translateexpand_more

Society School Employees News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 02:09 pm
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు

రాష్ట్రంలో15 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల, సొసైటీ పాఠశాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు రంగం సిద్ధమైంది. అమరావతి, జూన్01: రాష్ట్రంలో15 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల, సొసైటీ పాఠశాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన దస్త్రానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. త్వరలోనే క్యాబినెట్‌కు పంపే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులకి ఊరట లభించిందని ఆయా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తోపాటు అధికారులకు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు..