ సూళ్లు.. ద ద్ద రిల్లి పోతున్నాయిగా

కొన్ని సినిమాల జాతకాలు గొప్పగా ఉంటాయి. ఫిల్మ్ గోయర్స్ అంత గొప్పగా లేదని పెదవి విరిచినా, క్రిటిక్స్ మిక్స్‌ డ్‌ రివ్యూస్ ఇచ్చినా.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం అదరగొడుతుంటాయి. ఇటీవల వచ్చిన తమిళ చిత్రం 'కరుప్పు', మలయాళ మూవీ 'దృశ్యం -3' ఆ కోవకు చెందినవే! మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal), మీనా జంటగా నటించిన దృశ్యం 3 (Drishyam 3) మూవీ లాస్ట్ థర్స్ డే విడుదలైంది. మలయాళంతో పాటు పలు భారతీయ భాషల్లో జనం ముందుకు వచ్చింది. అయితే 'దృశ్యం' మొదటి రెండు భాగాలతో పోల్చితే అంత బాగాలేదనే టాక్ తో రావటంతో పాటు రివ్యూవర్స్ సైతం అదే భావన వ్యక్తం చేశారు. మొదటి రెండు భాగాలలో ఉన్నట్లు ఊహకందని ట్విస్టులు లేవని, చివరి ఇరవై నిమిషాల సినిమా కాస్త బెటర్‌గా ఉందనే అభిప్రాయం వక్తం చేశారు. అయితే వసూళ్ళు మాత్రం టాక్ కు భిన్నంగా ఉన్నాయి. మొదటి వారాంతానికి ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్‌ ను వసూలు చేసింది. అంతేకాదు.. అమెరికాలో ఏకంగా 1.2 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఆంటోని పెరుంబవూర్‌ నిర్మించిన 'దృశ్యం 3' మోహన్‌ లాల్‌ - జీతు జోసఫ్‌ జోడీకి ఇంకా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ మధ్య కాలంలో సూర్య (Suriya) నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్‌ దగ్గర గొప్ప ఫలితాల్ని అందుకోలేదు. దాంతో అభిమానులంతా అతని తాజా చిత్రం కరుప్పు (Karuppu) మీదే ఆశలు పెట్టుకున్నారు. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ కోర్ట్ డ్రామా రిలీజ్‌ టైమ్‌లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. హీరో సూర్య చొరవ చూపడంతో మొత్తానికి రిలీజ్‌ అయ్యింది. 'కరుప్పు'

Chitrajyothy01 Jun, 01:17 pm
భార్యలు ఏం చేసినా ఇంప్రెస్ అవ్వరు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్

ఎంతవారులైనా కాంతదాసులే అని వింటూనే ఉంటాం. బయట ఎంత మెగాస్టార్ అయినా కూడా ఇంట్లో మాత్రం నా భార్యకు భర్తనే.. ఆవిడని ఇంప్రెస్ చేయడం చాలా కష్టమని అంటున్నారు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohan Lal). ఎంతవారులైనా కాంతదాసులే అని వింటూనే ఉంటాం. బయట ఎంత మెగాస్టార్ అయినా కూడా ఇంట్లో మాత్రం నా భార్యకు భర్తనే.. ఆవిడని ఇంప్రెస్ చేయడం చాలా కష్టమని అంటున్నారు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohan Lal). ప్రపంచంలో తాను మాత్రమే కాదు.. ఏ భర్త కూడా భార్యలను ఇంప్రెస్ చేయలేరని చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మోహన్ లాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో భార్యల సైకాలజీ గురించి చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమాల్లో ఎంతో గంభీరంగా కనిపించే ఆయన, భార్యాభర్తల బంధంపై చేసిన ఈ కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మీ భార్యను మీరెప్పుడైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారా.. ? అన్న ప్రశ్నకు మోహన్ లాల్ మాట్లాడుతూ.. ' ఎవరినైనా ఇంప్రెస్ చేయొచ్చు కానీ, భార్యలను ఇంప్రెస్ చేయడం కష్టం. ఇప్పటివరకు నేను నా భార్యను పూర్తిగా ఇంప్రెస్ చేయలేదు. కావాలని ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తే ఇట్టే దొరికిపోతాను. ఎందుకంటే వారు అంత తెలివైనవారు. అందుకే భార్యలతో నార్మల్ గా ఉండడమే మంచిది. అంతేకాకుండా.. నా భార్య సుచిత్ర దగ్గర నేను ఏది దాచిపెట్టను. నాకు అబద్దాలు చెప్పడం కూడా రాదు. ఏది దాచకుండా అన్ని చెప్తాను. ఒకవేళ దాచాల్సిన విషయం అయితే.. అప్పుడు దాచినా.. ఆ తరువాత